Suja Varuni
-
ప్రేమజంటకు కమల్ విందు
తమిళనాడు, పెరంబూరు: ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులకు నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తన ఇంటికి ఆహ్వానించి విందునిచ్చారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా మరింత పాపులర్ అయిన నటి సుజా వరూణి. ఈమె యువ నటుడు, శివాజీగణేశన్ మనవడు, రామ్‌కుమార్ కొడుకు శివకుమార్ చాలా కాలంగా ప్రేమించుకుంటూ వచ్చారు. వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కింది. ఇటీవల చెన్నైలో శివకుమార్, సుజా వరూణిల వివాహం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశ్వీదించారు. అంతకుముందే నటి సుజా వరూణి బిగ్‌బాస్ గేమ్ షోలో పాల్గొన్న సమయంలో తాను చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయానని, ఆయన స్థానంలో నటుడు కమలహాసన్‌ను చూసుకుంటున్నానని అన్నారు. తన పెళ్లిని కమలహాసన్ తండ్రి స్థానంలో నిలబడి నిర్వహించాలని ఆశ పడుతున్నానన్న కోరికను ఆయన ముందుంచింది. అందుకు కమల్ కూడా అంగీకరించారు. అయితే ఇటీవల గజ తుపాన్ బాధితులను పరామర్శించడంలో తలమునకలైన కమలహాసన్ శివకుమార్, సుజా వరూణిల పెళ్లికి హాజరు కాలేకపోయారు. దీంతో కమల్ తుపాన్ బాధితులకు సహాయకార్యక్రమాలను పూర్తి చేసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు. బుధవారం నవదంపతులు శివకుమార్, సుజావరూణిలను కమల్ తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి మంచి బిరియానీ విందునిచ్చారు. ఈ విందులో నటి, మక్కళ్ నీది మయ్యం పార్టీ సభ్యరాలు శ్రీప్రియ, నటుడు నాజర్ సతీమణి కమీల పాల్గొన్నారు. -
శివాజీ మనవడితో సుజావరూణి పెళ్లి
తమిళసినిమా: దివంగత నటుడు శివాజిగణేశన్ మనవడు, రామ్‌కుమార్, వైజయంతిల కొడుకు, నటుడు శివాజీదేవ్ను నటి సుజావరూణి త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ జంట వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. శివాజీదేవ్, సుజావరూణి గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ఇటీవల తిరుమలకు వెళ్లి, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం దర్శనం చేసుకున్నారు.అక్కడ వారిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను నటి సుజావరూణి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో ఆమె పేర్కొంటూ తనకు శివాజీదేవ్కు వివాహ నిశ్చితార్థం జరగలేదని, తాము వేంకటేశ్వరస్వామి సుప్రభాతసేవ కోసం తిరుమల వెళ్లామని పేర్కొన్నారు. పెళ్లి నిశ్చితార్థం జరిగితే కచ్చితంగా అందరికీ చెబుతామని, అప్పటి వరకూ ఎలాంటి వదంతులకు తావివ్వరాదంటూ పేర్కొన్నారు. నటుడు, శివాజీగణేశన్ మనవడు, రామ్‌కుమార్ కొడుకు శివాజీదేవ్ మాత్రం తనకు నటి సుజావరూణికి మధ్య 11 ఏళ్లుగా ప్రేమ సాగుతోందని, కాగా తన తల్లి ఇటీవలే కన్నుమూయడంతో ఆ బాధ నుంచి తాను తెరుకోలేదని అన్నారు. ఆ ఏడాది చివరిలో సుజావరూధినితో తన పెళ్లి విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయిస్తారని శివాజీదేవ్ పేర్కొన్నారు. -
టాప్ లెస్‌గా నటించడానికి సై
చెన్నై: సినీ పరిశ్రమలో అద్భుతమైన నటనను ప్రదర్శించినప్పటికీ మార్కెట్ డల్ కావడంతో ఇలియానా, రాధికా ఆప్టే, విద్యాబాలన్ వంటి భామలు అందాలను ఆరబోసి మార్కెట్‌ను తిరిగి పొందగలిగారు. వారిలో ముఖ్యంగా రాధికా ఆప్టే ‘పార్సెట్’ వంటి కొన్ని చిత్రాలలో టాప్‌లెస్‌గా నటించి కలకలం రేపుతోంది. ఈ విధంగా నటించడానికి కోలీవుడ్ నటీమణుల్లో ఎవరికైనా దైర్యం ఉన్నదా అని పరిశీలిస్తే నేనున్నానంటూ ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. ఇన్నాళకు ఓ బ్యూటీ విచ్చలవిడిగా అందాల ఆరాబోతకు, టాప్‌లెస్‌గా నటించడానికి తాను సై అంటూ ముందుకు వచ్చింది. తమిళంలో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాలలో నటించింది సుజా వరూణి. వీటిలో చాలా వరకు అతిథి పాత్రలు, ఐటమ్ సాగ్సే అధికం. దీంతో విరక్తి చెందిన సుజా ఇకపై ఐటమ్ సాగ్స్కు చిందులు వేయబోనని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఈ విషయం గురించి అమ్మడు మాట్లాడుతూ.. తన కోసం వచ్చే దర్శకులు వద్ద ఓపెన్ హార్ట్‌గా కథలు వింటానన్నారు. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటే అంగీకరిస్తానని తెలిపారు. అధికంగా రెమ్యునరేషన్ ఇస్తానని తెలిపినప్పటికీ ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించనంది. విద్యాబాలన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలు నటించే హీరోయిన్ ఓరిటెండెట్ చిత్రాల్లో నటించాలని ఆశ అని తెలిపింది. కథ ప్రాముఖ్యతను బట్టి టాప్‌లెస్‌గా కూడా నటించడానికి తాను సిద్ధమని, అంతటి ధైర్యం తనకు ఉన్నదని తెలిపింది. అదే సమయంలో అనవసరమైన సన్నివేశాల కోసం అందాలను ఆరబోయనని తేల్చి చెప్పగలిగే ధైర్యం కూడా తనకు ఉదని చెప్పింది. ఇరవుక్కు ఆయిరం కన్గల్, శత్రు, ఆన్దేవదై వంటి చిత్రాలలో నటిస్తున్నట్టు సుజా వరూణి వెల్లడించింది.