జవహర్‌నగర్: రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి స్వీట్‌షాప్‌లోకి దూసుకెళ్లిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..వేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి స్థానిక మోర్ సూపర్‌మార్కెట్ సమీపంలోని స్వీట్ హౌజ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణం అద్దాలు, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. జవహర్‌నగర్ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని విచారణ చేపట్టారు. షాపింగ్‌కు వచ్చిన ఓ ఆర్మీ అధికారి భార్య బ్రేక్ వేయబోయి అనుకోకుండా యాక్సిలేటర్ తొక్కడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment