Sweet Shop
-
శివారెడ్డి స్వీట్ షాప్‌లో దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ మిఠాయి దుకాణం శివారెడ్డి స్వీట్ షాప్‌లో దారుణం చోటుచేసుకుంది. శివారెడ్డి స్వీట్ హౌస్‌లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది ఓ మహిళ విషయంలో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. తీవ్ర గాయాలైన ఓ వర్కర్ మృతి చెందాడు. వివరాలు.. మధురానగర్‌లోని శివారెడ్డి స్వీట్ షాప్‌లో శ్రీనివాస్, గౌస్ పనిచేస్తున్నారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన గౌస్.. శ్రీనివాస్ మొహం, తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం కొత్త గూడెం జిల్లా రామవరం. భద్రాద్రి జిల్లాకు చెందిన మహిళ వీరి గొడవకు కారణంగా తెలిసింది. ఆమె ముందే జరిగిన ఈ ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఘటనపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: మహిళపై 12 మంది గ్యాంగ్ రేప్) -
ఎవరూ లేని ఆ దుకాణంలో...
-
ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు!
సాక్షి, చెన్నై : కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మూతపడ్డ ఓ స్వీట్ షాపు ప్రజల మీద నమ్మకంతో సెల్ఫ్ సర్వీస్ మీద బ్రెడ్ ప్యాకెట్ల అమ్మకాలు సాగిస్తోంది. జనం కూడా సిబ్బంది ఎవరూ లేని ఆ దుకాణంలో ఉంచిన బ్రెడ్లకు తగిన డబ్బులు పెట్టి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ సంఘటన తమిళనాడులోని కోవైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లాక్డౌన్ కారణంగా కోవై రత్నపురం వంతెన వద్ద ఉన్న ఓ స్వీట్ షాపు మూసి వేసినప్పటికి దాని ముందు బెడ్ ప్యాకిట్లను ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు నిర్వాహకులు. అయితే వాటిని విక్రయించడానికి సిబ్బందిని నియమించలేదు. అందుకుబదులుగా బ్రెడ్ ట్రే వద్ద ఒక ప్రకటన బోర్డు ఉంచారు. ( ఎంత పద్దతిగా రోడ్డు దాటుతున్నాయో చూడండి ) అందులో బ్రెడ్ ధర రూ.30 అని, అవసరమైన మేరకు బ్రెడ్‌ను తీసుకుని, అందుకు తగిన మొత్తాన్ని పక్కనే ఉన్న డబ్బాలో వేసి వెళ్లాలని సూచించారు. ఆ ప్రాంత వాసులు అక్కడికి వెళ్లి బ్రెడ్‌ను తీసుకుని, డబ్బాలో సరిపడా డబ్బును వేసి వెళుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడంతో దాన్ని చూసిన అనేక మంది నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తున్న కోవై ప్రజలు, దుకాణ యజమాని నమ్మకానికి లైక్‌లతో ముంచెత్తుతున్నారు. ( ఆశ్చర్య పరుస్తున్న బామ్మ ఫిట్నెస్! ) -
ఖమ్మంలో కార్పొరేటర్ వీరంగం
సాక్షి, ఖమ్మం : నగరంలో అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ ఆవేశంతో ఊగిపోయాడు. అతడి కుమారుడితో కలిసి సోమవారం రాత్రి ఓ స్వీట్ షాపుపై దాడి చేశాడు. స్వీట్ షాపు యజమాని కొడుకును దారుణంగా కొట్టి కిడ్నాప్‌నకు యత్నించిన సంఘటన కలకలం రేకెత్తించింది. ఈ సంఘటనలో షాపు యజమాని, అతని కుమారుడికి గాయాలయ్యాయి. త్రీటౌన్ సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయమార్కెట్ రోడ్లో గల కృష్ణ స్వీట్ షాప్ యజమాని కృష్ణకు అతని సమీప బంధువు అయిన 47వ డివిజన్ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాల్సి ఉంది. కొంతకాలం నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి కార్పొరేటర్ నాగేశ్వరరావు, ఆయన కుమారుడు రాకేష్‌లు కొంతమందితో కలిసి వచ్చి స్వీట్ షాపుపై దాడికి పాల్పడ్డారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన షాపు యజమాని కుమారుడైన ఆకుల విజయ్ను కొట్టి తీవ్రంగా గాయపర్చారు. ఈ సంఘటనలో షాపు యజమాని కృష్ణకు సైతం గాయాలయ్యాయి. దుకాణంలో ఉన్న అద్దాలు పగులకొట్టి, సామగ్రిని చిందరవందరగా పడవేయడంతో..అప్పటికే అక్కడ ఉన్న వినియోగదారులు సైతం భయాందోళనతో పరిగెత్తారు. స్వీట్‌షాప్‌లో చిందరవందరగా తినుబండారాలు తర్వాత విజయ్ను బలవంతంగా కిడ్నాప్ చేసి కారులోకి ఎక్కించుకుని..కొట్టుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి..ఆ తర్వాత విడిచిపెట్టారు. అనంతరం బాధితులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన గొడవకు సంబంధించి ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి..షాపులో ఉన్న సీసీ పుటేజ్‌ల ద్వారా ఆధారాలు సేకరించారు. అనంతరం కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు రాకేష్, వారి గుమస్తాలు అయిన సాయి, రాము, సురేష్ మరికొందరిపై నాన్ బెయిల్‌బుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తీయని విషం
ఆహా ఏమి రుచి అనిపించే తీయతీయగా ఉండే ఆ మిఠాయిల తయారీ వెనుక ఉండే చేదు నిజాన్ని వింటే ప్రతి స్వీటు ప్రియుడూ కంగుతింటాడు. నిషేధిత రసాయనాలతో తయారయ్యే ఆ స్వీట్లలో ప్రాణాంతకమైన విషం దాగివుందన్న వాస్తవం వెలుగు చూసింది. కాకినాడ నడిబొడ్డున భానుగుడి సెంటర్లో అత్యాధునిక హంగులతో ఉన్న ఓ మిఠాయి దుకాణంపై నగరపాలకసంస్థ, ఆహార తనిఖీ విభాగాల అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 30 రకాల ముడిసరుకులతోపాటు 17రకాల స్వీట్లను అధికారులు స్వాధీనం చేసుకుని సదరు దుకాణానికి నోటీసులు జారీ చేశారు. సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : నగరంలోని భానుగుడి జంక్షన్ సమీపంలోని మహేంద్ర స్వీట్స్‌పై కార్పొరేషన్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆరోగ్యాధికారి డాక్టర్ పి.ప్రశాంత్ తన సిబ్బందితో జరిపిన తనిఖీల్లో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. స్వీట్ల తయారీకి వినియోగించే ముడిసరుకులో కనీస నాణ్యత లేకపోవడాన్ని వారు గుర్తించారు. పురుగుపట్టిన శనగపిండి. పుచ్చిన వేరుశనగగుళ్లు, కాలం చెల్లిన స్వీట్ల తయారీ సామగ్రిని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆహార తనిఖీ అధికారులకు వారు సమాచారం ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.వీర్రాజు ఆధ్వర్యంలో ఆ శాఖకు చెందిన అధికారులు అక్కడకు వచ్చి మహేంద్ర స్వీట్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. నాణ్యతలేని సరుకులు, కాలం చెల్లిన, నిషేధిత రసాయనాలతో స్వీట్లు, కేక్‌లు తయారు చేస్తున్న విషయాన్ని వారు గుర్తించారు. ఆ షాపు యజమానులు, మధ్యవర్తుల సమక్షంలో అక్కడ అందుబాటులో ఉన్న సరుకును వారు ధ్వంసం చేశారు. లడ్డు, పిస్తాకేక్, హల్వాను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. అనంతరం ఆ షాపు యజమానికి నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం నోటీసులు జారీ చేసింది. జిల్లా కేంద్రంలో కలకలం నగరంలో మంచి పేరున్న ప్రముఖ మిఠాయి దుకాణమైన మహేంద్ర స్వీట్స్‌లోనే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేలా స్వీట్లు తయారు చేస్తున్న వ్యవహారం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఇంతకాలం ధర ఎక్కువైనా ఇక్కడ నాణ్యమైన మిఠాయిలు దొరుకుతాయన్న ఆశతో నగరంలోని దూరప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసేవారు. తియ్యటి మిఠాయిల్లో దాగివున్న చేదు నిజాన్ని, అవి తినడం ద్వారా పాడయ్యే ఆరోగ్యాన్ని గుర్తించి ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి దుకాణాలపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను నగరవాసులు కోరుతున్నారు. -
స్వీట్ హౌస్‌లోకి దూసుకెళ్లిన కారు
జవహర్‌నగర్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి స్వీట్‌షాప్‌లోకి దూసుకెళ్లిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి స్థానిక మోర్ సూపర్‌మార్కెట్ సమీపంలోని స్వీట్ హౌజ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణం అద్దాలు, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. జవహర్‌నగర్ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. షాపింగ్‌కు వచ్చిన ఓ ఆర్మీ అధికారి భార్య బ్రేక్ వేయబోయి అనుకోకుండా యాక్సిలేటర్ తొక్కడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. -
‘స్వీట్’ కార్ఖానా..హైటెక్ జమానా
అందులోకి అడుగు పెట్గగానే హెడ్ క్యాప్ ఇస్తారు. కాళ్లకు ప్లాస్టిక్ కవర్ తప్పనిసరి. తర్వాత మీరు ఎయిర్ ఫిల్టర్లు అమర్చి ఉన్న ద్వారం.. దానికి ఉన్న అత్యంత మందమైన ప్లాస్టిక్తెరలను కాసింత బలంగానేచీల్చుకుంటూ లోపలికి అడుగుపెట్టాలి. ఇదంతా చూస్తే అదేదో రీసెర్చ్ సైన్స్ ల్యాబ్ ఏమో అనిపిస్తుంది కదా. కానీ కాదు.. నగరంలోని ఓ మిఠాయి దుకాణం కిచెన్. రుచులతో మాత్రమే కాదు.. అత్యాధునిక కిచెన్తోనూ నగరవాసుల్ని ఆకట్టుకుంటున్నాయి మిఠాయి షాప్స్. కళ్లారా చూసి నమ్మండి అంటూ వినియోగదారులనుకూడా ఆహ్వానిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో :చవులూరించే స్వీట్లు, హాట్లు సరే. మిరుమిట్లు గొలిపే లైట్లు, ఫ్యాన్సీ ఇంటీరియర్స్, ఎయిర్ కండిషనింగ్, యాంబియన్స్.. ఇవీ సరే. ‘వీటన్నింటికన్నా ఆ మిఠాయిలు ఎలా? ఎక్కడ? ఏ విధంగా తయారవుతున్నాయి? అనేదే వినియోగదారులకు అత్యంత ప్రధానమైన విషయం’ అంటారు కూకట్‌పల్లిలోని ఆల్మండ్ హౌస్ నిర్వాహకులు చైతన్య. నగరంలో ఆరు స్వీట్‌షాప్స్ నిర్వహిస్తున్న ఆల్మండ్ హౌస్... 4ఫ్లోర్లలో దాదాపు 20వేల చదరపు అడుగుల్లో విస్తరించిన తమ కిచెన్‌ను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దింది. స్టోర్‌లో అలంకరణతో పాటు కిచెన్‌లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నగరంలో ఇంతవరకూ ఏ స్వీట్ షాప్‌కు లేని హజార్డ్ అనాలసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ (హెచ్ఏసీసీపీ) సర్టిఫికేషన్ సాధించే దిశగా పయనిస్తోంది. అత్యాధునికం.. అత్యంత పరిశుభ్రం ప్రత్యేక ప్యాకింగ్ గదులు, ఎయిర్ కండిషన్డ్ ఫినిషింగ్‌లతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వంటశాలను తీర్చిదిద్దుతుండడం విశేషం. అందులో భాగంగా తయారీ విభాగంలోకి సరఫరా అయ్యే గాలిని సైతం శుద్ధి పరచడం, హ్యుమిడిటీ నియంత్రణ, యూవీ లైట్‌తో స్టెరిలైజ్ అయిన ఫ్రెష్ ఎయిర్... లాంటి ఎన్నో ప్రత్యేక విధానాలు ఇక్కడ కనిపిస్తాయి. గాలి నాణ్యతతో పాటు సూక్ష్మజీవుల పరిమాణాన్ని వారానికోసారి పరిశీలిస్తారు. తయారీదారులు, ఉత్పత్తులను హ్యాండిల్ చేసే సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను మూడు నెలలకు ఒకసారి చెక్ చేస్తారు. ఎనీటైమ్.. తనిఖీ చేసుకోండి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారంటేనే నగరంలోని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ సైతం వీలున్నంత వరకు తప్పించుకోవాలని చూస్తాయి. అలాంటిది.. సామాన్య ప్రజలు కూడా తమ కిచెన్‌ను తనిఖీ చేసుకోవచ్చునని ఆఫరిస్తున్నాయి ఆల్మండ్ హౌస్ లాంటి స్వీట్ షాప్స్. ‘కొనుగోలుదారుడిని కేవలం వ్యాపార లావాదేవీల వరకే పరిమితం చేయడం మా ఉద్దేశం కాదు. నిజానికి కిచెన్‌ను చెక్ చేసుకోవడమనేది వినియోగదారుడి హక్కు అని మేం భావిస్తాం. అందుకే మా కిచెన్‌ను మా కస్టమర్స్ ఎవరైనా ఎప్పుడైనా సరే తనిఖీ చేసేందుకు ఓపెన్‌గా ఉంచుతాం’ అంటున్నారీ స్టోర్ నిర్వాహకులు. అంతేకాదు.. నగరవాసులు చిన్న చిన్న బృందాలు, సమూహాలుగా ఈ కిచెన్‌ను సందర్శించాలనుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు. విద్యాసంస్థలు సైతం తమ విద్యార్థులకు టూర్స్ నిర్వహించదలిస్తే సహకరిస్తామంటూ కొత్త ట్రెండ్‌కు తెరదీశారు. -
పేరు పెట్టింది.. నిజాం నవాబు
టేస్ట్ స్పెషలిస్ట్: తండ్రి చనిపోయే సమయానికి మహ్మద్ హుస్సేన్‌కి 15 ఏళ్లు. అతని తండ్రి నిజాం సైన్యంలో పనిచేసేవాడు. తండ్రి మరణానంతరం ఈ స్వీట్ షాప్ పెట్టాడాయన. కారణం తెలియదు కానీ... అది ‘వితవుట్ నేమ్’ స్వీట్‌షాప్. నేమ్ బోర్డ్ లేకపోయినా నిదానంగా ఆ స్వీట్‌షాప్ ప్రాచుర్యంలోకి రావడం మొదలైంది. దాని మిఠాయిలు ఇప్పుడు పాతబస్తీ కేంద్రంగా చవులూరిస్తున్నారుు. పాలు, నెయ్యి, పంచదార, కుంకుమపువ్వు... మరికొన్ని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన దినుసులు కలిపి తయారు చేసే జౌజిహల్వా ఇక్కడ సూపర్ ఫేమస్. దీన్ని కట్టెల పొయ్యి మీద తక్కువ మంటతో 8 నుంచి 10 గంటల దాకా వండుతారు. కొద్దిగా జౌజిహల్వా నోట్లో వేసుకుంటే దాని రుచి చాలా సేపు మన నోటిని వదలదు. ఇక ఇక్కడి కేసరి లడ్డూ రుచి అద్భుతం అంటారు స్వీట్లవర్స్. ఇలాంటి వినూత్న రుచులనే ఆధారం చేసుకుని ఈ స్వీట్‌షాప్ పేరు శరవేగంగా విస్తరించింది. ఆ పేరంటే గుర్తొచ్చింది. ఈ షాప్‌కి తర్వాతి కాలంలో పేరు కూడా పెట్టారు. అది కూడా నామకరణం చేసింది ఎవరనుకున్నారు! ఏకంగా నిజాం నవాబు. దాని వెనుక ఓ చిన్న కథ ఉంది... ఈ షాప్ పేరు ఆ నోటా ఈ నోటా విన్న నిజాం నవాబు సైతం ఈ స్వీట్షాప్ని విజిట్ చేశాడట. అక్కడ మిఠాయిలు రుచి చూశారట. అద్భుతం అన్నారట. అంతేకాకుండా అంత టేస్టీ స్వీట్స్ విక్రయించే షాప్ అలా పేరు లేకుండా ఉండడం నచ్చక... అలా తిరిగి వెళ్లాక ఆ షాప్‌ని అభినందిస్తూ పురస్కారం పంపడమే కాక తన పుత్రుల్లో ఒకరి పేరును ఆ షాప్‌కి పెట్టమని అభ్యర్థిస్తూ స్వయంగా ఒక ఉత్తరం కూడా రాశాడట. అలా ‘హమీది కన్ఫెక్షనర్స్’ పేరు బోర్డెక్కిందట. నిజాం రాసిన ఉత్తరం, ఆయన పంపిన పురస్కారం ఆ షాప్‌లో మనకి ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. ‘మేం ప్రారంభించినప్పుడు (దాదాపు తొంభై ఎనిమిదేళ్ల క్రితం) ఇక్కడ ఈ షాప్ ఒక్కటే ఉండేది. దీనికి వచ్చిన ప్రాచుర్యంతో మరికొన్ని వెలిశాయి. మేం షాప్ పెట్టిన కొంత కాలానికి ఇక్కడ మొజంజాహి మార్కెట్ ప్రారంభమైంది’ అంటూ షాప్ నిర్వాహకులు పాషా చెప్పుకొచ్చారు. - సంకల్ప్ -
అపూర్వ బంధనం
సక్సెస్ స్టోరీ చంద్రశేఖర్ ఘోష్ కలలు పెద్దవి. వాటి కంటే కుటుంబబాధ్యతలు మరీ పెద్దవి. ఎందుకంటే నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు, తల్లికి సంబంధించిన బాధ్యత అంతా తానే చూసుకోవాలి. కలలకేం...ఎన్నయినా కనవచ్చు. పూట గడవాలి కదా! అగర్తలా(త్రిపుర)లోని తమ ‘స్వీట్ షాపు’లో తండ్రికి సహాయంగా ఉంటూనే మరోవైపు చదువుకునేవాడు. కుటుంబ బాధ్యతల కోసం చదువు పూర్తి కాగానే ఒక స్వచ్ఛందసంస్థలో ఉద్యోగంలో చేరారు చంద్రశేఖర్. అలా పదిహేను సంవత్సరాల కాలంలో... మొత్తం ఇరవై రెండు స్వచ్ఛంద సంస్థలలో పనిచేశారు. జేబు శాటిస్ఫ్యాక్షన్ తప్ప జాబు శాటిస్ఫ్యాక్షన్ లేదు. ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవాసంస్థ తరపున బంగ్లాదేశ్‌లో పనిచేస్తున్నప్పుడు పేదరికం విశ్వరూపాన్ని చూశారు చంద్రశేఖర్. ఆకలి బాధ తట్టుకోలేక మట్టిని తింటున్న పేద చిన్నారులను చూశారు. వడ్డీ చక్రవడ్డీగా మారి...ఆ తరువాత రాక్షస వడ్డీ అవతారం ఎత్తి పేదలను నంజుకుంటున్న క్రూరత్వాన్ని చూశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చూసిన పేదరికం...ఆయనను మార్చేసింది. ఇక ఉద్యోగం కాదు...పదిమందికీ ఉపయోగపడే పనేదైనా చేయాలనుకున్నారు ఆయన. పేదలకు చిన్నమొత్తంలో తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే సంస్థను మొదలుపెట్టాలనుకున్నారు. ఎందుకంటే 70 శాతం మంది పేదలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. సంస్థ స్థాపించడానికి నిధుల సమీకరణలో భాగంగా బ్యాంకులను ఆశ్రయించారు చంద్రశేఖర్. చిత్రమేమిటంటే ఏ బ్యాంకూ అతనికి రుణం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సన్నిహితులు, బంధువుల సహాయంతో మొత్తం రెండు లక్షలు సమకూర్చుకొని 2001లో కోల్‌కతాకు 60 కిలోమీట్లర దూరంలో ఉన్న కొన్నగార్ అనే గ్రామంలో ‘బంధన్’ పేరుతో సూక్ష్మరుణ సంస్థను ప్రారంభించారు. ‘2020 నాటికి కోటి మంది పేదలకు రుణం అందించాలి’ అనే చంద్రశేఖర్ లక్ష్యాన్ని చూసి బిగ్గరగా నవ్విన వారూ లేకపోలేదు. అయితే దేన్ని గురించీ ఆయన ఆలోచించలేదు. మొదటి అడుగుగా.....ప్రతి పేదవారి ఇంటికి వెళ్లి తన సంస్థ గురించి ప్రచారం చేశారు. పూచీకత్తు లేకుండా రుణం అనే మాట... వాళ్లకు కొత్తగా, చల్లగా వినిపించింది. బంధన్‌లో రుణాలు తీసుకొని వ్యాపారం మొదలు పెట్టి విజయం సాధించిన మహిళలు ఎందరో ఉన్నారు. వారి విజయగాథలను ఇతరులతో పంచుకోవడం అంటే చంద్రశేఖర్‌కు ఇష్టం. ‘‘బ్యాంకులు పేదలకు దగ్గర ఉన్నట్లుగానే ఉంటాయిగానీ, చాలా దూరంగా ఉంటాయి’’ అని చెప్పే చంద్రశేఖర్ ‘‘బ్యాంకులు పేదల దగ్గరికి నడచి రావాల్సిన అవసరం ఉంది’’ అంటారు. 100 శాతం రికవరీతో కొత్త బాట వేసింది బంధన్. 18 రాష్ట్రాల్లో లక్షలాది క్లయింట్లతో ఉన్న ‘బంధన్’ మన దేశంలో అతిపెద్ద సూక్ష్మ రుణసంస్థగా మొదటి స్థానంలో, ప్రపంచంలో రెండోస్థానంలో నిలిచింది. తాజాగా ఆర్బిఐ అనుమతితో ‘బంధన్’ బ్యాంకుగా మారుతోంది. ‘‘సందేహించే చోటుకు విజయం రాదు’’ అంటారు చంద్రశేఖర్ ఘోష్. ‘‘నా వల్ల అవుతుందా?’’ అని ఏ రోజైనా సందేహించి ఉంటే... ఈరోజు ఆయన ఖాతాలో ఇన్ని విజయాలు ఉండేవి కాదు కదా! సేవా మార్గం ‘బంధన్’ను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలనుకొని ఆ కలను నెరవేర్చుకున్నారు చంద్రశేఖర్ ఘోష్. ఇప్పుడు ఆయన సేవాకార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తన చదువంతా స్వచ్ఛందసేవాసంస్థల ఆర్థిక సహాయంతోనే సాగింది. అలా వారు సహాయ పడకపోతే తాను చదువుకోగలిగేవాడు కాదు. అందుకే ఇప్పుడు ఎందరో విద్యార్థులను తన డబ్బులతో చదివిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో చదువు మధ్యలోనే వదిలేసిన వారికి ఆర్థిక సహాయం చేసి వారు తిరిగి చదువుకునేలా చేస్తున్నారు.