struked
-
మా ఊరుకి తీసుకెళ్లండి..
చిల్పూరు: అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్ద సంతోషంగా గడిపి తిరిగొస్తున్న తమను ముంబైలో నిలిపివేయడంతో 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన మ్యాదరబోయిన రవీందర్, ఝాన్నీ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ దంపతులు గతేడాది సెప్టెంబర్ 22న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉంటున్న కుమారుడు ఉదయ్‌కుమార్ వద్దకు వెళ్లి ఈ ఏడాది మార్చి 19న తిరుగు ప్రయాణమయ్యారు. ఆరు నెలల తరువాత స్వగ్రామానికి వెళ్తున్నామనే ఆనందం వారిలో ఎంతో సేపు నిలవలేదు. మార్చి 20 మధ్యాహ్నం ముంబైలో విమానం దిగగానే అక్కడి సిబ్బంది వారి పాస్ పోర్టులు తీసుకుని ప్రత్యేక బస్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక ఆస్పత్రిలో 22వ తేదీ వరకు ఉంచారు. మళ్లీ మార్చి 31న పరీక్షలు చేసి ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించాక ఓ గెస్ట్ హౌస్‌కు తరలించారు. అక్కడి నుంచి ఈనెల 2వ తేదీన ఓ ఫంక్షన్ హాల్‌కు మార్చారు. ఇక్కడ ఉండడంతో ఇబ్బందిగా రవీందర్, ఝాన్సీ దంపతులు ఫోన్ ద్వారా శనివారం ‘సాక్షి’దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు స్పందించి తమను స్వగ్రామానికి చేర్చాలని వేడుకున్నారు. -
టూత్‌బ్రష్ మింగేశాడు..
న్యూఢిల్లీ: గొంతును శుభ్రం చేసుకుంటున్న ఓ వ్యక్తి అనుకోకుండా టూత్‌బ్రష్‌ను మింగేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది జరిగిన రెండు రోజలు తరువాత ఆ వ్యక్తికి ఎండోస్కోపీ నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు 12 సెం.మీల పొడువున్న బ్రష్‌ను అతని పొత్తికడుపు పై భాగం నుంచి బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సీమాపూరిలో నివాసం ఉంటున్న అవిద్ గతేడాది డిసెంబర్ 8వ తేదీన టూత్‌బ్రష్‌తో గొంతును బాగా శుభ్రం చేయాలని ప్రయత్నిస్తుండగా బ్రష్ గొంతు లోనికి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అవిద్ తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ ఓ ఆస్పత్రికి వెళ్లారు. అవిద్ అసలు విషయం చెప్పకపోవడంతో వైద్యులకు అతని కడుపు నొప్పికి గల కారణాలు తెలియలేదు. దీంతో వైద్యులు అతనికి సీటీ స్కాన్ నిర్వహించారు. అందులో అవిద్ కడుపులో ఏదో వస్తువు ఉన్నట్టు తెలింది. అప్పుడు అవిద్ వైద్యులకు అసలు విషయం చెప్పారు. బ్రష్‌ను బయటకు తీయడానికి ఆ ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో అక్కడి వైద్యులు అవిద్ సమస్యను ఏయిమ్స్‌కు రిఫర్ చేశారు. అవిద్కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఏయిమ్స్ వైద్యులు అతని ఉదరభాగంలో టూత్‌బ్రష్ చిక్కుకుని ఉందని.. అది గొంతు లోపలి ఇతర భాగాలకు ఎటువంటి హాని చేయలేదని తేల్చారు. డిసెంబర్ 10వ తేదీన అతని పొత్తికడుపు పైభాగంలో చిక్కుకున్న టూత్‌బ్రష్‌ను ఎండోస్కోపి చికిత్స ద్వారా బయటకు తీశారు. ఈ ఘటనపై ఎయిమ్స్ వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. చాలా మంది గొంతును శుభ్రం చేసుకోవడానికి టూత్‌బ్రష్ వాడతారని.. కానీ అలా చేయడానికి టంగ్ క్లీనర్ వాడటం మంచిదని తెలిపారు. -
గోస్తని పొంగితే..దిగ్బంధమే!
గోస్తని పొంగితే..దిగ్బంధమే! గోస్తనీ, దిగ్బంధం gostani,overflow,struked పద్మనాభం: పాండ్రంగి సమీపాన గోస్తని నదిలో వంతెన నిర్మాణం కలగానే మిగిలింది. పాండ్రంగి వాసులు బయటకు రావాలంటే గోస్తని దాటాలి. తగరపువలస, విశాఖపట్నం, విజయనగరం వెళ్లడానికి, పద్మనాభం రావడానికి పాండ్రంగి జంక్షన్లో బస్సులు ఎక్కుతుంటారు. వర్షాల సమయంలో నది గ్రామాన్ని తాకుతూ పొంగి ప్రవహిస్తుంది. నది ప్రవహించేటప్పుడు గ్రామస్తులు ఊరు దాటి వెళ్ల లేని పరిస్థితి. చుట్టుతిరిగి వెళ్లాలన్నా చిక్కులే మునివానిపాలెం మీదుగా తగరపువలస వెళ్లాలనుకున్నా సంగి వలస గెడ్డ, బోని మీదుగా పద్మనాభం రావాలనుకున్నా మద్ది సమీపాన ఉన్న పల్లి గెడ్డపై ప్రవహించే నీరు అడ్డు వస్తుంది. గ్రామంలోప్రాథమిక పాఠశాల ఏడో తరగతి వరకే ఉంది. ఎనిమిది నుంచి పదోతరగతి వరకు ఈ గ్రామ విద్యార్థులు రేవిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లా. వర్షాకాలంలో నది ఉధతంగా ప్రవహించడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. పాండ్రంగి పంచాయతీ పరిధిలో ఉండే కొత్త కురపల్లి, పాత కురపల్లి, బర్లపేట గ్రామాల ప్రజలు పంచాయతీ పరంగా అవసరమయ్యే పనులకు పాండ్రంగి రావాలి. సందర్శకులకు తిప్పలు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు జన్మనిచ్చిన పుణ్యగడ్డ కావడంతో ఇక్కడ అల్లూరి జననగహం, విగ్రహం, సామాజిక భవనం నిర్మించారు. ఈ స్మారక చిహ్నాలను తిలకించడానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. నదిదగ్గరకు వచ్చే వరకూ పొంగిప్రవహిస్తుందన్న విషయం తెలియక పోవడంతో పర్యాటకులు అల్లూరి స్మారక చిహ్నాలను చూడకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. నదిలో నిర్మించిన కాజ్వే గోతులు పడింది. నేతలు మారినా ఈ గ్రామానికి చెందిన రాజాసాగి సూర్యనారాయణ రాజు ఒక విడత, ఆర్.ఎస్.డి.డి.పి.అప్పలనరసింహరాజు నాలుగు సార్లు ఎమ్యేల్యేగా పనిచేశారు. అయినప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదు. విశాఖపట్నం మాజీ ఎంపీ దగ్గుబాటి పరందేశ్వరి, భీమిలి మాజీ ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మానవ వనరుల శాఖ మంంత్రి గంటా శ్రీనివాస తమను ఎన్నికల్లో గెలిపిస్తే వంతెన నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. ఆ హామీలు నీటిలో రాతలగా మిగిలిపోయాయి తప్ప కార్యరూపం దాల్చలేదు.