గూగుల్ కూడా పండగ చేసుకుంది | Google doodle runs high on T20 Cricket World Cup fever | Sakshi
Sakshi News home page

గూగుల్ కూడా పండగ చేసుకుంది

Published Mon, Mar 7 2016 8:54 AM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

గూగుల్ కూడా పండగ చేసుకుంది

గూగుల్ కూడా పండగ చేసుకుంది

న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులకు వేసవికాలమంతా వినోదమే వినోదం. ఆసియా కప్ ముగిసింది. వెంటనే మరో పరుగుల పండగ వచ్చేసింది. అభిమానుల్లో ఇప్పుడు టి-20 ప్రపంచ కప్ ఫీవర్. మంగళవారం ఆరంభమయ్యే ఈ మెగా ఈవెంట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టి-20 ప్రపంచ కప్నకు స్వాగతం పలుకుతూ ఆరంభానికి ఒక్క రోజు ముందు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ హోం పేజీలో కొత్త డూడుల్ను పోస్ట్ చేసింది. స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉన్న దృశ్యం గూగుల్ డూడుల్లో కనిపిస్తుంది.

ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఏడు వేదికలపై మ్యాచ్లను నిర్వహిస్తారు. 16 జట్లు పాల్గొంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement