Suchir Balaji
-
సుచీర్ బాలాజీ కేసులో షాకింగ్ ట్విస్ట్!
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ కేసులో అనూహ్యపరిణామం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ యువ టెక్ పరిశోధకుడి మృతిపై మిస్టరీ వీడడం లేదు. ఓపక్క అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ప్రకటించగా.. మరోవైపు తల్లిదండ్రులు బాలాజీ రమణమూర్తి, పూర్ణిమరావ్ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అది హత్యేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘రెండో అటాప్సీ రిపోర్ట్‌ను మేం చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిలలాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అనే చెప్తున్నాయి’’ అని తల్లి పూర్ణిమరావ్ అంటున్నారు... ‘‘ఏఐ ఇండస్ట్రీలో టాప్-10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్ఏఐ(OpenAI) కంపెనీని.. ఉన్నపళంగా ఎందుకు ఏఐ ఇండస్ట్రీని వదిలేస్తాడు. న్యూరా సైన్స్, మెషిన్‌లెర్నింగ్ వైపు ఎందుకు మళ్లాలనుకుంటాడు?. ఓపెన్ఏఐ మా అబ్బాయిని అణచివేసి ఉండొచ్చు.. బెదిరించి ఉండొచ్చు.. అనేదే మా అనుమానం’’ అని పూర్ణిమ చెబుతున్నారు . ‘‘లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మిత్రుడి పుట్టినరోజు పార్టీ నుంచి తిరిగి వచ్చినట్లు మా వాడు చెప్పాడు. వచ్చే నెలలో లాస్ వెగాస్ టెక్ షోలో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు అని తండ్రి రమణమూర్తి బాలాజీతో జరిగిన చివరి సంభాషణను వివరించారు. వాడెంతో సంతోషంగా ఉన్నాడు. అలాంటివాడెందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.సుచీర్ కెరీర్ ఎంపిక విషయంలో ఏనాడూ మేం అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే.. అది మరింత ప్రమాదకారిగా మారబోతుందని సుచీర్ గుర్తించాడు. చాట్‌జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమను దోపిడీ చేయడం అనైతిక చర్యగా భావించాడు. వాడి పోరాటం ఓపెన్ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు. కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేం ఏకీభవించాం... కానీ, ఏదో జరిగింది. మా దగ్గర శవపరీక్ష నివేదిక ఉంది. అందులో బలవనర్మణం కాదని స్పష్టంగా ఉంది. ఇక తెలుసుకోవాల్సింది.. దీనికి కారకులెవరు? ఎందుకు చేశారనే?.. మా అబ్బాయి మృతిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాలి. ఇప్పటికే ఇక్కడి భారత అధికారులను కలిశాం. ఈ విషయంలో భారత ప్రభుత్వ మద్దతు కోరుతున్నాం. ఇక్కడ బలైంది నా బిడ్డ మాత్రమే కాదు. ఓ మేధావి జీవితం అర్ధాంతంగా ముగిసింది. టెక్ ఇండస్ట్రీ ఓ విలువైన జీవితం పొగొట్టుకుంది. ఓపెన్ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తాని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది’’ అని సుచీర్ పేరెంట్స్ ప్రకటించారు.కార్నిఫోలియా ఎన్నారై దంపతులు బాలాజీ రమణమూర్తి-పూర్ణిమలకు సుచీర్ బాలాజీ(Suchir Balaji) జన్మించాడు. బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే కిందటి ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడు. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. అయితే సుచీర్ ఎత్తిచూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్ఏఐ ప్రకటించుకుంది. మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన అపార్ట్మెంట్లో నవంబర్ 26వ తేదీన సుచీర్ శవమై కనిపించాడు. అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. తమ ప్రాథమిక విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ అతని పేరెంట్స్‌తో పాటు పలువురు బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ఇంతకు ముందు.. ఇలాన్ మస్క్(Elon Musk)కు సైతంసుచీర్ బాలాజీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొసమెరుపు ఏంటంటే.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-శామ్ అల్ట్మన్ కలిసి ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. అప్పటి నుంచి ఇలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు వైరం కొనసాగుతోంది.చదవండి👉🏾 బాలాజీ తల్లి ట్వీట్, మస్క్ ఏమన్నారంటే.. -
ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి..మస్క్ కీలక ట్వీట్
కాలిఫోర్నియా: ఓపెన్ఏఐ ఇంజినీర్ సుచిర్ బాలజీ మరణంపై అతడి తల్లి పూర్ణిమారావ్ చేస్తున్న ఆరోపణలకు ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) మద్దతిచ్చారు. సుచిర్ బాలాజీ నవంబర్ 26న అమెరికాలోని సాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు.అయితే సుచిర్ మరణంపై తల్లి పూర్ణిమారావ్ తాజాగా ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు చేశారు. సుచిర్ మృతిపై తాము ప్రైవేట్ డిటెక్టివ్‌తో చేయించిన దర్యాప్తులో భాగంగా రెండోసారి శవపరీక్ష చేశామని తెలిపారు. శవపరీక్ష ఫలితాలు పోలీసులు చెబుతున్నదానికి భిన్నంగా ఉన్నాయన్నారు. ‘నవంబర్ 26న సుచిర్ అపార్ట్మెంట్లోకి ఎవరో ప్రవేశించారు. బాత్రూమ్లో సుచిర్కు ఇతరులకు మధ్య ఘర్షణ జరిగిన ఆనవాళ్లున్నాయి. రక్తపు మరకలు కూడా కనిపించాయి. ఇంతటి దారుణ హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చారు. సుచిర్ అనుమానాస్పద మృతిపై ఎఫ్‌బీఐ విచారణ చేయాలి’అని పూర్ణిమారావ్ తన పోస్టులో డిమాండ్ చేశారు. Update on @suchirbalajiWe hired private investigator and did second autopsy to throw light on cause of death. Private autopsy doesn’t confirm cause of death stated by police.Suchir’s apartment was ransacked , sign of struggle in the bathroom and looks like some one hit him…— Poornima Rao (@RaoPoornima) December 29, 2024పూర్ణిమారావ్ పెట్టిన ఈ పోస్టుకు బిలియనీర్ మస్క్ మద్దతు పలికారు. సుచిర్‌ది ఆత్మహత్యలా కనిపించడం లేదని మస్క్ ఆమె ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. సుచిర్ మృతిపై తమ పోరాటానికి మద్దతివ్వాలని పూర్ణిమారావ్ ఈ సందర్భంగా మస్క్‌ను కోరారు. This doesn’t seem like a suicide— Elon Musk (@elonmusk) December 29, 2024కాగా, సుచిర్ ఓపెన్ ఏఐ కంపెనీ చాట్‌జీపీటీ ఏఐ ప్రాజెక్టులో ఇంజినీర్‌గా పనిచేశారు. ఓపెన్ ఏఐ కంపెనీ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని పనిచేస్తున్న కంపెనీపైనే ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే సుచిర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత -
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024