సంక్షోభం అంచున్న ఇరాక్, సైనిక చర్యకు అమెరికా!
సంక్షోభం అంచున్న ఇరాక్, సైనిక చర్యకు అమెరికా!
Published Fri, Jun 13 2014 5:23 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
బాకుబా: షియా, సున్నీ వర్గాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇరాక్ సంక్షోభం అంచున నిలిచింది. ఇరాక్‌లో అనేక పట్టణాలు సున్నీ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని బాగ్దాద్ వైపుగా సున్నీ తీవ్రవాదులు ముందుకెళ్తున్నారు. సున్నీ తీవ్రదాడులతో ఇరాక్ భద్రతా బలగాలు కకలావికలమయ్యాయి. సున్నీ తీవ్రవాదుల దాడుల నుంచి తప్పించుకోవడానికి భద్రతా బలగాలు ఆత్మరక్షణలో పడ్డాయి.
సున్నీ తీవ్రవాదుల దాడులను తిప్పి కొట్టేందుకు సిద్ధం కావాలని షియా మతపెద్దలు పిలుపునిచ్చారు. షియావర్గం కూడా ఆయుధాలు సేకరించి పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణలతో ఇరాక్ లో రక్తపుటేర్లు పారుతున్నాయి. ఇరాక్ లో పరిస్థితి చేజారుతున్నట్టు కనిపించడంతో చర్యలపై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ఇరాక్ పై సైనిక చర్య తీసుకోవడానికి అమెరికా మొగ్గు చూపుతోంది. దాడికి సిద్ధమవుతోన్న అమెరికా ఇరాక్ సరిహద్దు దేశాల్లో సైన్యాన్ని మోహరించింది.
Advertisement
Advertisement