T-Works
-
‘లివింగ్ టెంపుల్’ ఆర్ట్ షో ప్రారంభం, ముఖ్య అతిథిగా స్మితా సబర్వాల్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లివింగ్ టెంపుల్’ హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని టి-వర్క్స్‌లో ప్రారంభమైంది. భారతదేశ ఆలయ కళ, సంస్కృతి మరియు వారసత్వాన్ని చాటుకునే ఈ ప్రదర్శనలో టెంపుల్ ఆర్ట్ స్ఫూర్తితో 30 మంది కళాకారులు వారి వారి కళారూపాలను ప్రదర్శిస్తారు. ‘లివింగ్ టెంపుల్’ పేరుతో నిర్వహిస్తున్న మూడు రోజుల పాలు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పర్యాటక, సంస్కృతి, వారసత్వం మరియు యువజన వ్యవహారాల శాఖ, తెలంగాణ) స్మితా సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు సర్వే శాఖ కెకె ముహమ్మద్ తదితరులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, “ఇది యువకులు, అనుభవజ్ఞులైన కళాకారులతో జమిలిగా కలిసి వచ్చే క్యాలెండర్ కార్యక్రమంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీనికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కెకె ముహమ్మద్ మాట్లాడుతూ, “వివిధ రకాల వారసత్వ పర్యటనలు ఉన్నాయి కానీ,అవి ప్రజలను ఆకట్టుకునేలా వినూత్నంగా ఉండాలన్నారు. సందర్శకులకు ఈ ప్రదర్శనను ఆదరించడం ద్వారా సింగపూర్, చైనాలో లాగా ఈ స్మారక చిహ్నాలను జీవన వారసత్వంగా మార్చాలని అభిలషించారు.మన వారసత్వాన్ని, ప్రకృతిని కాపాడుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు ప్రముఖ ఆర్టిస్ట్, కళా దర్శకుడు తోట తరణి తన సెట్‌ను తీసివేసినపుడు, ఈ ప్రదేశంలో ఎలాంటి శిథిలాలు లేకుండా జాగ్రత్త పడతానని వివరించారు.తెలంగాణ టూరిజం మద్దతుతో అన్నపూర్ణ మడిపడిగ క్యూరేట్ చేస్తున్న ‘లివింగ్ టెంపుల్’ దేశవ్యాప్తంగా ఉన్న 30 మందికి పైగా ప్రఖ్యాత కళాకారులు భారతీయ దేవాలయాల గొప్ప వారసత్వాన్ని ప్రదర్శిస్తారు. 100 కి పైగా అద్భుతమైన కళాకృతులతో,సాంప్రదాయ ఆలయ కళ, సమకాలీన కళాత్మక వ్యక్తీకరణల అందమైన కలయికగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన కళాఖండాల సేకరణతో పాటు - ఆర్ట్ - హెరిటేజ్ టూరిజం - ది మిస్సింగ్ లింక్ , ప్యానెల్ చర్చ, సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. తోట తరణి, అమర్ రమేష్, ద్రధా, చరణ్ జీత్, పర్ణవి బంగర్, రాయన్న గిరిధర్ గౌడ్, సంగం వంఖడే, వినోద్ దరోజ్ లాంటి అనేక ప్రఖ్యాత కళాకారుల బృందం అద్భుతమై ప్రదర్శనివ్వబోతోంది. ఈ కార్యక్రమం పురావస్తు శాస్త్రవేత్త కెకె మొహమ్మద్, ఫోటోగ్రాఫర్ అమర్ రమేష్ , కళాకారుడు ద్రధా వ్రత వంటి నిపుణుల సహకారం తో ‘లివింగ్ టెంపుల్’ భారతీయ ఆలయ సంస్కృతి యొక్క సజీవ వారసత్వానికి ఒక వేడుక, ఒక మరపురాని అనుభవాన్ని మిగల్చినుంది అనడంలో సందేహంలేదు.ఫిబ్రవరి 28 2025 మార్చి 2 వరకు సందర్శకులకు ఆహ్వానంప్రదర్శన: ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకువేదిక : టి-వర్క్స్, శిల్ప్ గ్రామ్ క్రాఫ్ట్ విలేజ్, రాయ్ దుర్గ్, హైదరాబాద్, తెలంగాణ 500081.మరిన్ని వివరాల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెం.అన్నపూర్ణ మడిపడిగ- 9052594901 -
గాల్లోకి ఎగిరిన 3డీ యూఏవీ
సాక్షి, హైదరాబాద్: తొలి 3డీ ముద్రిత మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ) తొలిసారిగా మంగళవారం విజయవంతంగా గాలిలోకి ఎగిరింది. 3డీ ముద్రిత మానవ రహిత విమానాన్ని ‘టి వర్క్స్’గతేడాది నవంబర్‌లో రూపొందించగా, పలు ప్రయత్నాల తర్వాత గాలిలోకి ఎగిరింది. గంటకు 80 కి.మీ. వేగంతో గాలిలోకి ఎగిరిన విమానం వేగం పుంజుకుని ఆ తర్వాత గంటకు 140 కి.మీ. వేగాన్ని అందుకుంది. సుమారు రెండు నిమిషాల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత రేడియో సంబంధాలను కోల్పోయి నేలకూలింది. ఈ అనుభవంతో మరింత మెరుగైన యూఏవీని త్వర లో తయారుచేస్తామని టి వర్క్స్ ప్రకటించింది. 3డీ ముద్రిత యూఏవీని తయారు చేయడంలో టి వర్క్స్ చేసిన కృషిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అభినందించారు. ఎన్నో ప్రత్యేకతలను కలిగిన యూఏవీ తయారీలో పూర్తిగా 3డీ ముద్రిత విడి భాగాలను ఉపయోగించారు. ఈ విడి భాగాలను పాలీ లాక్టిక్ యాసిడ్ (పీఎల్ఎ), అక్రిలోనైట్రిల్ బ్యూటడీన్ స్టిరీన్, హై ఇంపాక్ట్ పాలిస్ట్రీన్ (హెచ్‌ఐపీఎస్) వంటి పదార్థాలతో తయారు చేశారు. ఒకటిన్నర కిలోల బరువున్న ఈ యూఏవీని గంటకు 200 కి.మీ. వేగంతో పయనించే సామర్థ్యం తో రూపొందించారు. మంగళవారం జరిగిన ప్రయోగ ఫలితాల ఆధారంగా భవిష్యత్‌లో 3డీ ముద్రిత యూఏవీల ఎయిరోడైనమిక్ ధర్మాలను విశ్లేషించి, మరింత మెరుగైన యూఏవీని తయారుచేసేందుకు టి వర్క్స్ సన్నాహాలు చేస్తోంది. ప్రోటోటైప్‌ల తయారీ సులభం.. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమెకానికల్, మెకానికల్ రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్‌గా పేరొందిన టి వర్క్స్.. ఎయిరోస్పేస్ రంగంలో 3డీ ప్రింటింగ్ అప్లికేషన్ల సామర్థ్యం, పనితీరుపై వరుస పరిశోధనలు చేస్తోంది. గతంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలను కలప, ఫ్లైవుడ్‌తో తయారు చేసేందుకు నాలుగైదు వం దల గంటల సమయం పట్టేది. కానీ కంప్యూటర్ లో విడి భాగాల డిజైనింగ్, 3డీ ప్రింటర్ల ద్వారా ప్రోటోటైప్‌ల తయారీ సులభతరమైంది. యూ ఏవీలో అంతర్భాగాలను నట్లు, బోల్టులు తదితరాలతో సంబంధం లేకుం డానే తేనెపట్టులో అమర్చినట్లు బిగించి రూపాన్ని ఇచ్చారు. లిథి యం పాలిమర్ బ్యాటరీ వినియోగంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సంక్లిష్టతతో తయారు చేసిన ఈ యూఏవీ డిజైన్, 3డీ విడి భాగాల ముద్రణకు వంద గంటల సమయం మాత్రమే పట్టిందని టి వర్క్స్ వర్గాలు వెల్లడించాయి. -
సృజనాత్మకతకు టీ–వర్క్స్
♦ నూతన సంస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ♦ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం ♦ హార్డ్‌వేర్ నమూనాల అభివృద్ధి, ఇంక్యూబేషన్, నైపుణ్యాభివృద్ధికి సదుపాయాలు ♦ ఆలోచనతో వచ్చి ప్రొడక్ట్‌తో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: మీ దగ్గర ఓ సరికొత్త ఆలోచన ఉందా? ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని సృష్టించాలనుకుంటున్నారా? అందుకు తగిన సదుపాయాల కోసం అన్వేషిస్తున్నారా.. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒక సృజనాత్మక ఆలోచనతో వచ్చి ఉత్పత్తి (ప్రొడక్ట్)ను అభివృద్ధి చేసుకుని వెళ్లగలిగేలా సదుపాయాలను కల్పిస్తూ ‘టీ–వర్క్స్’ పేరుతో నూతన సంస్థకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ రంగాల్లో అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు దీనిని ఏర్పాటు చేసింది. హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ స్థాయి నమూనాల రూపకల్పన (ప్రొటోటైపింగ్) సదుపాయంతో పాటు ఔత్సాహిక పరిశోధకుల అభివృద్ధి కేంద్రం (ఇంక్యుబేషన్ సెంటర్), నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఈ ‘టీ–వర్క్స్’లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు లాభాపేక్ష లేని సంస్థగా టీ–వర్క్స్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణం సృష్టించడం, హార్డ్‌వేర్ నమూనాల తయారీ సదుపాయం కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు నిపుణులైన మానవ వనుల అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేయనుంది. ఈ సంస్థకు డైరెక్టర్లుగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ (ఎలక్ట్రానిక్స్) వ్యవహరిస్తారు. టీ–వర్క్స్ ప్రధాన ఉద్దేశాలివీ..నమూనాల ఉత్పత్తి కోసం: ఏదైనా ఓ ఆలోచనతో ఔత్సాహిక పరిశోధకులు అడుగు పెట్టి.. ఉత్పత్తిని రూపొందించుకుని బయటకు వెళ్లేందుకు కావాల్సిన అత్యాధునిక సదుపాయాలు, యంత్రాలు టీ–వర్క్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తుల నమూనాల అభివృద్ధి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు. ఇంక్యుబేషన్: హార్డ్‌వేర్ ఉత్పత్తికి సంబంధించిన ఆలోచనలకు కార్యరూపం కల్పించి ఉత్పత్తుల తయారీకి సహకరించడం, హార్డ్‌వేర్ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడిదారులు, సలహాదారులు, మార్గదర్శకులను ఆకర్షించడం, హార్డ్‌వేర్ రంగ అభివృద్ధికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఏకమై పనిచేసేందుకు ఇంక్యుబేషన్ కేంద్రం ఉపయోగపడనుంది.