T20 Cricket World Cup
-
భారత్‌తో మ్యాచ్.. కన్నీటి పర్యంతమైన బాబర్ ఆజమ్ తండ్రి, వైరల్ వీడియో
Babar Azam Father Gets Emotional: భారీ అంచనాలతో టీ20 వరల్డ్‌కప్ బరిలోకి దిగిన భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దాయాది దేశంతో పోరులో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన 151 పరుగులు చేసినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (3/31) టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఇక రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యంతో పరుగుల వరద పారించిన మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలుపొందడంతో పాకిస్తాన్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. (చదవండి: IND Vs PAK: చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్లు.. ) ఈక్రమంలో మ్యాచ్ వీక్షిస్తున్న పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ తండ్రి ఆజమ్ సిద్ధిఖీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్లుగా భారత్‌పై విజయం కోసం నిరీక్షిస్తున్న వేళ తన కొడుకు సారథ్యంలో ఆ కల నేరవేరడంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విజయంతో గ్రూప్ 2లో పాకిస్తాన్ టాప్‌లో కొనసాగుతోంది. (చదవండి: ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్‌గా ఖాలిద్ జమీల్) This is Babar Azam’s father. So happy for him. I first met him in 2012 at Adnan Akmal’s walima. Babar at that time was 3 years away from Pakistan debut. I clearly remember what his father told me “bas debut ho jane do. Agay sara maidaan babar ka hai” pic.twitter.com/ZlsvODQkSg — Mazher Arshad (@MazherArshad) October 24, 2021 -
టీ20 ప్రపంచకప్ వాయిదా
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టే జరిగింది. టీ20 ప్రపంచకప్ నిర్వహణ వాయిదా పడింది. వచ్చే ఏడాదికి టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. ఆదివారం జరిగిన వర్చువల్ మీటింగ్‌లో టీ20 ప్రపంచ కప్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఐసీసీ బోర్డు సభ్యులు చర్చించారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో నిర్వహణ, ఆటగాళ్ల సంరక్షణ వీలు పడదని సభ్యులు అభిప్రాయపడ్డారు. దీంతో ఐసీసీ ఈ మేరకు వాయిదా నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్ నిర్వహిస్తామని ఐసీసీ వెల్లడించింది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో పొట్టి వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉండగా.. కరోనా భయాల నేపథ్యంలో వాయిదా తప్పలేదు. కాగా, వచ్చే మూడేళ్లలో టీ20 ప్రపంచ కప్ నిర్వహణ తేదీలను ఐసీసీ ప్రకటించింది. 2021 టీ20 ప్రపంచ కప్ 2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2021 నవంబర్ 14న జరగనుంది. 2022 టీ20 ప్రపంచ కప్ 2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 13న జరగనుంది. 2023 టీ20 ప్రపంచ కప్ 2023 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుంది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వేదికగా జరిగే ఐసీసీ టీ20 వుమన్ వరల్డ్ కప్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదిలాఉండగా.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ సమయాన్ని ఐపీఎల్–13 నిర్వహణకు అనుకూలంగా మార్చుకోవాలని బీసీసీఐ యోచిస్తోంది. (నాకు బాయ్‌కాట్ కోపం తెప్పించారు: సైఫ్ అలీఖాన్) -
నారీ... ధనాధన్ భేరి
మహిళల క్రికెట్‌కు మళ్లీ ప్రపంచ కప్ కళ వచ్చింది. ఏడాది పాటు ఎన్ని టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగినా ఆకర్షణలో విశ్వ సమరం తర్వాతే ఏదైనా! పొట్టి ఫార్మాట్లో తమ సత్తా చాటేందుకు అగ్రశ్రేణి ఆస్ట్రేలియా నుంచి ఆటలో తప్పటడగులు వేస్తున్న థాయ్‌లాండ్ వరకు 10 జట్లు సన్నద్ధమయ్యాయి. తొలి నాలుగు టి20 ప్రపంచ కప్‌లు పురుషుల టోర్నీలతో సమాంతరంగా జరగడంతో స్త్రీ శక్తికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. రెండేళ్ల క్రితం విడిగా నిర్వహించినా తగినంత ప్రచారం లభించలేదు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుండటంతో ఒక్కసారిగా టోర్నీకు ఊపు వచ్చేసింది. ఇక 17 రోజుల పాటు నారీమణుల బ్యాట్ల నుంచి గర్జనలు ఖాయం. టి20ల్లో ఆరు సార్లు ప్రపంచ కప్ జరిగితే నాలుగుసార్లు ఆస్ట్రేలియానే విజేతగా నిలిచింది. ఒకసారి వెస్టిండీస్ మహిళలు గెలుపు కిరీటం దక్కించుకోగా, మొదటి టోర్నీలో చాంపియన్ అయిన ఇంగ్లండ్ మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. మన భారత్ మాత్రం మూడుసార్లు సెమీఫైనల్ దశలోనే ఆగిపోయింది. ప్రతీసారి బలమైన పోటీదారుగా కనిపిస్తున్నా టైటిల్ మాత్రం న్యూజిలాండ్‌కు అందని ద్రాక్షే అయింది. ఈసారి కూడా సొంత గడ్డపై లేడీ కంగారూలు ఫేవరెట్లు అనడంలో సందేహం లేదు. పురుషుల క్రికెట్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న జరిగే ఫైనల్లో తుది విజేత ఎవరో వేచి చూడాలి. 2009: తొలి టి20 ప్రపంచ కప్ జరిగిన ఏడాది. పురుషులతో పాటు వరుసగా నాలుగు టోర్నీలు జరిగాయి. 2018లో మాత్రం పురుషుల వరల్డ్ కప్ జరగకపోగా, మహిళల ఈవెంట్‌ను విడిగా నిర్వహించారు. ఈసారి ఇదే ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలోనే పురుషుల ప్రపంచ కప్ ఉన్నా... మహిళల టోర్నీ ప్రత్యేకత నిలబెట్టేందుకు, ప్రేక్షకుల, ప్రసారకర్తల దృష్టి మళ్లకుండా ఉండేందుకు ముందుగానే నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐసీసీ పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసింది. ‘ఉమెన్ ఇన్ బ్లూ’ ఆశలు! విశ్వ వేదికపై ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయినా... మళ్లీ పొట్టి ప్రపంచ కప్‌లో భారత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఆరు టి20 వరల్డ్ కప్‌లలో ఒక్కసారి కూడా మన జట్టు తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడుసార్లు సెమీస్‌లోనే ప్రస్థానం ముగిసింది. గతంతో పోలిస్తే ఈసారి మన టీమ్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఫార్మాట్‌కు తగిన విధంగా దూకుడు పెరిగింది. కోచ్ డబ్ల్యూవీ రామన్ మార్గనిర్దేశనంలో అమ్మాయిలు మరింతగా రాటుదేలారు. గత టోర్నీలాగే ఇప్పుడూ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోనే జట్టు బరిలోకి దిగుతోంది. ఆతిథ్య జట్టు, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌లతో పోలిస్తే ఇంకా కొంత వెనుకబడినట్లు అనిపిస్తున్నా... ఈ ఫార్మాట్లో సంచలనానికీ అవకాశం ఉంది. నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి శుభారంభం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఫామ్ ప్రకారం చూస్తే 2019 నుంచి భారత్ 10 టి20లు మ్యాచ్‌లు గెలిచి మరో 10 ఓడింది. ఇది కాస్త నిలకడలేమిని చూపిస్తోంది. ఇటీవల జరిగిన ముక్కోణపు టోర్నీలోనూ ఇది కనిపించింది. 2018 నుంచి చూస్తే స్మృతి మంధాన అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమన్‌గా నిలిచింది. 42 ఇన్నింగ్స్‌లలో ఆమె 1,243 పరుగులు చేసింది. స్ట్రయిక్ రేట్ కూడా దాదాపు 130 ఉంది. బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఆడిన అనుభవం ఉన్న స్మృతి ఇచ్చే ఆరంభంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మూడో స్థానంలో ఉన్న కెప్టెన్ హర్మన్ కూడా 933 పరుగులు సాధించింది. వీరిద్దరి బ్యాటింగ్, అనుభవం జట్టుకు పెద్ద బలం. ఇక జెమీమా రోడ్రిగ్స్, ఇటీవల సంచలన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్న షఫాలీ వర్మ కూడా దూకుడుగా ఆడితే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. భారీ షాట్లు ఆడగల వేద కృష్ణమూర్తి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ ఫార్మాట్లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా కీలకం కానుంది. పేస్ బౌలింగ్‌లో శిఖా పాండే ఓవరాల్ రికార్డు గొప్పగా లేకపోయినా... ఇటీవల పునరాగమనం తర్వాత ఆమె చాలా మెరుగ్గా ఆడుతోంది. అన్నింటికి మించి స్పిన్ బలగంపై కూడా భారత్ నమ్మకం పెట్టుకుంది. భిన్నమైన శైలి గల పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ల ప్రదర్శన జట్టు గెలుపోటములను ప్రభావితం చేయవచ్చు. అంచనా... జట్టు కూర్పు, ఫామ్, కీలక ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే కనీసం ఫైనల్ చేరాల్సిందే. అంతకంటే తక్కువ ఫలితాన్ని సాధిస్తే అది ఏ రకమైన ఘనతా అనిపించుకోదు. ఇంతకంటే మెరుగైన అవకాశం కూడా మళ్లీ రాకపోవచ్చు. ఇక తుది పోరులో కూడా గెలవగలిగితే చరిత్ర సృష్టించినట్లే. జట్టు వివరాలు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా, పూనమ్ యాదవ్, రాధ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజ, అరుంధతి రెడ్డి. ఎవరికెంత ప్రైజ్‌మనీ... విజేత: 10 లక్షల డాలర్లు (రూ. 7 కోట్ల 18 లక్షలు) రన్నరప్: 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 59 లక్షలు) సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు: 2 లక్షల 10 వేల డాలర్ల చొప్పున (రూ. కోటీ 50 లక్షలు) గ్రూప్ మ్యాచ్‌లో ఒక్కో విజయానికి: 15 వేల డాలర్ల చొప్పున (రూ. 10 లక్షల 77 వేలు) గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆరు జట్లకు: 30 వేల డాలర్ల చొప్పున (రూ. 21 లక్షల 54 వేలు) ►టోర్నీలో భారత్ మూడు సార్లు 2009, 2010, 2018లలో సెమీఫైనల్ వరకు చేరగలిగింది. ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. ►వరుసగా ఏడో వరల్డ్ కప్ బరిలోకి దిగుతున్న అమ్మాయిలు 9 జట్లలో కలిపి 14 మంది ఉన్నారు. థాయ్‌లాండ్‌కు మాత్రం ఇదే తొలి వరల్డ్ కప్. ►ఫైనల్ జరిగే మెల్బోర్న్ ఎంసీజీ మైదానం సామర్థ్యం. తుది పోరుకు స్టేడియం నిండితే ఒక అంతర్జాతీయ మహిళల మ్యాచ్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన రికార్డు నమోదవుతుంది. అమెరికాలోని రోజ్‌బౌల్‌లో జరిగిన 1999 మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్‌కు 90, 185 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. టీవీ అంపైర్ ‘నోబాల్స్’ను పర్యవేక్షించనున్న తొలి ఐసీసీ టోర్నీ ఇదే గత విజేతలు 2009: ఇంగ్లండ్ 2010, 2012, 2014, 2018: ఆస్ట్రేలియా 2016: వెస్టిండీస్ -
అతడే ఒక సైన్యం
-
అరేబియా తీరంలో కరీబియన్ విధ్వంసం
ముంబై: అదేబియా తీరంలో కరీబియన్ వీరుడు విధ్వంసం సృష్టించాడు. గత కొద్దికాలంగా ఆటతీరుకంటే వరుస వివాదాలతోనే వార్తల్లో నిలిచిన వెస్టిండీస్ తురుపుముక్క క్రిస్ గేల్ మళ్లీ తన ప్రతాపాన్ని చాటుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా బుధవారం ముంబైలో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 11 సిక్స్ లు, 5 ఫోర్లు బాది ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు మెకల్లం ఒక్కడే టీ20ల్లో రెండు సాధించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన గేల్ 48 బంతుల్లో 100 పరుగులు సాధించి విండీస్ ను విజయతీరాలకు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుంటూ.. వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ నెగ్గటం సంతోషంగా ఉందని, ఈ రోజు రాత్రి బీర్లు పొంగటం ఖాయమని గేల్ అన్నాడు. ఇంగ్లాడ్ నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్ కష్టసాధ్యమైనదే అయినప్పటికీ వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశానని గేల్ వివరించాడు. విండీస్ సారధి స్యామి మాట్లాడుతూ ఇంగ్లాడ్ ను 200 లోపే కట్టడిచేయడంతో గెలుపుపై నమ్మకం పెరిగిందని, అయితే గేల్ దుమారం వల్ల అది సులువుగా సాధ్యపడిందన్నాడు. 2006 నుంచి ఇప్పటి వరకు 46 అంతర్జాతీయ టీ20లు ఆడిన క్రిస్ గేల్ 44 ఇన్నింగ్స్ ల్లో 37.65 సగటుతో 1506 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో గేల్ ది ఎనిమిదో స్థానం. అయితే అత్యధిక సిక్సర్ల మోతలో మాత్రం గేల్ ను మించిన మొనగాడు లేడు. ఇప్పటివరకు గేల్ 98 సిక్స్ లు బాది.. సిక్సర్ల సెంచరీకి చేరువలో ఉన్నాడు. తొలుత టాస్ నెగ్గిన విండీస్.. ఫీల్టిండ్ చెంచుకుంది. ఇంగ్లాడ్ మొదటి ఇన్నింగ్స్ లో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. గేల్ సూపర్ సెంచరీతో విండీస్ 18.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తిచేసింది. -
అభిమానులకే కాదు గూగుల్కూ క్రికెట్ ఫీవర్
టి-20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంగళవారం నుంచే జరిగే ఈ మెగా ఈవెంట్ ప్రధాన మ్యాచ్‌లు అభిమానులను కనువిందు చేయనున్నాయి. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కూడా ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆమితాసక్తి చూపుతోంది. మంగళవారం భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే ఆరంభ మ్యాచ్‌కు స్వాగతం పలుకుతూ గూగుల్ హోం పేజీలో కొత్త డూడుల్‌ను పోస్ట్ చేసింది. రెండు క్రికెట్ బ్యాట్ల మధ్య బంతి ఉన్న దృశ్యం గూగుల్ డూడుల్‌లో కనిపిస్తుంది. టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీలు ఆరంభానికి ముందు రోజు కూడా గూగుల్ కొత్త డూడుల్‌ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉన్న దృశ్యాన్ని హోం పేజీలో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నాగ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. -
అఫ్రిది గ్యాంగ్ అక్కడ.. ధోనీ సేన ఇక్కడ
కోల్ కతా/ నాగ్ పూర్: మంగళవారం(మార్చి 15) నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్ కప్ పోటీలకు భారత్, పాకిస్థాన్ జట్లు సన్నధ్ధంఅవుతున్నాయి. షాహిద్ అఫ్రిది నేతృత్వంలో 27 మందితో కూడిన బృందం అబుదాబి నుంచి శనివారం రాత్రి కోల్ కతాకు చేరుకున్న సంగతి తెలిసిందే. భారీ భద్రత నడుమ హోటల్ కు చేరుకున్న పాక్ జట్టు.. ఆదివారం ఉదయమే ఈడెన్ గార్డెన్ కు చేరుకుని నెట్ ప్రాక్టీస్ లో మునిగిపోయింది. శ్రీలంకతో సోమవారం జరగనున్న వామప్ మ్యాచ్ లో సత్తాచాటలని భావిస్తోన్న పాక్ కు 19న భారత్ తో పోరు పెనుసవాలుగా మారింది. ఆసియా కప్ లో పరాజయం తర్వాత స్వదేశంలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ఈసారి అవకాశం కోల్పోకూడదనుకుంటోంది. నెట్ ప్రాక్టీస్ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్ చుట్టుపక్కల కనీవినీ ఎరుగనిరీతిలో భద్రతా బలగాలు మోహరించాయి. భారత్ తో మ్యాచ్ జరిగే రోజు వేల మంది సాయుధులు పహారాకాయనున్నారు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత్ జట్టు ఆదివారం ఉదయం నాగపూర్ కు చేరుకుంది. మార్చి 15న(మంగళవారం) టీమిండియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఆదివారం సాయంత్రం నుంచే ఇండియా టీమ్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్లు సమాచారం. నాగ్ పూర్ ఎయిర్ పోర్టులో అధికారులు, అభిమానులు ధోనీ సేనకు ఘనస్వాగతం పలికారు. అటు కోల్ కతాలో మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 'భారత్, పాక్ మ్యాచ్ కు ఈడెన్ వేదిక కావటం అదృష్టంగా భావిస్తున్నా' అని అన్నారు. -
గూగుల్ కూడా పండగ చేసుకుంది
న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు వేసవికాలమంతా వినోదమే వినోదం. ఆసియా కప్ ముగిసింది. వెంటనే మరో పరుగుల పండగ వచ్చేసింది. అభిమానుల్లో ఇప్పుడు టి-20 ప్రపంచ కప్ ఫీవర్. మంగళవారం ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టి-20 ప్రపంచ కప్‌నకు స్వాగతం పలుకుతూ ఆరంభానికి ఒక్క రోజు ముందు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ హోం పేజీలో కొత్త డూడుల్‌ను పోస్ట్ చేసింది. స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉన్న దృశ్యం గూగుల్ డూడుల్‌లో కనిపిస్తుంది. ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఏడు వేదికలపై మ్యాచ్‌లను నిర్వహిస్తారు. 16 జట్లు పాల్గొంటున్నాయి.