sufferings
-
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!
‘‘ప్రతి మనిషి జీవితంలో మానసిక ఒత్తిడి, బాధలు ఉంటాయి. నాకలాంటివి లేవని ఎవరైనా అంటే అబద్ధం చెప్పినట్టే. నేను కూడా చాలా మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ, ఓ సందర్భంలో బాధ, మానసిక ఒత్తిడిలపై పోరాడాలనే కసి ఏర్పడటంతో నా నిర్ణయం మార్చుకున్నా’’ అన్నారు నటి ఖుష్బూ. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ఒకానొక దశలో నా జీవితం ఆగినట్లు అనిపించింది. భయం వేసింది. అప్పుడు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నా. కానీ, నాలోని ధైర్యం నన్ను ఆ నిర్ణయం తీసుకోనివ్వకుండా వెనకడుగు వేసేలా చేసింది. ఆ సమయంలో నా స్నేహితులు దేవదూతల్లా మారారు. నన్ను ఇబ్బంది పెడుతున్న సమస్యల కోసం విలువైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి? అనుకున్నాను. పరాజయాలకు భయపడలేదు. చీకటిని చూసి బెదరలేదు. నన్ను సమస్యలవైపు నడిపిస్తున్న వాటిని చూసి ఏ రోజూ భయపడలేదు. నన్ను ఓడించి, నాశనం చేయాలనుకుంటున్న సమస్యలకంటే నేనే దృఢమైనదాన్ని అని నిరూపించాలని నిర్ణయించుకున్నా. నాలో పోరాడే శక్తి ఉండటంతో ధైర్యంగా ముందడుగు వేశా. పరాజయాల్ని విజయాలుగా మార్చుకోవడం నేర్చుకుని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా’’ అన్నారు ఖుష్బూ. -
చంద్రబాబు తీరుతో నలిగిపోతున్న అధికారులు
-
మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ‘మా బిడ్డ కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా రూ. 25 లక్షలు ఖర్చవుతుందంటున్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు. కూతురు పడుతున్న బాధలు చూడలేకపోతున్నాము. రాత్రింబవళ్లు ఇద్దరం కష్టపడితే కానీ కుటుంబం గడవని పరిస్థితి. వైద్యం చేయించలేక పోతున్నాము. మా కూతురు కారుణ్య మరణానికి అనుమతించండి’ అని జగద్గిరిగుట్టకు చెందిన రాంచంద్రారెడ్డి, శ్యామల దంపతులు గురువారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హర్షిత(11) కొంతకాలంగా కామెర్లతో బాధపడుతుండగా ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అమ్మాయికి కాలేయం పూర్తిగా దెబ్బతిందని, కాలేయ మార్పిడి చేయాల్సిందేనని ఇందుకోసం రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుందని స్పష్టం చేశారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆ దంపతులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి తమ కూతురు కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం ఉప్పునూతలకు చెందిన రాంచంద్రారెడ్డికి కూతురు హర్షితతో పాటు మరో కుమారుడు ఉన్నాడు. పదేళ్ల క్రితం నగరానికి వచ్చిన వీరి కుటుంబం జగద్గిరిగుట్టలో ఉంటుంది. స్థానికంగా ఓ స్వీట్‌షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జగద్గిరిగుట్టలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న హర్షితను అనారోగ్య కారణాల వల్ల చదువు మాన్పించారు. కష్టపడి సంపాదించిన రూ. 2.5 లక్షలు సైతం కూతురు కోసమే ఖర్చు చేశానని, ఇక తన వద్ద డబ్బులు లేవని.. గత్యంతరం లేకనే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతున్నట్లు రాంచంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. -
సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురుచూపులు
- పెండింగ్‌లో 4 వేల పాత దరఖాస్తులు - మళ్లీ అర్జీ పెట్టుకోవాలంటూ తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు తల్లడిల్లుతున్నారు. రాష్ర్టం విడిపోవడానికి ముందు అర్జీ పెట్టుకున్న వారందరూ తమకు సాయమెప్పుడందుతుందా.. అని ఏడాదిగా సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ కోసం అర్జీ పెట్టుకున్న వారందరిదీ అదే దీనస్థితి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత పది వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించి సాయం అందించిన సర్కారు... పాత అర్జీల విషయాన్ని మాత్రం పక్కన పెట్టింది. దాదాపు 4 వేల దరఖాస్తులను మూలకు పడేసింది. అసలు వీటికి సాయం అందించాలా.. వద్దా అనే మీమాంసతోనే కాలయాపన చేస్తోంది. అర్జీదారులు పలుమార్లు సచివాలయంలో సంబంధిత సెక్షన్ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఇదిలాఉండగా, పాత దరఖాస్తులన్నింటినీ వెనక్కి పంపించాలని ప్రభుత్వం ఇటీవలే కొత్త నిర్ణయం తీసుకుంది. అప్పటి అర్జీ దారులందరూ మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని.. తమ శాసనసభ్యుడు సిఫారసు లేఖలతో మళ్లీ అర్జీ పెట్టుకోవాలని వీటిని వెనక్కి పంపించే పని పెట్టుకుంది. దరఖాస్తు చేసుకొని ఏడాది దాటిపోయిందని.. అప్పుడున్న ఎమ్మెల్యేల సిఫారసుతోనే బిల్లులన్నీ జత చేసి సీఎం సాయం కోరుతూ అర్జీ పెట్టుకున్నామని... ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే లేఖలతో దరఖాస్తు చేయమనటంతో దిక్కుతోచడం లేదని బాధ పడుతున్నారు. ఇప్పటికే ఏడాదికిపైగా సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగమైన ఆరోపణలతో చాలా ఫైళ్లు పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన అధికారులు పాత వాటి జోలికెళ్లలేదు. రాష్ట్ర విభజన సమయానికి తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన తొమ్మిది వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయిదు వేల ఫైళ్లకు సీఎం ఆమోదం లభించడంతో పాటు చెక్కులు కూడా సిద్ధమయ్యాయి. చెక్కులు సిద్ధమైన మేరకు ఫైళ్లు క్లియర్ చేసిన తెలంగాణ సర్కారు.. అప్పుడు పరిశీలనకు నోచుకోని నాలుగు వేల ఫైళ్లను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడిప్పుడే సెక్షన్ అధికారులు వాటిని దుమ్ము దులిపే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న అర్జీలను తిరస్కరించి.. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సెలవివ్వటంతో బాధితులు గొల్లుమంటున్నారు. -
బాబోయ్ ‘గ్రేటర్’ బాధలు!
- ఎండ తీవ్రత, ఒత్తిడితో కరిగిపోతున్న కేబుళ్లు - ఆయిల్ లీకేజీలతో పేలుతున్న ట్రాన్స్ఫార్మర్లు - అనధికారిక కోతలపై గ్రేటర్ వాసుల ఆందోళన.. అధికారులకు ముచ్చెమటలు హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మండుతున్న ఎండలకు తోడు గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగం ఒక్కసారిగా రెట్టింపు కావడంతో వారికి దిక్కుతోచడం లేదు. టీఎస్ఎస్పీడీసీఎల్ చరిత్రలోనే గురువారం హైదరాబాద్‌లో అత్యధికంగా 52.0 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఈ డిమాండ్‌కు పగటి ఉష్ణోగ్రతలు తోడవ్వడంతో ఒత్తిడిని తట్టుకోలేక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కుప్పకూలుతోంది. గురువారం ఘన్‌పూర్‌లోని ట్రాన్స్‌కోకు చెందిన 400 కేవీ సబ్‌స్టేషన్‌లో ఓ పవర్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడానికి ఇదే కారణమని నిపుణులు అంటున్నారు. అక్కడి నుంచి బండ్లగూడ 220 కేవీ సబ్‌స్టేషన్‌కు సరఫరా నిలిచింది. కొత్తపేట, నాగోలు, హయత్‌నగర్, వనస్థలిపురంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేబుళ్లు కరిగి పోయి... పగటి ఉష్ణోగ్రతల ధాటి, పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోలేక మాదాపూర్, కళ్యాణ్‌నగర్, అయ్యప్పసొసైటీ, హైదర్‌గూడ, చంచల్‌గూడ, ఎగ్జిబిషన్గ్రౌండ్లోని 11 కేవీ యూజీ కేబుళ్లు కరిగిపోయి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయిల్ లీకేజీలను అరికట్టక పోవడంతో నాంపల్లి, జూబ్లీహిల్స్, పంజేషా, శ్రీరమణ కాలనీలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలో కాయిల్స్ కాలి పోయాయి. కొన్ని చోట్ల వెంటనే పునరుద్ధరించినప్పటికీ...అర్ధరాత్రి వరకు సరఫరా నిలిచింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని ఓ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు ఉన్న ఫ్యూజ్ వైరు ఎండతీవ్రతకు కరిగిపోయింది. సకాలంలో గుర్తించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించక పోవడంతో ఆ ప్రాంతంలోని వారంతా శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల వరకు అంధకారంలో మగ్గారు. ఉక్కపోత ఆపై ఇంట్లో కరెంట్ కూడా లేక పోవడంతో సిటిజన్లు న రక యాతన అనుభవించారు. ఈఎల్ఆర్ పేరుతో ఎడాపెడా ‘కోత’... దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 52 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్లో 38 లక్షలు ఉన్నాయి . డిస్కం పరిధిలో ప్రస్తుతం 4వేల మెగావాట్లకు పైగా విద్యుత్ సరఫరా అవుతుండగా, దీనిలో 2,400 మెగావాట్లు గ్రేటర్ హైదరాబాద్‌కు సరఫరా అవుతోంది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నమోదు అవుతుండటంతో ఒత్తిడితో ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలకు డిస్ట్రిబ్యూషన్ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలో భాగంగా అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో మధ్యాహ్నం, సాయంత్రం అనధికారిక కోతలు అమలు చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పని చేయడం లేదు. పగలే కాకుండా అర్థరాత్రి కూడా ఈఎల్ఆర్లు అమలు చేస్తుండటంతో నగరవాసులు తట్టుకోలేకపోతున్నారు.