మహిళలకు కవులు అండగా ఉండాలి
- వారి సమస్యలపై రచనల ద్వారా పోరాటం చేయూలి
- స్త్రీకి స్వేచ్ఛ ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యం
- సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
చేర్యాలటౌన్, న్యూస్‌లైన్ : రచయితలపై స్త్రీల ప్రభావం ఉంటుంద ని... మహిళలకు జరుగుతున్న అన్యాయంపై కవులందరూ తమ రచనల ద్వారా పోరాటం చేయూలని సినీ గేయ ర చయిత సుద్దాల అశోక్ తేజ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేర్యాల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో చేర్యాల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా సుద్దాల అశోక్ తేజ హాజరయ్యూరు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై వివక్ష కొనసాగినంత కాలం వారికి రక్షణ ఉండదన్నారు. సమాజ సంస్కరణ కోసం ప్రతిఒక్కరూ ముందుకురావాలన్నారు. దేశంలో 70 శాతం అబార్షన్లు జరుగుతున్నాయని... ఈ సంస్కృతిని విడనాడేందుకు సమాజంలో సగభాగంగా ఉన్న మహిళాలోకం పిడికిలెత్తి ఉద్యమించాలన్నారు. అనాది నుంచీ మహిళలపై దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని... దేశ రాజధానిలో మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యం కావడం తలదించుకోవాల్సిన విషయమని పేర్కొన్నారు. రచయిత అన్నవాడు నీళ్లలా ఉండాలని, సమాజ ఇతివృత్తంతో కూడిన రచనలు చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు సగ భాగంగా పోరాడారని, ఈ రాష్ట్రంలో వారికి కూడా సగభాగం అధికారాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్త్రీకి స్వేచ్చ ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. ‘అమ్మ నీకు దండమే, నేలమ్మ నేలమ్మ నేలమ్మా, అమ్మనురా నన్ను అమ్మకురా... కొడుకువురా నన్ను కొట్టకురా, అమ్మ నీ కడుపులోని ఆడపిల్లనే... నిన్ను చూడాలని ఉన్నదే అంటూ అమ్మ అన్న పదంపై, అమ్మతనంపై ఆయన పాటలు పాడగా.. మహిళలు చప్పట్లతో అభినందనలు తెలిపారు. కాగా, చేర్యాల ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని అశోక్ తేజ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
కవి, రచయిత నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మగవాడి గౌరవాన్ని కాపాడేందుకు మహిళలు బాధలను దిగమింగుతున్నారని, ఆకలిని సైతం లెక్కచేయకుండా ఉన్నదాన్ని పంచి అమ్మతనాన్ని నిలుపుతున్న మహిళలకు అందరు చేతులెత్తి నమస్కరించాలన్నారు. మహిళా లోకం సంఘటితమై ఉద్యమించినప్పుడే సమాజ మార్పు సాధ్యమవుతుందన్నారు. అంగన్ వాడీల చదువు అందరికి వెలుగు కావాలని, ప్రతి మహిళ చదువుకున్నప్పుడేఆత్మగౌరవం పెరుగుతుందన్నారు.
అనంతరం క్రీడాపోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఆ తర్వాత అతి థులను ఐసీడీఎస్ అధికారులు శాలువాలతో కప్పి ఘనంగా సన్మానించారు. సమావేశానికి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిణి పద్మజారమ ణ అధ్యక్షత వహించగా మహిళా జేఏసీ జనగా మ డివిజన్ అధ్యక్షురాలు పాశికంటి వెంకటరమణ సుధాకర్, చాంబర్ అధ్యక్షుడు ఉడుముల భా స్కర్‌రెడ్డి, కార్యదర్శి పుర్మ వెంకట్‌రెడ్డి, చేర్యాల సర్పంచ్ ముస్త్యాల అరుణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బి. కొండయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు. దిలా ఉం డగా... తెలంగాణ కళాకారులు పాడిన పాటలు అలరించాయి. బాల్యవివాహల వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రదర్శించిన నాటిక ఆహూతులను ఆకట్టుకుంది.