
టాప్ లెస్‌గా నటించడానికి సై
ఓ బ్యూటీ విచ్చలవిడిగా అందాల ఆరాబోతకు, టాప్‌లెస్‌గా నటించడానికి తాను సై అంటూ ముందుకు వచ్చింది.
చెన్నై: సినీ పరిశ్రమలో అద్భుతమైన నటనను ప్రదర్శించినప్పటికీ మార్కెట్ డల్ కావడంతో ఇలియానా, రాధికా ఆప్టే, విద్యాబాలన్ వంటి భామలు అందాలను ఆరబోసి మార్కెట్‌ను తిరిగి పొందగలిగారు. వారిలో ముఖ్యంగా రాధికా ఆప్టే ‘పార్సెట్’ వంటి కొన్ని చిత్రాలలో టాప్‌లెస్‌గా నటించి కలకలం రేపుతోంది. ఈ విధంగా నటించడానికి కోలీవుడ్ నటీమణుల్లో ఎవరికైనా దైర్యం ఉన్నదా అని పరిశీలిస్తే నేనున్నానంటూ ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు.
ఇన్నాళకు ఓ బ్యూటీ విచ్చలవిడిగా అందాల ఆరాబోతకు, టాప్‌లెస్‌గా నటించడానికి తాను సై అంటూ ముందుకు వచ్చింది. తమిళంలో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు 50 చిత్రాలలో నటించింది సుజా వరూణి. వీటిలో చాలా వరకు అతిథి పాత్రలు, ఐటమ్ సాగ్సే అధికం. దీంతో విరక్తి చెందిన సుజా ఇకపై ఐటమ్ సాగ్స్‌కు చిందులు వేయబోనని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది.
ఈ విషయం గురించి అమ్మడు మాట్లాడుతూ.. తన కోసం వచ్చే దర్శకులు వద్ద ఓపెన్ హార్ట్‌గా కథలు వింటానన్నారు. చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటే అంగీకరిస్తానని తెలిపారు. అధికంగా రెమ్యునరేషన్ ఇస్తానని తెలిపినప్పటికీ ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించనంది. విద్యాబాలన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే వంటి తారలు నటించే హీరోయిన్ ఓరిటెండెట్ చిత్రాల్లో నటించాలని ఆశ అని తెలిపింది.
కథ ప్రాముఖ్యతను బట్టి టాప్‌లెస్‌గా కూడా నటించడానికి తాను సిద్ధమని, అంతటి ధైర్యం తనకు ఉన్నదని తెలిపింది. అదే సమయంలో అనవసరమైన సన్నివేశాల కోసం అందాలను ఆరబోయనని తేల్చి చెప్పగలిగే ధైర్యం కూడా తనకు ఉదని చెప్పింది. ఇరవుక్కు ఆయిరం కన్గల్, శత్రు, ఆన్‌దేవదై వంటి చిత్రాలలో నటిస్తున్నట్టు సుజా వరూణి వెల్లడించింది.