super rich
-
ధనవంతులపై.. భారత్ మరింత పన్ను విధించాలి: ఫ్రెంచ్ ఆర్థికవేత్త
భారతదేశంలో సంపన్నులు, సంపన్నులుగానే ఉన్నారు, పేదవారు.. పేదవారుగానే ఉన్నారు. ఈ అసమానతలు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిని నివారించాలంటే.. ఇండియాలోని ధనికులపైన అధిక పన్నులు విధించాలని ఫ్రెంచ్ ఆర్థికవేత్త 'థామస్ పికెట్టీ' (Thomas Piketty) పేర్కొన్నారు.10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులున్న వ్యక్తులపైన 2 శాతం సంపద పన్నును విధిస్తే.. భారతదేశ వార్షిక ఆదాయం 2.73 శాతం పెరుగుతుంది. అదే విలువగల ఆస్తిపైన 33 శాతం వారసత్వ పన్ను విధించవచ్చని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులపై పన్ను విధించేందుకు.. కలిసి పని చేసేందుకు 20 ప్రధాన దేశాల ఆర్థిక మంత్రులు వాగ్దానం చేసారు. దీనిని భారత్ కూడా అనుసరించాలని ''21వ శతాబ్దంలో రాజధాని'' (Capital in the 21st Century) పుస్తక రచయిత కోరారు.ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో.. ధనవంతులపై పన్ను విధించడంలో భారతదేశం చురుకుగా ఉండాలని పికెట్టీ పేర్కొన్నారు. ఒక శాతం అగ్రశ్రేణి సంపన్న భారతీయులు కలిగి ఉన్న జాతీయాదాయ నిష్పత్తి.. అమెరికా, బ్రెజిల్ దేశాల సంపన్నులను మించిపోయిందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: అంబానీ, టాటా, అదానీ.. వీళ్లు చేసిన ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా?2022 - 2023లో.. భారతదేశంలోని ధనవంతులైన 1 శాతం మంది దేశానికి చెందిన సంపదలో 40.1 శాతాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఇండియాలోని 100 మంది ధనవంతుల సంపద ట్రిలియన్ డాలర్లు దాటేసినట్లు తెలిసింది. -
అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’..?
దేశంలో అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’ విధించాలంటే మీరేమంటారు..‘మంచిదేకదా డబ్బు ఉన్నవారి నుంచే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సరైందే’నని మద్దతు ఇస్తారా..? త్వరలో ఈ అంశంపై స్పష్టత రానుంది. వచ్చే నెలలో జీ20 కూటమి దేశాల ఆర్థిక మంత్రులు సమావేశం కానున్నారు. అందులో కోటీశ్వరుల ఆదాయంపై విధించే ‘సంపద పన్ను’పై చర్చించడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీ20 సభ్యదేశాల్లోని 68 శాతం మంది సంపద పన్ను ప్రతిపాదనకు మద్దతిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. భారత్‌లో ఏకంగా 74 శాతం మంది దీనిపై సానుకూలంగా స్పందించారు.ఎర్త్4ఆల్, గ్లోబల్ కామన్స్ అలయన్స్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. జీ20 సభ్యదేశాల్లోని దాదాపు 22,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. అత్యంత సంపన్నులపై విధించే ఈ పన్నుకు సంబంధించిన ప్రతిపాదన 2013 నుంచి చర్చలో ఉంది. ప్రస్తుతం జీ20 కూటమికి బ్రెజిల్ అధ్యక్షత వహిస్తోంది. ఈ కూటమి సంపద పన్నుపై ఏకాభిప్రాయానికి కృషి చేస్తోంది. జులైలో జరిగే ఆర్థిక మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడేలా ప్రయత్నిస్తోంది.సర్వేలోని వివరాల ప్రకారం..భారతీయుల్లో చాలామంది వాతావరణ మార్పులు, ప్రకృతి సంరక్షణకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంపన్నులపై విధించే పన్నును అందుకోసం ఉపయోగించాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ సమస్యల్లో కర్బన ఉద్గారాల నివారణకు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు ఈ పన్నును వినియోగించాలని 74 శాతం మంది చెప్పారు. మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ఉపయోగించాలని 76 శాతం మంది తెలిపారు. విద్యుదుత్పత్తి, రవాణా, నిర్మాణం, పరిశ్రమలు, ఆహారం ఇలా అన్నిరంగాల్లో మార్పులు చేసేలా సంపద పన్నును వెచ్చించాలని 68 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ట్రేడింగ్‌లో రూ.46 లక్షలు నష్టపోయిన బీటెక్ విద్యార్థి!ఈ ప్రతిపాదనలో కీలకపాత్ర పోషిస్తున్న ఫ్రెంచ్ ఆర్థికవేత్త గాబ్రియేల్ జుక్మాన్ మాట్లాడుతూ..‘సాధారణ ప్రజలతో పోలిస్తే సంపన్నులు చాలా తక్కువ పన్ను చెల్లిస్తారు. సంపద పన్ను వల్ల అంతర్జాతీయంగా ఓ ప్రమాణం ఏర్పడుతుంది. ప్రతి దేశంలోని బిలియనీర్లు తమ సంపదలో కనీసం 2 శాతం వార్షికంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆకలి, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు వంటి సమస్యల పరిష్కారానికి సందప పన్ను సరైంది’ అని అభిప్రాయపడ్డారు. -
కోటీశ్వరుల వలస.. మళ్లీ మొదలైంది.. వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?
ఉద్యోగం కోసం ఉపాధి కోసం వలస వెళ్లడం మనకు తెలుసు.. మరి ఇక్కడ కోటీశ్వరులే వలస వెళ్లిపోతున్నారు. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో వివిధ దేశాలకు చెందిన కోటీశ్వరులు మళ్లీ వలసల బాటపడుతున్నారని ప్రముఖ పెట్టుబడుల కన్సల్టెన్సీ సంస్థ హెన్లే అండ్ పార్ట్నర్స్ తెలిపింది. ఈ ఏడాది 88 వేల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (కనీసం రూ.8 కోట్ల చరాస్తులు కలిగిన వ్యక్తులు) స్వదేశాలను వీడొచ్చని హెన్లే గ్లోబల్ సిటిజన్స్ నివేదిక అంచనా వేసింది. ఇంతకీ వీరందరూ తమ స్వదేశాలను ఎందుకు వీడుతున్నారు? వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ఓసారి చూద్దామా.. వలస వెళ్లిన సంపన్నుల సంఖ్య రష్యాకు కోటీశ్వరుల బైబై ఈసారి అత్యధికంగా కోటీశ్వరులు వీడుతున్న దేశాల జాబితాలో రష్యా అగ్రస్థానంలో నిలిచింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం తాలూకు దుష్ప్రభావాల బారి నుంచి బయటపడేందుకు రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోని సంపన్నులు తమ దేశాలను వీడుతున్నారని హెన్లే విశ్లేషించింది. ఈ ఏడాది చివరికల్లా రష్యా నుంచి ఏకంగా 15 వేల మంది, ఉక్రెయిన్ నుంచి 2,800 మంది విదేశాలకు తరలిపోవచ్చని పేర్కొంది. ఇటు భారత్ నుంచి కూడా 8 వేల మంది విదేశాలకు వెళ్లిపోవచ్చని అంచనా వేసింది. మిలియనీర్ల స్వర్గధామం యూఏఈ అత్యధిక మంది కోటీశ్వరులు స్థిరపడేందుకు ఎంపిక చేసుకునే దేశాల జాబితాలో యూఏఈ తొలిస్థానంలో ఉంది. ఈ ఏడాది చివరికల్లా 4 వేల మంది తమ గమ్యస్థానంగా యూఏఈని ఎంపిక చేసుకోవచ్చని హెన్లే పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడులతోపాటు అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు యూఏఈ అనుసరిస్తున్న వలస విధానాలు ఇందుకు కొంత కారణం కావొచ్చని వివరించింది. వలసలు ఎందుకు? నిర్ణీత మొత్తంలో పెట్టుబడులు పెడితే విదేశీ పౌరసత్వం లభిస్తుందనో లేదా శాశ్వత నివాస హక్కు పొందవచ్చనో నచ్చిన దేశానికి కోటీశ్వరులు క్యూ కడుతున్నారు. అలాగే తమ కుటుంబాలకు మెరుగైన భద్రత, రక్షణ కోరుకునే వారు, కాలుష్యరహిత పర్యావరణంలో జీవించాలనుకునే వారు, ప్రభుత్వాల అణచివేత ధోరణులు లేదా అవినీతి ప్రభుత్వాల బారి నుంచి బయటపడాలనుకునే వ్యక్తులు, ఉన్నతవిద్య, ప్రపంచస్థాయి వైద్యం పొందాలనుకొనే మిలియనీర్లు కూడా సాధారణంగా వలసల వైపు మొగ్గు చూపుతుంటారని హెన్లే అండ్ పార్ట్నర్స్ విశ్లేషించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కోవిడ్-19 : మానవత్వం చాటిన మిలియనీర్లు
లండన్ : కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రపంచానికి తమ వంతు సాయం చేస్తామంటూ కొందరు కుబేరులు ఉదారంగా ముందుకొచ్చారు. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకునేందుకు తమ వంటి అత్యంత సంపన్నులపై కోవిడ్-19 ట్యాక్స్ విధించాలని 80 మందికి పైగా మిలియనీర్లు ప్రభుత్వాలకు విజ్క్షప్తి చేశారు. మానవత్వం కోసం మిలియనీర్లుగా తమను తాము అభివర్ణించుకున్న వీరంతా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో సంపన్నులపై కోవిడ్ పన్ను వసూలు చేయాలని కోరారు. కుబేరులపై అధిక పన్నును సత్వరమే శాశ్వత ప్రాతిపదికన విధించాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్ మేకర్ అభిగల్ డిస్నీ, స్క్రీన్‌రైటర్ రిచర్డ్ కర్టిస్, బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీం సహవ్యవస్ధాపకులు జెర్రీ గ్రీన్‌ఫీల్డ్, అమెరికన్ వ్యాపారవేత్త సిడ్నీ టోపాల్, న్యూజిలాండ్ రీటైలర్ స్టీఫెన్ టిండాల్ తదితర ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తమ వంటి మిలియనీర్లు ప్రపంచం కోలుకునేందుకు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని లేఖలో వారు స్పష్టం చేశారు. తాము ఇంటెన్సివ్ కేర్ వార్డుల్లో ఉండే రోగుల పట్ల జాగ్రత్త వహించలేమని, రోగులను తరలించేందుకు అంబులెన్స్‌లను నడపలేమని, ఇంటింటికీ ఆహారం అందించలేమని..అయితే తమ వద్ద పేరుకుపోయిన డబ్బుతో అవసరార్ధులకు సాయం చేయగలమని వారు పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి ప్రపంచం గట్టెక్కేందుకు రాబోయే రోజుల్లో డబ్బు అవసరం అధికంగా ఉందని అన్నారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశానికి ముందు అత్యంత సంపన్నులు ఈ లేఖను ప్రభుత్వాల ముందుంచడం గమనార్హం. మహమ్మారి విరుచుకుపడటంతో ఎదురయ్యే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే పలు ప్రభుత్వాలు సంపన్నులపై పన్నులను పెంచాయి. చదవండి : కపూర్ కుటుంబంలో కరోనా కలకలం! అధిక పన్నులు విధించడం మినహా మరో మార్గం లేదని బ్రిటన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ స్పష్టం చేసింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఛెజ్ సైతం అధిక పన్నులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఇటీవల సంకేతాలు పంపారు. కరోనా వైరస్ ప్రభావంతో పడిపోయిన రాబడిని పెంచుకునేందుకు అధిక ఆదాయ వనరులు కలిగిన పౌరులను రష్యా టార్గెట్ చేసుకంది. ఇక చమురు ధరలు తగ్గడం, వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు సౌదీ అరేబియా సేల్స్ ట్యాక్స్‌ను పెంచింది. కాగా ఆక్స్‌ఫాం, ట్యాక్స్ జస్టిస్ బ్రిటన్, అమెరికాలో అత్యంత సంపన్నులతో కూడిన పేట్రియాటిక్ మిలియనీర్స్ వంటి గ్రూపులతో కూడిన మిలియనీర్స్ ఫర్ హ్యూమనిటీ వేదిక ఏర్పాటైంది. -
‘రిచ్ ట్యాక్స్’ వచ్చేస్తోంది....
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ తమ మేనిఫెస్ట్‌లతో సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని కొల్లగొట్టాలని కాంగ్రెస్ తీవ్ర వ్యూహారచన చేస్తోంది. దీనిలో భాగంగానే పేద ప్రజలను ఆకట్టుకోవడానికి అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌ను విధించనున్నట్టు వెల్లడించింది. ‘రిచ్ ట్యాక్స్’ పేరుతో ఈ సెస్‌ను విధించబోతోంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ 84వ ప్లీనరీలో ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ‘జాతీయ దారిద్య్ర నిర్మూలన ఫండ్’ ను తాము ఏర్పాటుచేయనున్నామని, తాము అధికారంలోకి వచ్చాక 1 శాతం అత్యంత ధనవంతులపై 5 శాతం సెస్‌ను విధించనున్నామని పేర్కొంది. ఈ ఫండ్‌ను షెడ్యూల్డ్ కులాలు, తెగలకు, ఇతర దారిద్య్ర దిగువనున్న కుటుంబాలకు విద్యా స్కాలర్షిప్లను అందించనున్నామని తెలిపింది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఓ రెజుల్యూషన్‌ను తమ ప్లీనరీలో ప్రవేశపెట్టారు.దేశంలో పేరుకుపోయిన అసమానతలను గుర్తించాల్సినవసరం ఉందని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తగ్గుతున్న సామాజిక సంక్షేమ పథకాల ప్రాముఖ్యంపై విమర్శలు గుప్పించింది. పెరుగుతున్న ఆదాయ అసమానతలపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అని బీజేపీ వాగ్ధానం చేసిందని, కానీ దానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. బీజేపీ పాలనలో 1 శాతం ధనికుల సంపద 73 శాతం పెరిగిందని, కిందనున్న జనాభా సంపద కేవలం 1 శాతం మాత్రమే పెరిగినట్టు తెలిపింది. ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న డిమానిటైజేషన్ ప్రక్రియతో, ప్రజలు తమ వద్దనున్న నోట్లను మార్చుకోలేక, గంటల పాటు క్యూలైన్లో నిల్చోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొంది. పెద్ద నోట్లను మార్చుకోవడానికి క్యూలైన్లో నిల్చుని 100కి పైగా ప్రజలు మరణించారని ఆందోళన వ్యక్తం చేసింది. -
2025 నాటికి సూపర్ రిచ్ సిటీలు ఇవే
ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సిటీ ఏది? టోక్యో, ఆ తర్వాత న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, సియోల్, లండన్, పారిస్.. ప్లీస్ హోల్డాన్! మరో పదేళ్లలో ఈ జాబితా తలకిందులు కానుంది. మోస్ట్ ఎమర్జింగ్ సిటీలుగా అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న కొన్ని నగరాలు న్యూయార్క్, లండన్, టోక్యోలను అధిగమించి 2025 నాటికి సూపర్ రిచ్ సిటీలుగా అవతరించనున్నాయి. పలు అధ్యయనాలు అనంతరం ప్రఖ్యాత మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ మెకిన్సే అండ్ కంపెనీ ఫ్యూచర్ రిచ్ సిటీల జాబితాను రూపొందించింది. ఆ జాబితాలోని ఏడు నగరాల ఫొటోలు, వివరాలు మీకోసం.. (ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) . దోహా- ఖతార్: ఇప్పటికే సంపన్న నగరంగా ఉన్న దోహా అద్భుతమైన జీడీపీ వృద్ధి రేటుతో 2025నాటికి రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా అవతరిస్తుంది. 2. బెర్గన్- నార్వే: ఎనర్జీ ఇండస్ట్రీ, షిప్పింగ్, మెరైన్ పరిశోధనల్లో తనదైన ముద్రతో నార్వే ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న బెర్గన్ మరో పదేళ్లలో సూపర్ రిచ్ సిటీ అవుతుంది. 3. ట్రొన్హెయిమ్- నార్వే: మొబైల్ టెక్నాలజీకి పుట్టినిల్లయిన ట్రొన్హెయిమ్.. నార్వేలోని మరో ముఖ్యనగరం. స్టార్ట్ అప్ ల హబ్ గా 2025లోగా ఇది ధనిక నగరంగా అవతరించనుంది. 4. హ్వాసియోంగ్- దక్షిణ కొరియా: శాంసంగ్, ఎల్ జీ, హ్యుందాయ్ కపెనీల జన్మస్థానమైన ఈ నగరం మరికొద్ది సంవత్సరాల్లో ప్రపంచంలో ధనిక నగరం కానుంది. 5. అసాన్- దక్షిణ కొరియా: సమీప భవిష్యత్ లో గ్లోబల్ షిప్పింగ్ హబ్ గా అవతరించనున్న అసాన్ కూడా రిచ్చెస్ట్ సిటీ రేస్ లో దూసుకుపోతోంది. 6. రైన్ రుహ్ర్- జర్మనీ: యూరప్ లోని అతిపెద్ద నగరాల్లో మూడో స్థానం(ఫస్ట్ లండన్, సెకెండ్ పారిస్) లో ఉన్న జర్మన్ మెగాసిటీ రైన్ రూహ్ర్ ధనిక నగరంగా అవతరించడం ఎంతోదూరంలోలేదు. 7. మకావు- చైనా: అతితక్కువ కాలంలో బీభత్సంగా అభివృద్ధి చెందిన చైనా నగరం మకావు.. గతేడాది ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసినా 2025 నాటికి రిచ్చెస్ట్ సిటీ అవుతుందని అంచనా.