Surgical attack
-
‘పాక్ వినకుంటే గట్టి దాడితోనే సమాధానం’
సాక్షి, న్యూఢిల్లీ : ఇక నుంచి తాము చెప్పిన మాట వినకుండా అతి చేస్తే పాకిస్ధాన్‌కు గట్టి సమాధానం చెప్పి తీరుతామని భారత ఆర్మీ హెచ్చరించింది. అది ఎంత చేస్తే అంతకు రెట్టింపు నష్టాన్ని పాక్ చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. నలుగురు భారత సైనికులపై పాక్ సైనికులు కాల్పులు జరపడంతో వారు చనిపోయిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిగా భారత్ సేనలు సోమవారం ఉదయం పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి దూసుకెళ్లి ఆరుగురు పాక్ ఆర్మీ జవాన్లు కాల్చిపడేసింది. ఈ సందర్భంగా భారత ఆర్మీలోని నిపుణులు ముఖ్యంగా మేజర్ జనరల్ (మాజీ) నరేశ్ బదానీ ఈ దాడిపై మాట్లాడుతూ భారత సైనికులు తాజాగా చేసిన చర్య కూడా మరో సర్జికల్ స్ట్రైక్ లాంటిదేనని అన్నారు. గతంలో అయితే, పూర్తిస్థాయి సర్జికల్ దాడికి తాజాగా జరిగిన దాడికి కొంత వ్యత్యాసం ఉందన్నారు. అయితే, దీనిని పూర్తి స్థాయిలో దెబ్బకు దెబ్బ, ప్రతీకార దాడి అని చెప్పారు. తొలుత పాక్ వాళ్లే భారత సైనికులను కాల్చి చంపారని అందుకు ప్రతీకారంగానే భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లి ప్రతీకారం తీర్చుకుందని చెప్పారు. ఇక నుంచి పాక్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిదని అన్నారు. లేకుంటే పాక్ ఆలోచించేలోపే భారత్ దెబ్బకొడుతుందని, గట్టి సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. అయితే, శాంతికి తొలి ప్రాధాన్యం భారత్ ఇస్తుందని, అలాగే సమయానికి తగ్గట్టు ప్రతిస్పందిస్తుందని స్పష్టం చేశారు. -
‘సర్జికల్’ యోధులకు శౌర్యపతకాలు
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ దాడి చేసిన జవాన్లకు కేంద్రం రిపబ్లిక్ డే సందర్భంగా శౌర్యపతకాలు ప్రకటించింది. దాడిలో పాల్గొన్న 4వ, 9వ పారామిటలరీలకు చెందిన 19 మంది సైనికులను కీర్తిచక్ర, యుధ్ సేవా తదితర మెడళ్లు వరించాయి. దాడిలో పటాలాలకు సారథ్యం వహించిన మేజర్ రోహిత్ సూరి(4వ పారా)కి శాంతిసమయంలో ఇచ్చే రెండో అత్యున్నత శౌర్యపతకమైన కీర్తిచక్రను, ఈ దళాల కమాండింగ్ అధికారులైన కపిల్ యాదవ్, హర్‌ప్రీత్ సంధులకు యుధ్సేవాను ప్రకటించారు. ఈ పటాలాల్లోని ఐదుగురికి శౌర్యచక్రలు, 13 మం దికి సేనా మెడల్స్ దక్కాయి. కాగా, గూర్ఖా రైఫిల్స్ హవల్దార్ ప్రేమ్ బహదూర్ రేస్మి మగర్‌కు మరణానంతరం కీర్తి చక్రను, పాండురంగ్ మహదేవ్, నాయక్ విజయ్ కుమార్ తదితరులకు మరణానంతరం సేనా మెడల్స్‌ను ప్రకటించారు. వివిధ దళాల సైనికులకు 398 శౌర్య, ఇతర రక్షణ పతకాలు అందించేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆర్మీ తూర్పు కమాండ్ సారథి మేజర్ ప్రవీణ్ బక్షి, ఆర్మీ చీఫ్ పదవికి బిపిన్ రావత్‌తో పోటీపడిన దక్షిణ కమాండ్ సారథి మేజర్ పీఎం హరీజ్‌లకు పరమ్ విశిష్ట సేవాల మెడళ్లు దక్కాయి. -
ముందున్నది యుద్ధమేనా?
-
ముందున్నది యుద్ధమేనా?
సర్జికల్ దాడుల తర్వాత ఊపందుకుంటున్న ఊహాగానాలు న్యూఢిల్లీ: పాక్‌పై భారత బలగాలు జరిపిన సర్జికల్ దాడుల తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తనున్నాయి.. యుద్ధానికి దారి తీస్తుందా.. లేదా.. ఒకవేళ యుద్ధం వస్తే భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి.. ఇలాంటి ప్రశ్నలు విశ్లేషకుల నుంచి సామాన్య ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి. ఒకవేళ సుదీర్ఘ యుద్ధం జరిగితే మూడో యుద్ధం.. స్వల్పకాల యుద్ధం జరిగితే ఐదోది కానుంది. తొలిసారిగా 1947-48లో కశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు జిన్నా పటాన్ల ఆర్మీని భారత్‌పైకి పంపినపుడు యుద్ధం జరిగింది. దీని పర్యవసానంగా కశ్మీర్‌లోని కొంత భాగం ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాక్ కైవసం చేసుకుంది. తిరిగి 1965లో కశ్మీర్‌ను ఆక్రమించుకోవాల్సిందిగా అయూబ్ ఖాన్‌ను అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి భుట్టో పురికొల్పారు. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి లాహోర్ వైపు సరిహద్దు వెంబడి యుద్ధ ట్యాంకులను మోహరించారు. ఆ తర్వాత తాష్కెంట్ ఒప్పందంతో ఈ యుద్ధం అసంపూర్తిగానే ముగిసింది. ఎంతో ఖరీదుతో కూడుకున్న యుద్ధ విమానాల విడిభాగాల వ్యయం భరించలేక ఈ యుద్ధాన్ని ముగించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పాకిస్తాన్‌తో పోల్చుకుంటే భారత్ ఆర్థికంగా, శక్తిమంతంగా తయారైందనే చెప్పుకోవచ్చు. 1971 యుద్ధం తర్వాత పాక్‌నుంచి విడిపోయి బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పటికీ ఇరు దేశాలు దీన్ని యుద్ధంగా అధికారిక ప్రకటనలు చేయలేదు. యుద్ధం జరిగే అవకాశాలూ లేకపోలేదు ఉడీ ఘటన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పాక్‌పై ప్రతీకార దాడి చేయాలని నిర్ణయం తీసుకోవడం.. సర్జికల్ దాడులు జరగడం చకాచకా జరిగిపోయాయి. అయితే సర్జికల్ దాడుల గురించి ప్రకటించే సమయంలో వాడే భాషలో కూడా భారత్ ఎంతో జాగ్రత్త తీసుకుంది. ఇంకా ముందుకు వెళ్లబోమని పాకిస్తాన్‌కు, ప్రపంచానికి హామీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే పాక్, భారత్ మధ్య ఇప్పటికే అనేక సార్లు యుద్ధాలు సంభవించిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం జరిగే అవకాశాలు లేకపోలేదు. సర్జికల్ దాడితో ఉగ్రవాదం సమసిపోతుందా... పాక్‌పై జరిపిన సర్జికల్ దాడుల వల్ల పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం సమస్య సమసి పోతుందా.. లేదంటే మళ్లీ భారత్‌పై ఉగ్ర దాడి జరిగితే భారత్ తర్వాతి కర్తవ్యం ఏంటి? మరలా సర్జికల్ దాడి చేస్తుందా... అంతకన్నా పెద్ద నిర్ణయం తీసుకుంటుందా.. ఇప్పటికే బంగ్లాదేశ్‌ను పాక్ నుంచి విడదీసి సగం చేశాం. అయినా పాక్ గుణపాఠం నేర్చుకోలేదు. ఇంకా సగం విభజిస్తే కానీ పాకిస్తాన్ నేర్చుకుంటుందా? యుద్ధమే జరిగితే వేల ప్రాణాలు బలికావాల్సి ఉంటుంది. -
ఆర్మీ ఆపరేషన్ పై నేతలు ఏమన్నారంటే
భారత ఆర్మీ గురువారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ఉగ్రవాదుల స్ధావరాలపై చేసిన దాడులపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం పలు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. ఆర్మీ పీఓకేలో చేసిన సునిశిత దాడి(సర్జికల్ స్ట్రైక్) గురించి కేంద్ర ప్రభుత్వం తమకు పూర్తిగా వివరించిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ చేసిన మెరుపు దాడి పాక్ ను దెబ్బకు దెబ్బ కొట్టడమేనని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఆర్మీ చేసిన దాడి మిలటరీ ఆపరేషన్ కాదని ఉగ్రవాద వ్యతిరేక దాడి అని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వద్ద నిర్దేశిత దాడులను(సర్జికల్ అటాక్స్) నిర్వహించిన ఆర్మీను, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ అభినందించారు. ఆర్మీ దేశభక్తి, సాహసాలను కీర్తించారు. గురువారం భారత ఆర్మీ దాడితో భవిష్యత్తు ఉగ్రదాడులను భారత్ సహించబోదని పాకిస్తాన్ కు బోధపడిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. నిర్దేశిత దాడుల గురించి పాక్ చేసిన కామెంట్లపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆయన అంతకంటే ఏం చెప్పుకుంటారని అన్నారు. అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దాడులపై వరుస ట్వీట్లు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆర్మీ చక్కని పోరాటం చేసిందని కొనియాడారు. భారత వ్యతిరేకశక్తుల పీచమణచడంలో ఆర్మీ తిరుగులేని ధైర్య,సాహసాలను ప్రదర్శించిందని అన్నారు. సరైన సమయంలో చక్కని నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన్ని కూడా ఆయన ట్వట్టర్ ద్వారా అభినందించారు. దాడులపై మాట్లాడిన సీపీఐ నేత ఏచూరి సీతారం ఆర్మీ దాడిని పార్టీ సమర్ధిస్తున్నట్లు చెప్పారు. బలగాలను ఉపయోగించడం సరైన నిర్ణయం కాదనేది తన అభిప్రాయమని తెలిపారు. చర్చల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమని, ఇరుదేశాల మధ్య సంప్రదింపులు మొదలవ్వాలని ఆకాంక్షించారు. భారతీయ ఆర్మీ పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇచ్చిందని, ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని చెప్పారు. ఇది కేవలం సునిశిత దాడి మాత్రమే కాదని పాకిస్తాన్ కు భారత్ ఇచ్చిన వార్నింగ్ అని చత్తీస్ ఘడ్ సీఎం రామన్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉగ్రదాడులను సహించేది లేదని చెప్పారు.