Suddhala Ashok Teja
-
జానపదానికి గ్లామర్ రావాలి: అశోక్‌తేజ
- యాస అమ్మలాంటిది... నల్లగా ఉందని అమ్మని తరిమేస్తామా? - మట్టి చరిత్రను ఆవిష్కరిస్తేనే ఆవిర్భావానికి అర్థం - ఊరూవాడా వీధులన్నింటికీ త్యాగధనుల పేర్లు పెట్టాలి - సాక్షికి సుద్దాల అశోక్‌తేజ ఇంటర్వ్యూ... మన కల్చర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి... మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి.. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి.. బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: పుష్కరాలను ఎలా నిర్వహిస్తారో సమ్మక్క సారక్క జాతరను కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. బతుకమ్మ, బోనాల పండుగలు కూడా తెలంగాణ సంస్కృతికి ఐకా న్ వంటివి. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించాలి. తెలంగాణలో జాన పదం ఎక్కువగా ఉంటుంది. ఆట-పాట- మాట ఎవరికివారే రాసుకొని ట్యూన్ చేసుకుని ఆడుతూ పాడతారు. వీరినే వాగ్గేయకారులం టారు. వీటిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర జానపద సాంస్కృతిక అకాడమీని ఏర్పాటు చేయాలి. ఆ రంగంలో కృషిచేస్తున్న వారిని ఏడాదికి నాలుగుసార్లకు తగ్గకుండా కార్య క్రమాలను రూపకల్పన చేయాలి. అన్నమయ్య పీఠంలా జానపద పీఠాన్ని ఏర్పాటు చేయాలి. వృత్తికళాకారులను చేరదీయాలి. వారికి వేతనాలు ఇవ్వాలి. గౌరవ పారితోషకాలు అందజేయాలి. కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యంలో 25 శాతం వీటికి అన్ని ఛానళ్లలో ప్రాముఖ్యం ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అప్పుడుగానీ వీటికి గ్లామర్ రాదు. ప్రభుత్వం ఆదరిస్తే జానపద కళలకు కూడా గ్లామర్ వస్తుంది. ఒక రంగాన్ని పెంచిపోషి ంచాలంటే ముందుగా దాన్ని ఫోకస్‌లోకి తీసుకురావాలి. గ్లామర్ ఇవ్వాలి. టీఆర్ఎస్ ఉద్యమంతో వేలాదిమంది కళాకారులు పుట్టుకొచ్చారు. అలాగే కొన్ని టీవీల్లో జానపద కళారూపాలను ప్రదర్శించడం వల్ల ఆ కళాకారులకు గ్లామర్ పెరిగింది. అనేకమంది అమెరికా వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇచ్చారు. పాలకుర్తి సోమనాథుడు, పోతన, వేముల వాడ భీమకవి పేరుమీద పరిశోధనాలయాలు నిర్మించా లి. వారి పేర్లతో కళాపీఠాలు ఏర్పాటు చేయాలి. సుద్దాల హన్మంతు పేరుతోనూ కళాపీఠం ఏర్పాటు చేయాలి. కొమురం భీం, చాకలి ఐలమ్మ పేర్లమీద జిల్లాల్లో స్మారక మందిరాలు నిర్మించాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారు, తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి విగ్రహాలను ప్రతిష్టించాలి. వీధులకు, గ్రామాలకు, కూడళ్లకు వారి పేర్లు పెట్టాలి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేటితరానికి తెలియనే తెలియదు. దాన్ని సిలబస్‌లో పెట్టాలి. అమెరికాకు వెళ్లి వివేకానందుడు ఎంతో గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. అతను ఉపన్యాసం ఇచ్చిన హాలును జ్ఞాపకార్థంగా పర్యాటక క్షేత్రంగా అమెరికా ప్రభుత్వం ఉంచి గౌరవిస్తోంది. దాన్ని వేలాది మంది సందర్శిస్తుంటారు. పరాయి దేశ వ్యక్తిని ఒక అగ్రరాజ్యం అలా గుర్తించినప్పుడు మన వీరులను మనం ఎందుకు గుర్తుంచుకోకూడదు? వరంగల్ జిల్లాలో బైరాన్‌పల్లిలో మరో జలియన్‌వాలాబాగ్ వంటి సంఘటన జరిగింది. వందల మంది తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అక్కడ చనిపోయా రు. ఈ విషయం ఎందరికి తెలుసు? తెలంగాణ వంటకాలను హోంసైన్స్‌లో పాఠ్యాంశాలు చేయాలి... తెలంగాణలో శిలాశాసనాలను వెతికి పట్టుకుని వాటిని గ్రంథాలుగా చేయాలి. పుస్తకాలు, సీడీలుగా మార్చాలి. తాళపత్ర గ్రంథాలను సీడీలుగా మార్చాలి. వెబ్సైట్లలో పెట్టాలి. వందలాదిగా ఉన్న ప్రజల ఆచారాలను బయటకు తీయాలి. జొన్న, సజ్జ రొట్టెలకు ఉన్న విలువెంతో తెలుసా? పచ్చి పులుసు, అరిసెలు, గారెలు వంటివాటిని తెలంగాణ సృష్టించింది. వాటిలో ఉన్న ఆరోగ్య రహస్యాలను హోంసైన్స్‌లో సిలబస్‌గా పెట్టాలి. కల్చర్ అంటే మనం వేసుకునే బట్టలు, మనం నివసించే ఇళ్లు, మన ఆహారం, మన కళలు, మన భాష, మన సాహిత్యం, మన వ్యవసాయం, దాన్ని కాపాడుకునే విధానం, ఒక పద్ధతి కలిస్తేనే కల్చర్. దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి. యాసను కాపాడుకోవాలి... తెలంగాణ మాట్లాడే విధానంలోని యాసల సోయగాన్ని సొంపులను పట్టుకొని కాపాడుకోవాలి. యాసను వెక్కిరించొద్దు. యాస అమ్మలాంటిది. అమ్మ నల్లగా ఉందని వెళ్లగొడతామా? యాసలోని సొంపు సోయగాలను సీడీలుగా మార్చాలి. గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలి. వాటిని ధ్వంసం చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడమంటే సీఎం పదవి తెలంగాణ వారికి రావడమేనా? గద్దెల మీద మనుషులను మార్చడం కాదు. తెలంగాణ మట్టి చరిత్రను ఆవిష్కరించాలి. అధికార మార్పిడి కాదు కావాల్సింది. సినిమా రంగం తెలుగు సంస్కృతికి దూరమైంది. సహజత్వానికి దూరమైంది. తెలుగు అనుబంధాలకు ఇంకా దూరమైంది. పురిటి నొప్పులను కూడా సెక్సీగా చూపించే దుస్థితి సినిమాల్లో దాపురించింది. తెలంగాణ కళాకారులను సినిమా రంగంవైపు ప్రోత్సహించేందుకు ఫిల్మ్‌లో శిక్షణ ఇవ్వాలి. అందుకు ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. బాలచందర్, గిరీష్కర్నాడ్ వంటి వారిని తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాలి. ఈ పనిని ప్రభుత్వమే చేయాలి. -
మహిళలకు కవులు అండగా ఉండాలి
వారి సమస్యలపై రచనల ద్వారా పోరాటం చేయూలి స్త్రీకి స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యం సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ చేర్యాలటౌన్, న్యూస్‌లైన్ : రచయితలపై స్త్రీల ప్రభావం ఉంటుంద ని... మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కవులందరూ తమ రచనల ద్వారా పోరాటం చేయూలని సినీ గేయ ర చయిత సుద్దాల అశోక్ తేజ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేర్యాల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా సుద్దాల అశోక్ తేజ హాజరయ్యూరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై వివక్ష కొనసాగినంత కాలం వారికి రక్షణ ఉండదన్నారు. సమాజ సంస్కరణ కోసం ప్రతిఒక్కరూ ముందుకురావాలన్నారు. దేశంలో 70 శాతం అబార్షన్లు జరుగుతున్నాయని... ఈ సంస్కృతిని విడనాడేందుకు సమాజంలో సగభాగంగా ఉన్న మహిళాలోకం పిడికిలెత్తి ఉద్యమించాలన్నారు. అనాది నుంచీ మహిళలపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని... దేశ రాజధానిలో మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యం కావడం తలదించుకోవాల్సిన విషయమని పేర్కొన్నారు. రచయిత అన్నవాడు నీళ్లలా ఉండాలని, సమాజ ఇతివృత్తంతో కూడిన రచనలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు సగ భాగంగా పోరాడారని, ఈ రాష్ట్రంలో వారికి కూడా సగభాగం అధికారాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్త్రీకి స్వేచ్చ ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ‘అమ్మ నీకు దండమే, నేలమ్మ నేలమ్మ నేలమ్మా, అమ్మనురా నన్ను అమ్మకురా... కొడుకువురా నన్ను కొట్టకురా, అమ్మ నీ కడుపులోని ఆడపిల్లనే... నిన్ను చూడాలని ఉన్నదే అంటూ అమ్మ అన్న పదంపై, అమ్మతనంపై ఆయన పాటలు పాడగా.. మహిళలు చప్పట్లతో అభినందనలు తెలిపారు. కాగా, చేర్యాల ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని అశోక్ తేజ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కవి, రచయిత నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మగవాడి గౌరవాన్ని కాపాడేందుకు మహిళలు బాధలను దిగమింగుతున్నారని, ఆకలిని సైతం లెక్కచేయకుండా ఉన్నదాన్ని పంచి అమ్మతనాన్ని నిలుపుతున్న మహిళలకు అందరు చేతులెత్తి నమస్కరించాలన్నారు. మహిళా లోకం సంఘటితమై ఉద్యమించినప్పుడే సమాజ మార్పు సాధ్యమవుతుందన్నారు. అంగన్ వాడీల చదువు అందరికి వెలుగు కావాలని, ప్రతి మహిళ చదువుకున్నప్పుడేఆత్మగౌరవం పెరుగుతుందన్నారు. అనంతరం క్రీడాపోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఆ తర్వాత అతి థులను ఐసీడీఎస్ అధికారులు శాలువాలతో కప్పి ఘనంగా సన్మానించారు. సమావేశానికి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి పద్మజారమ ణ అధ్యక్షత వహించగా మహిళా జేఏసీ జనగా మ డివిజన్ అధ్యక్షురాలు పాశికంటి వెంకటరమణ సుధాకర్, చాంబర్ అధ్యక్షుడు ఉడుముల భా స్కర్‌రెడ్డి, కార్యదర్శి పుర్మ వెంకట్‌రెడ్డి, చేర్యాల సర్పంచ్ ముస్త్యాల అరుణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి. కొండయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. దిలా ఉం డగా... తెలంగాణ కళాకారులు పాడిన పాటలు అలరించాయి. బాల్యవివాహల వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శించిన నాటిక ఆహూతులను ఆకట్టుకుంది. -
కొన్ని పాటలు కారు డీజిల్ కోసమే
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ‘‘సినీ పరిశ్రమలో రెండు రకాల పాటలు రాస్తాం. కారు డీజిల్ కోసం కొన్ని ఇష్టం లేని పాటలు రాయకతప్పదు. వాటిని పెన్నుతోనే రాస్తా. సమాజం కోసం మంచి పాటలు రాయడంలో తృప్తి ఉంటుంది. వాటిని మాత్రం గుండెతో రాస్తా. పాలకులు తెలుగును రాష్ట్ర అధికార భాషగా చేయకపోవడం మన దౌర్భాగ్యం’’ అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న పదిహేనేళ్ల ‘స్పెషల్ జెక్‌ఫెస్ట్- 14’ వేడుకల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : రాష్ట్రంలో తెలుగు అమలుపై మీ అభిప్రాయం? జవాబు : ఇద్దరు తెలుగోళ్లు కలిస్తే ఇంగ్లిషులో మాట్లాడుతున్నారు. చదువుకున్నవారు తెలుగు మాట్లాడటం నామోషీగా భావిస్తున్నారు. పాలకులు కూడా ఆంగ్లంలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఇద్దరు తమిళులు కలిస్తే కచ్చితంగా తమిళంలో మాట్లాడకపోతే చిన్నతనంగా భావిస్తారు. ప్ర: తెలుగు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? జ : తెలుగును కంప్యూటరీకరిస్తే ప్రపంచ భాషగా వర్ధిల్లుతుంది. కంప్యూటకరణతోనే 365 అక్షరాలున్న చైనా భాష, 26 అక్షరాలున్న ఇంగ్లిషు ప్రపంచ ఖ్యాతి పొందినప్పుడు 56 అక్షరాల తెలుగును ప్రపంచ వ్యాప్తి ఎందుకు చేయలేం. ప్ర: మీ పాటలకు ప్రేరణ? జ : మా నాన్న హనుమంతే. ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. ఆయన అడుగుజాడల్లోనే మా అమ్మ జానకమ్మ ఉద్యమంలో పనిచేశారు. 1951లో తెలంగాణ సాయుధ పోరాటంలో నా తల్లిదండ్రులు సహా 4 వేల మంది ప్రాణాలు అర్పించారు. ఆ పోరాటం స్ఫూర్తితోనే నా పాటల్లో ఉద్యమం, చైతన్యం పుట్టాయి. ప్ర: ఏ సినిమాకు తొలిపాట రాశారు? జ : 1994లో ‘నమస్తే అన్న’ సినిమాకు ‘గరం గరం పోరీ’ పాటరాశా. ఇప్పటివరకు 700 సినిమాలకు 1,700 పాటలు రాశా. త్వరలో వచ్చే బాహుబలి, మనసును మాయ చేయకే తదితర సినిమాల్లో రాస్తున్నా. ప్ర: కొత్త సినిమాల పాటల్లో సాహిత్యం పరిస్థితి? జ : ప్రస్తుత జనరేషన్‌ను బట్టే సినిమా పాటలు ఉంటున్నాయి. ఏది వదిలేయాలి, ఏది స్వీకరించాలనేది ప్రేక్షకుల నిర్ణయం. ప్ర: ఏఏ సినిమాల్లో నటించారు? జ : శ్రీహరి నటించిన కుబుసంలో నటించా. కొత్తగా వస్తున్న ఆయుధం, అదీ లెక్క సినిమాల్లో నటిస్తున్నా. ప్ర: మీ లక్ష్యం ఏమిటి? జ : పరిశ్రమకు వచ్చిన మూడేళ్లకు నంది, ఐదేళ్లకే జాతీయ అవార్డు తీసుకోవాలనేది నా లక్ష్యం. నంది అవార్డు పొందిన రెండేళ్లకు జాతీయ అవార్డు అందుకున్నా. శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉంది. ప్ర: సినీ పరిశ్రమలో మీ టర్నింగ్ పాయింట్ జ : ఒసేయ్ రాములమ్మ. దాసరి వలనే నాకు పునర్జన్మ వచ్చింది. ఆ సినిమాల్లోని పాటల్లో పల్లెదనం, ఆవేశం, విప్లవం నా పాటలకు ప్రాణం పోశాయి. పాపులర్ అయ్యాను. ప్ర: ప్రైవేట్‌గా ఎన్ని పాటలు రాశారు? జ : రెండు వేల పాటలు రాశా. నాటికలు, నవలలు కూడా రాశా. 1985లో వెలుగురేఖలు నవలకు విశాలాంధ్ర వారు స్టేట్ ప్రైజ్ ఇచ్చారు. త్వరలో శ్రమపై ఒక కావ్యాన్ని విడుదల చేస్తున్నా.