Swedish telecom company
-
షాకింగ్: 8500 మందిని తొలగించనున్న టెలికాం దిగ్గజం
సాక్షి,ముంబై: స్వీడన్‌కు చెందిన టెలికాం దిగ్గజం ఎరిక్సన్ భారీగా ఉద్యోగులను తొలగించింది. టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తుందని రాయిటర్స్ శుక్రవారం నివేదించింది. లోకల్ బిజినెస్‌ను బట్టి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయిని ప్రకటించిన ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ ఇప్పటికే ఆయా ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. (ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!) టెక్నాలజీ కంపెనీలు ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపి వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తుననాయి. అయితే టెలికాం పరిశ్రమలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. కాగా స్వీడన్లో దాదాపు 1400 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా వేలాది ఉద్యోగాల కోతలను ప్రకటించిన ట్విటర్, గూగుల్, మెటా ,మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల లీగ్‌లో ఎరిక్సన్ చేరింది. (పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!) -
భారత్‌లో సగం సమయం యాప్స్‌కే!
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఫోన్‌ను ఉపయోగించిన సమయంలో సగం సమయాన్ని యాప్స్(అప్లికేషన్స్)కే కేటాయిస్తున్నారట. ఫోన్‌ను వాడుతున్నప్పుడు 47 శాతం సమయం వాట్స్‌యాప్, వీ చాట్, హైక్, స్కైప్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌పైనే గడుపుతున్నారట. స్వీడిష్ టెలికం కంపెనీ ‘ఎరిక్సన్’ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. భారత్‌లో 7,500 మందితో పాటు జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికాలోని ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న భారతీయులు ఎక్కువగా వాయిస్, ఇన్స్టంట్ మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్(స్కైప్ వంటివి), ఈ-మెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్(ఫేస్బుక్ వంటివి)పైనే దృష్టి పెడుతున్నారని ఈ సర్వేలో తేలింది. అదేవిధంగా కమ్యూనికేషన్ యాప్స్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచేందుకు గాను మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ వినియోగం మీద యూజర్లు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, భారత్ లలో కలిపి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 30 శాతం సమయాన్ని కమ్యూనికేషన్ యాప్స్‌పైనే కేటాయిస్తున్నారు.