Sudhir Kumar
-
బీఆర్ఎస్ వరంగల్ బరిలో సుధీర్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గా డాక్టర్ మారేపల్లి సు«దీర్‌కుమార్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం హనుమకొండ జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సుధీర్ కుమార్.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ విధేయుడిగా ఉన్నారు. దీనికితోడు మాదిగ సామాజికవర్గానికి చెందిన నేతకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు సు«దీర్‌కుమార్ అభ్యర్థి త్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థి ని ఖరారు చేసిన నేపథ్యంలో పారీ్టలో సమన్వయం, ప్రచారంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కీలక నేతలతో మంతనాలు: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలతోపాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దింపాలని నిర్ణయించిన కడియం కావ్య.. పార్టీని వీడటంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం కొనసాగిన వేటపై ఈ సమావేశంలో చర్చించారు. ఇటీవల జిల్లాకు చెందిన నేతలు సిఫార్సు చేసిన నలుగురి పేర్లపై చర్చించి.. చివరికి సు«దీర్‌కుమార్ పేరును ఖరారు చేశారు. తొలుత స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరును కూడా పరిశీలించినా.. ఆయనకు స్టేషన్ ఘన్పూర్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చేందుకే కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజయ్య తిరిగి బీఆర్ఎస్లో చేరేదీ, లేనిదీ స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సానుకూల సంకేతాలు పంపేందుకే! అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, తర్వాత పార్టీని వీడినవారికి కాకుండా.. ఇకపై పార్టీని అంటిపెట్టుకుని ఉండే వారికే అవకాశాలు వస్తాయన్న సంకేతాలు ఇచ్చేందుకే సు«దీర్కుమార్ను అభ్యర్థి గా ఎంపిక చేసినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన వంగపల్లి శ్రీనివాస్, సుందర్ రాజు, డాక్టర్ నిరంజన్, స్వప్న తదితరులకు భవిష్యత్తులో గుర్తింపు దక్కుతుందని హామీ ఇచి్చనట్టు వివరిస్తున్నాయి. కేసీఆర్‌తో శుక్రవారం జరిగిన భేటీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండ ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బసవరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు. -
జస్టిస్ సుమలత, జస్టిస్ సుదీర్‌కుమార్‌కు హైకోర్టు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: బదిలీపై ఇతర రాష్ట్ర హైకోర్టుల కు వెళ్తున్న జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ ముమ్మినేని సుదీర్‌కుమార్‌లకు హైకోర్టు ఘనంగా వీ డ్కోలు పలికింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫస్ట్ కోర్టు హాల్లో భేటీ అయిన ఫుల్ కో ర్టు వారిద్దరిని సన్మానించింది. జస్టిస్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ సుదీర్‌కుమార్‌ను మ ద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం గత వారం ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. న్యా యాన్ని అందించడంతోపాటు వారిచి్చన పలు తీ ర్పులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే ప్రశంసించారు. తీర్పుల వివరాలను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చదివి వినిపించారు. అనంతరం హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) బదిలీ అయిన న్యాయమూర్తులను ఘనంగా స న్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్ సుమలత మాట్లా డుతూ.. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయి కి చేరానన్నారు. యువ న్యాయవాదులు కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని సూ చించారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది పడబోనని.. వెళ్లిన చోట మన తెలంగాణ ప్రతిభను చాటేలా విధులు నిర్వహిస్తానని చెప్పారు. ‘బార్’తో కలసి పనిచేస్తానని తాను ప్రమాణం చేసే సందర్భంలోనే చెప్పానని, అలాగే న్యాయవాదుల విజ్ఞప్తులను అనుమతిస్తూ, వీలైనంత వరకు అనుకూలంగా పనిచేశానని జస్టిస్ సు«దీర్‌కుమార్ అన్నారు. అయితే ‘బార్’తో కలసి పనిచేశానా.. లేదా అన్నది న్యాయవాదులు చెప్పాలన్నారు. -
భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని గురువారం ఏర్పాటు చేసింది. కమిటీకి కేబినెట్ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా నాయకత్వం వహిస్తారు. ఇందులో ఐబీ జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, ఎస్పీజీ ఐజీ సురేశ్ సభ్యులు.∙వేగంగా నివేదిక అందించాలని కమిటీని హోంశాఖ కోరింది. అలాగే ఘటనపై తక్షణ నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హోంశాఖ ఆదేశించింది. మరోవైపు ఇదే ఘటనపై విచారణకు పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి మెహతాబ్ సింగ్ గిల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మతో కూడిన ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదికనందిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంజాబ్‌కు వచ్చిన ప్రధాని తీవ్రమైన భద్రతాలోపం కారణంగా బుధవారం అర్ధాంతరంగా ఢిల్లీకి వెనుదిరిగిన సంగతి తెలిసిందే! గురువారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్ ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు. భద్రతాలోపంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారని కోవింద్ కార్యదర్శి తెలిపారు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు రాష్ట్రపతికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం తన ఆందోళనను వెలిబుచ్చారు. గురువారం ఆయన మోదీతో మాట్లాడారు. నేడు సీజేఐ ముందుకు భవిష్యత్‌లో ఇలాంటి భద్రతా లోపాలు జరగకుండా ఫిరోజ్‌పూర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలైంది. అత్యవసర అంశం కింద దీన్ని చేపట్టి గురువారమే దీనిపై విచారణ జరపాలని సింగ్ కోరారు. అయితే పిటిషన్ కాపీని పంజాబ్ ప్రభుత్వానికి పంపాలని, దీన్ని శుక్రవారం విచారణకు చేపడతామని బెంచ్ పేర్కొంది. పీఎం పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న అన్ని భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సాక్ష్యాలను భటిండా జిల్లా న్యాయమూర్తికి స్వాధీ నం చేయాలని ఆదేశించాలని లాయర్స్ వాయిస్ కింద దాఖలు చేసిన పిటిషన్లో సింగ్ కోరారు. ఉద్దేశపూర్వక చర్యల వల్లే భద్రతా వైఫల్యం చోటుచేసుకుందని... ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భద్రతా లోపమా.. రైతు ఆగ్రహమా? తేల్చండి: తికాయత్ నోయిడా: భద్రతా వైఫల్యమా, రైతుల ఆగ్రహామా? ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన అర్ధంతరంగా ముగియడానికి ఈ రెండింటిలో ఏది కారణమో తేల్చడానికి విచారణ జరపాలని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ గురువారం డిమాండ్ చేశారు. ‘భద్రతా కారణాల వల్లే ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయిందని బీజేపీ అంటోంది. సభాస్థలిలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతోనే ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగారని సీఎం చన్నీ అంటున్నారు. దీంట్లో ఏది నిజమో నిగ్గుతేలాలి’ అని తికాయత్ ట్వీట్ చేశారు. -
కరోనా: గొప్పవాడివయ్యా
ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌గా బార్డర్లో శత్రువులతో పోరాటం చేసే యోధుడు సుధీర్‌కుమార్. ఇప్పుడు కరోనా వైరస్‌పై జరిగే పోరులోనూ నేను సైతం అంటున్నాడు. సుధీర్‌కుమార్ వయసు 43. ప్రస్తుతం అమృత్‌సర్‌లో విధులను నిర్వర్తిస్తున్నాడు. నెలరోజుల దీర్ఘకాలిక సెలవు మీద బీహార్‌లోని మోతిహరి జిల్లా జత్వాలియా గ్రామంలోని తన ఇంటికి వచ్చాడు కూతురు పెళ్లి జరిపించడానికి. పెళ్లి కోసమని 4 లక్షల రూపాయల లోను తీసుకున్నాడు. ఈ టైమ్‌లో లాక్డౌన్ వచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా మరికొన్ని రోజులు తన లీవ్ పొడిగించమని అతను పనిచేస్తున్న యూనిట్‌కు ముందుగానే మెసేజ్ పంపాడు. ఈ టైమ్‌లోనే సుధీర్ తన కుటుంబంతో కలిసి కరోనా వైరస్‌పై సమరశంఖం పూరించాడు. గ్రామంలో ఈ వైరస్‌కు సంబంధించిన సమాచారం ఇస్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాడు. అంతేకాదు మాస్కులు సొంతంగా తయారు చేస్తూ వాటితో పాటు పేదలకు కావల్సిన నిత్యాసవసర సరుకులన్నీ ఉచితంగా అందజేస్తున్నాడు. ఇంటి నుంచే పోరాటం.. ‘మేం మా అబ్బాయిని మాస్క్‌లు కొనుక్కురమ్మని పంపినప్పుడు విపరీతమైన డిమాండ్ ఉందని, మాస్క్‌లు దొరకడం లేదని తెలిసింది. అంతేకాదు, ఒక్కో మాస్క్ చాలా ఎక్కువ ధరకు అంటే దాదాపు రూ. 200కు అమ్ముతున్నారు. అయినా, వైరస్‌కు భయపడి ఖరీదైన మాస్క్‌లు కొనాలనే జనం ఆలోచన. ఆ మాస్క్‌లను చూసిన తర్వాత వాటిని ఇంట్లోనే ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నాడు సుధీర్. అతను శిక్షణ కోసం వెళ్లినప్పుడు అతని భార్య కుటుంబ పనుల్లో భాగంగా నేర్చుకున్న కుట్టుపని ఇప్పుడు సాయపడింది. దీంతో సుధీర్ నిర్ణయానికి కుటుంబం నుంచి వెంటనే బలం చేకూరింది. తన గ్రామంలోని ప్రజలకు ఫేస్‌మాస్క్‌లు తయారుచేసి పంపిణీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సుధీర్ చెప్పాడు. ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉంది. మరో కుట్టు మిషన్, ముసుగులు తయారు చేయడానికి కావల్సిన సరంజామాను సిద్ధం చేసుకున్నాడు. ఇలాంటి పరీక్ష సమయంలో దేశానికి ఎంతో కొంత సేవ చేయాలని సుధీర్ సంకల్పించాడు. రక్షణ కేంద్రంగా... సుధీర్ జిల్లా వైద్యాధికారితో సంప్రదించి, అతని సూచనలతో ఈ మాస్క్‌లను తయారుచేశాడు. భార్యతో కలిసి 4 వేల మాస్క్‌లను తయారుచేసి తమ ఊరివాళ్లకు, పొరుగూళ్లకు కూడా ఉచితంగా అందజేస్తున్నాడు. సుధీర్, అతని కుటుంబం ‘సామాజిక దూరం’ పాటించడంలో తమ గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సుధీర్ గ్రామం చిన్నదైనా జాగ్రత్తలు తీసుకోవడంలో రక్షణ కేంద్రంగా ఉంది. ‘రోజులో ఎక్కువ సమయం మాస్క్ ధరిస్తే మరో మాస్క్ కోసం నా దగ్గరకు వచ్చి తీసుకెళ్లు. కానీ, దానిని ఉతికి వాడాలనుకోకు’ అని మాస్క్ ధరించి మరీ చెబుతున్నాడు. కూతురి పెళ్లికోసం దాచిన డబ్బును... జూనియర్ ర్యాంక్ అధికారిగా ఉన్న సుధీర్ సంపాదన ఎక్కువేమీ కాదు. అతని సంపాదన కుటుంబ అవసరాలకే సరిపోదు. కానీ, దేశం సంక్షోభంలో ఉన్నందున తన కూతురు పెళ్లి కోసం తీసుకున్న వ్యక్తిగత రుణాన్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్నాడు. గ్రామంలో పేదలకు కావల్సిన పప్పు, ఉప్పు, కూరగాయలను, ఇతర నిత్యావసరాలను ఉచితంగా అందిస్తున్నాడు. ఎవరికి ఎప్పుడు సరుకులు కావాలన్నా వచ్చి తీసుకెళ్లచ్చు అని బోర్డు పెట్టి మరీ చెబుతున్నాడు. ఇతరులకు సాయం చేయడం ద్వారా నాకు డబ్బు కొరత ఉండదు. కానీ, వెలకట్టలేనన్ని ఆశీస్సులు నాకు అందుతాయి’ అని అంటున్నాడు సుధీర్. – ఆరెన్నార్ -
అభిమాని కోసం సచిన్ లేఖ
లండన్: భారత్ ఆడే ప్రతి క్రికెట్ మ్యాచ్‌కు చేతిలో త్రివర్ణ పతాకాన్ని, ముఖంపై సచిన్ అని రాసుకొని అలరించే ఓ వ్యక్తి కనపిస్తూ ఉంటాడు. అతడే సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి. సచిన్ రిటైర్మెంట్ అనంతరం కూడా సుధీర్ భారత్ ఆడే మ్యాచ్‌ల్లో పాల్గొని ఆటగాళ్లను, అభిమానులను ఉత్సహపరుస్తూనే ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫి కోసం భారత్ జట్టు ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టుతో కలిసి సుధీర్ అక్కడికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా అతనికి వీసా రాలేదు. దీంతో భారత్- న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌కు సుధీర్ హాజరు కాలేకపోయాడు. తన వీరాభిమానికి వీసా దక్కలేదన్న విషయం తెలుసుకున్న సచిన్ స్పందించాడు. సుధీర్‌కు వీసా ఇవ్వాలని కోరుతూ లేఖ రాశాడు. సుధీర్ గొప్ప మద్దతుదారుడని, ఎలాంటి సహాయం లేకుండా ఎవరు అతనిలా మద్దతు తెలుపుతారని, సొంత ఖర్చులతో భారత జట్టుకు మద్దతు తెలిపాడని, అతను ఇంగ్లండ్ వెళ్లేందుకు వీసా మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు సచిన్ లేఖలో పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లతో సుధీర్ సచిన్ ఏబిలియన్ డ్రీమ్స్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన విషయం తెలిసిందే. -
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం
కాటేదాన్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు ఓ యువకుడు విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వర్షానికి రోడ్డుపై ఎవరు లేకపోవడంతో యువకుడు దాదాపు 32 నిమిషాల పాటు ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. పైక్యాబిన్ను మాత్రమే తొలగించాడు. మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ సుధీర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కాటేదాన్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం సెంటర్‌కు ఎలాంటి సెక్యూరిటి గార్డును ఏర్పాటు చేయలేదు. కేవలం సీసీ కెమెరాను మాత్రమే ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో 20-25 సంవత్సరాల వయస్సు గల ఓ యువకుడు ఏటీఎం సెంటర్లోకి వచ్చాడు. ఏటీఎం క్యాబిన్‌ను గట్టిగా లాగడంతో తెరుచుకుంది. ఇందులో ఏటీఎం సెంటర్‌కు చెందిన ఏసీ రిమోట్ కంట్రోల్, ఏటీఎంలో స్లిప్‌ల కోసం ఏర్పాటు చేసే కాగితపు బండిల్లను స్టోర్‌గా దీనిని వాడుకుంటారు. ఇందులో డబ్బు ఏమైనా దోరుకుంతుందేమో అని నిందితుడు చూశాడు. కానీ ఏమీ దొరకకపోవడంతో తనతో తెచ్చుకున్న స్కూడ్రై వర్తో ఇతర భాగాలను తొలగించేందుకు ప్రయత్నించాడు. దాదాపు 32 నిమిషాల పాటు నిందితుడు ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. భారీ వర్షం కురుస్తుండడంతో ఈ సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడం, ఏటిఎంకు ఎవరు రాకపోవడంతో విషయం తెలియలేదు. ప్రతి రోజు రాత్రి సమయాలలో పెట్రోలింగ్ పోలీసులు ఏటీఎం సెంటర్లను పరిశీలిస్తుంటారు. 3 గంటల ప్రాంతంలో కానిస్ట్టేబుల్ ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చి పరిశీలించగా క్యాబిన్ తెరిచి ఉంది. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉదయం పోలీసులు ఫింగర్‌ప్రింట్స్‌ను సేకరించారు. అలాగే బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించి వీడియోను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ నగదు బదిలీ జనవరి నుంచి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వంట గ్యాస్ సబ్సిడీని ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే పథకాన్ని వచ్చే జనవరి నుంచి అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) అధ్యక్షుడు, సిండికేట్ బ్యాంకు సీఎండీ సుధీర్ కుమార్ జైన్ తెలిపారు. విధాన సౌధలో బుధవారం జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మైసూరు, తుమకూరు, ధార్వాడ, ఉడిపి జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. నగదు బదిలీకి సంబంధించి ఇప్పటి వరకు 96,864 బ్యాంకు ఖాతాలను ప్రారంభించి, 32,031 డెబిట్ కార్డులను పంపిణీ చేశామని వెల్లడించారు. 63,998 ఖాతాలను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేశామని తెలిపారు. కాగా రెండు వేల కంటే తక్కువగా జన సంఖ్య ఉన్న గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను అందించే చర్యలు చేపట్టామని చెప్పారు. ఇదివరకే 3,862 గ్రామాల్లో బ్యాంకింగ్ కేంద్రాలను ప్రారంభించామన్నారు. గృహ, విద్య, అల్ప సంఖ్యాకులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత క్రమంలో విరివిగా రుణాలు మంజూరు చేయాలని ఆయన బ్యాంకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ. రంగనాథ్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ఈ ఏడాది దూకుడు లేనట్లే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఈ ఏడాది వ్యాపారంలో దూకుడుగా వెళ్లరాదని ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ నిర్ణయించుకుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న స్పష్టమైన సంకేతాలు వెలువడటం లేదని, వృద్ధిరేటు తిరిగి గాడిలో పడేదాకా వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు సిండికేట్ బ్యాంక్ సీఎండీ సుధీర్ కుమార్ జైన్ తెలిపారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాపారంలో 14 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.3.34 లక్షల కోట్లుగా కాగా అది ఈ సంవత్సరం రూ.3.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలతోపాటు సుమారుగా 1,500 ఏటిఎంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సిండికేట్ బ్యాంక్‌కి 3,004 శాఖలు, 1,350 ఏటిఎంలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది 1,500 మంది ఆఫీసర్లను, 1,400 మంది క్లరికల్ సిబ్బందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ చర్యల వల్ల లిక్విడిటీపై స్వల్పంగా ఒత్తిడి ఉన్నప్పటికీ వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదన్నారు. ఈ సంవత్సరం రూ.1,830 కోట్ల మూలధనం సమకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు జైన్ చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల వ్యాపారాల్లో పెద్దగా మార్పులొస్తొయని భావించడం లేదన్నారు. కాని ఈ వివాదాలు సద్దుమణిగితే మాత్రం ఆగిపోయిన పెట్టుబడులు హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున రావచ్చన్నారు.