sudini jaipal reddy
-
సోనియా చెవిలో జోరీగనై తెలంగాణ తెచ్చా
అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించండి నా వల్లే తెలంగాణలో భద్రాది రాముడు కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మాగనూర్, న్యూస్‌లైన్: యూపీఏ చైర్పర్సన్, కాం గ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చెవిలో తాను జోరిగలా మారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించానని మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థి, కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాగనూరు మండలంలోని టైరోడ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని, మాట్లాడారు. తనకు మాగనూరు మండలం పై ప్రత్యేక అభిమానం ఉందని, అం దుకే ఎన్నికల ప్రచారాన్ని ఈ మండ లం నుంచి ప్రారంభిస్తున్నాని చెప్పా రు. తాను జనతా పార్టీలో ఉండి జోడెద్దుల గుర్తుపై పోటీ చేసి గెలుపొందానని, అప్పుడు ఓట్లు వేసి తనను గెలి పించిన వారు కూడా ప్రస్తుతం ఈ సభ లో ఉండటం ఎంతో సంతోషకరమన్నారు. తాను 45ఏళ్లుగా రాజకీయం లో ప్రజాప్రతినిధిగా ఉన్నారని, వరుస గా నాలుగు సార్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గా, సుదీర్ఘ కాలం ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉండి సేవ చేశానని చెప్పారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎ స్సార్ చెప్పినందుకే సోనియాగాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తన ఒత్తిడి వల్లే ఈ రోజు భద్రాది రాముడు తెలంగాణ ఉన్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని, పేదలకు అవసరమయ్యే జాతీయ ఉపాధి హా మీ పథకం, రూపాయికి కిలో బి య్యం, ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రుణమాఫీ, 108, 104 సేవలు, తదితర పథకాలను తెచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని, అందుకు తనను పార్లమెంట్‌కు, మక్తల్ నుంచి అసెంబ్లీకి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పంపించాలన్నారు. తన రాజకీయ జీవితంలో చివరిసారిగా పోటీ చేస్తున్నానని, అందుకే మహబూబ్‌నగర్‌లో బరిలో దిగినట్లు చెప్పారు. తాను ఢిల్లీలో పోటీ చేసినా గెలుస్తానని, కానీ సొంత జిల్లా కావడంతో ఇ క్కడి నుంచే పోటీ చేయాలనుకున్నాని తెలిపారు. కార్యక్రమంలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, చిట్టెం సుచరిత, రాజుల అశిరెడ్డి, బసిరెడ్డి, విరాఠ్రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజప్పగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు అభ్యర్థిగా జైపాల్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు ఖరారైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ విడుదల చేయబోయే నాలుగో జాబితాలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీగా కొనసాగుతున్న జైపాల్‌రెడ్డి మళ్లీ ఇక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఆయన విజ్ఞప్తి మేరకు ఏఐసీసీ పాలమూరు టిక్కెట్‌ను ఖరారు చేసింది. 1969లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జైపాల్‌రెడ్డి నాటి నుంచి నేటి వరకు 11 ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగా, ఏడుసార్లు ఎంపీగా పోటీచేసి ఐదుసార్లు గెలిచారు. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల గ్రామంలో జన్మించిన జైపాల్‌రెడ్డి 16 ఏళ్ల తరువాత పాలమూరు బరిలో దిగబోతున్నారు. 1998లో చివరిసారిగా జనతాదళ్ పార్టీ తరపున మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసిగెలిచారు. ఆ తరువాత ఆయన 1999, 2004 ఎన్నికల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అలాగే గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు మారారు. -
అంతుచిక్కని అంతరంగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అంచనాలకు అందని, విమర్శకులకు చిక్కని అపర మేధావి మనసులోని మాట ఎవరికీ అంతుబట్టడంలేదు. ఆయన అంతరంగం తెలుసుకోవాలనుకున్న వారికి ఆశాభంగమే ఎదురవుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశంపై ఆయన నోరు మెదపడంలేదు. దీంతో చేవెళ్ల లోక్‌సభ సీటుపై కన్నేసిన ఆశావహులు డోలాయమానంలో పడ్డారు. రాజకీయాల్లో ఆచితూచి స్పందించే కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వ్యూహాత్మకంగా మౌనముద్ర దాల్చడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2009లో తొలిసారి చేవెళ్ల బరిలో దిగిన జైపాల్... తదుపరి ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయననే విషయాన్ని బహిరంగంగా ప్రకటించనప్పటికీ, సన్నిహితులతో ఈ అంశంపై స్పష్టతనిచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న నేతల ంతా కదనరంగంలో కాలుమోపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెరవెనుక పావులు కదుపుతున్నారు. జైపాల్‌రెడ్డి మాత్రం ఇప్పటివరకు అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వీరిని ఆత్మరక్షణలో పడేసింది. పెద్దాయన రేసులో ఉంటే.. ఆయనను కాదని సీటు దక్కించుకోవడం కల్ల అని నేతాగణం భావిస్తోంది. ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్న తరుణంలో జైపాల్ నుంచి స్పష్టత రాకపోవడం వీరిని కలవరపరుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో నియోజకవ ర్గం వైపు జైపాల్ కన్నెత్తి చూడలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకున్నట్లేనని అంతా భావించారు. రాష్ర్ట విభజన ప్రకటన వచ్చిందే తడవు.. జైపాల్‌రెడ్డి తనదైన శైలిలో లౌక్యం, రాజకీయ మంత్రాంగం నెరపి మరోసారి తెరమీదకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పెద్దన్న పాత్రను పోషించారని, ఆయనే కొత్త రాష్ట్రానికి తొలి సీఎం అనే ప్రచారం నేపథ్యంలో లోక్‌సభకు పోటీచేయకపోవచ్చనే వాదనకు బలం చేకూరింది. ముఖ్యమంత్రి రేసులో ఉన్నందున సొంత నియోజకవర్గం కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల సీటుపై కన్నేసిన ఆశావహులు లోక్‌సభ బరి నుంచి జైపాల్ తప్పుకొన్నట్లేనని భావించి వ్యూహాలకు పదునుపెట్టారు. రాజకీయాలను ఔపోసన పట్టడమే కాదు..అద్భుతమైన ప్రతిభ, వాగ్ధాటితో ఎంతటి వారినైనా మెప్పించి ఒప్పించేజైపాల్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశాన్ని గుంభనంగా ఉంచుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమౌతోంది.