subhash Velingkar
-
‘ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టకపోతే శ్రీరాముడైనా గెలవలేడు’
పనాజీ : ‘ఈ రోజుల్లో రాముడైనా సరే డబ్బులు పంచకపోతే ఎన్నికల్లో గెలవలేడు’ అంటూ గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో యువతను ఉద్దేశిస్తూ నిర్వహించిన ‘గోవా సురక్ష మంచ్’ కార్యక్రమానికి సుభాష్ వెలింకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘ఎన్నికలు వస్తున్నాయి.. ఓటర్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్న యువత, మహిళలే నాయకులకు ముఖ్యం. వారిని ఆకట్టుకోవడానికి పార్టీలు ఎంత డబ్బునైనా ఖర్చు పెడతాయి. అయినా ఇప్పటి రాజకీయాలన్ని డబ్బు చూట్టే తిరుగుతున్నాయి. డబ్బు లేకపోతే గెలవడం చాలా కష్టం. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే స్వయంగా శ్రీరాముడే వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా.. డబ్బు పంచకపోతే ఆయన కూడా గెలవడు’ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గోవా ముఖ్యమంత్రిపై, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ పార్టీ తన విలువలను కోల్పొతుంది. అది కూడా తక్కిన పార్టీలతోవలోనే నడుస్తుందని ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను ఉద్దేశిస్తూ పారికర్ అనారోగ్యంతో ఉన్న ఇద్దరు మంత్రులను తొలగించారు. ఇప్పుడు ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి ఆయన మాత్రం ఎందుకు తన పదవి నుంచి వైదొలగటం లేదని ప్రశ్నించారు. అంతేకాక నాయకులు చిన్న జబ్బుల చికిత్స కోసం కూడా అమెరికా వెళ్లడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. -
'పారీకర్ హిందూవులను మోసం చేశారు'
కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పరీకర్ హిందూవులను మోసం చేశారని గోవా ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ సుభాష్ వెలింగ్కర్ గురువారం ఆరోపించారు. కాగా రాష్ట్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ పదవి నుంచి వెలింగ్కర్ ను తొలగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ గా పనిచేసిన ఆయనను తొలగించడంపై ఇప్పటికే రాష్ట్ర కేడర్ లో 400 మంది సభ్యులు రాజీనామాలు చేశారు. పదవిని కోల్పోవడంపై మాట్లాడిన వెలింగ్కర్ రానున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడనున్నట్లు చెప్పారు. బీజేపీ, పరీకర్ లను నమ్మిన రాష్ట్ర ప్రజలను వారు మోసం చేశారని అన్నారు. కొంకణి, మరాఠి తదితర భాషలను కాపాడుకునేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పరీకర్.. క్రిస్టియన్ స్కూళ్లను మూసివేసేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మైనారిటీల దేవుడిలా మారిపోయారని అన్నారు. మాతృభాషలో విద్యను బోధించని పాఠశాలలను మూసివేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రయత్నించగా.. పరీకర్ అడ్డగించారని ఆరోపించారు. బీజేపీతో బంధం తెగితే మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని లేదా స్వతంత్రంగా బరిలోకి దిగుతామని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకూ రాజీపడే ప్రసక్తే లేదని వెలింగ్కర్ అన్నారు. -
ఆరెస్సెస్‌కు గోవా గండం.. భారీగా రాజీనామాలు
పనాజీ: ఆరెస్సెస్‌లో కూడా అసంతృప్తి ముసలం మొదలైంది. గోవా ఇందుకు వేదికైంది. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని గోవా ఆరెస్సెస్ చీఫ్ సుభాష్ వెలింకార్ను తొలగిస్తూ ఆ సంస్థ ఉన్నత విభాగం నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయాన్ని వందల సంఖ్యలో ఆరెస్సెస్ వాలంటీర్లు వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 400 మంది ఆరెస్సెస్ వాలంటీర్లు రాజీనామాలు చేశారు. తాము ఆరెస్సెస్‌లో కొనసాగబోమని ప్రకటించారు. వీరిలో జిల్లా చీఫ్, మండల చీఫ్‌లు కూడా ఉన్నారు. వెలింకార్ను గోవా చీఫ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రకటన వెలువడిన అనంతరమే పనాజీలోని ఓ పాఠశాలలో ప్రత్యేకంగా స్థానిక పార్టీ నేతలు, ఆఫీస్ బేరర్లతో భేటీ అయిన వెలింకాన్ మద్దతుదారులు దాదాపు ఆరుగంటలపాటు చర్చించి చివరకు ఆరెస్సెస్, బీజేపీ ఉన్నతస్థాయి నాయకత్వాన్ని తప్పుబడుతూ ప్రకటన వెలువరించారు. తామంతా ఆరెస్సెస్‌లో ఉండబోమంటూ 400 మంది రాజీనామా చేశారు. తనను తొలగించి తప్పు చేశారని, ఈ ఒక్క కారణంతోనే బీజేపీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయం అని వెలింకార్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.