Swiss tennis star
-
ఇక సెలవు.. రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ దిగ్గజం ఫెదరర్
Roger Federer Announces Retirement: టెన్నిస్ దిగ్గజం, స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 41 ఏళ్ల ఫెదరర్ ఇవాళ (సెప్టెంబర్ 15) ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫెడెక్స్ (ఫెదరర్ ముద్దు పేరు).. ట్విటర్లో ఫేర్వెల్ సందేశాన్ని పంపాడు. టెన్నిస్ కుటుంబానికి ప్రేమతో రోజర్ అనే క్యాప్షన్‌తో ఏవీని షేర్ చేశాడు. To my tennis family and beyond, With Love, Roger pic.twitter.com/1UISwK1NIN — Roger Federer (@rogerfederer) September 15, 2022 లండన్‌లో వచ్చే వారం జరిగే లేవర్ కప్ తన చివరి ఏటీపీ ఈవెంట్ కానుందని స్పష్టం చేశాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడిగా తన 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అండగా నిలిచిన వారందరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఆట నుంచి తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)గా పిలువబడే ఫెడెక్స్ తన కెరీర్లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. కెరీర్లో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడిన అతను.. 310 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్‌గా కొనసాగాడు. -
ఫెడరర్ ఇంకా ఆడుతున్నాడా?
మాడ్రిడ్ : స్పెయిన్‌కు చెందిన జీసస్ అపారికో అనే వ్యక్తికి స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ ఫెడరర్ అంటే విపరీతమైన అభిమానం. తన రోల్‌మోడల్ ఫెడరర్ ఆట చూడటానికి మిగతా పనులన్నీ మానేసేవాడు. అయితే 2004 డిసెంబరు 12న అప్పటికి 18 ఏళ్ల వయసున్న అపారికో... ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. కట్‌చేస్తే... 11 ఏళ్ల తర్వాత ఇటీవలే కోమాలోంచి బయటపడ్డాడు. అయితే ఏ విషయాన్నీ పూర్తిగా గుర్తు తెచ్చుకోలేకపోయాడట. ఆ సమయంలో ఫెడరర్ ఆడుతున్న టెన్నిస్ మ్యాచ్‌ను చూసి ఒక్కసారి అవాక్కయ్యాడంట. ఫెడరర్ ఇంకా ఆడుతున్నాడా..? అంటూ ఒక్కసారిగా అప్పట్లో ఫెడరర్ సాధించిన ఘనతలను చెప్పడం మొదలుపెట్టాడట. తను కోమాలోకి వెళ్లినప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న ఫెడరర్ ఆ సీజన్లో నాలిగింటిలో మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాడని చెబుతున్నాడు. ‘ఫెడరర్ 34 ఏళ్ల వయసులోనూ ఇంకా ఆడుతుండటంతో పాటు రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. మొదట దీనిని నమ్మలేకపోయా. నన్ను ఆట పట్టిస్తున్నారని భావించా. 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచాడని చెప్పటంతో సిగ్గుతో చేతులతో నా ముఖాన్ని కప్పేసుకున్నా. బాగా ఆడతాడని అనుకున్నా. కానీ ఇన్ని టైటిల్స్ గెలుస్తాడని మాత్రం ఊహించలేదు. అప్పట్లో ఫెడరర్‌కు హెవిట్ గట్టిపోటీ ఇచ్చేవాడు’ అని అపారికో వెల్లడించాడు. ఫెడరర్‌ను గుర్తించాక ఇతర పాత విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాడట. యాక్సిడెంట్‌కు ముందు వింబుల్డన్‌కు వెళ్లాలని డబ్బులు పొదుపు చేసుకున్న అపారికో... ఇప్పుడు తన హీరో ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమవుతుండటం కొసమెరుపు. -
వావ్రింకాదే టైటిల్
రన్నరప్‌గా పేస్ జంట చెన్నై ఓపెన్ చెన్నై: ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా ఆద్యంతం నిలకడగా ఆడిన స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ స్టానిస్లాస్ వావ్రింకా చెన్నై ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అతను ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 6-4తో ‘క్వాలిఫయర్’ అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై విజయం సాధించాడు. ఫైనల్ చేరే క్రమంలో ముగ్గురు సీడెడ్ క్రీడాకారులను ఓడించిన బెడెన్ టైటిల్ పోరులో మాత్రం వావ్రింకా ధాటికి నిలువలేకపోయాడు. మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ లియాండర్ పేస్ (భారత్)-రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 3-6, 6-7 (4/7)తో యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)-జేమీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.