sudhakarbabu
-
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా గాడి తప్పి, అరాచకం రాజ్యమేలుతోందని, మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రజలు అధికారం ఇచ్చారనే తీరుతో బాబు ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. సుధాకర్‌బాబు సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అరాచకాలను సీఎం చంద్రబాబు అదుపు చేయలేకపోతున్నారని చెప్పారు.మహిళలు, బాలికలకు రక్షణ కలి్పంచలేక చేతులెత్తేశారని అన్నారు. ఇప్పుడు దిశ యాప్, వ్యవస్థ ఉండి ఉంటే మహిళలు, బాలికలపై ఇన్ని ఘోరాలు జరిగేవి కావని స్పష్టం చేశారు. బద్వేలు ఘటనలో బాలిక చేతిలో దిశ యాప్ ఉండుంటే ఆమె ప్రాణాలు పోయేవి కావని చెప్పారు. ఈ నాలుగు నెలల్లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు సంబంధించి 74 ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. కనీసం ఒక్క కేసులో అయినా శిక్ష పడి ఉంటే, ఇన్ని ఘటనలు జరిగేవి కావని చెప్పారు.హోం మంత్రికి సెల్ఫీల మీద ఉన్న శ్రద్ధ మహిళా రక్షణ మీద లేదని అన్నారు. కూటమి నేతలు మద్యం, ఇసుక దోపిడీపై పెట్టిన శ్రద్ధలో ఒక్క శాతమైనా మహిళల రక్షణపై పెట్టాలని సూచించారు. మంత్రి లోకేశ్ ఆయన స్థాయి మరిచి, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. లోకేష్ మాటలు, చేతలు చూసి ఆయనో పిల్ల రాక్షసుడు అని ప్రజలు అంటున్నారని చెప్పారు. కూటమి నాయకులు పోలసులను రాజకీయ కక్ష సాధింపునకు, తప్పుడు కేసులు పెట్టడానికి వాడుకుంటున్నారని, తప్పుడు వాంగ్మూలాలతో వైఎస్సార్సీపీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీకి అండగా ఉన్నారన్న కారణంతోనే దళిత నాయకులను వేధిస్తున్నారని, భయపెడుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడిపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని సుధాకర్ బాబు చెప్పారు. -
పోలవరం ఎఫ్ఆర్ఎల్ సర్వేరాళ్లు 2008లోనే ఏర్పాటు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట మట్టం (ఎఫ్ఆర్ఎల్) 45.72 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో 2008లోనే గుర్తించి, సర్వేరాళ్లు ఏర్పాటుచేశామని తెలంగాణ అధికారులకు ఆ ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు మరోసారి తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించిన రికార్డులు ఈనెల 14లోగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ఇస్తామన్నారు. ఆ రికార్డులను పరిశీలించాక కూడా ఏమైనా అనుమానాలుంటే క్షేత్రస్థాయిలో ఎఫ్ఆర్ఎల్ సర్వేరాళ్లను చూపించడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. ఎఫ్ఆర్ఎల్ మ్యాప్, ముంపు ప్రాంతాల్లో వేసిన సర్వేరాళ్ల (అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన) వివరాలను ఏపీ ప్రభుత్వం అందజేశాక మరోసారి సమావేశం నిర్వహిస్తామని పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం రెండు రాష్ట్రాల అధికారులకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ (వెనుక జలాలు) ప్రభావం వల్ల ముంపుపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ నెల 3న కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్విందర్‌సింగ్ వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ మూడోసారి సమావేశమైంది. గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసిందని, అందులో ఎలాంటి ముంపు ముప్పు ఉండదని తేలిందని ఎత్తిచూపుతూ ఛత్తీస్‌గఢ్, ఒడిశా అభ్యంతరాలను తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు గతంలో గోపాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సాధికార కమిటీ కూడా సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికనే ఖరారు చేసిందని గుర్తుచేశారు. పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌పై ఏపీ, తెలంగాణ అధికారులు అధ్యయన నివేదికలను మార్చుకుని, చర్చించి.. తెలంగాణ అభ్యంతరాలను నివృత్తి చేయాలని పీపీఏను సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. ఆ మేరకు బుధవారం పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం రెండు రాష్ట్రాల అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఏపీ తరఫున పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, తెలంగాణ తరఫున ఈఎన్సీ కె.నాగేంద్రరావు, ఆ రాష్ట్ర అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి భేటీ.. పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ మ్యాపు, సర్వేరాళ్లకు సంబంధించిన రికార్డులు ఏపీ అధికారులు అందజేసిన తర్వాత.. రెండు రాష్ట్రాల అధికారులతో భౌతికంగా సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు చేసిన ప్రతిపాదనను పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం ఆమోదించారు. ఏపీ అధికారులు ఇచ్చే రికార్డులను తెలంగాణ అధికారులకు పంపుతామన్నారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారులతో చర్చిస్తామని చెప్పారు. అప్పటికీ తెలంగాణ సర్కార్ సంతృప్తి చెందకపోతే.. ఎఫ్ఆర్ఎల్ రాళ్లను క్షేత్రస్థాయిలో చూపించడానికి సంయుక్తంగా వెళదామని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఆర్ఎల్ అందరికీ తెలిసిందే.. పోలవరం ఎఫ్ఆర్ఎల్ పరిధిలోకి కిన్నెరసాని, ముర్రేడువాగులతోపాటు మరో ఆరువాగులు వస్తాయని.. వాటిలోకి బ్యాక్‌వాటర్ ఎగదన్ని తమ రాష్ట్రంలో బూర్గుంపహాడ్ మండలంలో 899 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని తెలంగాణ ఈఎన్సీ నాగేంద్రరావు చెప్పారు. ఇందుకు సంబంధించిన రికార్డులను పీపీఏ ద్వారా ఏపీ అధికారులకు అందజేశారు. కిన్నెరసాని, ముర్రేడువాగులపై పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసిందని, ఆ నివేదిక తెలంగాణ అధికారుల వద్ద కూడా ఉందని పోలవరం సీఈ సుధాకర్‌బాబు గుర్తుచేశారు. పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను 2008లోనే గుర్తించి.. ముంపునకు గురయ్యే ప్రాంతాలను అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించి.. సర్వేరాళ్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులు రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని, వాటిని సమీకరించి ఈనెల 14న అందజేస్తామని చెప్పారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ స్పందిస్తూ పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల ముంపు ప్రాంతంపై ఏపీ ప్రభుత్వం వాస్తవాలను దాచేస్తోందని, అందువల్లే రికార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎఫ్ఆర్ఎల్కు సంబంధించిన రికార్డులన్నీ సీడబ్ల్యూసీ వద్ద, తెలంగాణ అధికారుల వద్ద ఉన్నాయని.. వాస్తవాలను దాచాల్సిన అవసరం తమకు లేదని పోలవరం సీఈ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. బూర్గుంపహాడ్‌లో ముంపునకు గురయ్యే 899 ఎకరాల భూమిని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిందని, దాన్ని ఏపీకి అప్పగించే ప్రక్రియలో జాప్యం జరుగుతోందని గుర్తుచేశారు. -
ప్యాకేజీ కోసం రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసారు :సుధాకర్ బాబు
-
అందుకే వైఎస్ రాజారెడ్డిని హత్య చేశారు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు చరిత్ర అంతా రక్తసిక్తం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైఎస్సార్ కుటుంబంపై కుట్రలకు తెరతీశారని ఆరోపించారు. 1998లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డిని దెబ్బతీసేందుకే వైఎస్ రాజారెడ్డిని హత్య చేశారన్నారు. 3 తరాలుగా వైఎస్సార్ కుటుంబంపై చంద్రబాబు కక్షకట్టారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారన్న భయంతో మానసికంగా దెబ్బ తీసేందుకే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో బాబు ఉన్నారన్నారు. చంద్రబాబు ఎంత భయపెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. టీడీపీలో దళితులపై జరిగిన దాడులు హర్షకుమార్కు గుర్తులేవా అని ప్రశ్నించారు. సామాన్య కార్యకర్తలు, దళితులకు వైఎస్సార్ సీపీ సీట్లు కేటాయించిందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను బీసీ, ఎస్సీ నేతలతో వైఎస్ జగన్ ప్రకటింపజేశారని వెల్లడించారు. -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్న వారే జీవితంలో అభివృద్ధి చెందుతారని రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. శుక్రవారం సి.క్యాంప్‌లోని లలిత కళాసమితి(టీజీవి కళాక్షేత్రం)లో డీఆర్డీఏ - మెప్మా సంయుక్తంగా రాజీవ్ యువకిరణాలు ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్‌మేళా నిర్వహించాయి. అర్హులైన వారిని ఎంపిక చేసుకునేందుకు అపోలో ఫార్మసీ, బిగ్‌సీ మొబైల్, లెమన్ మీడియా, టాటా మోటార్స్, భారత్ మోటార్స్, గ్రూప్-4 సెక్యూరిటీ కంపెనీ మొత్తం 18 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. సూపర్వైజర్, మార్కెటింగ్ మేనేజర్, పరిపాలనాధికారులు, కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్, సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ సూపర్వైజర్ తదితర ఉద్యోగాలలోకి తీసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దాదాపు వె య్యి మంది యువతీయువకులు పాల్గొన్నారు. కష్టించేతత్వం ఉన్నవారికి అవకాశాలు అనేకం ఉన్నాయని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కష్టపడకపోతే ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారని, అభివృద్ధిలోకి రాలేరని తెలిపారు. రాజీవ్ యువకిరణాలు పథకం యువతకు ఉపాధి అవకాశాలను పెంచిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కర్నూలుకు వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలు రానున్నాయని, అందువల్ల ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయని పేర్కొన్నారు. యువతీ యువకులు వృత్తినైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు సూచించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు ప్రసంగించారు. వికలాంగులకు సదరం ధ్రువపత్రాల పంపిణీ... కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన 480 మంది వికలాంగులకు సదరం ధ్రువపత్రాలను మంత్రి టి.జి.వెంకటేష్, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, జేసీ కన్నబాబు పంపిణీ చేశారు. సదరం సర్టిఫికెట్ల వల్ల బోగస్ వికలాంగులకు అడ్డుకట్ట వేసినట్లు అయ్యిందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, మెప్మా పీడీ రామాంజనేయులు, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణమూర్తి, ఐకేపీ జాబ్స్ మేనేజర్ విజయకుమార్, మెప్మా లైవ్లీ ఉడ్ నిపుణుడు వెంకటేష్, డీపీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.