Suraram
-
HYD: సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణికులకు గాయాలు
సాక్షి,హైదరాబాద్: నగరంలోని సూరారంలో ఆదివారం(జులై 7) సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు మండిపడ్డారు. ఈ ఘటనతో బహదూర్‌పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు ట్రాఫిక్‌జామ్ అయింది.వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. జీడిమెట్ల డిపో బస్సు గండి మైసమ్మ నుంచి సికింద్రాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. -
చెరువులోకి దూకిన దొంగ..గంటలు గడుస్తున్నా దొరకని దొంగ..
-
ఏడుపదుల వయసులోనూ..
ఒకప్పుడు చిన్న మ్యాటర్ రాయాలన్నా టైప్ సెంటర్ల వద్దకు క్యూ కట్టాల్సి వచ్చేది.. కొన్ని ఉద్యోగాలకు టైపు రైటింగ్ తప్పనిసరి. టైప్ రైటింగ్ నేర్చుకునేందుకు సెంటర్ల వద్ద టైమ్ ఫిక్స్ చేసుకొని బ్యాచ్‌లు ఏర్పాటు చేసుకునేవారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కాలనీలో చూసినా ఆన్లైన్, మీసేవ, నెట్ సెంటర్లే కనిపిస్తున్నాయి. ఏ సేవలైనా కంప్యూటర్ కావాల్సిందే.. దాదాపు టైప్ ఇనిస్టిట్యూట్స్ మూతపడ్డాయి. కానీ 70 సంవత్సరాల వయసులోనూ ఓ వ్యక్తి టైప్ ఇనిస్టిట్యూట్ నడిపిస్తూ.. నామమాత్రపు ఫీజు తీసుకొని ఎంతో మంది విద్యార్థులకు టైపింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. సూరారం గ్రామానికి చెందిన సామల యాదగిరి సూపరింటెండెంట్‌గా రిటైరయ్యారు. బోయిన్‌పల్లిలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదివిన ఆయన డిగ్రీ పూర్తి చేసి ఐడీపీఎల్‌లో పనిచేస్తూ, మరోపక్క అమీర్‌పేట్‌లో టైపు నేర్చుకొని లోయర్, హైయర్‌లో ఉత్తీర్ణత సాధించాడు. 1969లో పరిశ్రమల శాఖలో టైపిస్ట్‌గా చేరి నెలకు రూ.130 జీతం తీసుకున్నాడు. 1979లో సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. పనిలో మరింత చురుగ్గా వ్యవహరించడంతో 1996లో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ పొంది మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. 2004లో పదవి విరమణ అనంతరం సూరారంలో కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శ్రీచక్ర టైపు ఇనిస్టిట్యూట్‌ను స్థాపించి నామమాత్రపు ఫీజు తీసుకుని యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఏడు పదుల వయసులో కూడా నిముషానికి 45 పదాలు టైప్ చేస్తూ తనకుతానే సాటి అనిపించుకున్నాడు. శిక్షణ కోసం పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు. ఫీజు గురించి వారిపై ఎప్పుడూ ఒత్తిడి పెంచకుండా వారికి టైప్ రైటింగ్‌లో తర్ఫీదునిస్తున్నాడు. టైప్ మిషన్ మరిచిపోయారు నేటి యువత కంప్యూటర్ వాడుతున్నారు. కొంతమంది టైప్ చేసేందుకు బద్దకిస్తూ ఫోన్లో వాయిస్ టైపింగ్ చేస్తున్నారు. చాలామంది టైప్ మిషన్ అనేది ఉందనే విషయాన్ని మరిచిపోయారు. టైప్ రైటింగ్ నేర్చుకుంటేనే కంప్యూటర్‌పై రాణించగలుగుతారు. ప్రభుత్వం టైప్ మిషన్ నేర్చుకోవాలనే రూల్ పెడితే నేటి యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. – సామల యాదగిరి -
పచ్చని కుటుంబంలో చిచ్చు
సాక్షి, హైదరాబాద్: పచ్చని కుటుంబంలో ఊహించని ప్రమాదం పెను విషాదం రేపింది. గ్యాస్ సిలిండర్ మృత్యుపాశంగా మారి చిన్నారితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలంటుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా, మదిర గ్రామానికి చెందిన షేక్ సుభానీ(32), షేక్ షర్మిళ (25) దంపతులు హైదరాబాద్ నగరానికి వలస వచ్చి సూరారం హనుమాన్ నగర్లో నివాసముంటున్నారు. వీరికి షేక్ హైదర్ ఫిర్దోస్(3) కుమార్తె. ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 5న సాయంత్రం ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో సుభానీ సిలిండర్ మార్చాడు. 6వ తేదీ ఉదయం అతను సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు స్విచ్ ఆన్ చేశాడు. అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుభానీతో పాటు అతడి భార్య షర్మిళ, కుమార్తె ఫిర్దౌస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 12న సుభాని, షర్మిళ మృతి చెందగా, చిన్నారి ఫిర్దోస్ బుధవారం కన్నుమూసింది. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి 20 రోజుల జైలు
సాక్షి, సూరారం(హైదరాబాద్) : డ్రంకన్ డ్రైవ్‌లో మూడవ సారి పట్టుబడిన వ్యక్తికి 20 రోజుల జైలు శిక్షతోపాటూ లైసెన్స్ రద్దు చేస్తు మేడ్చల్ కోర్టు తీర్పునిచ్చింది. కుత్బుల్లాపూర్ గాంధీనగర్‌కు చెందిన లాల్‌మహ్మద్ బుధవారం రాత్రి నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. గతంలో రెండు సార్లు ఇదే తరహాలో దొరకడంతో గురువారం ట్రాఫిక్ పోలీసులు అతన్ని మేడ్చల్ కోర్టులో హాజరు పరిచారు. మూడుసార్లు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడడంతో ఆగ్రహించిన జడ్జి అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు 20 రోజుల జైలు శిక్ష విధించారు. -
చదువుల తల్లులకు అండగా నిలిచిన పోసాని
-
అత్యాచార నిందితులకు రిమాండ్
మెదక్: మోసపూరిత మాటలతో ఇంటి వద్ద దిగబెడతామని నమ్మించి బైక్ పై మహిళను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ఓ మహిళ(30)పై బాలేష్, నగేష్ అనే ఇద్దరు యువకులు బుధవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. -
మహిళా రైతు ఆత్మహత్య
కాళేశ్వరం : కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన చల్లా స్వరూప(38) అనే మహిళా రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకుంది. గత రెండేళ్లగా తమకున్న ఐదెకరాల భూమిలో స్వరూప, శ్రీనివాస్ దంపతులు పత్తిపంటను సాగుచేస్తున్నారు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోయారు. ఇదే క్రమంలో గురువారం స్వరూప, శ్రీనివాస్ తమ పత్తి చేనులో కలుపు తీస్తుండగా మేడిగడ్డ బ్యారేజీ సర్వే అధికారులు వచ్చి మీ భూమి మొత్తం పోతుందని తెలిపారు. ఇప్పటికే రూ.5లక్షల అప్పు ఉన్నామని, భూమి కూడా పోతే ఎలా బతకాలని మనస్తాపం చెందింది. ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి క్రిమిసంహారకమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీనికితోడు కుమార్తె మానస వికలాంగురాలు కావడంతో ఆమెపై మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు. మృతురాలి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వరూప భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పులబాధతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో భూమి కోల్పోతున్నందున ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామన్నారు. -
ఒంటరి ‘పోరు’
సాధారణంగా ఎన్నికల ప్రచారమంటే హంగూ ఆర్భాటం..మందీ మార్బలం తప్పనిసరి. డప్పు చప్పుళ్లు, మైకుల మోతలు, కార్యకర్తల హంగామా ఉండాల్సిందే. ఇలా జనంలోకి వెళ్తేనే.. ఓట్లు రాలడం కష్టతరమవుతున్న ఈ రోజుల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ఒంటరి పోరుకు దిగాడు. ఎలాంటి హంగామా లేకుండా..కార్యకర్తలెవరూ పక్కన లేకుండా.. ఒంటరిగా ఓ గుర్రపు బగ్గీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ఆయనే సూరారం డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బర్ల శ్రీను. కేవలం తన గుర్తున్న జెండాలను బగ్గీకి కట్టేసి ఒంటరిగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. - సూరారం