
శివాజీదేవ్‌తో సుజావరూణి
తమిళసినిమా: దివంగత నటుడు శివాజిగణేశన్ మనవడు, రామ్‌కుమార్, వైజయంతిల కొడుకు, నటుడు శివాజీదేవ్‌ను నటి సుజావరూణి త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ జంట వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. శివాజీదేవ్, సుజావరూణి గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ఇటీవల తిరుమలకు వెళ్లి, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం దర్శనం చేసుకున్నారు.అక్కడ వారిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను నటి సుజావరూణి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
అందులో ఆమె పేర్కొంటూ తనకు శివాజీదేవ్‌కు వివాహ నిశ్చితార్థం జరగలేదని, తాము వేంకటేశ్వరస్వామి సుప్రభాతసేవ కోసం తిరుమల వెళ్లామని పేర్కొన్నారు. పెళ్లి నిశ్చితార్థం జరిగితే కచ్చితంగా అందరికీ చెబుతామని, అప్పటి వరకూ ఎలాంటి వదంతులకు తావివ్వరాదంటూ పేర్కొన్నారు. నటుడు, శివాజీగణేశన్ మనవడు, రామ్‌కుమార్ కొడుకు శివాజీదేవ్ మాత్రం తనకు నటి సుజావరూణికి మధ్య 11 ఏళ్లుగా ప్రేమ సాగుతోందని, కాగా తన తల్లి ఇటీవలే కన్నుమూయడంతో ఆ బాధ నుంచి తాను తెరుకోలేదని అన్నారు. ఆ ఏడాది చివరిలో సుజావరూధినితో తన పెళ్లి విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయిస్తారని శివాజీదేవ్ పేర్కొన్నారు.