successors
-
దొరా.. ఇళ్లు రెడీ!
కొయ్యూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలసి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన గంటందొర, మల్లుదొర వారసుల సొంతింటి కల అతి త్వరలోనే సాకారం కానుంది. సామాజిక బాధ్యతగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ(ఎన్సీసీ) రూ.2 కోట్లతో మల్లుదొర సొంత ఊరు అయిన కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీలోని లంకవీధిలో నిర్మిస్తున్న ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లో గంటందొర, మల్లుదొర వారసులు 11 మందికి వాటిని అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు సొంతిళ్లు లేక, గుడిసెల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్వారా క్షత్రియ సేవా సమితి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది.సామాజిక బాధ్యతగా సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మించానలి కోరారు. ఈ మేరకు 11 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎన్సీసీ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మమ్మ, ఐటీడీఏ పీవో అభిషేక్ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సంస్థ నిలబెట్టుకుంది. రూ.2 కోట్లు వెచ్చింది రెండు భవనాలను నిర్మించింది. ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లు... ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లను ఎన్సీసీ నిర్మించింది. ఒక్కో ఫ్లాట్‌లో రెండు బెడ్ రూమ్‌లు, అటాచ్డ్ బాత్రూమ్లు, హాలు, వంటగదితో సహా అన్ని వసతులు కల్పించింది.మల్లుదొర , గంటందొర వారసులు 11 మందికి 11 ఫా్లట్లు కేటాయించి, ఒక ఫ్లాట్‌ను ఎన్సీసీ తమ కార్యకలాపాల కోసం వినియోగించుకోనుంది. ఈ నిర్మాణ పనులను క్షత్రియ సేవా సమితి పర్యవేక్షిస్తోంది. ఆనందంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సరైన గూడు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గృహాలు నిర్మించి ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు. – గాం గంగరాజు, లంకవీధిసొంతిల్లు అదృష్టం ఎట్టకేలకు సొంత గూటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్నాం. ఇంత అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదు. రెండు బెడ్ రూమ్‌లతోపాటు హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్లు నిర్మించడం ఆనందంగా ఉంది. – గాం సన్యాసమ్మ, లంకవీధిసమస్యను పరిష్కరించాం ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్వాతంత్య్ర సమరయోధుల పక్కా ఇళ్ల నిర్మాణం మా హయాంలో చేపట్టినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత తీసుకుని ఇంత అద్భుతంగా గృహాలను నిర్మించడం మరిచిపోలేని విషయం. లబ్ధిదారులు జీవితకాలం ఆ కంపెనీకి రుణపడి ఉంటారు. – జి.మాధవి, మాజీ ఎంపీ, అరకు -
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
బారక్పూర్/హుగ్లీ: ‘‘నాకు వారసులెవరూ లేరు. దేశ ప్రజలే నా వారసులు. అభివృద్ధి చెందిన భారత్‌ను వారి చేతికి ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ప్రజలను లూటీ చేసి, వారసుల కోసం కోటలు కట్టాలన్నదే ప్రతిపక్షాల అసలు లక్ష్యం. విపక్ష కూటమిలో కనిపించే ఉమ్మడి లక్షణం అవినీతి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను బతికి ఉన్నంతకాలం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఎవరూ రద్దు చేయలేరని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గతంలో ఎన్నడూ లేనన్ని తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ యువరాజు(రాహుల్ గాం«దీ) వయసు కంటే తక్కువ సీట్లతో ఆ పార్టీ సరిపెట్టుకోవాల్సిందేనని అన్నారు. పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలనలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బెంగాల్‌లోని బారక్పూర్, హుగ్లీ, హౌరా, పుర్సురాలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. బిహార్ రాజధాని పాటా్నలో రోడ్ షోలో పాల్గొన్నారు. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గూండాలు సందేశ్‌ఖాలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అయినప్పటికీ నిందితులను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం నిస్సిగ్గుగా కాపాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ అరాచకాలను ఎదిరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మహిళలపై హేయమైన నేరాలకు పాల్పడిన దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్ రాష్ట్రం అవినీతి కేంద్రంగా, బాంబుల తయారీ పరిశ్రమగా మారిపోయింది. చొరబాట్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇక్కడి స్థానికులు మైనారీ్టలుగా మారిపోతున్నారు. ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు దాసోహం అంటోంది. ప్రతి ఇంటికీ మంచినీటి సరఫరా గురించి నేను మాట్లాడితే తృణమూల్ నాయకులు బాంబుల బాష మాట్లాడుతున్నారు. హిందువులను బాగీరథీ నదిలో విసిరేస్తామంటున్నారు. వారికి ఆ అధికారం, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి? బెంగాల్లో శ్రీరాముడి పేరు పలికే పరిస్థితి లేదు. జనం శ్రీరామనవమి జరుపుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు జిహాద్ పిలుపులకు మద్దతిస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన బాధితులకు భారతదేశ పౌరసత్వం కలి్పంచేందుకు పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి. చట్టంపై అబద్ధాల రంగు చల్లుతున్నాయి. ఈ చట్టం పౌరసత్వం ఇవ్వడానికే తప్ప లాక్కోవడానికి కాదు. 400కు పై సీట్లు.. నినాదం కాదు, తీర్మానం లోక్‌సభ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ బీజేపీ కూటమి పట్ల సానుకూలంగా జరిగింది. ఈసారి ఎన్నికల్లో మాకు 400కు పైగా సీట్లు వస్తాయనేది నినాదం కాదు. అది ప్రజల తీర్మానం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతోనే సాధ్యం. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నాయి’ అని మోదీ స్పష్ట్టం చేశారు. -
బ్యాంకుల్లో రూ.35 వేల కోట్ల డిపాజిట్లు.. వారసులకు అందేదెలా?
కోటీ, రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.35 వేల కోట్లు. బ్యాంకుల్లో పదేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరగని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తమిది. డిపాజిట్‌దారులు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యుల(వారసులు)కు కూడా తెలియని డిపాజిట్లు కొన్నయితే, వారసులు ఎవరో తేలక బ్యాంకులోనే ఉండిపోయినవి కొన్ని. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఎవరూ క్లెయిమ్ చేయని ఈ డిపాజిట్ల మొత్తం రూ. 35,012 కోట్లుగా కేంద్ర ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. 10,24,00,599 ఖాతాలకు చెందిన ఈ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిబంధనల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఈ సొమ్ము మృతుల వారసులకు చెందాల్సి ఉందని తెలిపింది. ఈ క్లెయిమ్‌లను పరిష్కరించడంలో కుటుంబ సభ్యులకు సహకరించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మృతుల ఖాతాలకు సంబంధించి చట్టపరమైన ప్రాతినిధ్యం లేకుండా క్లెయిమ్‌లు పరిష్కరించరు. ఇందుకోసం నిర్దిష్టమైన దరఖాస్తు, నిబంధనలు ఉంటాయి. వీటిని మృతుల కుటుంబ సభ్యులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించినట్లు ఆర్థి క మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ దరఖాస్తులు సరైన వివరాలు లేకుండా, అసంపూర్తిగా ఉంటే వాటిని బ్యాంకులు తిరస్కరిస్తాయని, అయితే వాటిని తిరస్కరించడానికి కారణాలను క్లెయిమ్‌దారులకు బ్యాంకులు తెలియజేయాలని, సక్రమంగా నమోదు చేయడానికి సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థి క శాఖ పేర్కొంది. ఈ ఖాతాల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పింది. ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, చట్టబద్ధమైన వారసులను కనుగొనేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కూడా ఆదేశించినట్లు తెలిపింది. ఒక సంవత్సరానికంటే ఎక్కువ కాలం కార్యకలాపాలు లేని ఖాతాలను ప్రతి ఏడాదీ సమీక్షించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించిందని తెలిపింది. ఆ ఖాతాదారులను సంప్రదించి కారణాలను తెలుసుకోవడంతో పాటు ఎటువంటి లావాదేవీలు జరగలేదని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలని సూచించినట్లు చెప్పింది. -
మృతుని ఖాతాల వివరాలు వారసులకు ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: మృతుని అకౌంట్ల వివరాలను వ్యక్తిగత సమాచారం పేరుతో అతని వారసులకు ఇచ్చేందుకు నిరాకరించ రాదని పేర్కొన్న కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) సంబంధిత అధికారికి జరిమానా విధించింది. చనిపోయిన తన తండ్రికి సంబంధించిన పోస్టాఫీసు అకౌంట్ల వివరాలు అందజేయాల్సిందిగా ఓ వ్యక్తి పోస్టల్ సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అది వ్యక్తిగత సమాచారం కాబట్టి, తాము ఇవ్వలేమంటూ సూపరింటెండెంట్ నిరాకరించారు. దీనిపై బాధితుడు సీఐసీని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ‘హిందూ వారసత్వ చట్టం ప్రకారం మృతునికి దరఖాస్తుదారు చట్టపరమైన వారసుడు. కాబట్టి అతడు వ్యక్తిగత వివరాలు కోరినట్లుగా పరిగణించలేము. తండ్రికి సంబం ధించిన అన్ని అకౌంట్ల వివరాలు తెలుసుకునే హక్కు అతనికి ఉంది. మృతుని కుటుంబానికి పోస్టాఫీసు ఎటువంటి డబ్బు కూడా చెల్లించలేదు. కాబట్టి, దరఖాస్తు దారు అడిగిన మేరకు అకౌంట్లు, నిల్వల వివరాలు అందజే యాల్సిందే’ అని పేర్కొన్నారు. అంతేకాదు, దరఖాస్తుదారును ఇబ్బంది పెట్టినందుకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
వా‘రస’ రాజకీయం!
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీలో వారసుల పోటీ మొదలైనట్టు కనిపిస్తోంది. పలువురు రాష్ట్ర మంత్రులకు వారి వారసుల ఒత్తిడి, పనితీరు, వ్యవహార శైలి తలనొప్పిగా మారుతున్నాయి. రాజకీయ వ్యవహారాల్లో తలమునకలైన వారికి కుటుంబ సభ్యుల చేదోడు వాదోడు సహజమే అయినా.. నియోజకవర్గాల్లో, శాఖాపరంగా పాలనా వ్యవహారాల్లో కొందరు వారసులు జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారుల బదిలీలు, సెటిల్మెంట్లు, ఇతర ఆర్థిక అంశాల్లోనూ కల్పించుకుంటున్నారు. ఇది వివాదాలకు దారితీస్తోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ప్రత్య ర్థులే కాకుండా సొంత పార్టీ నేతల నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటిదాకా పాలనా అంశాలు, అంతర్గతంగా రాజకీయ నిర్ణయాల్లో జోక్యం వరకు పరిమితమైన వారసులు.. వచ్చే ఎన్నికల నాటికి స్వయంగా రాజకీయ గోదాలోకి దిగేందుకు ఎత్తులు వేస్తున్నారు. రాజకీయ వారసత్వం కోసం.. కొందరు అమాత్యుల వారసులు బహిరంగంగానే తమకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కావాలని కోరుతున్నారు. మరికొందరు బయటపడకుండా అంతర్గతంగా పనులు చక్కబెడుతూ.. పార్టీలో, ఇతర వర్గాల్లో బలం పెంచుకుంటున్నారు. కొందరు వారసులు నియోజకవర్గంలో అన్నీ తామై దూకుడుగా పనిచేస్తున్నారు. బహిరంగంగానే అభివృద్ధి కార్యక్రమాల్లో, పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల్లో తమ తండ్రి తరఫున చాలా కార్యక్రమాలకు వారే హాజరవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ అరంగేట్రం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో అంతర్గత పోటీదారులపై, కుటుంబంలో పోటీ వారసులపై, ప్రత్యర్థి పార్టీల్లోని పోటీదారులపై పైచేయి సాధించడం కోసం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికార యం త్రాంగంతోనూ ఇదే తీరుగా వ్యవహరిస్తుండటం ఇబ్బందులకు కారణమవుతోంది. ఇలా ఇద్దరు ముగ్గురు మంత్రుల వారసులు అత్యుత్సాహంతో తండ్రులకు ఇబ్బందులు తెచ్చిపెట్టడం.. వారి వ్యవహారశైలిపై మంత్రులు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం వంటి పరిస్థితులు కూడా తలెత్తాయి. కుమార్తెలు, అల్లుళ్లు కూడా..! కొందరు అమాత్యులకు రాజకీయ వారసులుగా వారి కుమార్తెలు, అల్లుళ్లు తెరపైకి వస్తున్నారు. రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి కుమార్తె వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరానికి చెందిన మరో కీలక మంత్రి అల్లుడు.. ఆయన రాజకీయ వారసునిగా తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన.. నగరంలోని ఓ అసెంబ్లీ స్థానంలో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దూకుడు.. వివాదాలు.. అధికారంలో ఉన్నప్పుడే రాజకీయాలకు అవసరమైన అర్థ, అంగ, ఇతర బలాల సమీకరణ కోసం కొందరు మంత్రుల వారసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా బలోపేతం కావడం కోసం వివాదాస్పద భూముల్లోనూ, ఆస్తుల్లోనూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు మంత్రుల తనయులు ఆర్థిక వ్యవహారాల్లో కలగజేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడి తీరు చాలాసార్లు మంత్రిని, పార్టీని ఇబ్బందులకు గురిచేసిందని.. పలువురు నేతల అనుచరులను బెదిరించారని టీఆర్ఎస్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఓ నేత ఆర్థిక వ్యవహారంలో తమను వేధిస్తున్నారంటూ ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇలాంటి ఘటనలపై కొందరు ఫిర్యాదులు చేస్తుండగా.. అధికారంలో ఉన్నవారితో గొడవ ఎందుకనే భయంతో చాలామంది ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారు. అయితే ఫిర్యాదులు రాకున్నా బెదిరింపుల ఫోన్‌కాల్ రికార్డులు, వీడియోలు, ఇతర మార్గాల్లో ఆ విషయాలు బయటపడి.. మంత్రులను అంతర్గతంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వారసులు! ♦ హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు మంత్రుల కుమారులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారిలో కొందరు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే ఆయా చోట్ల కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అవకాశం లభించలేదు. ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఓ నామినేటెడ్ పదవిలో ఉన్న ఆయన.. పార్టీ నేతలతో, అధికారులతో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మంత్రి కుమారుడు ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి ప్రయత్నిస్తున్నారు. ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు అమాత్యుల కుమారులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు కూడా రాజకీయ అవకాశాల కోసం పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. -
ఇక చిన్నమ్మ సేన
సాక్షి, చెన్నై : అమ్మ సేనలు అన్న పేరు మరుగున పడి, ఇక చిన్నమ్మ సేన తెర మీదకు రానుంది. అమ్మ జయలలిత రాజకీయ వారసురాలు శశికళ అన్న విషయాన్ని పార్టీ పెద్దలు తేల్చడంతో అభిమానాన్ని చాటుకునే పనిలో అత్యుత్సాహం ప్రదర్శించడంలో సేనలు దూసుకెళుతున్నారు. చిన్నమ్మ ఫొటోలు, పేర్లతో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. ఏ మేరకు ద్వితీయ, తృతీయశ్రేణి కేడర్ ఉత్సాహాన్ని చూపుతున్నదో అదే స్థాయిలో వ్యతిరేకత అనేక చోట్ల వ్యక్తం అవుతోంది. పురట్చితలైవి జయలలిత మీద అన్నాడీఎంకే వర్గాలకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె మరణం ఆ పార్టీ వర్గాలకు తీరని లోటే. అందుకే ఆ లోటును చిన్నమ్మ ద్వారా భర్తీ చేయడానికి సిద్ధమయ్యారు. నాయకులు ఎందరో ఉన్నా, పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం సాగించేంత కీలక వ్యక్తి అన్నాడీఎంకేలో లేరు. ఈ దృష్ట్యా, జయలలితకు నీడలా ఉంటూ, ఆమె కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ పోయెస్ గార్డెన్ వేదికగా రాజకీయ వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్న చిన్నమ్మే ఇక, తమకు అమ్మ అన్న నిర్ణయానికి అన్నాడీఎంకే పెద్దలు వచ్చేశారు. చిన్నమ్మే దిక్కు అంటూ పోయెస్ గార్డెన్‌కు పోటెత్తే నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం అన్ని జిల్లాలు, మండల, యూనియన్, నగర, పట్టణ, గ్రామ కమిటీల కార్యదర్శులు పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి పెద్దలు చిన్నమ్మా...పగ్గాలు చేపట్టమ్మా అంటూ వేడుకుంటుంటే, జిల్లా మొదలు గ్రామ స్థారుు నాయకులు ఇక చిన్నమ్మే....తమ అమ్మా అని చాటుకునే విధంగా పరుగులు తీయడానికి సిద్ధం అవుతుండడం గమనార్హం. సీఎం పన్నీరు సెల్వం మొదలు మంత్రులు, ఎంపీలు అందరూ చిన్నమ్మే ఇక అమ్మ రాజకీయ వారసురాలు అని స్పష్టం చేయడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి కేడర్ ఉత్సాహాన్ని, అభిమానాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. పత్రికల్లో చిన్నమ్మకు ఆహ్వానం పలికే రీతిలో ప్రకటనల్ని హోరెత్తిస్తున్నారు. ఇన్నాళ్లు అమ్మ సేనలం అని చెప్పకుంటున్న వాళ్లు, ఇక ఆ పేరును తెర మరుగు చేసి చిన్నమ్మ సేనలుగా తమ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం. ఇక, ఎంజీఆర్, జయలలిత తదుపరి, చిన్నమ్మే అంటూ వారి ముఖ చిత్రాలతో ఫ్లెక్సీలను హోర్డింగ్‌లను ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. అమ్మ మార్గంలో మా చిన్నమ్మా...!, నాడు...నేడు..రేపు , భూమి ఉన్నంత వరకు అమ్మే..! అన్న నినాదాలతో ఈ హోర్డింగ్‌లు హోరెత్తుతున్నాయి. ఇన్నాళ్లు జయలలిత హోర్డింగ్‌లు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తుండడంతో, వాటిని తొలగించడం లక్ష్యంగా కోర్టులో పెద్ద సమరమే చేసిన ఘనత సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామికి దక్కుతుంది. ఇక, చిన్నమ్మ ఫ్లెక్సీల భరతం పట్టే విధంగా ట్రాఫిక్ ఉరకలు తీసినా తీయొచ్చేమో...!. కాగా, కొందరు చిన్నమ్మ మీద భక్తిని చాటుకునే విధంగా పరుగులు తీస్తుంటే, అదే స్థాయిలో మరెందరో తమ అమ్మ స్థానంలో మరొకర్ని సహించబోమన్నట్టుగా నిరసనలు వ్యక్తం చేస్తుండడం ఆలోచించాల్సిందే. మెజారిటీ శాతం చిన్నమ్మకు మద్దతుగా పెద్దల పయనం సాగుతున్నా, కింది స్థాయి కేడర్‌లో మాత్రం ఆ స్పందన కరువైనట్టుగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. కొందరు అయితే, చిన్నమ్మకు వ్యతిరేకంగా పోయెస్ గార్డెన్ వైపుగా చొచ్చుకు వస్తుండడం కొసమెరుపు. చిన్నమ్మకు వ్యతిరేకత : చిన్నమ్మకు వ్యతిరేకంగా పుదుచ్చేరి అన్నాడీఎంకే సీనియర్, మాజీ ఎమ్మెల్యే ఓం శక్తి శేఖర్ గళం విప్పారు. అమ్మ జయలలిత శాశ్వత ప్రధాన కార్యదర్శి అన్న విషయాన్ని మరచి, ప్రస్తుతం నాయకుల తీరు ఉన్నదని మండిపడ్డారు. ప్రధాన కార్యదర్శిగా మరొకర్ని నియమించడానికి వీలు లేదని, అమ్మే ఆ పదవికి శాశ్వతం అని పేర్కొన్నారు. మరొకర్ని ఆ పదవిలో నియమిస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ, శశికళను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించే ప్రయత్నాలను ఖండించారు. ఆ పదవికి ఆమె అనర్హురాలుగా వ్యాఖ్యానించారు. అలాగే, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ, శశికళ పగ్గాలు చేపట్టిన పక్షంలో అన్నాడీఎంకే రెండుగా చీలడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఇన్నాళ్లు అమ్మ జయలలితకు కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ వచ్చిన సేనలు, ప్రస్తుతం చిన్నమ్మ కాళ్ల మీద పడే పనిలో పడ్డట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే రీతిలో పలువురు నేతల సాష్టాంగ నమస్కారాల వీడియో వాట్సాప్‌లలో హల్చల్ చేస్తున్నాయి.