Swatilakra
-
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేలా!
నాగోజు సత్యనారాయణ: రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పూర్తిస్థాయిలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు టీఎస్ఎస్పీ(తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్) బెటాలియన్స్ అడిషనల్ డీజీ, కేంద్ర బలగాల భద్రత విధులకు సంబంధించి రాష్ట్ర నోడల్ అధికారి స్వాతి లక్రా వెల్లడించారు. స్థానిక శాంతిభద్రతల పరిస్థితుల ఆధారంగా సున్నితమైన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఎన్నికల భద్రత విధుల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాల మోహరింపు, ప్రధాన విధులకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అడిషనల్ డీజీ స్వాతిలక్రా పంచుకున్నారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు ప్రధానంగా అప్పగించే ఎన్నికల విధులు...? ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడంలో అన్ని దశల్లోనూ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు స్థానిక పోలీసులకు సహకారంగా ఉంటాయి. ప్రధానంగా వాహన తనిఖీలు, రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులు, ఇతర కీలక పాయింట్లలో పహారా, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు..ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద కీలకమైన భద్రత విధులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు అప్పగిస్తాం. ఎన్నికల విధుల్లో కేంద్ర బలగాల మోహరింపు ఏ ప్రాతిపదికన ఉంటుంది..? స్థానికంగా ఎన్ని పోలింగ్స్టేషన్లు ఉన్నాయి..అందులో ఎన్ని సమస్యాత్మకమైనవి, సున్నితమైనవి ఉన్నాయన్న నివేదిక ఆధారంగా కేంద్ర బలగాలను పంపుతున్నాం. ప్రస్తుతానికి వంద కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రవ్యాప్తంగా పంపించాం. స్థానికంగా వాళ్లకు వసతి సదుపాయానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్స్టేషన్లు,, గత ఎన్నికల్లో నమోదైన ఘటనల ఆధారంగా సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అవసరం మేరకు అదనపు బలగాలను కేటాయిస్తున్నాం. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కేంద్ర బలగాలతో అన్ని ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించడానికి కారణం..? స్థానికంగా యూనిట్ ఆఫీసర్లు కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్‌లు చేస్తున్నారు. దీని ముఖ్యఉద్దేశం..మీ ప్రాంతంలో భద్రత కోసం పూర్తి సన్నద్ధంగా మేం ఉన్నాం అని పోలీసు నుంచి ప్రజలకు భరోసా ఇవ్వడమే. దీనివల్ల ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం. అదే సమ యంలో సంఘ విద్రోహశక్తులకు ఒక్కింత హెచ్చరిక మాదిరిగా ఈ కవాతులు చేయడం సర్వసాధారణమే. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు తోడు ఇతర రాష్ట్రాల పోలీసు సిబ్బంది బందోబస్తుకు వస్తారా..? ఇంకా కొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఉన్నందున అందుకు అనుగుణంగా విడతల వారీగా కేంద్ర సాయుధ బలగాల సర్దుబాటు ఉంటుంది. ఒక్కో కంపెనీలో సరాసరిన 80 నుంచి 100 మంది వరకు సిబ్బంది ఉంటారు. ఈ లెక్కన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల నుంచే 30 వేల మందికిపైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరికి అదనంగా ఎలక్షన్ పది రోజుల ముందు నుంచి పోలింగ్ తేదీన విధుల్లో ఇతర రాష్ట్రాల నుంచి సాయుధ పోలీసు బలగాల సిబ్బందితో పాటు హోంగార్డులు సైతం ఉంటారు. 2018 ఎన్నికల భద్రత విధుల్లో 279 కంపెనీల కేంద్ర బలగాలే ఉన్నాయి. ఈసారి ఆ సంఖ్య పెరిగిందా..? గతంలో 279 కంపెనీల కేంద్ర బలగాలు ఉండగా, ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మనం ఎక్కువ కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు కావాలని ప్రతిపాదనలు పంపించాం. ఈసారి మొత్తం 375 కంపెనీల బలగాలను మనం అడిగాం. ఇప్పటికే 100 కంపెనీలు వచ్చాయి. ఇంకో 275 కంపెనీలు వస్తాయి. -
మహిళలపై నేరాలకు సైబర్ ల్యాబ్‌తో చెక్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ ల్యాబ్ దోహ దపడుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ తరహా నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీసుశాఖలో సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర మహిళాభద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్‌పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి.స్వాతిలక్రా, సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధనాకేంద్రం (సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్) అధికారుల మధ్య కుదిరిన అవగాహనాఒప్పందంపై శుక్రవారం డీజీపీ సమక్షంలో సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఐ.జి సుమతి, సి.ఆర్.సి.ఐ.డి.ఎఫ్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల తదితరులు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, దీనిలో భాగంగానే సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వాటిని అరికట్టడం సాధ్యమవుతుందని, సైబర్ నేరాలపట్ల ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు సైబర్ ల్యాబ్ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. 2020–21ను సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ, పరిష్కారానికి సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని స్వాతిలక్రా అన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్ట్రాగాం, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల ద్వారానే ఈ నేరాలు జరుగుతున్నాయని వెల్లడించారు. మహిళలు, పిల్లలపై నేరాల నియంత్రణ, దేశంలోనే తొలిసారిగా ఈ సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. -
షీ-టీమ్స్‌కు పట్టుబడ్డ 37 మంది మైనర్లు
అదనపు సీపీ స్వాతిలక్రా సిటీబ్యూరో: ఈవ్‌టీజింగ్‌పై ఉక్కుపాదం మోపిన షీ-టీమ్స్ డెకాయి ఆపరేషన్లను ముమ్మరం చేసింది. వారం రోజుల వ్యవధిలో 37 మంది మైనర్లు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు. వీరందరికీఈసారి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, స్వచ్ఛంద సంఘాల కౌన్సెలర్లతో వారికి బుధవారం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పించారు. ఈ సంద ర్భంగా క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతి లక్రా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు 80 మందిపై ఈవ్‌టీజింగ్ కేసులు నమోదు చేశామన్నారు. వీరిలో ఎనిమిది మందికి జైలు శిక్ష పడగా మిగతావారికి చలానా విధించామన్నారు. తాజాగా ఈ వారం రోజుల్లో షీ-టీమ్స్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 37 మంది బాలలు దొరికారన్నారు. వీరందరికీ వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఈవ్‌టీజింగ్‌పై నిపుణులైన ప్రొఫెసర్లు, మహిళా సంఘాల నేతలతో కౌన్సెలింగ్ ఇప్పించామన్నారు. కౌన్సెలింగ్ నిర్వహించిన తీరు చూస్తే వీరంతా మారిపోతారనే నమ్మకం కలిగిందని స్వాతి లక్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఈవ్‌టీజింగ్ జరిగితే డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. బాధితుల పేర్లు, ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతున్నామన్నారు. డీసీపీ పాలరాజు మాట్లాడుతూ నగరంలో తప్పిపోయిన పిల్లల ఆచూకీపై సీఐడీ అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్‌కు నగర పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. డివిజన్ల వారీగా ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు వి.శ్రీనివాస్, కె.ప్రసన్నరాణి, కవితతో పాటు ఈవ్‌టీజింగ్‌లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులు, వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన కౌన్సెలర్లు పాల్గొన్నారు. -
ఈవ్‌టీ జింగ్ బంద్?
21 రోజులుగా నమోదు కాని టీజింగ్ కేసు షీట్‌మ్ ఏర్పాటే కారణం సిటీబ్యూరో: నగరంలో ఈవ్‌టీజింగ్ బంద్ అయ్యిందా? ఈవ్‌టీజర్లు పారిపోయారా? లేక ప్రవర్తన మార్చుకున్నారా ?... గత 21 రోజుల నుంచి షీ టీమ్ పోలీసులకు ఒక్క ఈవ్ టీజర్ దొరక్కపోవడం.. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈవ్‌టీజింగ్‌కు పేరుగాంచిన మెహిదీపట్నం, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కోఠి, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో సైతం ఈవ్ టీజింగ్ జాడలు కనుమరుగయ్యాయి. నగరంలోని బస్టాపు, రైల్వేస్టేషన్లు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, మార్కెట్ల వద్ద మహిళలు ఎదుర్కొంటున్న ఈవ్‌టీజింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు నెలల క్రితం అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా నేతృత్వంలో నగరంలో 100 షీటీమ్‌లను కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఈ ప్రత్యేక పోలీసు బృందాలు ఆయా ప్రాంతాలలో సివిల్ దుస్తుల్లో కాపు కాశాయి. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వారిని వీడియోలో బంధించి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఇలా వీరు రెండు నెలల్లో సుమారు 82 కేసులు నమోదు చేశారు. వీరిలో 11 మందిని జైలుకు కూడా పంపారు. కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రవర్తన మార్చుకున్న 20 మంది విద్యార్థులు తాము సైతం ఈవ్‌టీజింగ్‌కు చెక్ పెట్టేందుకు కళాశాలలు, బస్టాప్‌ల వద్ద ప్రచారం చేశారు. బస్సులు, ఆటోలు, ఎంఎంటీఎస్ రైళ్లలో సైతం పోలీసులు విస్తృతంగా ఈవ్ టీజింగ్ కలిగే అనర్థాలపై ప్రచారం చేసి మహిళలకు భరోసా ఇచ్చారు. ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే 100 నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రచారం చేయడంతో పాటు 10 నిముషాలలో ఘటనా స్థలానికి చేరుకునేలా పోలీసులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రెండు నెలల్లో 100 నెంబర్నుంచి వచ్చిన ఫిర్యాదులను ఏసీపీలు కవిత, శ్రీనివాస్‌లు స్వీకరించి వెంటనే రంగంలో ఉన్న షీ టీమ్స్ ఎస్ఐలు ముత్యాలు, రాజేందర్‌గౌడ్, రమేష్‌గౌడ్, రమేష్, బ్రహ్మచారి, హరికృష్ణలను అప్రమత్తం చేసి పది నిముషాల్లో ఘటనా స్థలానికి చేరుకునేలా చేశారు. షీ టీమ్స్ ప్రచారం వల్ల నగరంలో ఈవ్‌టీజింగ్ జాడ లేకుండా పోయింది. అప్రమత్తంగా ఉన్నాం: ఈవ్‌టీజింగ్ కోసం మేము తీసుకున్న చర్యలు సత్ఫలితాలిచ్చాయి. రెండు నెలల పాటు టాస్క్ఫోర్, సీసీఎస్ పోలీసులు చాలా కృషి చేశారు. 21 రోజుల నుంచి ఈవ్‌టీజింగ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఈవ్‌టీజింగ్ బంద్ అయ్యిందని అనుకుంటున్నాం. అయినా మేము అప్రమత్తంగానే ఉన్నాం. షీ టీమ్స్ కూడా నిరంతరం రంగంలో ఉంటాయి. ఈవ్‌టీజింగ్ చేస్తున్నట్టు అనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేయాలి. మహిళల నుంచి కూడా తమకు మంచి స్పందన వచ్చింది. -స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్