Sukhbir singh
-
సుఖ్బీర్కు ఈసారి గట్టి పోటినే..
జలాలాబాద్: పంజాబ్‌లో శిరోమణి అకాళీదల్ పార్టీ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు గట్టి పోటీ ఎదురవనుంది. ఆయన పోటీ చేస్తున్న స్థానంలోనే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న సిట్టింగ్ ఎంపీ భగవంత్ మన్, కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు కూడా ఇదే సీటుకోసం బరిలోకి దిగడంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. ఈ ముగ్గురు కూడా కీలక నేతలే. ముఖ్యంగా బిట్టు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బీంత్ సింగ్ మనవడు కాగా, పంజాబ్ రాజకీయాల్లో భగవత్ మన్కి గొప్పముద్ర ఉంది. మరోపక్క, సుఖ్బీర్ కూడా చాలా టఫ్ కాంపిటేషన్ ఇచ్చే వ్యక్తే. అయినప్పటికీ ఈసారి మాత్రం ఆయనే కఠిన పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సుఖ్బీర్ 53,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. -
'ఆ సీఎం ఓ డంప్‌యార్డ్.. అన్ని పార్టీల చెత్త అక్కడికే'
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీపై పంజాబ్ లోని శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆప్ ఇతర పార్టీల్లోని చెత్తను(ఇతర పార్టీలకు చెందిన విఫల నాయకులను) ఏరుకుంటుందని వ్యంగ్యంగా విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీని విస్తరించుకునేందుకు పంజాబ్‌నే క్షేత్రంగా ఎంచుకుందని ఆరోపించారు. 'ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం చెత్తను మాత్రమే నిర్వహిస్తోంది. అది అన్ని పార్టీల్లోని చెత్తను ఏరుకుంటోంది. అన్ని పార్టీల చెత్త కూడా కేజ్రీవాల్ డంప్ యార్డ్‌లోకి వచ్చి పడుతున్నాయి' అంటూ ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. కేజ్రీవాల్ ఒక ఆందోళనకారుడు మాత్రమే. ఆయన ఆయన ఆలోచన స్థాయిని మెరుగుపరుచుకోలేదు. ఢిల్లీలో ఆయన అంతగా చేసేందేమీ లేదు. ఆయన దగ్గర ఏ పోర్ట్‌ఫోలియో లేదు.. ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. కేవలం పంజాబ్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాడు. కేజ్రీవాల్ ఒక మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు మాత్రమే. అంతకుమించి ఏమీ లేదు. ఆయన పంజాబ్ కు రావడం ద్వారా దేశ నేతగా మారి మోదీపై పోరాడాలని అనుకుంటున్నారు' అని ఆయన అన్నారు. గోల్డెన్ టెంపుల్ అంటే తెలియని కేజ్రీవాల్‌ను పంజాబ్ ప్రజలు తరిమి కొడతారని జోస్యం చెప్పారు. పంజాబ్ గురించి కేజ్రీవాల్ కు సరిగా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఐబీఎం మహిళా ఉద్యోగిని హత్యకేసులో వ్యక్తి అరెస్ట్
బెంగళూరు : బెంగళూరులో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన మహిళా సాప్ట్వేర్ ఇంజినీర్ కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే పంజాబ్ కు చెందిన కుసుమా రాణి సింగ్లా (31) బెంగళూరు ఐబీఎంలో ఉద్యోగం చేస్తోంది. ఆరు నెలల క్రితం ఆమె ఇక్కడకు బదిలీపై వచ్చింది. కాడుగోడిలోని మహావీర్ కింగ్స్ ప్లేస్ అపార్ట్మెంట్లో తన స్నేహితురాలు నిధి శర్మతో కలిసి ఉంటోంది. కాగా మంగళవారం కుసుమ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. లాప్టాప్ వైర్ ఛార్జర్‌తో ఆమె గొంతు బిగించి దుండగులు హతమార్చారు. నిధి శర్మ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి యాహూ మాజీ ఉద్యోగి సుఖ్బీర్ సింగ్‌ను పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన కుసుమ్, సుఖ్బీర్ సింగ్... సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే కుసుమ్ వద్ద పలుమార్లు డబ్బులు తీసుకున్న అతడు మోసం చేసినట్లు తెలుస్తోంది. వీరి మధ్య గొడవలు జరగడంతో సుఖ్బీర్ సింగ్‌పై కొద్దిరోజుల క్రితం కుసుమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే సుఖ్బీర్ ...కుసుమ్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది. -
సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు
స్థలాన్ని పరిశీలించిన కేంద్ర కమిటీ సభ్యులు బుక్కరాయసముద్రం : జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు న్యూఢిల్లీ కేంద్ర మంత్రిత్వ శాఖ హెఆర్డీ జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి సుఖ్బీర్ సింగ్ తెలిపారు. జిల్లాలో సెంట్రల్ యూనివ ర్సిటీ నిర్మాణం కోసం మండల పరిధిలోని జంతులూరు గ్రామంలో స్థల పరిశీలన కోసం సెంట్రల్ కమిటీ సభ్యులు మంగళవారం పర్యటించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్ఆర్డీ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి సుఖ్బీర్ సింగ్ సాధు నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్ ఖండూరీ, రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్రాదారా, హైదరాబాద్ యూనివర్సిటీ వీసీ హరిబాబు ఈ కమిటీలో ఉన్నారు. రాష్ట్ర సమాచార శాఖ, ఐటీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, కలెక్టర్ కోన శశిధర్ హాజరయ్యారు. ముందుగా జంతులూరు గ్రామంలోని ఓపన్ ఎయిర్ జైలుకు సంబంధించిన 500 ఎకరాల పొలాన్ని తొలుత ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ పొలం చుట్టూ ఉన్న వనరులను మంత్రి, ప్రభుత్వ విప్, కలెక్టర్ వారికి వివరించారు. అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం ఉందని, అనంతపురం-తాడిపత్రి నాలుగు లైన్ల రహదారి పక్కనే ఈ భూమి ఉందని తెలిపారు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 160 కిలోమీటర్ల దూరం, జంతులూరు గ్రామానికి 10 కిలోమీటర్లు దూరంలో నేషనల్ హైవే-44 ఉందని కమిటీ సభ్యులకు వివరించారు. గ్రామ సమీపంలో తుంగభద్ర ఎగువ కాలువ , పీఏబీఆర్, మిడ్ పెన్నార్ డ్యాంలు ఉన్నాయన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి మొదటి దశ పూర్తి చేసుకుని రెండో దశ నిర్మాణం పూరోగతిలో ఉందని, వీటి ద్వారా నీటి కొరత ఉండదని అన్నారు. జిల్లా కేంద్రం 6 కిలోమీటర్ల దూరంలో యూనివర్సిటీలు, సర్వ జన వైద్యశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్టీయూ, ఎస్కే యూనివర్సిటీ, అనేక ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయని వారు కమిటీకి వివరించారు. భవిష్యత్తులో అనంతపురంలో విమానాశ్రమం కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జంతులూరు అన్ని విధాలా ఎంతో అనుకూలమని వారు తెలిపారు. కమిటీ వెంట ఆర్డీఓ హుసేన్ సాహెబ్, జెడ్పీటీసీ రామలింగారెడ్డి, తహశీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
16 స్థానాల్లో సాద్ (బాదల్) పోటీ
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాలనుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు శిరోమణి అకాలీదళ్ ఢిల్లీ శాఖ ప్రకటించింది. అయితే తుదినిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ శాఖ ఒక తీర్మానం చేసి పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు పంపింది. ఢిల్లీలో తమకు పట్టున్న 16 స్థానాల్లో సొంతంగా పోటీచేయాలని పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని మంగళవారం సాద్ ఢిల్లీ అధ్యక్షుడు మంజిత్ సింగ్ తెలిపారు. అయితే బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామన్నారు. సాద్ గతంలో ఢిల్లీలో బీజేపీతో పొత్తులో నాలుగు స్థానాలకు పోటీపడింది కాని అన్నింటా ఓటమి పాలైన విషయం తెలిసిందే.