syrian boy
-
నువ్వేమి చేశావు నేరం..!
-
నిన్ను చూసి గర్విస్తున్నా: ఒబామా
వాషింగ్టన్: ‘నువ్వు చాలా మంచివాడివి. నీలాగే అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని ఆరేళ్ల బాలుడిని ఉద్దేశించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. సిరియా అంతర్యుద్ధం బాధిత బాలుడు ఒమ్రాన్ గురించి తనకు లేఖ రాసిన అలెక్స్ అనే అమెరికా బాలుడిని ఒబామా ప్రత్యేకంగా ప్రశంసించారు. తన అధికారిక నివాసానికి ఆహ్వానించి అలెక్స్ తో మాట్లాడారు. అలెక్స్ తన కుటుంబ సభ్యులతో పాటు వైట్ హౌస్ కు వెళ్లి ఒబామాను కలిశాడు. ఒమ్రాన్ పట్ల అలెక్స్ చూపిన మానత్వానికి ఒబామా ముగ్దుడయ్యారు. చిన్నవయసులోనే అరుదైన వ్యక్తిత్వం కనబరిచిన అలెక్స్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సిరియా వైమానిక దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ ఫొటోను చూసి కదిలిపోయిన అలెక్స్ ఒబామాకు లేఖ రాశాడు. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. ఈ ఉత్తరాన్ని ఐక్యరాజ్యసమితిలో ఒబామా చదివి వినిపించారు. -
డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు
-
డియర్ ఒబామా.. సిరియాకు వెళ్లు
ఒబామాకు లేఖ రాసిన ఆరేళ్ల బాలుడు న్యూయార్క్: సిరియా వాయుసేన దాడిలో గాయపడి అంబులెన్సులో రక్తమోడుతూ దీనంగా కూర్చున్న ఐదేళ్ల బాలుడు ఒమ్రాన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. తాజాగా అమెరికాకు చెందిన అలెక్స్ అనే ఆరేళ్ల బాలుడు.. ఒమ్రాన్‌ను తన ఇంటికి తీసుకురావాలని, తమ్ముడిలా చూసుకుంటానని అధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశాడు. ఈ లేఖను ఒబామా ఐక్యరాజ్యసమితిలో చదివి వినిపించారు. అలెక్స్ స్వదస్తూరీతో రాసిన లేఖలో ‘ఒబామా! వెళ్లి ఒమ్రాన్ ను మా ఇంటికి తీసుకురండి. మేం మీకోసం జెండా, పూలు, బెలూన్లతో ఎదురుచూస్తూ ఉంటాం. అతణ్ని మా కుటుంబంలో చేర్చుకుంటాం. తమ్ముడిలా చూసుకుంటా. ఇంగ్లిష్ నేర్పిస్తాం’ అని పేర్కొన్నాడు. -
పాపం ఈ పసివాడికి ఎంతకష్టం..!
-
పాపం ఈ పసివాడికి ఎంతకష్టం..!
అలెప్పో: సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్య ప్రజలు, చిన్నారులు ఎలా సమిధలౌతున్నారో తెలిపే ఓ బాలుడి చిత్రం ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఐదేళ్ల బాలుడు ఒళ్లంతా గాయాలతో అమాయకంగా చూస్తున్న చూపులు సిరియా అంతర్యుద్దాన్ని కళ్లకుకడుతోంది. అలెప్పో ప్రాంతంలో తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని జరిపిన వైమానిక దాడుల్లో ఓ భవనం ధ్వంసమైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు, పాత్రికేయులు ఒమ్రాన్ అనే బాలుడి కుటుంబాన్ని రక్షించారు. ఒమ్రాన్ తో పాటు అతని ముగ్గురు సోదరులు, తల్లిదండ్రులు ఈ ఘటనలో గాయపడ్డారు. ఒళ్లంతా తీవ్రగాయాలై రక్తమోడుతున్న బాలుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ బాలుడి ప్రాణానికి ప్రమాదమేం లేదని వైద్యులు వెల్లడించారు. ఒమ్రాన్ కుటుంబాన్ని భవనం నుంచి బయటకు తీసుకొచ్చిన కొద్ది సేపట్లోనే అది పూర్తిగా కుప్పకూలిందని స్థానికులు వెల్లడించారు. ఒమ్రాన్ అంబులెన్స్ లో కూర్చున్న సమయంలో ఓ పాత్రికేయుడు తీసిన ఫోటో ఇది. ఒమ్రాన్ ఫోటోతో అంతర్జాతీయ సమాజం కదిలిపోయింది. సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ సైతం తక్షణమే అలెప్పోలో వైమానిక దాడులను నిలిపేయండి అని కోరింది. -
ప్రపంచాన్ని కుదిపేసిన ఫొటోనే ఇలా..
ఎర్రచొక్కా, నీలిరంగు నిక్కరు ధరించిన నాలుగేళ్ల సిరియా బాలుడు ఆయలాన్ కుర్దీ మృతదేహం టర్కీ బీచ్‌కు కొట్టుకొచ్చిన ఫొటో లక్షలాది మంది ప్రజల హృదయాలను కదిలించింది. అనేకమందికి కన్నీళ్లు తెప్పించిన ఆ విషయం గుర్తుండే ఉంటుంది. కన్నీళ్లు కారుస్తున్న నిశ్శబ్ద ప్రకృతి మధ్య ఇసుకపై బోర్లాపడిన బాలుడి చెంపలను అలలు తాకుతున్నట్లుగా కనిపించే ఫొటో సోషల్ మీడియాలో ఐదు నెలల క్రితం విపరీతంగా ప్రాచుర్యం పొందింది. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు సృష్టిస్తున్న మారణకాండ నుంచి తప్పించుకునేందుకు యూరప్ బాట పట్టిన సిరియా, ఇరాక్ శరణార్థుల గురించి మొట్టమొదటి సారిగా ప్రపంచం పట్టించుకోవడానికి ఈ ఫొటోనే కారణమైంది. అచ్చం ఆ ఫొటోలో కనిపించినట్లుగా ఆ బాలుడి విగ్రహాన్ని చెక్కారు ఫిన్లాండ్కు చెందిన ప్రముఖ శిల్పి పెక్కా జిల్హా. 'అంటిల్ ది సీ షెల్ హిమ్ ఫ్రీ' అని దానికి టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ బాలుడి విగ్రహాన్ని టర్కీ రాజధాని హెల్సింకీ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటుచేశారు. బాలుడు ఆయలాన్ కుర్దీ, అతడితో పాటు తండ్రి మినహా ఐదుగురు కుటుంబ సభ్యుల మరణానికి కారణమైన ఇద్దరు మానవ అక్రమ రవాణాదారులు టర్కీ జైల్లో ఉన్నారు. వారిపై విచారణ కొనసాగుతోంది. నేరం రుజువైతే వారికి 35 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. సిరియా, ఇరాక్ ప్రాంతాల నుంచి వచ్చిన శరణార్థులు టర్కీ నుంచి యూరప్‌కు వెళుతూ వందలాది మంది సముద్రంలో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. టర్కీ అధికార లెక్కల ప్రకారమే గత ఒక్క నెలలోనే 400 మంది శరణార్థులు నీట మునిగి చనిపోయారు. వాస్తవానికి మృతుల సంఖ్య మూడింతలు ఉంటుందని అనధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.