రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది | YSRCP TJR Sudhakar Babu Strong Counter to Chandrababu | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది

Published Tue, Oct 22 2024 5:28 AM | Last Updated on Tue, Oct 22 2024 5:35 AM

YSRCP TJR Sudhakar Babu Strong Counter to Chandrababu

చంద్రబాబు పాలన పూర్తిగా గాడి తప్పింది 

మహిళలు, బాలికలకు రక్షణ లేదు 

దిశ యాప్‌ ఉండి ఉంటే, ఇన్ని ఘటనలు జరిగేవి కావు 

రాజకీయంగా కక్ష సాధింపునకు పోలీసులను వాడుతున్నారు 

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలన పూర్తిగా గాడి తప్పి, అరాచకం రాజ్యమేలుతోందని, మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మె­ల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. ప్రతీకా­రం తీర్చుకోవడానికే ప్రజలు అధికారం ఇచ్చారనే తీరుతో బాబు ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. సుధాకర్‌బాబు సోమవా­రం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడి­యా సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అరాచకాలను సీఎం చంద్ర­బాబు అదుపు చేయలేకపోతున్నారని చెప్పారు.

మహిళలు, బాలికలకు రక్షణ కలి్పంచలేక చేతులెత్తేశారని అన్నారు. ఇప్పుడు దిశ యాప్, వ్యవస్థ ఉండి ఉంటే మహిళలు, బాలికలపై ఇన్ని ఘోరాలు జరిగేవి కావని స్పష్టం చేశారు. బద్వేలు ఘటనలో బాలిక చేతిలో దిశ యాప్‌ ఉండుంటే ఆమె ప్రాణాలు పోయేవి కావని చెప్పారు. ఈ నాలుగు నెలల్లో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్య­లకు సంబంధించి 74 ఘటనలు చోటు చేసుకున్నాయ­న్నారు. కనీసం ఒక్క కేసులో అయినా శిక్ష పడి ఉంటే, ఇన్ని ఘటనలు జరిగేవి కావని చెప్పారు.

హోం మంత్రికి సెల్ఫీల మీద ఉన్న శ్రద్ధ మహిళా రక్షణ మీద లేదని అన్నారు. కూటమి నేతలు మద్యం, ఇసుక దోపిడీపై పెట్టిన శ్రద్ధలో ఒక్క శాతమైనా మహిళల రక్షణపై పెట్టాలని సూచించారు. మంత్రి లోకేశ్‌ ఆయన స్థాయి మరిచి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా­రని దుయ్యబట్టారు. లోకేష్‌ మాటలు, చేతలు చూసి ఆయనో పిల్ల రాక్షసుడు అని ప్రజలు అంటున్నారని చెప్పారు. 

కూటమి నాయకులు పోలసులను రాజకీయ కక్ష సాధింపునకు, తప్పుడు కేసులు పెట్టడానికి వాడుకుంటున్నారని, తప్పుడు వాంగ్మూలాలతో వైఎస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీకి అండగా ఉన్నారన్న కారణంతోనే దళిత నాయకులను వేధిస్తున్నారని, భయపెడుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడిపై తప్పుడు కేసులు బనా­యించి వేధిస్తున్నారని సుధాకర్‌ బాబు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement