స్టైలిష్ లుక్‌లో ఒకప్పటి టాలీవుడ్ హీరో.. గుర్తుపట్టండి చూద్దాం? | Tollywood Actor Shoban Babu AI Video Viral | Sakshi
Sakshi News home page

Guess The Actor: ఏఐ మాయ.. దిగ్గజ హీరో లుక్ అదిరిపోయిందంతే!

Published Wed, Jan 10 2024 2:51 PM | Last Updated on Wed, Jan 10 2024 3:03 PM

Tollywood Actor Shoban Babu AI Video Viral - Sakshi

టాలీవుడ్‌లో చాలామంది హీరోలున్నారు. వాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అయితే అందగాడు అనే మాట వస్తే మాత్రం దాదాపు ప్రతిఒక్కరూ చెప్పేమాట ఒక్కరి పేరు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ.. సినిమాల రూపంలో ఆయన సజీవంగా ఉండిపోయారు. ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నేపథ్యంలో ఆయన వీడియో ఒకటి వైరల్ అయిపోయింది. మరి ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు)

పైన ఫొటోలో, దిగువన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శోభన్ బాబు. అవును తెలుగు సినిమాల్లో అందగాడు అనగానే గుర్తొచ్చేది ఈయనే. 1959లో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈయన 1996 వరకు దాదాపు 230కి పైగా సినిమాల్లో హీరోగా, నటుడిగా చాలా అంటే చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. సోగ్గాడు, దేవత లాంటి సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. 

ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో సరికొత్త వీడియోలు, ఫొటోలు రీక్రియేట్ చేస్తున్నారు. అలా కొందరు శోభన్ బాబుని ఈ సాంకేతిక ఉపయోగించి పలు వీడియోలు క్రియేట్ చేశారు. బీచ్ ఒడ్డున సిక్స్ ప్యాక్‪‌తో నడిచొస్తున్న వీడియోని తాజాగా ఆర్జీవీ ట్వీట్ చేయగా ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. మరో వీడియోలో సూట్ వేసుకున్న లుక్ అయితే కేక పుట్టిస్తోంది. 

(ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement