Sunni
-
పాక్‌లో తెగల వైరం.. 130 మంది మృత్యువాత
పెషావర్: పాకిస్తాన్‌లోని కల్లోలిత ఖైబర్ ప్రావిన్స్‌లో రెండు తెగల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో కనీసం 130 మంది ప్రాణాలు కోల్పోయారు. కుర్రం జిల్లాలోని అలిజాయ్, బగాన్ తెగల మధ్య నవంబర్ 22వ తేదీన ఘర్షణలు మొదలయ్యాయి. అంతకుముందు రోజు, జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్లపై దాడులు జరిపి 57 మంది చంపేయడంపై ఈ ఘర్షణలకు ఆజ్యం పోసింది. సున్నీ, షియా గ్రూపుల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పోలీసులు అంటున్నారు. ఆదివారం జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 130కి, క్షతగాత్రుల సంఖ్య 186కు చేరిందన్నారు. దీంతో, ప్రభుత్వం విద్యా సంస్థలను మూసివేసింది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను ఆపేసింది. పెషావర్–పరాచినార్ రహదారిని, పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖర్లాచి పాయింట్ వద్ద రాకపోకలను నిలిపివేసింది. దీంతో, చమురు, నిత్యావసరాలు, మందులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఖైబర్ ప్రభుత్వ యంత్రాంగం అంటోంది. -
పాకిస్తాన్ : 100 దాటిన ఘర్షణ మృతుల సంఖ్య
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో షియా - సున్నీల మధ్య జరిగిన ఘర్షణల్లో మరణాల సంఖ్య 100కు చేరింది. గత వారం పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో షియా- సున్నీల మధ్య ఘర్షణ జరిగింది.జిల్లాలోని పరాచినార్ ప్రాంతంలో 200 మంది షియా వర్గానికి చెందిన ప్రయాణికులు వెళ్తున్న వాహనాలపై మెరుపుదాడి జరిగింది. అగంతకులు జరిపిన కాల్పుల్లో భారీ ప్రాణనష్టం సంభవించిందని స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నాటి నుంచి షియా - సున్నీ వర్గాల మధ్య మొదలైన ఘర్షణ తారాస్థాయికి చేరింది. వాహనాలపై జరిగిన దాడి తర్వాత అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారు. అయితే, కాల్పుల విరమణ సమయంలో చెదురు మదురు ఘర్షణలు చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య 100కి పైగా దాటిందని కుర్రం జిల్లా డిప్యూటీ కమిషనర్ జావేదుల్లా మెహసూద్ మీడియాకు తెలిపారు. -
పాక్‌లో షియా, సున్నీ పోరు.. 25 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో గల కుర్రం జిల్లాలో గత వారం చివర్లో ప్రారంభమైన ఈ ఘర్షణలు కొంతమేరకు తగ్గాయి. ఈ ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన 25 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.కుర్రం ప్రాంతం ఇటీవలి కాలంలో మత హింసకు కేంద్రంగా నిలిచింది. ఇక్కడ తలెత్తిన భూవివాదం హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడి గిరిజన పెద్దల సహాయంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ప్రావిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి బారిస్టర్ సైఫ్ అలీ తెలిపారు. కుర్రంలో శాంతి చర్చల అనంతరం ఇకపై ఎలాంటి హింసాకాండకు పాల్పడకుండా ఉండేందుకు ఇరువర్గాలు అంగీకరించాయన్నారు.సున్నీ ఆధిపత్య పాకిస్తాన్ జనాభాలో 15 శాతం మంది షియా ముస్లింలున్నారు. చాలా కాలంగా ఈ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. షియా వర్గం ఆధిపత్యం ఉన్న కుర్రం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఇరు వర్గాల మధ్య మధ్య ఉద్రిక్తతలున్నాయి. ఈ ఏడాది జూలైలో జరిగిన భూ వివాద ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు మృతిచెందారు.కాగా కుర్రం జిల్లాలో హింసను ముగించేందుకు శాంతి ఒప్పందంపై ఇరు వర్గాల పెద్దలు సంతకం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రభుత్వానికి సహకరించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందాన్ని ఏ వర్గమైనా ఉల్లంఘించిన పక్షంలో వారు రూ.12 కోట్ల మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు -
నలుగురి కథ
‘‘4 ఇడియట్స్’ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటించారు. ఇప్పటి పరిస్థితుల్లో చిన్న సినిమాల విడుదల చాలా కష్టం. వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు థియేటర్‌కి రావటం లేదు. అది చాలా బాధగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి ప్రధాన పాత్రల్లో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై సతీష్ కుమార్ శ్రీరంగం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘4 ఇడియట్స్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ విడుదల చేశారు. సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నేను ఇప్పటివరకు చేసిన 14 చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘4 ఇడియట్స్’ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. గతంలో ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య ఉంటే దాసరి నారాయణరావుగారు ఉండేవారు. ఇప్పుడు సి.కల్యాణ్‌గారు ఉన్నారు. సెప్టెంబర్‌లో మా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాతలు తుమ్ములపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య, కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్. -
'ఆయుధాలు పట్టి పోరాడండి..'
కర్పాలా(ఇరాక్): దేశంపై దాడులకు తెగపడుతున్న ఉగ్రవాదులపై ఆయుధాలు చేపట్టి పోరాడాలని షియాల మతపెద్ద గ్రాండ్ అయాతుల్లా ఆలీ అల్ సిస్తానీ పిలుపునిచ్చారు. పవిత్ర స్థలాలను, ప్రజలను, దేశాన్ని కాపాడుకునేందుకు పౌరులు ఆయుధాలు పట్టుకుని ఉగ్రవాదులపై తిరగపడాలని మత పెద్దలు పిలుపునిస్తున్నారు. ధర్మం కోసం యుద్దం చేస్తున్న భద్రత దళాలకు స్వచ్చందంగా మద్దతు తెలుపాలని కర్బాలా నగరంలో జరిగిన మత సమావేశంలో సూచించారు. దేశం కోసం పోరాడుతూ త్యాగం చేసిన వారి కుటుంబాలకు, వ్యక్తులకు సముచిత గౌరవిస్తామన్నారు. -
సంక్షోభం అంచున్న ఇరాక్, సైనిక చర్యకు అమెరికా!
బాకుబా: షియా, సున్నీ వర్గాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇరాక్ సంక్షోభం అంచున నిలిచింది. ఇరాక్‌లో అనేక పట్టణాలు సున్నీ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని బాగ్దాద్ వైపుగా సున్నీ తీవ్రవాదులు ముందుకెళ్తున్నారు. సున్నీ తీవ్రదాడులతో ఇరాక్ భద్రతా బలగాలు కకలావికలమయ్యాయి. సున్నీ తీవ్రవాదుల దాడుల నుంచి తప్పించుకోవడానికి భద్రతా బలగాలు ఆత్మరక్షణలో పడ్డాయి. సున్నీ తీవ్రవాదుల దాడులను తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలని షియా మతపెద్దలు పిలుపునిచ్చారు. షియావర్గం కూడా ఆయుధాలు సేకరించి పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో ఇరాక్ లో రక్తపుటేర్లు పారుతున్నాయి. ఇరాక్ లో పరిస్థితి చేజారుతున్నట్టు కనిపించడంతో చర్యలపై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ఇరాక్ పై సైనిక చర్య తీసుకోవడానికి అమెరికా మొగ్గు చూపుతోంది. దాడికి సిద్ధమవుతోన్న అమెరికా ఇరాక్ సరిహద్దు దేశాల్లో సైన్యాన్ని మోహరించింది.