shivaji ganeshan
-
శివాజీ గణేషన్‌ను ఇండస్ట్రీ పట్టించుకోలేదు: ఇళయరాజా షాకింగ్ కామెంట్స్
సాక్షి, చెన్నై: దివంగత నటుడు శివాజీ గణేషన్‌ను చిత్ర పరిశ్రమ, ప్రభుత్వం తగిన రీతిలో సత్కరించలేదని సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ప్రముఖ రచయిత మరుదు మోహన్ నటుడు శివాజీ గణేషన్ గురించి రాసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. దర్శకుడు భారతి రాజా, కే.భాగ్యరాజ్, సంగీత దర్శకుడు ఇళయరాజా, రచయిత ముత్తులింగం, నటుడు ప్రభు, రాంకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ఇళయరాజా మాట్లాడుతూ.. శివాజీ గణేషన్ నుంచి తాను నేర్చుకున్న అనేక విషయాల్లో కాలం ఒకటని పేర్కొన్నారు. క్రమశిక్షణలో ఆయనకు మించిన వారు మరొకరు ఉండరన్నారు. తన కారు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు స్టూడియో ముందు ఆగుతుందన్నారు. ఒకసారి తాను ఆలస్యంగా రావడంతో ఏమిటి రాసా నువ్వు కూడానా అని శివాజీ గణేషన్ తనను అడిగారన్నారు. రికార్డింగ్ స్టూడియోలో ఆయన తన అనువాభవాలను పంచుకునే వారని చెప్పారు. ఒకసారి సినీ పరిశ్రమ తరపున శివాజీ గణేషన్‌కు అభినందన సభ జరిగిందన్నారు. ఆయనకు ఒక కానుక అందించాలని నిర్ణయించామన్నారు. అందుకు తగిన నగదును పరిశ్రమ వర్గాల నుంచి వసూలు చేసినట్లు చెప్పారు. నటీనటులు తినే భోజనంలో ప్రతి బియ్యం గింజ పైనా శివాజీ గణేషన్ పేరు ఉంటుందన్నారు. దీంతో ఆయనకు ప్రదానం చేసే జ్ఞాపికపై ఎవరి పేర్లు ఉండరాదని, దానికి అయ్యే ఖర్చును తానే ఇస్తానని చెప్పానన్నారు. ఆ విషయం తెలిసి శివాజీ గణేషన్ ఎవరిని మరిచినా ఇళయరాజాను మరవకూడదని అన్నారన్నారు. శివాజీని సినిమా పెద్దలు గాని, ఏ ప్రభుత్వం తగిన విధంగా సత్కరించలేదని, అయితే వ్యక్తిగతంగా ఎవరైనా చేశారంటే అది ఈ ఇళయ రాజానే అని పేర్కొన్నారు. చదవండి: మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా? అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి -
నటన రంగంలోకి శ్రీదేవి మేనకోడలు, మ్యూజిక్ వీడియోతో కనువిందు
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. అయితే ఆమె చిన్న కూతురు అనుకుంటే పొరపాటు పడ్డంటే. ఆమె శ్రీదేవి మేనకోడలు శిరీష. ఓ ప్రైవేటు మ్యూజిక్ వీడియో సాంగ్‌లో ఆమె కనువిందు చేస్తోంది. కేరళ నేపథ్యంలో అక్కడి సాంప్రదాయంలో ఓ లవ్‌ట్రాక్‌పై ఈ మ్యూజిక్ వీడియో సాగింది. ప్రస్తుతం ఈ మ్యూజిక్ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్ మరో విశేషం ఎంటంటే ఇందులో మరో సీనియర్ నటుడు మనవడు కూడా నటించాడు. ‘నడిగర్ తిలకం’ శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శిరీషకు జోడిగా నటించాడు. కొన్ని జనరేషన్లుగా లవ్ చేసుకుంటున్న జంటల ప్రేమ ఇతివృతంలో ఈ పాట సాగింది. ఇందులో శిరీష, దర్శన్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఓ సెలబ్రిటీ ప్యాకేజి అనదగ్గ ఈ మ్యూజిక్ వీడియోను సీనియర్ నటి పద్మిని మనవరాలు లక్ష్మి దేవి రూపొందించింది. చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు ‘యదలో మౌనం’ అంటూ సాగే ఈ మ్యూజిక్ వీడియోకు అచ్చు రాజమణి, వరుణ్ మీనన్ సంగీతం సమకూర్చారు. టాలీవుడ్ యువ గీత రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించాడు. కాగా ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాన్వి.. బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ హీరోయిన్గా సత్తా చాటుతోంది. ఇక రెండో కూమార్తె ఖుషి కపూర్ కూడా ఓ మంచి ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. -
అనూహ్య రేఖ
ఆమె సరళ రేఖ కాదు. వక్రరేఖ కాదు. ఒక అనూహ్య రేఖ. తెలుగు, తమిళం అనే మాతృ ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్లో చక్రం తిప్పింది. హీరోలకు ఇన్స్పిరేషన్. హీరోయిన్లకు గ్లామర్ టీచర్. నేడు ఆమెకు 67 నిండి 68 వస్తున్నాయి. రేఖను తాడేపల్లిగూడెం అమ్మాయి అనొచ్చు. ఎందుకంటే ఆమె తల్లి నటి పుష్పవల్లిది అదే ఊరు. పుష్పవల్లి నటిగా ఎదగడం, జెమిని గణేశన్‌తో సహజీవనం చేయడం ఆ రోజుల్లో సంచలనం. జెమిని గణేశన్ వల్ల ఆమెకు రేఖ, మరో కుమార్తె రాధ పుట్టారు. కాని రేఖ జీవితంలో తల్లి మాత్రమే ఉంది. తండ్రి లేడు. తండ్రి చాలా కాలం రేఖను తన కూతురుగా అంగీకరించలేదు. అప్పటికే ఒక పెళ్లి అయిన జెమినీ గణేశన్ సావిత్రితో పెళ్లి సమయంలో పుష్పవల్లితో సహజీవనం చేస్తున్నాడు. సావిత్రితో పెళ్లి బహిర్గతం అయ్యాక ఆమెకు దూరం అయ్యాడు. అందువల్ల కావచ్చు బహుశా పబ్లిక్‌గా రేఖను తన కుమార్తె అని ఆయన చెప్పుకోలేదు. రేఖకు ఈ గాయం ఒకటైతే తల్లి ఆ తర్వాత మరో సంబంధంలోకి వెళ్లి ఫలితంగా పుట్టిన మరో ముగ్గురిని పెంచాల్సి రావడంతో రేఖ తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. తన జీవితం తాను జీవించాలనుకుంది. తన జీవిత రేఖ తానే గీసుకోవాలనుకుంది. రేఖ అలా పెరిగింది. ఇంతేరా ఈ జీవితం ‘రంగుల రాట్నం’లో భుజంగరాయ శర్మ రాసిన ‘ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం’ పాట రేఖకు సరిపోతుంది. ఎందుకంటే ఆ సినిమాలో రేఖ ‘బేబీ రేఖ’ పేరుతో నటించింది. రంగుల రాట్నంలో పైకి కిందకు ఉత్థాన పతనాలు ఉంటాయి. రేఖ జీవితంలో కూడా ఉన్నాయి. తెలుగులో ‘అమ్మ కోసం’ సినిమాలో కృష్ణంరాజు పక్కన నటించిన రేఖ తన తల్లి సమాజానికి తండ్రి సమాజానికి దూరంగా వెళ్లదలుచుకుంది. ముంబై వెళ్లి 14–15 ఏళ్లకే ‘సావన్ భాదో’ సినిమాలో హీరోయిన్ అయ్యింది. ఆ సినిమా హిట్ అయినా రేఖను ఎవరూ లెక్క చేయలేదు. పైగా ‘నల్లబాతు’ అని పిలిచేవారు. ఆమె రంగు, బొద్దుగా ఉండే రూపం నార్త్‌కు పనికి రాదని పత్రికలు రాశాయి. కాని రేఖ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసలు మన రూపాన్ని మనం చెక్కుకోవచ్చు అని మొదటిసారి బాలీవుడ్‌కి తెలియచేసింది రేఖ. ఆ తర్వాత ఆమె రూపం మారింది. ఫ్యాషన్ మారింది. నటన మారింది. రేఖ అంటే ‘ఫ్యాషన్ దివా’ అని పేరు తెచ్చుకుంది. తోడు ఎవరు? రేఖ జీవితం ఎప్పుడూ వివాదాస్పదమే. అమితాబ్‌తో ఆమె తొలిసారిగా ‘దో అంజానే’ లో నటించింది. పెళ్లయిన అమితాబ్ రేఖ ఆకర్షణలో పడ్డాడని ఆ వెంటనే వాళ్లు కలిసి చేసిన సినిమాలు చూస్తే అనిపిస్తుంది. ‘మిస్టర్ నట్వర్లాల్’, ‘మొకద్దర్ కా సికిందర్’, ‘సిల్సిలా’... ఇవి రేఖ–అమితాబ్‌ల చిత్రాలు. వీరి ప్రేమ, ఆ సమయంలో జయభాదురి మానసిక సంఘర్షణ యశ్‌చోప్రాను ‘సిల్సిలా’ తీసేలా చేశాయి. నిజ జీవితం లోని పాత్రలు సినిమా తెర మీద నటించడం బహుశా మొదటి చివరి సారిగా ఈ సినిమాలోనే జరిగిందేమో. అయితే ఈ సినిమా అంత విజయం సాధించలేదు. రేఖ తన తోటి నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకుందని వదంతులు వచ్చాయి. ఆ తర్వాత రేఖ ముంబై వ్యాపారి ముఖేశ్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. నాలుగు పార్టీల్లో కలిసిన ముఖేశ్ అగర్వాల్ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అని దూకుడుగా అడిగితే రేఖ కూడా అంతే దూకుడుగా ఓకే అనడం ఆ రోజే వాళ్లు పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఆ వెంటనే ఒకరి లోపాలు ఒకరికి తెలిసి ఆ పెళ్లి ప్రమాదంలో పడింది. ముఖేశ్ అగర్వాల్ పెళ్లయిన ఒక సంవత్సరం లోపే రేఖ చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో రేఖ నటించిన ‘శేష్నాగ్’ విడుదలైతే జనం ఆ పోస్టర్ల మీద పేడ కొట్టారు. రేఖ వాదన ఎవరూ వినలేదు. రేఖను మీడియా ఎప్పుడూ తన దృష్టి నుంచే చూసింది. గొప్పనటి రేఖ గొప్ప నటి, డాన్సర్. రేప్ విక్టిమ్గా ‘ఘర్’ సినిమాలో నటించి ఆమె తన సీరియస్ నట ప్రయాణాన్ని మొదలెట్టింది. హృషికేశ్ ముఖర్జీ ‘ఖూబ్సూరత్’లో రేఖను చూసి చాలామంది ముచ్చటపడ్డారు. ఆ తర్వాత ముజఫర్ అలీ దర్శకత్వంలో ‘ఉమ్రావ్‌జాన్’లో నటించి రేఖ విమర్శకులను అప్రతిభులను చేసింది. ఒక తవాయిఫ్ జీవితాన్ని రేఖ సంపూర్ణమైన పరిణితితో ఆవిష్కరించగలిగింది. శ్యాం బెనగళ్ ‘కలియుగ్’, గిరిష్ కర్నాడ్ ‘ఉత్సవ్’ ఆమెను పార్లల్ సినిమాల్లో వెలిగించాయి. మరోవైపు ‘ఫూల్ బనే అంగారే’, ‘ఖూన్ భరీ మాంగ్’ ఆమెను యాక్షన్ హీరోయిన్ను చేశాయి. రేఖ ఏదైనా బాగా చేసింది. రేఖ చేసిందంతా బాగుందనే పేరు వచ్చింది. జుట్టు తెల్లబడని నటి రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆమె బయట ఏదైన షోకు వచ్చినా ఉత్సాహంతో కనిపిస్తుంది. ‘ఆజ్ కల్ పావ్ జమీపర్ నహి పడ్తే హై మేరే’, ‘తేరే బినా జియా జాయేనా’, ‘సున్ సున్ దీదీ తేరే లియే ఏక్ రిష్టా ఆయాహై’, ‘ఆప్ కే ఆంఖోమే కుచ్ మెహకే హుయే రాజ్ హై’, ‘పర్ దేశియా ఏ సచ్ హై పియా’... ఎన్నో హిట్ సాంగ్స్ రేఖకు. ఆమెకు 68 వచ్చేశాయంటే నమ్మడం కష్టం. కాని వయసును జయించిన భాగ్యం ఈ భానురేఖదే కదా. రేఖతో మొదలైన చాలామంది అమ్మ పాత్రలు వేసి రిటైర్ అయిపోయారు. అమ్మమ్మ పాత్రలు వేసి తెరమరుగు అయ్యారు. కాని జుట్టు తెల్లగా ఉన్న పాత్రలు అతి తక్కువ వేసిన రేఖ ఇప్పుడూ యంగ్‌గా కనిపిస్తూ ప్రత్యేక పాత్రలు వేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది. -
వారికి కూడా శివాజీ గణేశన్‌కు పట్టిన గతే..
సాక్షి ప్రతినిధి, చెన్నై: వెండితెర నటులుగా ఉంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయ అజ్ఞానులని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. గతంలో అగ్రనటులు శివాజీగణేశన్ పార్టీకి పట్టిన గతే వీరికి తప్పదని ఎద్దేవా చేశారు. సేలం జిల్లా, నగర అన్నాడీఎంకే నిర్వాహకులతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఓమలూరులో మంగళవారం సమావేశమై పార్టీ స్థితిగతులను సమీక్షించారు. అనంతరం ఆయన పత్రికాప్రతినిధులతో మాట్లాడుతూ తమ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని గొప్పలు చెప్పుకొంటున్న మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ఇటీవలి ఉపఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని ఎడపాడి ప్రశ్నించారు. ‘కమల్ పెద్ద నాయకుడే కదా, గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. పాపం ఆయనకు వయస్సు దాటిపోయి వృద్ధాప్య దశలోకి చేరుకోవడంతో సినిమా అవకాశాలు రాక రాజకీయ ప్రవేశం చేశారు. సినిమాలు విజయం సాధించక పోవడంతో కనీసం తమ పార్టీవారైనా చూస్తారనే ఆశతోనే కమల్‌హాసన్ మక్కల్ నీది మయ్యం స్థాపించాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించవచ్చు. అది తప్పుకాదు. అయితే ఇతరులను దూషించడం తప్పు. ఇంతకాలం ఆయన ఎక్కడున్నారు. నేను 1974లో అన్నాడీఎంకేలో చేరి పార్టీ కోసం 45 ఏళ్లపాటు పాటుపడ్డాను. ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకెళ్లాను. ప్రజాభిమానంతో సీఎం దశకు చేరుకున్నాను. రజనీ, కమల్ వెండితెర నటులు, రాజకీయం తెలియదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల సంఖ్య కూడా తెలియదు. ప్రజల సమస్యలపై అవగాహన లేదు. శివాజీగణేశన్ సొంతపార్టీ పెట్టి ఎన్నికల సమయంలో ఏమైనారో అందరికీ తెలుసు’ అంటూ రజనీకాంత్, కమల్ హాసన్‌లపై విమర్శలు గుప్పించారు. కాళ్లపై పడి ఎవరైనా సీఎం అవుతారు.. శివాజీ గణేశన్ రాజకీయ జీవితంపై సీఎం పళనిసామి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమాన సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇతరులు కాళ్ల మీద పడి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తికి.. ఆత్మాభిమానం గల మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించింది. పళనిసామికి అధికారం మాత్రమే ఉందని.. పదవి పోయిన తర్వాత ఆయనను ఎవరూ గుర్తుపెట్టుకోరని.. అదే శివాజీ గణేశన్ మాత్రం తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొంది. ఒకప్పడు తమ అభిమాన నటుడి ప్రచారంతో అన్నాడీఎంకే గెలుపొందిన విషయాన్ని సీఎం మరిచిపోయినట్టు ఉన్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కమల్, రజనీ అభిమానులు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటులను తక్కువ చేసి మాట్లాడటం సీఎం స్థాయి వ్యక్తికి సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. -
శివాజీ మనవడితో సుజావరూణి పెళ్లి
తమిళసినిమా: దివంగత నటుడు శివాజిగణేశన్ మనవడు, రామ్‌కుమార్, వైజయంతిల కొడుకు, నటుడు శివాజీదేవ్ను నటి సుజావరూణి త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ జంట వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందనే ప్రచారం జరుగుతోంది. శివాజీదేవ్, సుజావరూణి గత 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ఇటీవల తిరుమలకు వెళ్లి, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం దర్శనం చేసుకున్నారు.అక్కడ వారిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను నటి సుజావరూణి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో ఆమె పేర్కొంటూ తనకు శివాజీదేవ్కు వివాహ నిశ్చితార్థం జరగలేదని, తాము వేంకటేశ్వరస్వామి సుప్రభాతసేవ కోసం తిరుమల వెళ్లామని పేర్కొన్నారు. పెళ్లి నిశ్చితార్థం జరిగితే కచ్చితంగా అందరికీ చెబుతామని, అప్పటి వరకూ ఎలాంటి వదంతులకు తావివ్వరాదంటూ పేర్కొన్నారు. నటుడు, శివాజీగణేశన్ మనవడు, రామ్‌కుమార్ కొడుకు శివాజీదేవ్ మాత్రం తనకు నటి సుజావరూణికి మధ్య 11 ఏళ్లుగా ప్రేమ సాగుతోందని, కాగా తన తల్లి ఇటీవలే కన్నుమూయడంతో ఆ బాధ నుంచి తాను తెరుకోలేదని అన్నారు. ఆ ఏడాది చివరిలో సుజావరూధినితో తన పెళ్లి విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయిస్తారని శివాజీదేవ్ పేర్కొన్నారు. -
చెరగని ముద్ర
ఆరనీకుమా.. ఈ దీపం కార్తీకదీపం.. అనే పాటతో తెలుగిం టి ఆడపడుచుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ సినీనటి శ్రీదేవికి నాగార్జునసాగర్‌తో ప్రత్యేకానుబంధం ఉం ది. 1979లో ఆమె నటించిన కా ర్తీకదీపం సినిమాలోని ప్రేక్షకాదరణ పొందిన పాటతో పాటు కొన్ని సన్నివేశాలను జలాశయ తీరంలో చిత్రీకరించారు. నాగార్జునసాగర్ : సినీనటి శ్రీదేవికి ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1979లో విడుదలైన కార్తీకదీపం సినీమాలో ఒకపాటను సాగర్ జలాశయతీరంలో చిత్రీకరించారు. ఈ పాటతోనే ఆ సినిమా హిట్టయ్యింది. ‘ఆరానీకుమా ఈదీపం కార్తీకదీపం’ అనే పాటను శోభన్‌బాబు, శారదతోపాటు శ్రీదేవితో కలిసి జలాశయంలో దీపాలు వదిలే దృశ్యాలను చిత్రీకరించారు. శోభన్‌బాబు, శ్రీదేవిపై ‘చిలుకమ్మ పలికింది.. చిగురాకు కులికింది’ అనే పాటను విజయవిహార్, ఎత్తిపోతల ప్రాంతంలో చిత్రీకరించారు. శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి రచనతో తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. శోభన్‌బాబు, శ్రీదేవి, శారద చక్కని నటనతో.. ఈ చిత్రం విజయవంతమయ్యింది. ప్రస్తుతం శ్రీదేవి మరణవార్త విన్న సాగర్వాసులు ఆనాడు ఈ ప్రాంతంలో తీసిన చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
రజనీ హింట్ ఇచ్చిన ఆ హీరో ఎవరు?
తమిళ అభిమానులు రజనీకాంత్‌ను దైవంలా ఆరాధిస్తారు. కేవలం సౌత్‌కే కాదు ఇండియాకే సూపర్‌స్టార్ రజనీ. అతని స్టైల్‌కి ప్రపంచమంతటా ఫ్యాన్సే. అలాంటిది.. రజనీ తన తర్వాత స్థానంలో ఎవరుండొచ్చు అనే అంశంపై ఓ హింట్ ఇవ్వడం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా రజనీ అభిమానులతో సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ మీటింగ్‌లో రజనీ మాట్లాడుతూ...‘‘ రాజకీయాల్లోనైనా, సినిమాల్లోనైనా సమయం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. సమయాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి. ఒకప్పుడు నేను మా స్నేహితుని పెళ్లికి కోయంబత్తూర్ వెళ్లాను. నాతో శివాజీ గణేశన్ కూడా ఉన్నారు. ఇద్దరం ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందరూ రజనీ... రజనీ.. అంటూ కేకలు వేశారు. అప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నేను ఒక లెజెండ్ పక్కన నిల్చొని ఉన్నాను. శివాజీ గణేశన్ పక్కన ఉండగా నా గురించి అభిమానులు కేకలు వేయడం ఇబ్బందిగా అనిపించింది. అది చూసి శివాజీ గణేశన్...‘మేము మా సమయంలో ఎన్నో మంచి సినిమాలు చేశాము. ఇప్పుడు ఇది నీ సమయం.. నువ్వు ఎదిగే సమయం.. ఇంకా మంచి సినిమాల్లో నటించు, బాగా కష్టపడు’ అన్నారు. సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్లీ కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సివచ్చింది. అదే ఎయిర్ పోర్ట్‌కి మరో స్టార్ హీరో వచ్చారు. దీంతో ఆ హీరో అభిమానులు చాలా మంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు మీరు వస్తే ఇబ్బందిగా ఉంటుందని.. అక్కడి నుంచి నాకొక మెసెజ్ వచ్చింది. సరే అతను వెళ్లిన తర్వాతనే వస్తానని చెప్పాను. అప్పుడు నాకు శివాజీ గణేశన్ మాటలు గుర్తొచ్చాయి.. సమయం ఇంకొకరికి వచ్చింది అని అనుకొన్నా' అని రజనీకాంత్ తెలిపారు. అయితే ఆ హీరో ఎవరూ అనే విషయాన్ని రజనీ క్లారీటీ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో చర్చనీయాంశమైంది. -
సీనియర్ మాటల రచయిత కన్నుమూత
తమిళసినిమా: ఎంజీఆర్ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్ రచయిత ఆర్కే.షణ్ముగం మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. ఎంజీఆర్ నటించిన ఆయిరత్తిల్ ఒరువన్, ముఖరాశి, రహస్యపోలీస్ 115, నినైత్తదై ముడిప్పవన్, నీతిక్కు తలైవణంగు, పల్లాండు వాళ్గ, నాడోడి, చిరిత్తు వాళవేండుం 16 చిత్రాలకు షణ్ముగం మాటలను రాశారు. అదేవిధంగా శివాజీగణేశన్ నటించిన పలు చిత్రాలకు సహాయదర్శకుడిగానూ పని చేశారు. షణ్ముగం గత కొన్ని వారాల క్రితం బాత్రూమ్లో జారి పడడంతో వెన్నెముక విరిగింది. అందుకు శస్త్ర చికిత్స చేయించుకున్నా, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. షణ్ముగంకు భార్య దేవి, కూతుళ్లు సత్యవతి, సంతానలక్ష్మీ ,ఈశ్వరి, మహాలక్ష్మీ ఉన్నారు. షణ్ముగం అంత్యక్రియలు బుధవారం జరిగాయి. -
ముదురుతున్న ‘శివాజీ’ వివాదం
చెన్నై మెరీనా బీచ్ సమీపంలోని శివాజీ గణేశన్ విగ్రహ వివాదం మరింతగా ముదురుతోంది. విగ్రహాన్ని తొలగించాలని ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ శుక్రవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత అంతటి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నడిగర్ తిలగం శివాజీ గణేశన్. ఎంజీఆర్‌పై అభిమానానికి గుర్తుగా నగరంలో అనేక విగ్రహాలు ఉన్నాయి. బీచ్ వద్ద అతిపెద్ద సమాధి ఉంది. అలాగే శివాజీ గణేశన్ స్మృతి చిహ్నంగా 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం బీచ్ రోడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని ముఖ్యమంత్రి హోదాలో కరుణానిధి ప్రారంభించారు. రోడ్డు కూడలిలో ఉన్నందున ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల వివాదం పుట్టుకొచ్చింది. విగ్రహాన్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. దీంతో అభిమానులు మద్రాసు హైకోర్టును ఆశ్రరుుంచారు. అక్కడ వాదోపవాదాలు పూర్తయి ఎట్టకేలకు విగ్ర హాన్ని అక్కడి నుంచి తొలగించి మరెక్కడైనా ప్రతిష్ఠించాలని హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు కోర్టు తీర్పుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శివాజీ గణేశన్ అభిమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రభాకరన్ వాదనలు వినిపిస్తూ తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. అలాగే విగ్రహం తొలగింపు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తీర్పుపై స్టే విధించేందుకు, ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్లు న్యాయమూర్తులు సతీష్‌కుమార్, అగ్రిహోత్రి, కేకే శచీంద్రన్ పేర్కొన్నారు. విగ్రహ తరలింపు అభ్యంతర పిటిషన్‌ను సాధారణ కేసుగా కొనసాగించుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా శివాజీ గణేశన్ కుమారులు రామ్‌కుమార్, ప్రభు శుక్రవారం తమ స్పందనను తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది అభిమానులు కలిగిన తమ తండ్రి విగ్రహం తరలింపుపై ప్రభుత్వం తగిన నిర్ణయాన్ని తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహం విషయంలో అభిమానులు ఆందోళనలు చేయవద్దని వారు కోరారు. శివాజీ గణేశన్ విగ్రహ వివాదం వెనుక అధికార పార్టీ దురుద్దేశం దాగి ఉందని డీఎంకే కోశాధికారి స్టాలిన్ వ్యాఖ్యానించారు. శివాజీ విగ్రహాన్ని కరుణానిధి ప్రారంభించినందునే దాన్ని తొలగింపు కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర మంత్రి జీకే వాసన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లుగా అభిమానులను అలరిస్తున్న శివాజీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం లేదన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. -
అపురూపం: చెక్కు చెదరని జ్ఞాపకాల మందిరం
తాజ్‌మహల్! ప్రపంచ వింతల్లో ఒకటి! ఒక భర్త తన భార్య గుర్తుగా ఇంత భారీగా కట్టించిన మహల్ భువిపై ఇంకొకటి లేదు! మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు భార్య ముంతాజ్ అంటే ఎంతో ప్రేమ! ఆమె 1631లో పరమపదించారు. ఆమె గుర్తుగా తాజ్‌మహల్‌ని కట్టారు షాజహాన్! ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో... యమునా నదీ తీరాన... పూర్తిగా పాలరాయితో... వెయ్యి ఏనుగుల సాయంతో... ఇరవై వేల మంది కార్మికులు ఇరవై రెండేళ్ల పాటు శ్రమించి నిర్మించిన అతిగొప్ప కట్టడమిది! కట్టి శతాబ్దాలు అవుతోంది. అయినా దాని వన్నె తగ్గలేదు. కనీసం ఒక్కసారైనా ఆ మహాకట్టడాన్ని చూడాలని ఉబలాటపడేవారే అందరూ! సినీ తారలూ దీనికి మినహాయింపు కాదు! నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించుకున్నప్పటి ఫొటోని పైన చూడవచ్చు! అలాగే ఢిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మహానటి సావిత్రి, ప్రఖ్యాత నటుడు శివాజీ గణేశన్, వారి అర్థాంగి కమలా గణేశన్ ప్రత్యేకంగా ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ని దర్శించుకున్నప్పటి స్టిల్ కూడా. అలాగే నేటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తన శ్రీమతి లక్ష్మితో కలిసి తాజ్‌మహల్ ముందు తీపిగుర్తుగా తీయించుకున్న స్టిల్. అమెరికా అధ్యక్షుడైనా అతి సామాన్యుడైనా తాజ్‌మహల్ అందాలకు ముగ్ధుడవ్వాల్సిందే. ఆ నిర్మాణానికి ఆశ్చర్యపోవాల్సిందే. దాని ముందు ఫొటో దిగాల్సిందే! ఎందుకంటే... తాజ్‌మహల్ వంటి దృశ్యకావ్యం మరొకటి లేదు గనుక! వేరొకటి సాటి రాదు గనుక!! ఇంకొకటి కట్టలేరు గనుక!!! - సంజయ్ కిషోర్ -
చిత్రపతి