Sumera
-
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే..
వనపర్తి: పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి పిల్లలు, పెద్దలందరితో ఇంటి నుంచి బయల్దేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట శివారులో చోటుచేసుకుంది. అతివేగం, కునికి పాటు ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవింగ్ చేసిన పెళ్లి కుమారుడు ఖాజాకుత్బుద్దీన్ మాట్లాడుతూ బళ్లారిలోని బసవన్నకుంట నుంచి బయల్దేరిన తాము కర్నూలు పట్టణం దాటిన తర్వాత అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఒక హోటల్ వద్ద కుటుంబ సభ్యులంతా భోజనం చేశామని చెప్పారు. అప్పుడే రైలులో వెళ్తున్న వారు కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారు.. నిద్ర వస్తే.. హైవేపై ఉన్న పెట్రోల్ పంపులో ఆగి కొద్దిసేపు నిద్రించి తెల్లవారుజామున బయల్దేరాలని సూచన చేశారు. కానీ, ఆలస్యం అవుతుందని భావించి భోజనం తర్వాత మళ్లీ బయల్దేరామని, కునికిపాటు రావడంతో కారు పక్కకు వెళ్లినట్లు గుర్తించలేదని, ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు చెట్టును ఢీకొట్టడం, కారులోని అందరం చెల్లాచెదురుగా పడిపోవడంతో మేలుకువ వచ్చిందని వాపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించినవనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి ఇది మూడో ఘటన.. 2009లో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే మిత్రులు ప్రమాణ స్వీకారం చూడాలనే ఉద్దేశంతో మారుతీ వ్యాన్లో హైదరాబాద్కు వెళ్తుండగా.. తెల్లవారుజామున వాహనం అదుపు తప్పడంతో చోటుచేసుకున్న సంఘటనలో నలుగురు మృతి చెందారు. ● 2020లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా క్లూజర్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదంతో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. ● తాజాగా ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జాగ్రత్తలు పాటించాలి అర్ధరాత్రి ప్రయాణాల విషయంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని వనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి అన్నారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసే అనుభవం లేనివారు వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రించడం, అతివేగంగా కారు నడపడమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. మృతుల్లో 95 ఏళ్ల వృద్ధురాలు.. ఏడు నెలల పసికందు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో 95 ఏళ్ల సలీమాబీ, 7 నెలల పసికందు వాసీఫారిఫత్ అనే చిన్నారితోపాటు 39 ఏళ్ల అబ్దుల్ రహమన్, రెండేళ్ల రుమానా, నాలుగేళ్ల రోషిణి ఉన్నారు. మరో ఆరేళ్ల చిన్నారి సుమేర ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం గమనార్హం. -
ఫోన్లో మాట్లాడినందుకు చెల్లిని చంపాడు
కరాచి: ఇస్లాం మత రాజ్యమైన పాకిస్తాన్లో 'మర్యాద హత్యలు' (హానర్ కిల్లింగ్స్)' ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. కుల కట్టుబాటును తప్పినందుకో, పరాయి పురుషిడితో ప్రేమాయణం సాగిస్తూ దొరికిపోయినందుకో కాకుండా కేవలం పరులతో మాట్లాడినందుకు ఓ అన్న చెల్లిని వంటింటి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన కరాచి సమీపంలోని ఒరాంగి పట్టణంలో బుధవారం జరిగింది. హయత్ ఖాన్ అనే 20 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. సీనియర్ పోలీసు అధికారి అజ్ఫర్ మహేశర్ కథనం ప్రకారం సుమైరా అనే 16 ఏళ్ల యువతి ఇంటి ముందు మెట్ల వద్ద నిలబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ హయత్ ఖాన్కు కనిపించింది. ఎవరితో మాట్లాడుతున్నావంటూ ఇంట్లో నుంచి విసురుగా వచ్చిన హయత్ ఖాన్ చెల్లిని ప్రశ్నించాడు. 'నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు?' అని సుమైరా ఎదురు ప్రశ్నించింది. అంతమాటకే ఆగ్రహోదగ్రుడైన అన్న హయత్ వంటింట్లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చి చెల్లిని పొడిచేసి గుమ్మం ముందుకు తోసేశాడు. బాటసారులు సుమైరాను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. జరిగిందేదో జరిగిపోయింది. నేను నా కొడుకును క్షమించేశాను' అని ఆ పిల్లల తండ్రి ఇనాయత్ ఖాన్ ఇంటికి దర్యాప్తునకు వచ్చిన పోలీసులకు చెప్పాడు. ఇలా చెప్పడం 2005 వరకు పాకిస్తాన్లో చెల్లుబాటు అవుతూ వచ్చింది. అంటే, ఇంతటి ఘోరాన్ని కూడా ఇంటి పెద్దలు క్షమించేస్తే నేరస్థుడికి ఎలాంటి శిక్ష ఉండేది కాదు. కనీసం విచారణ కూడా చేసేవారు కాదు. 2005లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇలాంటి కేసుల్లో పోలీసులే ప్రభుత్వం తరపున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలా చేసినంత మాత్రానా నేరస్థుడికి శిక్ష పడుతుందన్న గ్యారెంటీ లేదు. ఓ కేసులో తండ్రి లేదా కుటుంబ సభ్యులు నేరస్థుడిని క్షమించేస్తే నేరస్థుడిని శిక్షించాలా, వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందీ కోర్టు జడ్జీనే. జడ్జీ తలచుకుంటే నేరస్థుడిని వదిలేయవచ్చు. దేశంలో మర్యాద హత్యలను సమూలంగా నిర్మూలిస్తానని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఎన్నోసార్లు శపథం చేశారు. నేరస్థులకు క్షమాభిక్ష చట్టాన్ని కూడా ఇంతవరకు మార్చలేక పోతున్నారు. 'నేను కావాలని చంపలేదు. పొడిచి బెదిరిద్దామని అనుకున్నాను. చనిపోయింది. నేను కూడా చావాలని కోరుకుంటున్నాను' అని చెల్లిని చంపిన అన్న హయత్ జైలు నుంచి మీడియాతో వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్లో కాకుండా పరులతో మాట్లాడం ఇప్పటికీ మగవాళ్లకు మింగుడుపడని సమస్యే.