ఆరనీకుమా.. ఈ దీపం కార్తీకదీపం.. అనే పాటతో తెలుగిం టి ఆడపడుచుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ సినీనటి శ్రీదేవికి నాగార్జునసాగర్‌తో ప్రత్యేకానుబంధం ఉం ది. 1979లో ఆమె నటించిన కా ర్తీకదీపం సినిమాలోని ప్రేక్షకాదరణ పొందిన పాటతో పాటు కొన్ని సన్నివేశాలను జలాశయ తీరంలో చిత్రీకరించారు.
నాగార్జునసాగర్ : సినీనటి శ్రీదేవికి ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1979లో విడుదలైన కార్తీకదీపం సినీమాలో ఒకపాటను సాగర్ జలాశయతీరంలో చిత్రీకరించారు. ఈ పాటతోనే ఆ సినిమా హిట్టయ్యింది. ‘ఆరానీకుమా ఈదీపం కార్తీకదీపం’ అనే పాటను శోభన్‌బాబు, శారదతోపాటు శ్రీదేవితో కలిసి జలాశయంలో దీపాలు వదిలే దృశ్యాలను చిత్రీకరించారు.
శోభన్‌బాబు, శ్రీదేవిపై ‘చిలుకమ్మ పలికింది.. చిగురాకు కులికింది’ అనే పాటను విజయవిహార్, ఎత్తిపోతల ప్రాంతంలో చిత్రీకరించారు. శివాజీ గణేశన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ఆధారంగా డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి రచనతో తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. శోభన్‌బాబు, శ్రీదేవి, శారద చక్కని నటనతో.. ఈ చిత్రం విజయవంతమయ్యింది. ప్రస్తుతం శ్రీదేవి మరణవార్త విన్న సాగర్‌వాసులు ఆనాడు ఈ ప్రాంతంలో తీసిన చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment