Sundar Raman
-
సెన్సెక్స్ డెరివేటివ్స్‌పై బీఎస్ఈ దృష్టి
కోల్‌కతా: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈ తిరిగి సెన్సెక్స్–30 డెరివేటివ్స్‌ను ప్రారంభించే యోచనలో ఉంది. సభ్యుల నుంచి ఇందుకు అవసరమైన సూచనలు, వివరాలను సేకరిస్తున్నట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి వెల్లడించారు. ప్రధాన ఇండెక్స్ సెన్సెక్స్‌లో భాగమైన 30 షేర్లలో ఆప్షన్స్, ఫ్యూచర్స్(డెరివేటివ్స్)ను 2000లో బీఎస్ఈ ప్రవేశపెట్టింది. అయితే ప్రత్యర్థి ఎక్సే్ఛంజీ ఎన్ఎస్ఈలో భాగమైన నిఫ్టీ–50 డెరివేటివ్స్తో పోలిస్తే ఇన్వెస్టర్ల నుంచి తగిన ఆసక్తిని సాధించలేకపోయింది. దీంతో మరోసారి సెన్సెక్స్–30 డెరివేటివ్స్ ప్రొడక్టులను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు రామమూర్తి తెలియజేశారు. దీనిలో భాగంగా మార్కెట్ పార్టిసిపెంట్ల ద్వారా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసో చామ్ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా రామమూర్తి సెన్సెక్స్ దిగ్గజాలలో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను ప్రవేశపెట్టడంపై వివరాలు వెల్లడించారు. వెరసి ఎఫ్‌అండ్‌వో విభాగం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలో మెరుగుపరచవలసిన అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. బీఎస్ఈలో అత్య ధికంగా ట్రేడయ్యే 30 బ్లూచిప్ కంపెనీలు సెన్సెక్స్‌లో భాగమయ్యే సంగతి తెలిసిందే. వీటిలో డెరివేటివ్స్‌ను పునఃప్రారంభించే సన్నాహాల్లో ఉన్న ట్లు రామమూర్తి పేర్కొన్నారు. నిఫ్టీ–50తో పోలిస్తే సెన్సెక్స్–30 డెరివేటివ్స్ కొంత విభిన్నంగా ఉండనున్నట్లు సూ చించారు. ఒకే విధమైన రెండు విభిన్న ప్రొడక్టులు అందుబాటులో ఉన్నపుడు వివిధ ట్రేడింగ్ వ్యూ హాలు, ఇంటర్‌ప్లే ద్వారా మార్కెట్లు మరింత వృద్ధి చెందేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
రిలయన్స్ స్పోర్ట్స్ సీఓఓగా సుందర్
ముంబై: ఈనెల తొలి వారంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కార్యనిర్వాహణాధికారి (సీఓఓ)పదవికి రాజీనామా చేసిన సుందర్ రామన్.. తాజాగా రిలయన్స్ ఇండస్ట్టీస్ స్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(రిల్) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పలు రకాలైన క్రీడా వ్యాపారాల్లో కీలకంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ అభివృద్ధిలో భాగంగా సుందర్ రామన్ ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్లు పేర్కొంది. 'రిలయన్స్ స్పోర్ట్స్ సీఓఓగా సుందర్ ను నియమించాం. ఇప్పటికే భారత్ లో స్పోర్ట్స్ పెట్టుబడుల్లో ముందు వరుసలో ఉన్న మాకు సుందర్ సేవలు ఉపయోగపడగలవు. రిలయన్స్ స్పోర్ట్స్ ద్వారా మరింత విస్తరించాలనుకుంటున్న మాకు సుందర్ అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. త్వరలో ఆయన రిలయన్స్ స్పోర్ట్స్ సీఓఓగా బాధ్యతలు తీసుకుంటారు' అని రిల్ పేర్కొంది. తనను రిలయన్స్ స్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమించడం పట్ల చాలా ఆనందంగా ఉందని సుందర్ రామన్ తెలిపాడు. తన ముందున్నది కీలకమైన సవాల్ గా భావించి రిలయన్స్ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని పేర్కొన్నాడు. -
ఐపీఎల్ సీఓఓ ...అంతకు మించి
‘క్రికెట్‌కు భారత్ నుంచే అధిక ఆదాయం వస్తున్నప్పుడు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిధుల వాటా విషయంలో అందరితో సమానంగా ఎందుకు ఉండాలి? కాబట్టి... భారత్‌కు ఎక్కువ వాటా ఇవ్వాలి. ఇది ఇష్టం లేకపోతే చెప్పండి... ఐసీసీ నుంచి బీసీసీఐ బయటకు వెళ్లి సొంతంగా క్రికెట్ నిర్వహించుకుంటుంది’... ఏడాదిన్నర క్రితం ప్రపంచ క్రికెట్‌ను వణికించిన స్టేట్మెంట్ ఇది. అంతకాలం మిగిలిన దేశాలతో పాటు సమానంగా ‘చిల్లర’ తీసుకున్న బీసీసీఐ... ఈ ఏడాది నుంచి ఐసీసీ వాటాలో అధిక మొత్తాన్ని సంపాదించడానికి కారణం ఆ స్టేట్మెంట్. దీనిని రూపొందించిన వ్యక్తి సుందర్ రామన్. ఐపీఎల్ సీఓఓగానే ఆయన ప్రపంచానికి తెలుసు. కానీ గత ఎనిమిదేళ్లలో సుందర్ రామన్ ఓ శక్తిగా ఎదిగారు. ముఖ్యంగా గత మూడేళ్లుగా ఆయన భారత క్రికెట్‌ను శాసిస్తున్నారు. శ్రీనివాసన్ సన్నిహితుడిగా పేరున్న రామన్ అనుమతి లేనిదే బీసీసీఐలో ఒక్క ఫైల్ కూడా కదల్లేదు. కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎవరినైనా తొలగించాలన్నా... బోర్డుకు సంబంధించి ఏ మార్పు జరగాలన్నా సుందర్ రామన్ అనుమతి ఉండాల్సిందే. అంత బలంగా ఎదిగాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? 2004లో సుందర్ రామన్ ‘మీడియా ప్లానర్’ అనే రోల్‌తో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2004లో ఈఎస్‌పీఎన్‌లో చేరి కామెంటేటర్స్ కోసం టాలెంట్ హంట్ నిర్వహించగా, ఆ కార్యక్రమంలో విఫలమయ్యారు. ఆ తర్వాత ‘మైండ్షేర్’ అనే గ్లోబల్ మీడియా ఏజెన్సీలో చేరారు. ఆ సమయంలోనే లలిత్ మోడీకి దగ్గరయ్యారు. 2007లో ఐపీఎల్ ఆలోచన రాగానే లలిత్ మోడీ తొలుత కలిసింది సుందర్ రామన్నే. ఈ ఇద్దరూ భారత్‌లో టి20 లీగ్ ద్వారా ప్రపంచ క్రికెట్ రాతను మార్చారు. బీసీసీఐపై కాసుల వర్షం కురిపించారు. ఆ తర్వాత మోడీని లీగ్ నుంచి బయటకు పంపినా... రామన్‌ను మాత్రం ఎవరూ కదిలించలేకపోయారు. ఇదే సమయంలో రామన్... శ్రీనివాసన్‌కు సన్నిహితంగా మారారు. గత మూడు సంవత్సరాలుగా బీసీసీఐలో రామన్ చెప్పిందే వేదం. ఇదే సమయంలో శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఎంపిక కావడంతో రామన్ అక్కడకూ వెళ్లారు. అన్ని ఐసీసీ సమావేశాల్లో ఆయన శ్రీనివాసన్‌కు ‘షాడో’ అనే పేరు కూడా వచ్చింది. తన తెలివితేటలతో, లెక్కలతో రామన్ బీసీసీఐ ఆదాయాన్ని గణనీయంగా పెంచారు. స్పాట్ ఫిక్సింగ్ వివాదం 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసు సమయంలో సుందర్ రామన్ పేరు కూడా వినిపించింది. ఆ సీజన్లో రామన్ ఒక బుకీతో ఎనిమిది సార్లు మాట్లాడాడని ముద్గల్ కమిటీ పేర్కొంది. తాను ఒక వ్యక్తితో మాట్లాడిన మాట వాస్తవమే అని, అయితే అతను బుకీ అనే విషయం తనకు తెలియదని ముద్గల్ కమిటీ ముందు రామన్ చెప్పారు. అలాగే గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని తెలిసినా ఐపీఎల్ సీఓఓ హోదాలో ఉండి కూడా ఆయన చర్యలు తీసుకోలేదని కమిటీ పేర్కొంది. ఆ తర్వాత లోధా కమిటీ కూడా రామన్‌ను తప్పు పట్టింది. ఈ నెల 15న లోధా కమిటీ ముందు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే... నిజానికి 2013లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం సమయంలోనే రామన్ రాజీనామా చేయాల్సింది. కానీ అప్పుడు అంతా శ్రీనివాసన్ హవా. కాబట్టి ఐపీఎల్ కౌన్సిల్ కూడా రామన్‌ను సమర్థించింది. అయితే ఇటీవల కాలంలో మారిన సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. శశాంక్ మనోహర్ బీసీసీఐ అధ్యక్షుడు కాగానే అడిగిన తొలి ప్రశ్న... ‘రామన్ ఎందుకు కొనసాగుతున్నాడు’ అని. అక్టోబరు 31లోగా రాజీనామా చేయకపోతే... నవంబరు 9న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో తొలగిస్తామని శశాంక్ నేరుగా రామన్‌కు చెప్పేశారు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక తప్పుకున్నారు. ఇక ఈ కేసు విషయానికొస్తే... ఐపీఎల్ సీఓఓగా అనేక మంది వ్యక్తులను కలవడం తన బాధ్యతల్లో భాగమని, తాను కలిసిన వారిలో బుకీ ఉన్నాడనే విషయం తనకు తెలియదని రామన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శశాంక్ అండ్ కో... బోర్డులోని శ్రీనివాసన్ సన్నిహితులందరినీ బయటకు పంపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే సుందర్ రామన్ రాజీనామా. అయితే భారత క్రికెట్ ఆదాయం పెరుగుదలలో సుందర్ రామన్ పాత్ర మాత్రం ఎప్పటికీ బోర్డు చరిత్రలో ఉంటుంది. -సాక్షి క్రీడావిభాగం -
రామన్ రాజీనామా
బీసీసీఐ ఆమోదం ఐపీఎల్ సీఓఓగా ఎనిమిదేళ్లు సేవలు ముంబై: భారత క్రికెట్లో మరో పెను మార్పు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి దాని ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఓఓ)గా పని చేసిన సుందర్ రామన్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం నాగ్‌పూర్ వెళ్లి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు రాజీనామా పత్రం అందించారు. దీనిని వెంటనే ఆమోదిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘సుందర్ తన రాజీనామాను శశాంక్‌కు అందించారు. దీనిని బీసీసీఐ ఆమోదించింది. ఐపీఎల్ కోసం రామన్ సర్వశక్తులూ ఒడ్డి కష్టపడ్డారు. ఇందుకు ఆయనను అభినందిస్తున్నాం’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. అయితే రామన్ రాజీనామా విషయంలో ఎవరి బలవంతం లేదని అన్నారు. ‘రామన్‌కు వ్యతిరేకంగా ఎక్కడా ఎలాంటి నివేదికలు లేవు. బహుశా తన మనసులో వేరే ఆలోచన ఉండి ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి తప్పుకోవాలని అనుకున్నారు’ అని శుక్లా అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రామన్ హస్తం ఉందని తేల్చిన జస్టిస్ ముద్గల్ కూడా రాజీనామా సరైన నిర్ణయమని అన్నారు. ‘రెండేళ్ల క్రితం నివేదికలో ఆయన పేరు వచ్చినప్పుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేది. అయితే వ్యక్తిగత నిర్ణయాలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. ఏమైనా రామన్ రాజీనామా చేయడం మంచి పరిణామం’ అని ముద్గల్ అన్నారు. -
సుందర్ రామన్ ఉద్యోగి మాత్రమే: బీసీసీఐ
న్యూఢిల్లీ: వివాదాస్పద ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర్ రామన్ బీసీసీఐలో కేవలం ఉద్యోగి మాత్రమేనని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు లేదని చెప్పారు. ‘ప్రస్తుతానికి రామన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు రాలేదు. మేం బాధ్యతలు తీసుకునే నాటికి ఆయనతో పాటు చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై విచారణ జరుగుతోంది. కాబట్టి లోధా కమిటీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం. అది వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి దాన్ని అమలు చేస్తాం. తొందరపడి అతనికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదల్చుకోలేదు. రామన్ కేవలం ఉద్యోగి మాత్రమే. నిర్ణయాలు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకుంటుంది. సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు అమలు మాత్రమే చేస్తారు’ అని ఠాకూర్ పేర్కొన్నారు. వర్కింగ్ గ్రూప్ నివేదిక వచ్చే వరకు చెన్నై, రాజస్తాన్ ఫ్రాంచైజీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఠాకూర్ పునరుద్ఘాటించారు.