subinspector transfors
-
సీఐకి రివర్స్ పంచ్
సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాను అడ్డుకుని, అక్రమాన్ని బయటపెట్టిన పోలీసు అధికారికి పదోన్నతి రాకపోయినా గుర్తింపు, ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కబ్జాకోరులపై తన అనుమతి లేకుండా చర్యలు ఎలా తీసుకుంటావంటూ సదరు ఇన్స్పెక్టర్పై ఓ ఎమ్మెల్యే కస్సుమన్నారు. పట్టుబట్టి మరీ ఆ అధికారిని బదిలీ చేయించారు. వెస్ట్‌జోన్‌లోని ఓ ఠాణాలో పోస్టింగ్ ఇచ్చిన మూడు నెలలు కూడా కాకుండానే ఉన్నతాధికారులు ఆయన్ను బదిలీ చేశారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే.. కబ్జా అంశంపై కేసు నమోదు, దర్యాప్తు, అరెస్టులు ప్రతిదీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరగటం. సమర్థుడిగా గుర్తింపు ఉండటంతోనే పోస్టింగ్... అత్యంత ప్రముఖులు నివసించే, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పశ్చిమ మండలంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో ఏప్రిల్ 2న జరిగిన రేవ్ పార్టీ తీవ్ర కలకలం సృష్టించింది. ఆ సందర్భంలో స్థానిక ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు వేసిన ఉన్నతాధికారులు ఆ స్థానంలో సమర్థుడిగా గుర్తింపు ఉన్న అధికారిని నియమించారు. ఈ నియామకానికి ముందే ఉన్నతాధికారులు సదరు అధికారి వ్యవహారశైలి, పనితీరు తదితరాలను పరిగణనలోకి తీసుకున్నారు. కబ్జా కేసుతో విభేదాలు.. పశ్చిమ మండలంలో ఉన్న రూ.40 కోట్ల విలువైన స్థలం కబ్జా వ్యవహారం గత నెలలో వెలుగులోకి వచ్చింది. దీనిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు, బోగస్ వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలా ఆ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందారు. బాధితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్సీ వారికి అండగా నిలిచారు. కబ్జా పర్వాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఆద్యంతం అన్ని అంశాలను సదరు ఇన్స్పెక్టర్ పరిశీలించి.. కబ్జా నిజమేనని తేల్చారు. అడ్డా కూలీలను స్థల యజమానులుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ వివరాలు ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి, వారు అనుమతించిన తర్వాతే నిందితులను అరెస్టు చేశారు. మొత్తం 16 మంది నిందితులుగా ఉండగా అయిదుగురిని కటకటాల్లోకి పంపారు. అనుమతి రద్దు చేసిన జీహెచ్ఎంసీ... పశ్చిమ మండల పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టు చేసిన నిందితుల వివరాలు పరిగణనలోకి తీసుకున్న జీహెచ్ఎంసీ అంతర్గత విచారణ జరిపింది. ఇందులో అసలు విషయం తేలడంతో సదరు నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఈ విషయాన్ని కబ్జాకోరుల ద్వారా తెలుసుకున్న నగర ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. తనకు తెలియకుండా కబ్జాపై కేసు ఎలా నమోదు చేస్తారని, అరెస్టుల వరకు ఎలా వెళ్తారంటూ సదరు ఇన్స్పెక్టర్పై రంకెలు వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, తనకు లభించిన ఆధారాలను బట్టే ముందుకు వెళ్లానంటూ సదరు ఇన్స్పెక్టర్ చెప్పడాన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేక అతడిని బదిలీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. చేతులెత్తేసిన ఉన్నతాధికారులు... ఓ దశలో ఈ విషయం రాష్ట్రంలోనే కీలక కార్యాలయం వరకు వెళ్లింది. అక్కడి అత్యున్నత అధికారులు జరిగిన అంశంపై నివేదిక కోరారు. ఆద్యంతం ప్రతి అంశాన్నీ వివరిస్తూ నగర పోలీసులు రిపోర్టు కూడా సమర్పించారు. దీన్ని పరిశీలించిన ఆ కీలక కార్యాలయంలో ఇన్స్పెక్టర్ తప్పులేదని భావించింది. అయినప్పటికీ ఎమ్మెల్యే ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఇన్స్పెక్టర్ను బదిలీ చేయించారు. కబ్జాపై కేసు, దర్యాప్తు, అరెస్టుకు ఆదేశించిన ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. ఎమ్మెల్యే ఒత్తిడి తట్టుకోలేక సదరు ఇన్స్పెక్టర్ను బదిలీ చేస్తూ మరో పోలీసుస్టేషన్లో ఎస్హెచ్ఓగా నియమించారు. నగరంలో ముగ్గురు ఇన్స్పెక్టర్ల బదిలీ.. నగర కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌ను బంజారాహిల్స్‌కు బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న కె.నాగేశ్వర్రావుకు మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ ఎం.మట్టయ్యను సీసీఎస్‌కు మార్చారు. (చదవండి: ఫారిన్ ట్రేడింగ్ మాయాజాలం.. రూ.152 కోట్లతో పలాయనం) -
అనంతపురంలో భారీగా ఎస్సైల బదిలీలు!
అనంతపురం క్రైం : అనంతపురం జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. మొత్తం 97 మంది ఎస్ఐలకు స్థాన చలనం కల్పించారు. అనంతపురం రేంజ్ డీఐజీ బీ.బాలకృష్ణ, ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, అదనపు ఎస్పీ కే. మాల్యాద్రి సభ్యులుగా ఉన్న పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ బదిలీలను చేస్తూ డీఐజీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ టెక్నికల్ విభాగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ఇందుకు ప్రత్యేకంగా ఎస్ఐలను నియమించారు. అలాగే ఎస్సీ,ఎస్టీ వర్గాలకు త్వరితగతిన న్యాయం జరగాలనే, రాయదుర్గం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ఆయా విభాగాలకు ఎస్ఐలను కేటాయించారు. గతంలో వివిధ కారణాలతో వీఆర్‌లో ఉంచిన మరికొందరు ఎస్ఐలకు అవకాశం కల్పించారు. అలాగే ప్రస్తుతం ఉన్న కొందరిని వీఆర్‌లోకి తీసుకున్నారు. చిత్తశుద్ధితో సమర్థవంతంగా పనిచేసే అధికారులను గుర్తించి సరైన స్థానాలను కేటాయించారు. ప్రజలతో దురుసుగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా. పక్షపాతంగా వ్యవహరించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా చర్యలు తీసుకునేలా పోలీసు యంత్రంగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇదే సమయంలో ఫ్యాక్షన్ కట్టడి, నేరాల నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట, ఇసుక,ఎర్రచందనం అక్రమ రవాణా, ఆరాచకశక్తుల ఆగడాలు తదితర అంశాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నూతన స్థానాలకు వెళ్తున్న ఎస్ఐలకు ఎస్పీ సూచించారు. ఎస్ఐల బదిలీల వివరాలు ఇలా... పేరు ప్రస్తుత స్థానం బదిలీస్థానం వై. నాగమధు వీఆర్ గుమ్మఘట్ట వీ.రెడ్డెప్ప ముదిగుబ్బ అనంతపురం త్రీటౌన్ వీ. రాంప్రసాద్ అనంతపురం వన్‌టౌన్ అలాచ్డ్ అనంతపురం రూరల్ జీ.దిలీప్‌కుమార్ గుమ్మఘట్ట ఆత్మకూరు సీ. శంకర్‌రెడ్డి అనంతపురం త్రీటౌన్ కళ్యాణదుర్గం టౌన్ డీ.శ్రీనివాస్ అనంతపురం రూరల్ ఇటుకలపల్లి పీ. సుధాకర్ కనేకల్లు వీఆర్ పీ.నాగేంద్రప్రసాద్ రామగిరి రాప్తాడు ఏ.శరత్చంద్ర బుక్కపట్నం నార్పల కే.రఘుప్రసాద్ ఎస్బీ అటాచ్డ్ ఎస్సీ,ఎస్టీసెల్ యూ.వలిబాసు పుట్టపర్తి ఎస్సీ,ఎస్టీ సెల్ కే.శాంతిలాల్ బత్తలపల్లి శెట్టూరు డీ.తయార్హుస్సేన్ ఆత్మకూరు వీఆర్ బీ.నబిరసూల్ డీ.హీరేహళ్ కళ్యాణదుర్గం రూరల్ శ్రీరాంశ్రీనివాస్ వీఆర్ బొమ్మనహాల్ బీ.మహానంది అనంతపురం ట్రాఫిక్ రాయదుర్గం బీ.శేఖర్ పెనుకొండ డీ.హీరేహాళ్ జీ.యువరాజు డీఎస్బీ అటాచ్డ్ కనేకల్ డీ.శ్రీనివాసులు తాడిమర్రి పుట్టపర్తి అర్బన్ డీ.జనార్థన్‌నాయుడు సీసీఎస్ వజ్రకరూర్ ఆర్.రామయ్య ఉరవకొండ బుక్కరాయసముద్రం ఎన్.రామాంజినేయులు సీకేపల్లి గుత్తి జే.హేమంత్‌కుమార్ కూడేరు అటాచ్డ్ బత్తలపల్లి ఎన్.శేఖర్ నార్పల రామగిరి జీటీ.నాయుడు గోరంట్ల పట్నం బీ.వెంకటేశ్వర్లులు తాడిపత్రి అర్బన్ గోరంట్ల ఎం.మనోహర్ ఉరవకొండ వీఆర్ వీ.గంగాధర్ వజ్రకరూర్ అనంతపురం ట్రాఫిక్ కె.ధరణికిశోర్ మడకశిర అటాచ్డ్ యల్లనూరు సీ.ఆంజనేయులు హిందూపురం రూరల్ అటాచ్డ్ హిందూపురం రూరల్ జీ.జయపాల్‌రెడ్డి పామిడి తాడిపత్రి అర్బన్ పీ.మహబూబ్‌బాషా హిందూపురం వన్‌టౌన్ రొళ్ల జీ.సాగర్ అనంతపురం ట్రాఫిక్ కదిరి టౌన్ ఎన్.శివాజీ కనగానపల్లి వీఆర్ జీ.శివ విడపనకల్లు బ్రహ్మసముద్రం కేపీ. మధుప్రసాద్ పోతుకుంట వీఆర్ ఎం.నాగస్వామి బెలుగుప్ప అటాచ్డ్ బెలుగుప్ప జే.జయనాయక్ కళ్యాణదుర్గం టౌన్ ముదిగుబ్బ సీటీ మక్బూల్‌బాషా నల్లచెరువు మడకశిర డీవీ నారాయణరెడ్డి తాడిపత్రి రూరల్ అటాచ్డ్ తాడిపత్రి రూరల్ ఎస్. శివగంగాధర్‌రెడ్డి ఇటుకలపల్లి నల్లమాడ కే.శ్రీరాం ధర్మవరం అర్బన్ సీసీఎస్(టెక్నీకల్ సెల్) ఎస్.హరూన్‌బాషా రొద్దం అనంతపురం ట్రాఫిక్ ఐ.రవిశంకర్‌రెడ్డి అనంతపురం టూటౌన్ పామిడి జీ.నిరంజన్‌రెడ్డి కదిరిటౌన్ పెద్దవడుగూరు ఎన్.నారాయణ సోమందేపల్లి వీఆర్ కే.దస్తగిరి డీఎస్బీ అటాచ్డ్ రొద్దం పీ.హమీద్‌ఖాన్ ధర్మవరం అర్బన్ అటాచ్డ్ అనంతపురం టూ టౌన్ ఎస్.నరేంద్రభూపతి నల్లమాడ నల్లచెరువు కే.ధరణిబాబు పెద్దవడుగూరు కదరి రూరల్ పీవై ఆంజనేయులు రొళ్ల తాడిపత్రి టౌన్ బీ శంకర్‌బాబు గుడిబండ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఎం.రామారావ్ శింగనమల కనగానపల్లి ఎం.కృష్ణారెడ్డి గుత్తి సీసీఎస్ బీ.రాఘవరెడ్డి రాయదుర్గం పుట్టపర్తి రూరల్ సుమీత్‌కుమార్ పీసీఆర్ కుందుర్పి వెంకటప్రసాద్ తనకల్లు అమడగూరు ఎస్.అనీల్‌కుమార్ వీఆర్ పరిగి బీటీ వెంకటేశ్వర్లు ఎన్పీకుంట హిందూపురం వన్‌టౌన్ పీ వెంకటేశ్వర్లు పట్నం బుక్కపట్నం ఏ.గురుప్రసాద్ గుంతకల్లు రూరల్ వీఆర్ వై.విజయకుమార్ రాప్తాడు వీఆర్ ఎన్.రాఘవేంద్రప్ప గాండ్లపెంట వీఆర్ వీ.శ్రీనివాసులు కుందుర్పి వీఆర్ పీ.శ్రీనివాసులు గుంతకల్లు టూ టౌన్ వీఆర్ జే.మోహన్కుమార్గౌడ బీకే సముద్రం వీఆర్ షేక్ వలీబాసు కళ్యాణదుర్గం రూరల్ వీఆర్ మోహన్‌కుమార్ అగళి వీఆర్ గౌస్మహ్మద్బాషా చిలమత్తూర్ సోమందేపల్లి కే.ఎం.లింగన్న అమరాపురం పెనుకొండ జమాల్‌బాషా లేపాక్షి అటాచ్డ్ సీకేపల్లి టీవీ శ్రీహర్ష గార్లదిన్నె పెద్దపప్పూరు నారాయణయాదవ్ గార్లదిన్నె అటాచ్డ్ కసాపురం ఎస్కే చాంద్‌బాషా వీఆర్ గుంతకల్లు టూ టౌన్ ఎం.సుబ్బరాయుడు అనంతపురం టూ టౌన్ పోతుకుంట డీ.రమేష్‌రెడ్డి అమడగూరు తనకల్లు ఆర్.శ్రీనివాసులు మహిళా పీఎస్ గార్లదిన్నె పీ.మహబూబ్‌ఖాన్ వీఆర్ పుట్లూరు పీ.జాకీర్‌హుస్సేన్ వీఆర్ అనంతపురం ట్రాఫిక్ పీఎం రఫీ కదిరి రూరల్ అనంతపురం టూ టౌన్ వీ.రత్నం వీఆర్ విడపనకల్లు కే శ్రీధర్ కంబదూరు గుడిబండ టీపీ వెంకటస్వామి బ్రహ్మసముద్రం అమరాపురం కే జనార్ధన్ బొమ్మనహల్ శింగనమల ఏ.క్రాంతికుమార్ గుంతకల్లు వన్ టౌన్ కంబదూరు కే.వెంకటరెడ్డి కసాపురం సీసీఎస్ బీ వెంకటేష్‌నాయక్ వీఆర్ పుట్టపర్తి అర్బన్ బీవీ నగేష్‌బాబు డీఎస్బీ అటాచ్డ్ గుంతకల్లు వన్ టౌన్ కే రాజశేఖర్ వీఆర్ సీసీఎస్ యూ. సద్గురుడు వీఆర్ గుంతకల్లు రూరల్ బీ ప్రవీన్‌కుమార్ వీఆర్ ఎన్పీకుంట వెంకటరమణ శెట్టూరు అనంతపురం వన్ టౌన్ ఎన్ రాజశేఖర్‌రెడ్డి కొత్తచెరువు వీఆర్ ఎం. తబ్రేజ్ వీఆర్ అగళి ఎస్ ఏ రహిమాన్ వీఆర్ రాయదుర్గం ట్రాఫిక్ ఏ ఇస్మాయిల్ వీఆర్ సీసీఎస్(టెక్నికల్ సెల్)