Support price for paddy
-
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్‌తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు రూ.1,773.98 కోట్లు జమ చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం రూ.926.90 కోట్లను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినట్టు పేర్కొన్నారు. దాదాపు 16 రోజులు దాటిన ఎఫ్‌టీవోలు అన్నింటికీ నగదు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 3,10,791 మంది రైతుల నుంచి రూ.3,578.43 కోట్ల విలువైన 17.35 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇప్పటి వరకు 1.67 లక్షల మంది రైతులు మద్దతు ధర నగదును అందుకున్నట్టు వివరించారు. త్వరలోనే మిగిలిన రైతులకూ మద్దతు ధరను ఖాతాల్లో వేస్తామని తెలిపారు. రైతులకు గోనె సంచులు, హమాలీ, రవాణా ఖర్చుల కింద రూ.17.66 కోట్లు అందించినట్టు వివరించారు. -
చిన్నబోయిన సన్నాలు ‘వెల’ విల
ఇళ్లు, కళ్లాల్లోనే ధాన్యం మద్దతు ధర రూ.1,800 వట్టిమాటే.. రూ.1,600లకే దండుకుంటున్న దళారులు పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కూడా ఉంది.. వరి మద్దతు ధర దొడ్డు రైతుల గుండెల్లో దడ పుట్టిస్తుంటే.. సన్న రైతులు చిన్న బోతున్నారు.. అమ్ముకోలేక ఇళ్లలో, పొలాల వద్ద నిల్వ పెడుతున్నారు.. దొంగల పాలు కాకుండా ఎముకలు కొరికే చలిలో కాపలా ఉంటూ జాగారం చేస్తున్నారు.. సర్కారు మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నారు..– బోధన్ రూరల్ నా పేరు బేగరి శ్రీనివాస్. మాది బోధన్ మండలం ఏరాజ్‌పల్లి. నాకు ఎకరం సొంత పొలం ఉంది. మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని సన్న రకం ధాన్యం (బీపీటీ) సాగు చేశాను. ఒక పంటకు మూడెకరాల కోసం కౌలుకు రూ.39 వేలు.. పెట్టుబడి రూ.80 వేలు ఖర్చు చేశాను. మొత్తం రూ.1.19 లక్షలు అయ్యాయి. 72 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన రూ.1800 ధర లభించక పోవడంతో బహిరంగ మార్కెట్లో ధాన్యం రూ.1,610 లకు అమ్ముకుంటే రూ.1.16 లక్షలు వచ్చాయి. ఈ లెక్కన ఖరీఫ్ అంతా కష్టపడి సాగు చేస్తే రూ.3వేల నష్టం వచ్చింది. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో 1.60 లక్షల హెక్టర్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. వీటిలో ప్రధానంగా వరి పంటను సుమారు 65 వేల హెక్టార్లకుపైగా సాగు చేశారు. ఖరీఫ్ ప్రారంభం నుంచి సరైన సమయంతో వర్షాలు కురిసి పంటలకు ధీమా కలిగించాయి. అల్ప పీడన ప్రభావంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలాల్లో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొన్ని రకాల పంటలు నీట మునిగి నష్టపోగా.. వరి సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కలిసొచ్చిందని చెప్పొచ్చు. వాతావరణం అనుకూలించడంతో వరి పంటలను సాగు చేసిన ఈ ఏడాది కరెన్సీ నోట్లు, మద్దతు ధర విషయంలో అన్నదాతలకు కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా సన్న రకం ధాన్యం సాగు చేసిన రైతులకు ఈ కష్టాలు అధికంగా వెంటాడుతున్నాయి.– బోధన్ రూరల్ అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. ఈ ఏడాది ఖరీఫ్‌లో సన్నరకం ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా తయారైంది. వ్యవసాయాన్ని నమ్ముకుని ఆరుగాలం పంట పొలాల్లో శ్రమించి పండించిన పంటలు అమ్ముకుందామంటే రైతులకు నానా తిప్పలు తప్పడం లేదు. పండించిన పంటకు లాభసాటి మద్దతు ధర లభించక సన్న రకం ధాన్యం రైతులు విలవిలలాడుతున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన పంటలకే మద్దతు ధర లభించక ఇబ్బందులు ఎదురుర్కొంటుంటే ఇక యాసంగిలో ఎలా సాగు చేయాలో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ ఏదాది దొడ్డు రకం ధాన్యానికి రూ.1,510 మద్దతు ధర ప్రకటించి ఐకేపీ, సివిల్ సప్లయ్, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. సన్న రకం ధాన్యం మాత్రం ప్రభుత్వం నుంచి ఆశించిన లాభసాటి ధర లభించడం లేదు. ఇక బహిరంగ మార్కెట్లో అమ్ముకుందామంటే కరెన్సీ నోట్ల కష్టాలతో దళారులు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో చేసేది లేక రైతులు తమ ఇళ్లలో, పంట పొలాల్లో ధాన్యం నిల్వ ఉంచుకుంటున్నారు. రాత్రుళ్లు జాగారం చేస్తున్నారు. -
రైతన్నకు శుభవార్త..
ఆన్లైన్ ద్వారా కొనుగోలు డబ్బుల చెల్లింపు - అక్టోబర్ నుంచి అమలు - పెరిగిన ధాన్యం మద్దతు ధర రాయికల్ : జిల్లా రైతులకు శుభవార్త. అన్నదాతలు తాము పండించిన పంట ఐకేపీ, సహకార సంఘాల్లో అమ్మిన తర్వాత డబ్బులకోసం 15 నుంచి నెల వరకు వేచిచూసేవారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు నేరుగా డబ్బులు ఆన్లైన్ ద్వారా తమ ఖాతాలో జమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి ఆన్లైన్ ద్వారా చెల్లింపుకు అక్టోబర్‌లో శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ నుంచి జిల్లాలో 301 ఐకేపీ కొనుగోలు సెంటర్లు, 320 సహకార సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సెంటర్లలో అమ్మిన రైతులకు కేవలం 48 గంటల్లోనే తమ అకౌంట్లోకి డబ్బులు జమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గతంలో ఐకేపీ, సహకార కొనుగోలు సెంటర్లో అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు రాకపోవడం, బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడటం, బ్యాంకులో సిబ్బంది సరిగా లేకపోతే ఆ డబ్బుల కోసం రోజుల తరబడి వేచిచూడడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మొదటిసారిగా ఆన్లైన్ పేమెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్, ఆధార్‌కార్డులను సంబంధిత మండల ఐకేపీ కార్యాలయంలో సమర్పించాలని, తద్వారా కంప్యూటరీకరణ చేసి ఆన్లైన్ అకౌంటింగ్ ద్వారా త్వరితగతిన రైతులకు తమ అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉంది. పెరిగిన వరి మద్దతు ధర అక్టోబర్ నుంచి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, సహకార కొనుగోలు కేంద్రాల ఆధ్వర్యంలో వరికొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గతంలో ఏ గ్రేడ్ వరికి రూ.1345 ఉండగా.. ప్రస్తుతం రూ.1400లకు కామన్ గ్రేడ్ రూ.1310 ఉండగా.. రూ.1360కి పెంచిందని ఐకేపీ అధికారులు తెలిపారు.