Syed Umar
-
ఇంటర్ కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లు దొర్లాయి. అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలతో విద్యార్థులు గందరగోళపడ్డారు. అయితే ఇంటర్ బోర్డు అధికారులు ఆ తర్వాత అక్షర దోషాలు, అన్వయ దోషాలు ఏయే ప్రశ్నల్లో ఉన్నాయో పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి, విద్యార్థులకు తెలియజేశారు. కామర్స్ తెలుగు మీడియం ఓల్డ్ సిలబస్‌లో 3 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వాటికి జవా బులు రాసిన (తప్పైనా, ఒప్పైనా) వారందరికీ మార్కులు ఇస్తామని తెలిపారు. మరోవైపు ఈ పరీక్షలు రాసేందుకు 5,03,429 మంది రిజిస్టర్ చేసుకోగా.. 4,78,987 మంది హాజరయ్యారు. ఇక 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. పూర్తయిన ప్రథమ సంవత్సర ప్రధాన పరీక్షలు: ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. ఈ నెల 19, 21 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ద్వితీయ సంవత్సర ప్రధాన పరీక్షలు ఈ నెల 18తో పూర్తికానున్నాయి. 20, 23 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ఇవీ ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులు.. - కామర్స్–1 తెలుగు మీడియం (ఓల్డ్ సిలబస్) సెక్షన్–డి 18వ ప్రశ్నలో డెబిట్ వైపు అప్పులకు బదులుగా క్రెడిట్ నిలువలు అని ఉండాలి. - తెలుగు మీడియం (న్యూ సిలబస్) కామర్స్–1లో 16వ ప్రశ్నలో నిలి అని ఉంది. అక్కడ నిలిపి అని ఉండాలి. - సెక్షన్–ఈ 19వ ప్రశ్నలో తేదీ 8లో చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారు అని ఉండాలి. - సెక్షన్–ఎఫ్‌లో 22వ ప్రశ్నలో తేదీ 5న వంశీకి అమ్మిన సరుకుకు బదులుగా వంశీ నుంచి కొన్న సరుకు అని ఉండాలి. అలాగే తేదీ 10లో వంశీకి అమ్మిన సరుకు రూ.1,200 అని ఉండాలి. ఇదీ ప్రింట్ కాలేదు. - సెక్షన్–ఎఫ్‌లో 23వ ప్రశ్నలో 2018 అని పొరపాటుగా వచ్చింది. - సెక్షన్–జీలో 31వ ప్రశ్నలో రుణగ్రస్తులు రూ.28,000 అని ఉండడానికి బదులుగా రూ.22,000 అని వచ్చింది. - కెమిస్ట్రీ–1లో (ఇంగ్లిష్ మీడియం) సెక్షన్–బి 14వ ప్రశ్నలో ప్రశ్న చివరలో ఠీజ్టీజి ్చn ్ఛ్ఠ్చఝp ్ఛ అని ఉండాలి. - సెక్షన్–జీలో 27వ ప్రశ్నలో ్కఅఐఈ ఇఏఉఖ్ఖఉ బదులుగా ్కఅఐఈ అఔఅఖఐఉ అని ఉండాలి. - కెమిస్ట్రీ–1లో (తెలుగు మీడియం) సెక్షన్–బీలో 15వ ప్రశ్నలో 10.6 శాతానికి బదులుగా 10.06 శాతం అని ఉండాలి. - సెక్షన్–బీలో 16వ ప్రశ్నలో ఏ్గఈఐఈఉకు బదులుగా ఏ్గఈఖఐఈఉ అని ఉండాలి. -
ఆ కాలేజీలను మూసేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించని భవనాల్లో కొనసాగుతున్న జూనియర్ కాలేజీలను మూసేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. 2020–21 విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా భవనాల్లో ఆ కాలేజీలను కొనసాగించేది లేదని స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సోమవారం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. పరీక్షలు పూర్తయ్యాక ఆయా భవనాల్లో కాలేజీలను కొనసాగించకుండా చూస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రథమ సంవత్సరం పూర్తయ్యే విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపించాలని తెలిపారు. ఆయా కాలేజీలు నిబంధనలు పాటించని వైనంపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వారు చెప్పిన సమాధానం పట్ల బోర్డు సంతృప్తి చెందలేద న్నారు. అందుకే త్వరలోనే మూసివేత నోటీసులు ఇస్తామని తెలిపారు. మరోవైపు కావాలనుకుంటే ఆయా యాజమాన్యాలు ఆ కాలేజీలను ఇతర భవనాల్లోకి షిప్ట్ చేసుకోవచ్చని సూచించారు. అందుకోసం అఫిలియేషన్ దరఖాస్తుల సమయంలో కొత్త భవనాలకు సంబంధించి షిఫ్టింగ్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని యాజమాన్యాల్లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన 18 కాలేజీలు, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 26 కాలేజీలు, శ్రీ గాయత్రి విద్యా సంస్థలకు చెందిన 8 కాలేజీలు, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు చెందిన 5 కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు 11 ఉన్నట్లు వెల్లడించారు. కాలేజీలు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీ హాస్టళ్లను నియంత్రించేందుకు చర్యలు చేపడతామన్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేస్తామ ని చెప్పారు. ఒత్తిడిని అధిగమించేలా, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేలా విద్యార్థులకు హార్ట్ఫుల్నెస్ సొసైటీ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే ఆ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. -
సాఫ్ట్వేర్ సమస్యలన్నీ సరిదిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘సాఫ్ట్వేర్ సమస్యలన్నీ సరిదిద్దాం.. కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకున్నాం.. గత పరీక్షల సమయంలో దొర్లిన ప్రతి తప్పునూ సవరించాం.. విద్యార్థులు ఈసారి ఎలాంటి భయా నికి గురికాకుండా పరీక్షలు రాయవచ్చు. పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నాం’అని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. వచ్చే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 9,62,699 మంది ఫీజు చెల్లించారని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు మరికొంత మంది ఫీజు చెల్లించే అవకాశం ఉందని, అవసరమైతే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఇంటర్ విద్యా కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఉమర్ జలీల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పరీక్షలకు ముందు, పరీక్షల తరువాత కంప్యూటర్ ప్రాసెసింగ్‌లో దొర్లిన తప్పుల విషయంలో త్రీమెన్ కమిటీ ఇచ్చిన సిఫారసులు అన్నింటినీ అమలు చేస్తున్నామని జలీల్ స్పష్టం చేశారు. త్రీమెన్ కమిటీ లేవనెత్తిన అంశాలను, తమ దృష్టికి వచ్చిన లోపాలను పరిగణనలోకి తీసుకొని, అవేమీ దొర్లకుండా ఈసారి సొంత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామని తెలిపారు. బోర్డులో ప్రత్యేకంగా ఐటీ, డొమైన్ టీమ్‌లను (ఈడీపీ) నియమించామని చెప్పారు. ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు (సీజీజీ) అప్పగించామని పేర్కొన్నారు. బోర్డుకు, సీజీజీకి మధ్య సమన్వయకర్తగా ఈడీపీ టీం పని చేస్తుందన్నారు. గ్లోబరీనాకు ఉన్న ఒప్పందం వేరే అంశమని, దానికి ఎప్పటివరకు సమయం ఉంది.. ఎన్నాళ్లు చేయాల్సి ఉందన్నది వేరుగా పరిశీలిస్తామన్నారు. 15 వరకు సవరణలకు అవకాశం.. ఫీజు చెల్లించిన విద్యార్థుల వివరాల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఈ నెల 15 వరకు గడువు ఇచ్చామని జలీల్ తెలిపారు. ఈసారి ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో మాట్లాడాక చెబుతామని వెల్లడించారు. ఈసారి కాలేజీల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గడువును జనవరి 15 వరకు పొడగిస్తామని చెప్పారు. -
1st తర్వాత సెకండే ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో ఫ్లెక్లీ కోర్సు విధానం (మొదటి ఏడాది తరువాతే రెండో ఏడాది కచ్చితంగా చదవాల్సిన అవసరం లేకుండా) అమలుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం తరువాత కచ్చితంగా రెండో ఏడాది పూర్తి చేయాలి.ఈ నిబంధనను తొలగించే అంశంపై బోర్డు కసరత్తు చేస్తోంది.తొలి ఏడాది ముగిశాక విద్యార్థి మరేదైనా చదువుకొని మళ్లీ ద్వితీయ ఏడాది పూర్తి చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ విధానం విదేశాల్లో ఉండగా, దేశంలోని ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీలో మాత్రమే ఇది అమల్లో ఉంది. దీనివల్ల విద్యార్థులు కొంత కాలవ్యవధితో తమ చదువును కొనసాగించ వచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఆయన వివిధ అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఒత్తిడి తగ్గించేందుకే.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. గత నెల 30న నిర్వహించిన స్టూడెంట్ కౌన్సెలర్ల శిక్షణలో వ్యక్తిత్వ వికాస నిఫుణులు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లలో పాస్, ఫెయిల్ స్థానంలో క్లియర్, నాట్ క్లియర్ పదాలను తీసుకురావడం, ఫ్లెక్సీ విధానం అమలు వంటివి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.దేశ వ్యాప్తంగా పాస్, ఫెయిల్ విధానమే ఉంది. మన రాష్ట్రంలో దానిని తీసుకువస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయా అనే అంశాన్నీ చర్చించాల్సి ఉంది. ఒడిశాలోని సెంచూరియన్ యూనివర్సిటీకి ఈనెల 7న అధ్యయనానికి వెళ్తున్నాం. వచ్చాక నివేదికతోపాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తాం. వృత్తి విద్యా కోర్సుల్లో సమూల మార్పులు రాష్ట్రంలో వృత్తివిద్యను మార్పు చేయబోతున్నాం. ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశ పెడతాం.వొకేషనల్ ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేలా చూస్తాం. ప్రస్తుతం సెంచూరియన్ యూనివర్సిటీలో 28 రకాల వొకేషనల్ కోర్సులు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి రాష్ట్రంలో మార్పులు తీసుకువస్తాం. వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. ఈ మేరకు జిల్లా అధికారులకు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాం. రెండు రోజుల్లో ఈ తరగతులు ప్రారంభమవుతాయి. కృతార్థులు కాని విద్యార్థులకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. బోర్డు వెబ్సైట్లో ఆడియో వీడియో పాఠాలు విద్యార్థుల కోసం బోర్డు వెబ్సైట్లో ఆడియో, వీడియో పాఠాలను ఉంచుతాం. ప్రభుత్వ , ప్రైవేటు కాలేజీల విద్యార్థులూ వాటిని చూసి నేర్చుకునేలా ఉంటాయి. ఇంగ్లిషు–తెలుగులో రూపొందించిన ఈ పాఠాలను (పాఠ్యాంశాల వారీగా) నిఫుణుల నుంచి తీసుకుంటున్నాం. త్వరలోనే అందుబాటులోకి తెస్తాం. ద్వితీయ సంవత్సర పాఠ్య పుస్తకాల మార్పు గతేడాది ప్రథమ సంవత్సర పాఠ్య పుస్తకాలను మార్పు చేశాం. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరంలో మార్చుతున్నాం. వచ్చే ఏడాదినుంచి కొత్త పుస్తకాలు అందుబాటులోకి తెస్తాం. ఈసారి ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేయం.. వచ్చే ఏడాదికి ఆలోచిస్తాం.ఇకపై పక్కాగా నిబంధనల ప్రకారం ఉన్న కళాశాలలకే అనుమతులు ఇస్తాం. ఈ ప్రక్రియనూ జనవరిలోనే ప్రారంభిస్తాం. -
ఆధిపత్య పోరు..!
మైనార్టీ సంక్షేమ శాఖలోకార్యదర్శి వర్సెస్ డెరైక్టర్ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలపై మెమో జారీ చేసిన కార్యదర్శి తీవ్రంగా పరిగణించి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాసిన డెరైక్టర్ ఉపముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా ఆగని వివాదం గాడి తప్పుతున్న మైనార్టీ సంక్షేమం సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం దేవుడెరుగు గానీ....శాఖ కార్యదర్శి , డెరైక్టర్ల మధ్య ఆధిపత్య పోరు పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు లక్ష్యానికి చేరుకోగా పోగా, వాటిపై అధికారుల్లో కనీసం జవాబు దారీతనం కరువైంది. కొంత కాలంగా ఇరువురి మధ్య రగులుతున్న అంతర్గత వివాదానికి ఇటీవల ఒక అధికారి సర్వీస్ పొడిగింపు ప్రతిపాదనల వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో మైనార్టీ సంక్షేమ విభాగాలపై డెరైక్టర్ అజమాయిషీ లేకుండా చేసేవిధంగా కార్యదర్శి మెమో జారీ చేయడం సంచలనం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన డెరైక్టర్ ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖను రాయడం చర్చనీయాంశంగా తయారైంది. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యం చేసుకున్నా వివాదానికి తెర పడనట్లు తెలుస్తోంది. ప్రచ్ఛన్న యుద్దం.. మైనార్టీ సంక్షేమ శాఖపై ప్రత్యేకంగా మంత్రి ప్రాతినిధ్యం లేక పోవడం ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఆధిపత్యం పోరుకు దారి తీసినట్లయింది. గత ఏడాది కాలంగా కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ ఎంజే అక్బర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కార్యదర్శి ‘‘ 2014 అక్టోబర్ 28న లేఖ నంబర్ 1501/2014-2 ద్వారా జారీ అయినా మెమో (మైనార్టీ సంక్షేమ విభాగాల ద్వారా ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు, ఉత్తర ప్రత్యుత్తరాల అంశం)’ పై తిరిగి కార్లిఫికేషన్ ఇస్తూ అదే నంబర్‌తో మరో మెమో జారీ చేయడం కలకలం రేపింది. ఈ మెమోలో ‘ మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ శాఖాపరమైన అధిపతి. డెరైక్టర్ నిధుల పంపిణీ, పాలసీ సంబంధించిన అంశాలకు పరిమితం. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ సంస్థ. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తోంది. ఇతర కార్పొరేషన్ల మాదిరిగా ఇండిపెండెంట్‌గా కార్యకలాపాలు కొనసాగించాలి, అంటూ పేర్కొనడం మైనార్టీ విభాగాలపై డెరైక్టర్ ఆజమాయిషి లేకుండా చేసినట్లయింది. ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ... రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోపై తీవ్రంగా స్పందించిన డెరైక్టర్ ఒక అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాశారు. ఈ నెల 9వ తేదిన లేటర్ నెంబర్ సీ /49సీఎండబ్ల్యు/ఎడిఎంఎన్/2016 ద్వారా గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు , మెమోలు, ఆదేశాలను కోడ్ చేస్తూ సుమారు ఏడు పేజీల సుద్ఘీ లేఖాస్త్రాన్ని సంధించడం శాఖలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 2014 అక్టోబర్ 28న జారీ చేసిన మెమోకు కార్లిఫికేషన్గా ఇటీవల జారీ అయినా మెమో భిన్నంగా ఉందని, ఇది పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొనడం కారద్యర్శిపై ఎదురుదాడికి దిగినట్లయింది. వాస్తవంగా 2014లో మైనార్టీ సంక్షేమ శాఖ సహయ కార్యదర్శి ఒక మెమో జారీ చేస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ కిస్ట్రియన్(మైనార్టీ) కార్పొరేషన్లు ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు,అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు డెరైక్టర్ ద్వారా సమర్పించాలని, నేరుగా సంబంధిత శాఖ కార్యదర్శి, ప్రభుత్వానికి పంపవద్దని సూచించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం మైనార్టీ కమిషనరేట్ (డెరైక్టరేట్) ఏర్పాటు నేపథ్యంలో జారీ చేసిన జీవో నంబర్ 37,161,130.345 లతో పాటు జారీ అయినా మెమోల్లో గల మైనార్టీ సంక్షే మ శాఖ డెరైక్టరేట్‌కు గల అధికారాలు, విభాగాల ద్వారా అమలయ్యే పథకాలపై పర్యవేక్షణ, తదితర అంశాలను డెరైక్టర్ లేఖలో వివరించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత కూడా జారీ కాబడిన మెమోలోని అంశాలను కోడ్ చేస్తూ... ఇటీవల కార్లిఫికేషన్ ఇచ్చిన మెమోను అనుసరించి తగిన పరిష్కా రం చూపాలని లేఖలో విజ్ఞప్తి చేయడం కార్యదర్శిని సవాల్ చేసినట్లయింది. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత పెరిగినట్లయింది.