Supporting measures
-
లెక్కలేదా...
వర్షాలకు జిల్లా అతలాకుతలం మొత్తం నష్టం రూ. 239.81కోట్లు కుదేలయిన వ్యవసాయరంగం నష్టంపై సర్కారు కాకిలెక్కలు క్షేత్ర పరిశీలనతో పొంతన కుదరని అధికారుల గణాంకాలు సహాయక చర్యలపై అసంతృప్తి తిరుపతి: మున్నెన్నడూ లేనివిధంగా కురిసిన వర్షాలకు జిల్లా అతలాకుతలమయింది. అన్నదాతను అనూహ్య వర్షాలు నష్టాల్లో ముంచెత్తింది. వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తూ కలవరపెడుతున్నాయి. వర్షాఘాతానికి ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు. అన్ని వర్గాలపై జలఖడ్గం దాడి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే స్పందించాల్సిన సర్కారు తీరుపై జనం పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వేస్తున్న నష్టం అంచనా లెక్కలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వారు చెబుతున్న లెక్కలకూ, క్షేత్రస్థాయిలో వాస్తవాలకూ ఏమాత్రం పొంతన కుదరడం లేదు. జిల్లావ్యాప్తంగా సాక్షి విలేకరుల బృం దం నష్టం అంచనా వేసినప్పుడు అధికారుల లెక్కల్లో డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వర్షాలకు 45మంది మృత్యువాత పడితే సర్కారు 14మంది చనిపోయినట్లు లెక్కకట్టింది. కూలిపోయిన ఇళ్లు కూడా అధికారులు తక్కువే చూపిస్తున్నారు. రైతునష్టం విషయంలోనూ అదేతీరు. మరోపక్క ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని చెపుతున్నప్పటికి, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. రైతులు ఎకరాకు సరాసరిన రూ 30-35వేలు ఖర్చు చేసి పంటలను సాగు చేశారు. అవి కళ్లెదుటే నీట మునిగి పోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టదన్నట్లు వ్యవహారిస్తూ మాటలకే పరిమిత మవుతోంది. ఇంతవరకు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరిగి పంట నష్టం వేసిన దాఖలా ల లేదు. పైగా జిల్లా కేంద్రంలో కాకిలెక్కలను వేస్తూ సర్కారుకు నివేదిస్తున్నారు. అంటువ్యాధుల బెడద... వర్షాలకు పలుగ్రామాలు, పట్టణాల్లో తాగునీరు కలుషితమవుతోంది. వ్యాధులు జిల్లాను చుట్టిముట్టే అవకాశం ఉంది. ఇప్పటికే డెంగీ జ్వరాలతో గజగజ వణికి పోయిన జిల్లా వాసులు, ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని బెంబేలెత్తుతున్నారు..చలిగాలులకు తోడు, దోమలు బెడద ప్రజలను పట్టి పీడిస్తోంది. పారిశుధ్యానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పంచాయతి, కార్పొరేషన్, వైద్య శాఖ అధికారులు నామ మాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. వృథాగా పోతున్న నీరు... జిల్లా వ్యాప్తంగా పలు చెరువులకు గండ్లు పడినీరు వృథాగాపోతోంది. ఇంకా పలు చోట్ల మరమ్మత్తులుచేపట్టలేదు. తొట్టంబేడు మండలంలో తెలుగు గంగ కాలువకు గండ్లు పడటంతో వృథాగా నీరుపోతూనే ఉంది. కాళంగి రిజర్వాయర్ గేట్ విరిగి పోవడంతో నీరు బయటకు పోతోంది.ఇంకా వర్షాలు కురిస్తే పలు చెరువులు ప్రమాదపుటంచున ఉండటంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. పీలేరు నియోజక వర్గంలో మేడికుర్తి చెరువుకు గండి పండటంతో ఇప్పటికే ప్రాజెక్టులోని నీరంతా వృథాగా బయటకు పోయింది. కాస్త ఉపశమనం శుక్రవారం వరుణుడు కాస్త శాంతించడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది. తిరుపతిలో ఆటోనగర్, చంద్రశేఖర్రెడ్డినగర్, నవోదయ కాలనీ, కొర్రమేను కుంటలాంటి కాలనీలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తుండటం, కళ్యాణి డ్యాంలోకి నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో, నీటిని దిగువకు విడుదల చేస్తే పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైయ్యే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాల ప్రజలు హడలి పోతున్నారు.శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ఇంకా 60 గ్రామాలకు పైగా రాకపోకలకు నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని విమానాలు అలస్యంగా నడుస్తున్నాయి. వర్షం నష్టంపై అధికారిక లెక్కలివీ.. చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో తుపాను బాధితులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టామని జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయ్‌చందర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుపాను ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా 14 మంది మృతి చె ందారని, 3,694 ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. మృతులకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్ష ల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. దెబ్బతిన్న ఇళ్లలో 144 పూర్తిగా నేలమట్టమయ్యాయన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పక్కా ఇంటికి రూ. 50 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ. 25 వేలు, గుడిసెలకు రూ. 5 వేలు, అతిగా ప్రమాదం జరిగిన ఇంటికి రూ. 6 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 5,780 మందికి ఆహారం అందజేసినట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా 212 గొర్రెలు, 44 మేకలు, 3 ఎద్దులు, దూడ, 168 పందులు మృతి చెందాయన్నారు. 42 చెరువులకు గండిపడగా, వాటి నుంచి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. వరద నీటిలో కొట్టుకుపోరుు వుృతి నాగలాపురం: వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మరణిం చాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం నందనంలో జరిగింది. గ్రావూనికి చెందిన రాజేం ద్రయ్యు(53) శుక్రవారం సాయుంత్రం రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తున్న కాలువను దాటబోయాడు. వరద నీరు ఉధృతికి కొట్టుకుపోయాడు. గమనించిన గ్రామస్తులు గాలించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆ గ్రావు శ్మశానవాటిక సమీపాన కాలువ వద్ద రాజేంద్రయ్య మృతదేహం ఉండటం గుర్తించారు. -
వాన దాడి
తిరుపతి: వర్షాలు కొనసాగుతుండడంతో జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తిరుపతి నగరంలో పలు కాలనీలకు చుట్టూ నీరు చేరడంతో ద్వీపాల(చుట్టూ నీళ్లు)ను తలపిస్తున్నాయి. గురువారం సాయంత్రం రెండుగంటల పాటు కుండపోతగా కురిసిన వర్షానికి భీతావాహులయ్యారు. సరిగ్గా పాఠశాలలలు, కళాశాలలు, కార్యాలయా ల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎక్కడిక్కడే జనం నిలిచిపోయారు. ఆటోలు సైతం వెళ్లలేని విధంగా రోడ్లను వర్షపునీరు ముంచెత్తింది. ఉదయం కాస్త తెరిపివ్వడంతో పలు ప్రయివేటు పాఠశాలలు యధావిధిగా నడిచాయి. ఊహించని రీతిలో సాయంత్రం వర్షం ముంచెత్తడంతో ఇళ్లకు ఏలా వస్తారోనని తల్లిదండ్రులు తీవ్ర అందోళనకు గురయ్యారు. దాదాపు 48 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఆటోనగర్, ఆశోక్ నగర్ ప్రాంతాల్లో భారీగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్లు పొంగిపారుతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు హడలిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో 70 గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎస్వీయూ పరిధిలో మూడో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. మందకొడిగా సహాయక చర్యలు... జిల్లాలో చేపట్టిన పునరావాస కార్యక్రమాలు మందకోడిగా సాగుతున్నాయి. 8,465 కుటుంబాలు వర్షాల ప్రభావానికి గురైనట్లు గుర్తించిన అధికారులు ఇప్పటి వరకు వెయ్యి కుటుంబాలకు మించి బియ్యం, కిరోసిన్, చక్కెర, పామాయిల్, కందిపప్పు అందించలేకపోయారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం, వరద ముంచెత్తడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నదులు పొంగి పారుతుండడం, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. కల్యాణి డ్యాం నీటి మట్టం 893 అడుగులకు చేరింది. అధికారుల అంచనా ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. 305 ఇళ్లు పూర్తిగా, 1345 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 83.580 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతినడంతో రూ. 16.67 కోట్ల నష్టం వాటిల్లింది. 31.3 కి.మీ.మేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. 45 చెరువులకు గండ్లు పడగా రూ.1.5కోట్ల నష్టం వాటిల్లింది. కూరగాయలు 567.50 హెక్టార్లు, పూలతోటలు 138.20 హెక్టార్లు, బొప్పాయి 33, అరటి పంటలకు 31.40 హెక్టార్టలో దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించి రూ.1.12కోట్ల నష్టం వాటిల్లింది. 1658 ఎకరాల్లో వరి, 952 ఎకరాల్లో వేరుశెనగ, 15 ఎకరాల్లో కంది, 12 ఎకరాల్లో జొన్న, ఇతర పంటలు కలిపి మొత్తంగా 2,637 ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రూ. 4.47 కోట్ల నష్టం వాటింది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. పొంచి ఉన్న అంటు వ్యాధులు.... వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అప్పటికే పేరుకు పోయిన చెత్త చెదారంతోపాటు జంతు వధశాలల వ్యర్థాలు కుళ్లి వర్షపు నీటితోపాటు రోడ్లపైకి చేరాయి. ప్రస్తుత వర్షానికి మరింత కుళ్లి నివాస ప్రాంతాల వీధుల్లోకి చేరుతున్నాయి. దోమల బెడద కూడా ఉండడంతో ఎప్పుడు ఏవ్యాధులు చుట్టుముడతాయోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చేబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. వడమాలపేటలో అత్యధిక వర్షం చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో గురువారం కూడా వర్షం కురిసింది. అత్యధికంగా వడమాలపేట మండలంలో 64.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా సత్యవేడు మండలంలో 2.4 మిల్లీ మీటర్ల వర్షపాతం న మోదైంది. పెనుమూరులో 59.6, రేణిగుంట 54.6, తిరుపతి అర్బన్ 53.2, రామచంద్రాపురం 52.6, బీఎన్ కండ్రిగ 52.4, వెదురుకుప్పం 50.4, చ ంద్రగిరి 48.8, ఏర్పేడు 46.2, తొట్టంబేడు 40.8, కార్వేటినగరం 36.2, నగరి 35.2, శ్రీకాళహస్తి 31.4, తవణంపల్లి 27.4, బంగారుపాళెం 27.2, చిత్తూరు 26.6, నారాయణవనం 26.4, కేవీబీ పురం 26.2, గంగాధరనెల్లూరు 26.2, పూతలపట్టు 25, నిమ్మనపల్లె 24.6, సదుం 24.2, ఎస్ఆర్పురం 23.2, సోమల 22.4, పుత్తూరు 22.4, కురబలకోట 21.2, నిండ్ర 21.2, పాకాల 19.8, మదనపల్లె 18.6, పెద్దపంజాణి 18.4, వాల్మీకిపురం 18.2, పిచ్చాటూరు 17.4, యాదమరి 17.4, పుంగనూరు 17.2, గుడిపాల 17.2, వరదయ్యపాళెం 15.8, పులిచెర్ల 15.4, ఐరాల 15.2, కెవి పల్లె 15, పెద్దమండ్యం 14.6, బెరైడ్డిపల్లె 13.2, కలికిరి 12.8, పలమనేరు 12.4, బి.కొత్తకోట 12.2, పీలేరు 12.2, రొంపిచెర్ల 12.2, పాలసముద్రం 11.4, మొలకలచెరువు 11.2, రామసముద్రం 11.2, తంబళ్లపల్లె 11, గంగవరం 10.6, చౌడేపల్లె 10.2, చిన్నగొట్టిగల్లు 10.2, ఎర్రావారిపాళెం 10, నాగలాపురం 9.6, పీటీఎం 9.2, కలకడ 9.2, వి.కోట 9, తిరుపతి రూరల్ 8.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
బతుకు బాట
పడిపోయిన మట్టి గోడల ఇంటి ముందు దిగాలుగా కూర్చున్న వారంతా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలోని పెద్ద నింగప్ప కుటుంబసభ్యులు. వీరికి సెంటు భూమి లేదు. బతికేందుకు ఊళ్లో పనిలేదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరుకు వలసెళ్లారు. అక్కడ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఊరికి రాక చాలా రోజులైంది. సంక్రాంతికైనా ఇంటికి రావాలనుకున్నారు. బుధవారం భోగి పండుగ రోజున నింగప్ప బెంగళూరులో చనిపోయాడు. సంక్రాంతికి సొంతూరొచ్చి సంబరంగా పండుగ చేసుకోవాల్సిన నింగప్ప నలుగురు కుమారులు.. నాన్న శవాన్ని మోసుకుని వచ్చారు. ఊరంతా పండుగ చేసుకుంటే వారు మాత్రం నాన్న చావును తలుచుకుంటూ కుమిలిపోయారు. సాక్షిప్రతినిధి, అనంతపురం : ఏళ్లుగా ‘అనంత’ను పీడిస్తున్న కరువు రక్కసి ఈసారీ వదలలేదు. దీనివల్ల రైతులు, కూలీలు పొట్టచేతబట్టుకుని వలస వెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 43 వేల కుటుంబాలు సొంతూళ్లను వదిలాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఏటా ఇదే దుస్థితివర్షాభావ పరిస్థితులు ‘అనంత’ రైతును ఏటా దెబ్బతీస్తూనే ఉన్నాయి. వ్యయప్రయాసలకోర్చి ఈ ఏడాది పంట సాగు చేస్తే.. వరుణుడు కాసింత కనికరం కూడా చూపలేదు. పంట మొత్తం ఎండిపోయేలా చేశాడు. పంటను కాపాడుకునేందుకు వందలాది అడుగులు బోర్లు తవ్వినా నీటిజాడ కనిపించలేదు. కాస్తోకూస్తో పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఫలితంగా రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఏటా జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటిస్తోందంటే ఏస్థాయిలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం మినహా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం లేదు. ఈ క్రమంలో రుణాలు తీర్చలేక, అప్పులోళ్ల మాటలు పడలేక, ఆత్మాభిమానం దెబ్బతిన్న అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయిన రోజు నుంచి ఇప్పటి వరకూ 51మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు చచ్చి సాధించేదేమీ లేదంటూ వలసబాట పడుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతితో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. భవ న నిర్మాణ కూలీలుగా కొందరు, సెక్యూరిటీ గార్డులుగా మరికొందరు.. ఇలా ఏ పని దొరికితే అది చేస్తున్నారు. కరువు సహాయక చర్యలేవీ? ఈ ఏడాది ఏడు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా, వర్షాభావంతో 5.06 లక్షల హెక్టార్లలో మాత్రమే వేశారు. వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోయింది. ఐదు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని స్వయాన వ్యవసాయాధికారులే ప్రభుత్వానికి నివేదికలు పంపారు. భూగర్భజలాలు కూడా కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం సగటు నీటిమట్టం 20 మీటర్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే 2.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. కొన్నిచోట్ల 800-1000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గత రెండేళ్లుగా పంట నష్టం వాటిల్లడం, ఈసారీ పూర్తిగా చేతికందకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. మూడేళ్లుగా పంట కోసం, పూట గడవడం కోసం చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారాయి. రుణమాఫీపై ఆశలు అడియాసలయ్యాయి. గతేడాదికి సంబంధించి రూ.227 కోట్ల వాతావరణ బీమా జిల్లాకు మంజూరైనా ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అప్పుల కింద ఈ డబ్బును బ్యాంకర్లు జమ చేసుకున్నారు. గతేడాదికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రూ.643 కోట్లు రావాల్సివుంది. కష్టకాలంలో ఈ డబ్బు ఇచ్చి రైతన్నకు ఊరట కల్గించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించలేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ సొమ్మును మంజూరు చేయించే దిశగా జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ఆలోచించడం లేదు. బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండూ కలిపితేజిల్లాకు దాదాపు రూ.900 కోట్లు అందుతుంది. రుణమాఫీ రూపంలో అయితే ఈ ఏడాది అందేది కేవలం రూ.780 కోట్లే. ఇకపోతే ఉపాధి హామీ పథకం కూడా జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కావడం కాలేదు. దీనివల్ల తప్పనిపరిస్థితుల్లో ప్రజలు వలసబాట పడుతున్నారు. వలసల బాట నల్లచెరువు మండలం బండ్రేపల్లిలో 110 కుటుం బాలు ఉంటే 76 కుటుంబాలు వలసెళ్లాయి. కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి, మల్లాపురం, కాపర్లపల్లి, పాలవాయి గ్రామాల నుంచి 500 కుటుంబాలు వలసెళ్లాయి. కుందుర్పి మండలం మలయనూరు, తూముకుంట, బెస్తపల్లి, ఎనుములదొడ్డి, జంబుగుంపల, ఎర్రగుంట, మహంతపురం పంచాయతీల్లో దాదాపు 1,500 కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాలు 6-8 నెలల పాటు అక్కడే ఉంటున్నాయి. మరికొన్ని కుటుంబాలు అంత కంటే ఎక్కువగా గడుపుతున్నాయి. గుంతకల్లు మండలం పులగుట్టపల్లి తండాలో 300 కుటుంబాలుంటే దాదాపు సగం వలసబాట పట్టాయి. సోమందేపల్లి, రొద్దం మండలాల్లో 2,500 కుటుంబాలు వలసపోయాయి. మడ గూరు మండలం దెందువారిపల్లెలో వంద కుటుంబాలు వలసెళ్లాయి. నియోజకవర్గం వలసెళ్లిన కుటుంబాలు(అంచనా) కదిరి 6 వేలు పెనుకొండ 4500 రాప్తాడు 4300 హిందూపురం 3 వేలు మడకశిర 3 వేలు ఉరవకొండ 3 వేలు గుంతకల్లు 4200 కళ్యాణదుర్గం 4 వేలు రాయదుర్గం 3200 పుట్టపర్తి 4200 ధర్మవరం 2400 అనంతపురం 500 శింగనమల 500 తాడిపత్రి 500 మొత్తం కుటుంబాలు 43,300 -
బతుకు బాట
పడిపోయిన మట్టి గోడల ఇంటి ముందు దిగాలుగా కూర్చున్న వారంతా బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలోని పెద్ద నింగప్ప కుటుంబసభ్యులు. వీరికి సెంటు భూమి లేదు. బతికేందుకు ఊళ్లో పనిలేదు. దీంతో ఇంటిల్లిపాది బెంగళూరుకు వలసెళ్లారు. అక్కడ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఊరికి రాక చాలా రోజులైంది. సంక్రాంతికైనా ఇంటికి రావాలనుకున్నారు. బుధవారం భోగి పండుగ రోజున నింగప్ప బెంగళూరులో చనిపోయాడు. సంక్రాంతికి సొంతూరొచ్చి సంబరంగా పండుగ చేసుకోవాల్సిన నింగప్ప నలుగురు కుమారులు.. నాన్న శవాన్ని మోసుకుని వచ్చారు. ఊరంతా పండుగ చేసుకుంటే వారు మాత్రం నాన్న చావును తలుచుకుంటూ కుమిలిపోయారు. సాక్షిప్రతినిధి, అనంతపురం : ఏళ్లుగా ‘అనంత’ను పీడిస్తున్న కరువు రక్కసి ఈసారీ వదలలేదు. దీనివల్ల రైతులు, కూలీలు పొట్టచేతబట్టుకుని వలస వెళుతున్నారు. ఇప్పటికే దాదాపు 43 వేల కుటుంబాలు సొంతూళ్లను వదిలాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఏటా ఇదే దుస్థితివర్షాభావ పరిస్థితులు ‘అనంత’ రైతును ఏటా దెబ్బతీస్తూనే ఉన్నాయి. వ్యయప్రయాసలకోర్చి ఈ ఏడాది పంట సాగు చేస్తే.. వరుణుడు కాసింత కనికరం కూడా చూపలేదు. పంట మొత్తం ఎండిపోయేలా చేశాడు. పంటను కాపాడుకునేందుకు వందలాది అడుగులు బోర్లు తవ్వినా నీటిజాడ కనిపించలేదు. కాస్తోకూస్తో పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఫలితంగా రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఏటా జిల్లాలో దాదాపు అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటిస్తోందంటే ఏస్థాయిలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం మినహా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించడం లేదు. ఈ క్రమంలో రుణాలు తీర్చలేక, అప్పులోళ్ల మాటలు పడలేక, ఆత్మాభిమానం దెబ్బతిన్న అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయిన రోజు నుంచి ఇప్పటి వరకూ 51మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు చచ్చి సాధించేదేమీ లేదంటూ వలసబాట పడుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతితో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. భవ న నిర్మాణ కూలీలుగా కొందరు, సెక్యూరిటీ గార్డులుగా మరికొందరు.. ఇలా ఏ పని దొరికితే అది చేస్తున్నారు. కరువు సహాయక చర్యలేవీ? ఈ ఏడాది ఏడు లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా, వర్షాభావంతో 5.06 లక్షల హెక్టార్లలో మాత్రమే వేశారు. వర్షాలు లేక పంట పూర్తిగా ఎండిపోయింది. ఐదు లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని స్వయాన వ్యవసాయాధికారులే ప్రభుత్వానికి నివేదికలు పంపారు. భూగర్భజలాలు కూడా కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం సగటు నీటిమట్టం 20 మీటర్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చితే 2.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. కొన్నిచోట్ల 800-1000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీటి జాడ కనిపించడం లేదు. గత రెండేళ్లుగా పంట నష్టం వాటిల్లడం, ఈసారీ పూర్తిగా చేతికందకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. మూడేళ్లుగా పంట కోసం, పూట గడవడం కోసం చేసిన అప్పులు తలకు మించిన భారంగా మారాయి. రుణమాఫీపై ఆశలు అడియాసలయ్యాయి. గతేడాదికి సంబంధించి రూ.227 కోట్ల వాతావరణ బీమా జిల్లాకు మంజూరైనా ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అప్పుల కింద ఈ డబ్బును బ్యాంకర్లు జమ చేసుకున్నారు. గతేడాదికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ రూ.643 కోట్లు రావాల్సివుంది. కష్టకాలంలో ఈ డబ్బు ఇచ్చి రైతన్నకు ఊరట కల్గించే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించలేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ సొమ్మును మంజూరు చేయించే దిశగా జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డితో పాటు అధికార పార్టీ నేతలు ఆలోచించడం లేదు. బీమా, ఇన్పుట్ సబ్సిడీ రెండూ కలిపితేజిల్లాకు దాదాపు రూ.900 కోట్లు అందుతుంది. రుణమాఫీ రూపంలో అయితే ఈ ఏడాది అందేది కేవలం రూ.780 కోట్లే. ఇకపోతే ఉపాధి హామీ పథకం కూడా జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కావడం కాలేదు. దీనివల్ల తప్పనిపరిస్థితుల్లో ప్రజలు వలసబాట పడుతున్నారు. వలసల బాట నల్లచెరువు మండలం బండ్రేపల్లిలో 110 కుటుం బాలు ఉంటే 76 కుటుంబాలు వలసెళ్లాయి. కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి, మల్లాపురం, కాపర్లపల్లి, పాలవాయి గ్రామాల నుంచి 500 కుటుంబాలు వలసెళ్లాయి. కుందుర్పి మండలం మలయనూరు, తూముకుంట, బెస్తపల్లి, ఎనుములదొడ్డి, జంబుగుంపల, ఎర్రగుంట, మహంతపురం పంచాయతీల్లో దాదాపు 1,500 కుటుంబాలు పొట్ట చేతబట్టుకుని వెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాలు 6-8 నెలల పాటు అక్కడే ఉంటున్నాయి. మరికొన్ని కుటుంబాలు అంత కంటే ఎక్కువగా గడుపుతున్నాయి. గుంతకల్లు మండలం పులగుట్టపల్లి తండాలో 300 కుటుంబాలుంటే దాదాపు సగం వలసబాట పట్టాయి. సోమందేపల్లి, రొద్దం మండలాల్లో 2,500 కుటుంబాలు వలసపోయాయి. మడ గూరు మండలం దెందువారిపల్లెలో వంద కుటుంబాలు వలసెళ్లాయి. నియోజకవర్గం వలసెళ్లిన కుటుంబాలు(అంచనా) కదిరి 6 వేలు పెనుకొండ 4500 రాప్తాడు 4300 హిందూపురం 3 వేలు మడకశిర 3 వేలు ఉరవకొండ 3 వేలు గుంతకల్లు 4200 కళ్యాణదుర్గం 4 వేలు రాయదుర్గం 3200 పుట్టపర్తి 4200 ధర్మవరం 2400 అనంతపురం 500 శింగనమల 500 తాడిపత్రి 500 మొత్తం కుటుంబాలు 43,300 కరువు, అనంత, సహాయక చర్యలు, Drought, indivisible, supporting measures -
మృత్యువును జయించిన బాలిక
బోరుబావిలో పడ్డ చిన్నారి రెండున్నర గంటల తర్వాత బయటకు.. పరిగి/ కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండల పరిధిలో బోరుబావిలో పడిన ఓ చిన్నారిని రెండున్నర గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గీ మండలంలోని ముదిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్, బుజ్జిబాయిలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నాయి. ఇందులో బతుకుదెరువు కోసం లక్ష్మణ్ దుబాయికి వెళ్లగా.. బుజ్జి పుణెలో పనిచేస్తోంది. ఇద్దరు కుమారులు ముదిరెడ్డిపల్లిలోనే ఉండి చదువుకుంటున్నారు. కుమార్తెలు నందిని అలియాస్ అంజలి(6), బుజ్జిలు చిన్నవారు కావడంతో అమ్మమ్మగారి ఊరైన గోవిందుపల్లితండాలో అమ్మమ్మ సీతాబాయి, తాతా భోజ్యానాయక్ల వద్ద ఉంటున్నారు. మంగళవారం సీతాబాయి, భోజ్యానాయక్‌లు తండా సమీపంలోని పొలానికి పనికి వెళ్లారు. నందిని కూడా వారితోపాటే వెళ్లింది. అక్కడే ఉన్న బాలిక సాయంత్రం వేళ కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిందని భావించారు. అయితే, ఇంటికీ రాకపోవడంతో వెతుక్కుంటూ మళ్లీ పొలానికి వెళ్లారు. అక్కడ బోరుబావిలోంచి శబ్దాలు రావడంతో గమనించగా, అందులో చిన్నారి పడిపోయినట్లు స్పష్టమైంది. ఆ బోరుబావి పూడ్చినా 10 ఫీట్ల మేరకు అలాగే వదిలేయడంతో చిన్నారి అక్కడ ఉన్నట్లు భావించారు. గ్రామసర్పంచ్ వెంటనే పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారమందించగా, వారు రావడంతో పాటు జేసీబీని రప్పించారు. 108 సిబ్బంది బోరుబావిలో చిన్నారికి ఆక్సిజన్ అందించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో బోరుబావికి సమాంతరంగా జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చిన్నారిని క్షేమంగా బయటికి తీశారు. అనంతరం ఆమెను 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
శిక్షణపై ‘ఫైర్’
* అగ్నిమాపక సిబ్బంది ఆగ్రహం * ఎనిమిది ఏళ్లుగా ఏదీ శిక్షణ * పాములతో నిరంతర భయం చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యవసర సమయాల్లో ఆదుకునే అగ్నిమాపక సిబ్బందే ఆపదలో ఉన్నారు. వృత్తిపరమైన శిక్షణకు నోచుకుండానే విధులు నిర్వహిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. తమిళనాడులో చెన్నై, వేలూరు, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురైలో అగ్నిమాపకశాఖకు సంబంధించి ప్రధాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ ఐదు ప్రధాన కేంద్రాల అజమాయిషీ కింద 302 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. హొగెనకల్, కొత్తగిరిల్లో మరో రెండు ప్రత్యేకవిభాగాలు ఉన్నాయి. అన్నింటిలో కలిపి వేలాది మంది అగ్నిమాపక సహాయ సిబ్బంది పనిచేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు, నిర్మాణాలు కూలిపోయినపుడు వీరే సహాయక చర్యలు చేపడతారు. చెరువులు, నీటిగుంతల్లో పడిపోయిన వారి ప్రాణాలను రక్షించడం కూడా వీరి బాధ్యతే. ఈ పనులు నిర్వర్తించేందుకు ప్రారంభదశలోనే సిబ్బందికి మూడు నెలల పాటు శిక్షణను ఇవ్వాల్సి ఉంది. అంతేగాక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారిలోని నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు అధునాతన శిక్షణ ఇవ్వాలి. ఈ రకమైన శిక్షణలో పాములు పట్టుకునే విధానం అత్యంత ప్రధానమైనది. వివిధ సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందికి ఒక్కోసారి విషసర్పాలు ఎదురవుతాయి. ఆ పాములను ఒడిసి పట్టుకునేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. 2005 తరువాత అగ్నిమాపక సిబ్బంది పాములను పట్టే శిక్షణకు నోచుకోలేదు. శిక్షణ పొందలేదు కదా అని రక్షణ చర్యలకు దూరంగా ఉండలేక పోతున్నారు. శిక్షణ పొందకుండానే 8 ఏళ్లుగా ప్రాణాలకు తెగించి పాములు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం పోత్తేరీలోని ఒక ప్రయివేటు కళాశాలలోకి పాము జొరబడింది. అగ్నిమాపక శాఖకు చెందిన నేశగుహన్ (27) పామును పట్టుకునే ప్రయత్నం చేయగా కాటువేసింది. హడావుడిగా అతన్ని ఆస్పత్రికి తరలించి ప్రాణం కాపాడారు. శిక్షణకు నోచుకోకుండా విధులు నిర్వర్తించడం వల్లనే ఇటువంటి విపరీతాలు చోటుచేసుకుంటున్నాయని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందికి శిక్షణపై తిరునెల్వేలీకి చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ, కొత్తగా విధుల్లో చేరేపుడు ఇచ్చే శిక్షణే అత్యంత సాధారణంగా సాగుతోంది. మూడునెలల పాటూ ఇచ్చే శిక్షణను మొక్కుబడిగా పూర్తిచేస్తున్నారు. ఈ శిక్షణలో పాములు పట్టే విధానంపై ఎటువంటి మెళకువలను నేర్పడం లేదు. ఇతర శిక్షణ కంటే పాములు పట్టే విషయంలో ప్రత్యేక శిక్షణ, జాగ్రత్తలు, వాడాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచాల్సి ఉంది. అయితే 8 ఏళ్లుగా ఉన్నతాధికారులు ఈ విషయాన్నే పక్కనపెట్టేశారు. సహాయక చర్యలకు పోయినపుడు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలను ఆదుకునేది సిబ్బందే. అరుుతే వారు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను ఎన్నో సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అంతేకాదు, నీటిలో మునిగిపోయిన వ్యక్తిని రక్షించేందుకు ఈతలో శిక్షణనిచ్చి సరిపుచ్చుతున్నారు. నీటి అడుగు భాగంలోకి వెళ్లాలంటే మాస్కులు, ఆక్సిజన్ అవసరం. ఇవేమీ సరఫరా చేయడం లేదు. ఆపదలో ఉన్న ర క్షించే వారికే రక్షణ కరువైపోవడంతో వారు దినదినగండంగా బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.