ఒంటరి ‘పోరు’
సాధారణంగా ఎన్నికల ప్రచారమంటే హంగూ ఆర్భాటం..మందీ మార్బలం తప్పనిసరి. డప్పు చప్పుళ్లు, మైకుల మోతలు, కార్యకర్తల హంగామా ఉండాల్సిందే. ఇలా జనంలోకి వెళ్తేనే.. ఓట్లు రాలడం కష్టతరమవుతున్న ఈ రోజుల్లో ఓ స్వతంత్ర అభ్యర్థి ఒంటరి పోరుకు దిగాడు. ఎలాంటి హంగామా లేకుండా..కార్యకర్తలెవరూ పక్కన లేకుండా.. ఒంటరిగా ఓ గుర్రపు బగ్గీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ఆయనే సూరారం డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బర్ల శ్రీను. కేవలం తన గుర్తున్న జెండాలను బగ్గీకి కట్టేసి ఒంటరిగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. - సూరారం