Sugar cane factory
-
తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే..
దేశవ్యాప్తంగా గతంలో నెలకొన్న ఎల్‌నినో, వర్షాల ప్రభావం చక్కెర(షుగర్) ఇండస్ట్రీపై పడింది. ప్రస్తుతం చక్కెర ఉత్పత్తి తగ్గుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య ఉత్పత్తి అయిన చక్కెర గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. గతేడాది ఇదే సమయంలో 82.05 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. సాధారణంగా షుగర్ మార్కెటింగ్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు గరిష్ఠంగా ఉంటుంది. గతేడాది ఉన్న 497 ఫ్యాక్టరీలు ఈ ఏడాదీ ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) పేర్కొంది. కానీ మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ఫ్యాక్టరీలు 10–15 రోజులు లేటుగా ప్రొడక్షన్ ప్రారంభించినట్లు వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో చక్కెర ఉత్పత్తి అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య 22.11 లక్షల టన్నులుగా నమోదయ్యింది. గతేడాది మార్కెటింగ్ ఇయర్లో ఇదే సమయానికి 20.26 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసింది. మహారాష్ట్రలో అయితే చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు పడిపోయింది. చెరుకును చక్కర ఉత్పత్తితోపాటు ఇథనాల్ ప్రొడక్షన్‌కు వినియోగిస్తున్నారు. అయితే చెరుకును ఇథనాల్ కోసం వాడకపోతే ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో 325 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ఇస్మా అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: వీటిని తెగవాడుతున్నారు..! దేశవ్యాప్తంగా డిస్టిలరీ ప్రాజెక్టులు ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ ప్లాంట్లలో దాదాపు రూ.35,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మరోవైపు ఎల్ నినో, వర్షాల ప్రభావంతో దేశవ్యాప్తంగా చెరుకు ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకల్లో ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్(ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్) తెలిపింది. దేశంలో చక్కెర ధరలను కంట్రోల్ చేసేందుకు సప్లయ్ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో ప్రభుత్వం ఎగుమతులను నిలిపేసింది. -
చెన్నూరుకు తీపికబురు
సాక్షి, ఖాజీపేట : నాడు రైతులకు, కార్మికులకు కడుపునిండా అన్నం పెట్టి బతుకు బండిని నడిపిన చక్కెర ఫ్యాక్టరీ చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా 1995, 2009లో మూతపడింది. కార్మికుల ఆకలి చావులకు చంద్రబాబు కారణం అయ్యారు. నేడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే మూతపడిన ఫ్యాక్టరీల పునరుద్ధరణకు తీర్మానం చేయడంతో కార్మికులు, రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వైఎస్ఆర్ హాయాంలో ఫ్యాక్టరీ అభివృద్ధికి నిధులుఇచ్చారు. నేడు సీఎం జగన్ పూర్వవైభవం తీసుకురానున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరుకు సాగు చేసే రైతులు, కార్మిక, కూలీల జీవితాల్లో తీపి నింపేందుకు 1971లో చక్కెర ఫ్యాక్టరీని ప్రారంభించారు. 1974లో పూర్తి చేశారు. దీనికోసం ప్రభుత్వం నుంచి 60.15 ఎకరాలు, రైతుల భూమి 30.71 ఎకరాలతో కలిపి 5 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు.ఇందులో 9వేలమంది రైతులు వాటాదారులుగా ఉన్నారు. ప్రతి రైతు 1971లో రూ 2,200 పెట్టుబడిగా పెట్టారు. ఫ్యాక్టరీలో రైతుల వాటా 54.11 శాతం ఉంది.1975లో క్రషింగ్ పనులు మొదలయ్యాయి. 1995లో తొలిసారి ఫ్యాక్టరీ మూతపడింది. దీనిని పునురుద్ధరించాల్సిన అప్పటి సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004లో ఫ్యాక్టరీని తెరిపించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఐదేళ్లకు రూ.19కోట్ల నిధులను ఇప్పించారు. 2010లో ఫ్యాక్టరీ నిర్వహణకు రూ.5కోట్ల 50 లక్షలు బ్యాంకుల నుంచి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పించని కారణంగా మళ్లీ మూతపడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్లపాటు పట్టించుకోలేదు. దీంతో వైఎస్సార్ హయాంలో అభివృద్ధిపథంలో నడిచిన చక్కెర ఫ్యాక్టరీ మూతపడింది.తిరిగి వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో రైతులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రైవేటీకరణ దిశగా గోవాడ!
అధికార పార్టీ ఎంపీ కన్ను? చెరకు రైతుల్లో ఆందోళన సుగర్స మహాజనసభ నేడు సహకార రంగంలో దేశంలోనే అత్యుత్తమ చెరకు ఫ్యాక్టరీల్లో ఒకటైన గోవాడ సుగర్స్ ప్రైవేటీకరణ వైపు పయనిస్తోందా? టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందా? ప్రస్తుత పరిణామాలు ఈ ప్రశ్నలకు తావిస్తున్నాయి. రైతు, ప్రభుత్వ భాగస్వామ్యంతో చెరకు రైతులకు అండగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను తెగనమ్మే పనిలో ప్రభుత్వం పడినట్టు తెలుస్తోంది. చోడవరం: రాష్ట్రంలో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా వాటిలో రెండు ఇప్పటికే మూతబడ్డాయి. మిగతా ఎనిమిదింటిలో చో డవరం (గోవాడ) లాభాల్లో ఉండగా ఏటికొప్పాక ఫ్యాక్టరీ లాభనష్టాలు లేకుండా నడుస్తోంది. ఆరు ఫ్యాక్టరీలు ప్రభుత్వంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ఏటా కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ కన్నేసినట్టు తెలిసింది. గోవాడతోపాటు మిగతా ఫ్యాక్టరీలను కూడా కొనుగోలుకు ఆ పార్టీకి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, విశాఖ డెయిరీ చైర్మన్ కూడా కాచుకు కూర్చున్నట్టు సమాచారం. వీరి ఒత్తిళ్ల మేర కే ప్రభుత్వం చెరకు పరిశ్రమలపై వేసిన అధ్యయన కమిటీలో వ్యూహాత్మకంగా ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీల యజమానులను నియమించిందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధికి అధికారులు, మంత్రులు, పరిశ్రమ, వ్యవసాయ నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలి. అధ్యయన కమిటీలో కీలక వ్యక్తిగా ఉన్న సుధాకరచౌదరి గతంలో గోవాడ సుగర్స్ ఎండీగా పనిచేశారు. ఇప్పుడు ఆయన ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్నారు. గోవాడ ఫ్యాక్టరీని ఎంపీ సుజనా చౌదరికి కట్టబెట్టేందుకే సుధాకరచౌదరిని కమిటీలో వేశారన్న ప్రచారం సాగుతోంది. సుధాకర చౌదరి గోవాడ ఫ్యాక్టరీ ముఖ్య సలహాదారునిగా నియమించేందుకు ఇటీవల ముమ్మర యత్నాలు చేశారని చెబుతున్నారు. ఫ్యాక్టరీల అధ్యయనం పేరుతో నష్టాలు చూపించి, ఆశిస్తున్న నాయకులకు లీజు పేరుతో దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోనే 24 వేల మంది సభ్య రైతులున్న అతిపెద్ద ఫ్యాక్టరీ అయిన గోవాడపై లక్షన్నర కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నాయి. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వారు లాభాలు పొంది మిల్లును మూసేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. తాజాగా విజయనగరం జిల్లాలో కోట్లాది రూపాయలు రైతులకు గిట్టుబాటు ధర బకాయిలు ఇవ్వకుండా ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ మూసేసి వెళ్లిపోవడంతో ఇప్పుడు అక్కడ రైతులు అప్పులు పాలైపోయి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు, సీఎం చంద్రబాబు తీరుపై ఇక్కడ టీడీపీ నాయకులు కూడా అయోమయంలో పడ్డారు. గోవాడ ఫ్యాక్టరీ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే రాజు, సభ్యుడుగా ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడు టీడీపీకి చెందిన వారే. ప్రైవేటీకరణ జరిగితే రైతులు తీవ్రంగా ప్రతిఘటించే అవకాశం ఉన్నందున తమ రాజకీయ భవిష్యత్‌పై వారు ఆందోళన చెందుతున్నట్టు కొందరు టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం జరిగే ఈ ఫ్యాక్టరీ మహాజనసభలో సభ్యుల నిర్ణయం ఎలా ఉంటోదనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.