వర్షాలకు జిల్లా అతలాకుతలం
మొత్తం నష్టం రూ. 239.81కోట్లు
కుదేలయిన వ్యవసాయరంగం
నష్టంపై సర్కారు కాకిలెక్కలు
క్షేత్ర పరిశీలనతో పొంతన కుదరని అధికారుల గణాంకాలు
సహాయక చర్యలపై అసంతృప్తి
తిరుపతి: మున్నెన్నడూ లేనివిధంగా కురిసిన వర్షాలకు జిల్లా అతలాకుతలమయింది. అన్నదాతను అనూహ్య వర్షాలు నష్టాల్లో ముంచెత్తింది. వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తూ కలవరపెడుతున్నాయి. వర్షాఘాతానికి ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు. అన్ని వర్గాలపై జలఖడ్గం దాడి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే స్పందించాల్సిన సర్కారు తీరుపై జనం పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వేస్తున్న నష్టం అంచనా లెక్కలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వారు చెబుతున్న లెక్కలకూ, క్షేత్రస్థాయిలో వాస్తవాలకూ ఏమాత్రం పొంతన కుదరడం లేదు. జిల్లావ్యాప్తంగా సాక్షి విలేకరుల బృం దం నష్టం అంచనా వేసినప్పుడు అధికారుల లెక్కల్లో డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వర్షాలకు 45మంది మృత్యువాత పడితే సర్కారు 14మంది చనిపోయినట్లు లెక్కకట్టింది. కూలిపోయిన ఇళ్లు కూడా అధికారులు తక్కువే చూపిస్తున్నారు.
రైతునష్టం విషయంలోనూ అదేతీరు. మరోపక్క ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నామని చెపుతున్నప్పటికి, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. రైతులు ఎకరాకు సరాసరిన రూ 30-35వేలు ఖర్చు చేసి పంటలను సాగు చేశారు. అవి కళ్లెదుటే నీట మునిగి పోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమి పట్టదన్నట్లు వ్యవహారిస్తూ మాటలకే పరిమిత మవుతోంది. ఇంతవరకు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరిగి పంట నష్టం వేసిన దాఖలా ల లేదు. పైగా జిల్లా కేంద్రంలో కాకిలెక్కలను వేస్తూ సర్కారుకు నివేదిస్తున్నారు.
అంటువ్యాధుల బెడద...
వర్షాలకు పలుగ్రామాలు, పట్టణాల్లో తాగునీరు కలుషితమవుతోంది. వ్యాధులు జిల్లాను చుట్టిముట్టే అవకాశం ఉంది. ఇప్పటికే డెంగీ జ్వరాలతో గజగజ వణికి పోయిన జిల్లా వాసులు, ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని బెంబేలెత్తుతున్నారు..చలిగాలులకు తోడు, దోమలు బెడద ప్రజలను పట్టి పీడిస్తోంది. పారిశుధ్యానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పంచాయతి, కార్పొరేషన్, వైద్య శాఖ అధికారులు నామ మాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.
వృథాగా పోతున్న నీరు...
జిల్లా వ్యాప్తంగా పలు చెరువులకు గండ్లు పడినీరు వృథాగాపోతోంది. ఇంకా పలు చోట్ల మరమ్మత్తులుచేపట్టలేదు. తొట్టంబేడు మండలంలో తెలుగు గంగ కాలువకు గండ్లు పడటంతో వృథాగా నీరుపోతూనే ఉంది. కాళంగి రిజర్వాయర్ గేట్ విరిగి పోవడంతో నీరు బయటకు పోతోంది.ఇంకా వర్షాలు కురిస్తే పలు చెరువులు ప్రమాదపుటంచున ఉండటంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. పీలేరు నియోజక వర్గంలో మేడికుర్తి చెరువుకు గండి పండటంతో ఇప్పటికే ప్రాజెక్టులోని నీరంతా వృథాగా బయటకు పోయింది.
కాస్త ఉపశమనం
శుక్రవారం వరుణుడు కాస్త శాంతించడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది. తిరుపతిలో ఆటోనగర్, చంద్రశేఖర్‌రెడ్డినగర్, నవోదయ కాలనీ, కొర్రమేను కుంటలాంటి కాలనీలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తుండటం, కళ్యాణి డ్యాంలోకి నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో, నీటిని దిగువకు విడుదల చేస్తే పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైయ్యే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాల ప్రజలు హడలి పోతున్నారు.శ్రీకాళహస్తి నియోజక వర్గంలో ఇంకా 60 గ్రామాలకు పైగా రాకపోకలకు నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని విమానాలు అలస్యంగా నడుస్తున్నాయి.
వర్షం నష్టంపై అధికారిక లెక్కలివీ..
చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలో తుపాను బాధితులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టామని జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయ్‌చందర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తుపాను ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా 14 మంది మృతి చె ందారని, 3,694 ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. మృతులకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్ష ల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. దెబ్బతిన్న ఇళ్లలో 144 పూర్తిగా నేలమట్టమయ్యాయన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పక్కా ఇంటికి రూ. 50 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ. 25 వేలు, గుడిసెలకు రూ. 5 వేలు, అతిగా ప్రమాదం జరిగిన ఇంటికి రూ. 6 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 5,780 మందికి ఆహారం అందజేసినట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా 212 గొర్రెలు, 44 మేకలు, 3 ఎద్దులు, దూడ, 168 పందులు మృతి చెందాయన్నారు. 42 చెరువులకు గండిపడగా, వాటి నుంచి ఎలాంటి ప్రమాదం సంభవించకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.
వరద నీటిలో కొట్టుకుపోరుు వుృతి
నాగలాపురం: వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మరణిం చాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం నందనంలో జరిగింది. గ్రావూనికి చెందిన రాజేం ద్రయ్యు(53) శుక్రవారం సాయుంత్రం రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తున్న కాలువను దాటబోయాడు. వరద నీరు ఉధృతికి కొట్టుకుపోయాడు. గమనించిన గ్రామస్తులు గాలించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆ గ్రావు శ్మశానవాటిక సమీపాన కాలువ వద్ద రాజేంద్రయ్య మృతదేహం ఉండటం గుర్తించారు.
లెక్కలేదా...
Published Sat, Nov 21 2015 1:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement