tadur
-
అభివృద్ధి వైపు అడుగులు
సాక్షి,తాడూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలు పారిశుద్ధ్యం వైపు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో కొత్తగా ఎంపికైన సర్పంచ్‌లు ఆయా గ్రామాలలో మొదట పారిశుద్ధ్య పనుకే ప్రాధాన్యత కనబరుస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గం మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పారిశుద్ధ్య పనులు ముఖ్యమని గుర్తించారు. ఇందుకు పాలక వర్గాల సభ్యులు గ్రామంలోని అన్ని వార్డులను తిరిగి స్థానిక పరిస్థితులను అధ్యాయనం చేశారు. మురుగు కాల్వలు లేకపోవడంతో సీసీరోడ్లు బురదమయం అవుతున్నాయని, ప్రజల వినతుల మేరకు మురుగు కాల్వల నిర్మాణంపై ప్రాధాన్యత పెంచారు. సీసీరోడ్లకు ఇరువైపులా మురుగు కాల్వ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా మురుగు కాల్వల నిర్మాణాల కోసం సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నారు. నిర్మాణలను త్వరగా చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్‌లు అంటున్నారు. చకచకా పనులు మండల కేంద్రంలో సర్పంచ్‌గా ఎన్నికైన అనుపటి యాదమ్మ ఆధ్వర్యంలో వార్డులోని ప్రధాన సమస్యలు గుర్తించి మంచినీటి వసతితో పాటు చేమురుగు కాల్వలు, సీసీరోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన గ్రామసభలో స్వచ్ఛ తాడూరుగా చేయాలన్న ఉద్ధేశంతో గ్రామస్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యంగా 9, 10, 11, 12వ వార్డులను నీటి సమస్యతో పాటు మురుగు కాల్వ నిర్మాణాలను చేపట్టారు. ప్రధాన రోడ్డు వరకు సీసీరోడ్డు వేయించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. -
ఆ ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు
నాగర్ కర్నూలు : తాడూరు ఎంపీటీసి విజయలక్ష్మీ ఎన్నిక చెల్లదంటూ నాగర్ కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శుక్రవారం తీర్పుచెప్పారు. మళ్లీ కొత్తగా ఎన్నికల నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు కోర్టు సూచించింది. 2014 సంవత్సరంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌటింగ్ ఓట్లకు నాలుగు ఓట్లు తేడా రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి న్యాయం కోసం కోర్టుకు వెళ్లింది. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ లక్ష్మీ పై 2 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి రేణుక ఓడిపోయింది. స్వల్పతేడాతో ఓడిపోవడం, ఆ ఓట్లకు ప్రాధాన్యత ఉండటంతో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలి
తాడూరు: ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ చేసుకోవాలని వ్యవసాయాధికారిణి నీతి తెలిపారు. ఎకరాకు వరికి రూ.560, మొక్కజొన్న రూ.400, మిర్చి యూ–1 రకం రూ.1200, మిర్చి–1 రకం రూ.వెయ్యి, కందులు రూ.260, పెసర రూ.200, వేరుశనగ యూ–1కు రూ.320, వేరుశనగ–1 రకానికి రూ.360 వంతున బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరున డీడీ తీయాలని పేర్కొన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించడంలో ఎలాంటి సందేహాలున్నా సెల్ నం.9603322481 సంప్రదించవచ్చని, జూలై 30లోపు బీమా చెల్లించుకోవాలని సూచించారు. -
ప్రేమను అంగీకరించలేదని యువతి హత్య
తాడూర్ : మహబూబ్‌నగర్ జిల్లా తాడూర్ మండలం ఆకునెల్లికుదురు గ్రామంలో దారుణం జరిగింది. నిర్భయ దారుణంపై నలుగురికి ఉరిశిక్ష పడిన రోజే యువతిపై అరాచకానికి తెగబడ్డాడో ఉన్మాది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమను అంగీకరించలేదన్న నెపంతో అనిత అనే యువతిని అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య నరికి చంపాడు. తనను ప్రేమించాలంటూ తిరుపతయ్య ఆరు నెలలుగా అనిత వెంటపడుతున్నాడు. నెల క్రితం అనితను కిడ్నాప్ కూడా చేశాడు. అప్పట్లో అది సంచలనం సృష్టించింది. దాంతో తల్లిదండ్రులు అనితను చదువు మానిపించారు. అప్పటి నుంచి ఆమె పొలం పనులకు వెళ్తోంది. శుక్రవారం పొలం పనులకు వెళ్లిన అనితను తిరుపతయ్య గొడ్డలితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ప్రస్తుతం తిరుపతయ్య పరారీలో ఉన్నాడు.