అభిమానులకే కాదు గూగుల్కూ క్రికెట్ ఫీవర్
టి-20 ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంగళవారం నుంచే జరిగే ఈ మెగా ఈవెంట్ ప్రధాన మ్యాచ్లు అభిమానులను కనువిందు చేయనున్నాయి. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కూడా ఎంతో ప్రాధాన్యమిస్తూ ఆమితాసక్తి చూపుతోంది. మంగళవారం భారత్, న్యూజిలాండ్ల మధ్య జరిగే ఆరంభ మ్యాచ్కు స్వాగతం పలుకుతూ గూగుల్ హోం పేజీలో కొత్త డూడుల్ను పోస్ట్ చేసింది. రెండు క్రికెట్ బ్యాట్ల మధ్య బంతి ఉన్న దృశ్యం గూగుల్ డూడుల్లో కనిపిస్తుంది.
టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీలు ఆరంభానికి ముందు రోజు కూడా గూగుల్ కొత్త డూడుల్ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉన్న దృశ్యాన్ని హోం పేజీలో పోస్ట్ చేసింది. ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నాగ్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి.