Surendar
-
బీమారంలోని చైతన్య జూనియర్ కాలేజ్ ఛైర్మన్ సురేందర్ గౌడ్ అరెస్ట్
-
అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి..`
వరంగల్/మహబూబాబాద్: హనుమకొండ జిల్లా భీమారంలోని శ్రీ చైతన్య కళాశాల అధ్యక్షుడు బూర సురేందర్ గౌడ్ కీచకుడని తేలింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈమేరకు నిందితుడు సురేందర్గౌడ్తో పాటు అతడికి సహకరించిన మెస్ ఇన్చార్జ్ శ్రవణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆదివారం వెల్లడించారు. హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన బూర సురేందర్‌గౌడ్ స్థానికంగా శ్రీ చైతన్య ప్రైవేట్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నాడు. నాలుగు అంతస్తుల భవనం.. గ్రౌండ్ ఫ్లోర్లో కళాశాల కార్యాలయం, మొదటి ఫ్లోర్లో తరగతులు, రెండు, మూడు ఫ్లోర్లలో హాస్టల్, నాలుగో ఫ్లోర్లో ఇద్దరు భార్యలు రేణుక, సంధ్య, ఇద్దరు పిల్లలతో సురేందర్‌గౌడ్ నివాసముంటున్నాడు. ప్రస్తుతం బాలికల క్యాంపస్‌లో 160 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సురేందర్‌గౌడ్ సస్పెన్షన్ హసన్‌పర్తి: విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భీమారానికి చెందిన శ్రీ చైతన్య జూని యర్ కళాశాల చైర్మన్ బూర సురేందర్గౌడ్ను బీజేపీ 55వ డివిజన్ అధ్యక్ష పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వంనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బి.ఉమాశంకర్ సోమవారం ప్రకటించారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీకి అప్రతిష్ట కలిగేలా ప్రవర్తిస్తూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు వేటు వేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. వారం రోజుల్లో రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని సూచించారు. అర్ధరాత్రి ఫోన్ చేసి.. ఈనెల 22వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో హాస్టల్లో ఉన్న ఆ విద్యార్థినికి శ్రవణ్ ఫోన్ చేసి కిందికి రమ్మన్నాడు. భయపడిన ఆ విద్యార్థిని స్నేహితులతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వచ్చింది. వారిని చూసిన సురేందర్‌రెడ్డి ఆగ్రహంతో ఆ విద్యార్థినిని దూషించడమే కాకుండా బెదిరింపులకు గురిచేశాడు. అడ్డుగా వచ్చిన మరో విద్యార్థినిపై చేయి చేసుకుని అక్కడి నుంచి సురేందర్, శ్రవణ్ పరారయ్యారు. కళాశాలలో అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు.. సురేందర్ గౌడ్ వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి యత్నించే వాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని ఏసీపీ కిరణ్‌కుమార్ వివరించారు. విద్యార్థినిపై కన్ను.. హాస్టల్లో ఉంటూ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిపై కన్ను వేసిన సురేందర్‌గౌడ్ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి యత్నించాడు. ఇందుకు ఫీజు మాఫీ చేస్తానని.. డబ్బులు కూడా ఇస్తానని మభ్యపెట్టాడు. ఇందుకు హాస్టల్లో మెస్చార్జ్గా పని చేస్తున్న చెన్నారావుపేటకు చెందిన శ్రవణ్ సహకారం తీసుకున్నాడు. పలుమార్లు మాటలతో వేధించడమే కాకుండా అసభ్యకరంగా వ్యవహరించినా ఆ విద్యార్థిని లొంగలేదు. విద్యార్థి సంఘాల ఆందోళన.. కళాశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈమేరకు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం వడ్డేపల్లి చర్చి వద్ద సురేందర్, శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఘటనకు సంబంధించిన వాస్తవాలు అంగీకరించారని ఏసీపీ చెప్పారు. సమావేశంలో సీఐ అబ్బయ్య, ఎస్సై సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ? -
TS Election 2023: ఎవరెవరు.. ఎక్కడెక్కడ..? బీఆర్ఎస్ లో త్వరలో స్పష్టత..!
నిజామాబాద్: బాన్సువాడలో తిరిగి పోచారం శ్రీనివాస్‌రెడ్డే బరిలో ఉంటారని సీఎం కేసీఆర్ తేల్చేయగా.. పక్కనున్న జుక్కల్‌లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేనే మరోసారి గెలిపించాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల ఎల్లారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. జాజాల సురేందర్‌ను బంపర్ మెజారిటీతో మరోసారి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. ఇలా జిల్లాలోని మిగతా మూడుచోట్ల అధికార పార్టీనుంచి బరిలో నిలిచేది ఎవరో తేల్చేసిన బీఆర్ఎస్ అధిష్టానం.. కామారెడ్డిపై మాత్రం ప్రకటన చేయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన నెలకొంది. అయితే కామారెడ్డి టికెట్టు తనదేనన్న నమ్మకంతో ఉన్న గంప గోవర్ధన్.. తన అనుచరుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎన్నికలకు పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సర్వేలు చేయించిన సీఎం కేసీఆర్.. గెలుపుకోసం అవసరమైన చోట అభ్యర్థులను మారుస్తారన్న ప్రచారం జరిగింది. అందులో కామారెడ్డి అసెంబ్లీ స్థానం ఒకటన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కామారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. గంప గోవర్ధన్ నేతృత్వంలో కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అభినందించారు. కేటీఆర్ గోవర్ధన్‌ను అభినందించడం కేడర్‌కు కొంత ఉత్సాహాన్నిచ్చినా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్.. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్‌ను కోరానన్నారు. కేసీఆర్ పోటీ చేస్తే కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందన్న భావనతో తాను సీఎంను ఆహ్వానించానని పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయంగా చర్చ జరిగింది. గోవర్ధన్ గెలవడని సర్వేలు చెబుతున్నాయని, అందుకే ఓటమి భయంతోనే కేసీఆర్ పేరు తెరపైకి తీసుకువచ్చారంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. కేసీఆర్ పోటీ చేసినా, ఇంకా ఎవరు పోటీ చేసినా తన గెలుపును ఎవరూ ఆపలేరన్న ధీమా వ్యక్తం చేశారు. దీంతో గంప గోవర్ధన్ తన స్వరం పెంచారు. కేసీఆర్ పోటీ చేయకపోతే తానే బరిలో ఉంటానని, షబ్బీర్‌అలీని చిత్తుగా ఓడిస్తానని ప్రకటించారు. మిగతా నియోజకవర్గాల్లో.. బాన్సువాడలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ ఎప్పుడో తేల్చేశారు. బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమలను సందర్శించిన సమయంలో మళ్లీ పోచారం శ్రీనివాస్‌రెడ్డినే గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అనంతరం పిట్లంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్ సింధేకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈనెల 14న జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పర్యటనలో జాజాల సురేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇలా జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో సిట్టింగ్‌లే బరిలో నిలుస్తారన్న స్పష్టత రావడం, కామారెడ్డిపై మాత్రం ప్రకటన చేయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. తమ నాయకుడికి టికెట్టు వస్తుందో లేదోనన్న టెన్షన్లో వారున్నారు. దీనికి తోడు పలువురు నాయకులు టికెట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడంతో గంప అనుచరుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. దీంతో గంప వారి ఆందోళన తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి గ్యారంటీ అంటూ.. మంత్రి కేటీఆర్ నాయినమ్మ ఊరైన కోనాపూర్‌లో నిర్మించిన స్కూల్ బిల్డింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. కేటీఆర్ విదేశీ పర్యటన తర్వాత కోనాపూర్‌కు వస్తారని, అప్పుడు నియోజక వర్గస్థాయిలో నిర్వహించే సభలో కామారెడ్డి టికెట్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంటే ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు మంజూరై, పార్టీ నాయకత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యేదని అంటున్నారు. అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో సీఎం ఇక్కడినుంచి పోటీ చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్టు తనకే వస్తుందని గంప సైతం ధీమాతో ఉన్నారు. క్యాడర్లో నెలకొన్న ఆందోళనకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రయత్నిస్తున్నారు. మొన్నటివరకు టికెట్టు విషయమై మాట్లాడని గోవర్ధన్.. ఇటీవల టికెట్టు తనకే వస్తుందంటూ తనను కలుస్తున్నవారితో పేర్కొంటున్నారు. పోటీ చేయడమే కాదు మరోసారి విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి ఇక్కడి నుంచి పోటీ చేయమని సీఎం కేసీఆర్‌ను కోరానని, ఆయన పోటీ చేస్తానంటే తాను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నానని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో తనకు టికెట్టు పక్కా అనే ధీమా గోవర్ధన్‌లో కనిపిస్తోంది. -
సీఎల్పీ విలీనం లక్ష్యంగా!
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’లక్ష్యంగా టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల జోరు పెంచింది. తెలంగాణ చట్టసభలలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా వేగంగా చర్చలు మొదలుపెట్టింది. మార్చి ఆఖరుతో శాసనమండలిలో కాంగ్రెస్‌కు ప్రాతనిధ్యం లేకుండా పోతుంది. ఆరోజు వరకు అసెంబ్లీలోనూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకుని.. సీఎల్పీని టీఆర్ఎస్లో విలీనం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. ఉపేందర్‌రెడ్డి గురువారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆయ న టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావుపై ఉపేందర్‌రెడ్డి విజయం సాధించారు. గెలిచినప్పటి నుంచే టీఆర్ఎస్ అధిష్టానంతో ఆయన సంప్రదింపులు మొదలుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఉపేందర్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారుతున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న వెలువడనుంది. ఆలోపు కాంగ్రెస్ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికార పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా.. ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్లో చేరుతారని తెలిసింది. ఖమ్మంపై గులాబీ రెపరెపలు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్షంగా విజయం నమోదు చేసుకున్న టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకుంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క ఖమ్మం సెగ్మెంట్లోనే గెలిచింది. ఎన్నికలు కాగానే.. ఎమ్మెల్యేలు లావుడ్య రాములునాయక్, రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియనాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎల్పీ విలీనం దిశగా.. శాసనమండలిలో అనుసరించిన ‘కాంగ్రెస్ సభాపక్షం విలీనం’ వ్యూహాన్నే శాసనసభలో నూ అమలు చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. శాసనమండలిలో కాంగ్రెస్‌కు ఐదుగురు సభ్యులు ఉంటే ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనమవుతున్నట్లు శాసనమండలి చైర్మన్‌కు లేఖ ఇచ్చారు. దీంతో శానసమండలి కాంగ్రెస్ పక్షం టీఆర్ఎస్లో విలీనమైంది. కేవలం ఇద్దరు ఎమ్మెల్సీలతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఇప్పుడు శాసనసభలోనూ ఇదే వ్యూహానికి రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు కైవసం చేసుకుంది. వీరిలో 13మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైనట్లుగా గుర్తిస్తారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు శాసనసభలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. లోక్‌సభ ఎన్నికలలోపు ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు కదుపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సబితారెడ్డి, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియనాయక్, ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయమే. మరో ఏడుగురు ఇదేబాటలో నడిస్తే.. టీఆర్ఎస్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఖమ్మం పచ్చబడుతుందనే: ఉపేందర్‌రెడ్డి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు వీలైనంత సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు పాలేరు ఎమ్మెల్యే కందా ఉపేందర్‌రెడ్డి తెలి పారు. కేసీఆర్ నాయకత్వంలోనే ప్రాజెక్టులన్నీ పూర్తయితే.. ఖమ్మం జిల్లా పచ్చబడుతుందనే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అవసరమైతే కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పు కోరడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి పత్రికలకు ప్రకటన జారీ చేశారు. ‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. టీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ అన్ని వర్గా ల ప్రజల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభి వృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా అవిరళ కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం వ్యవసాయ భూమికి సాగునీరందించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు భక్తరామదాసు ప్రాజెక్టును శరవేగంగా నిర్మించారు. కరువు పీడిత పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో సీతారామ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా లో ప్రాజెక్టులన్నీ పూర్తయి, జిల్లా అంతా పచ్చబడుతుందనే పూర్తి నమ్మకం నాకు కలిగింది. ప్రజల బాగు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నాను. టీఆర్ఎస్లో చేరి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు వీలైనంత సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’ అని పేర్కొన్నారు.