ఎమ్మెల్సీగా జాఫ్రీ ఎన్నిక ఏకగ్రీవం
హైదరాబాద్:
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సయ్యద్ అమీన్-ఉల్- జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి అద్వైతకుమార్ సింగ్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి అధికార టీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా జాఫ్రీ నామినేషన్ దాఖలు చేశారు.
ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ లేకపోవడంతో జాఫ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించి సర్టిఫికెట్ను అందజేశారు. ఎన్నికల పరిశీలకుడు వి.ఎన్.విష్ణు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మోజం ఖాన్ హాజరయ్యారు.