
నాగర్ కర్నూలు : తాడూరు ఎంపీటీసి విజయలక్ష్మీ ఎన్నిక చెల్లదంటూ నాగర్ కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి శుక్రవారం తీర్పుచెప్పారు. మళ్లీ కొత్తగా ఎన్నికల నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు కోర్టు
సూచించింది. 2014 సంవత్సరంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో పోలైన ఓట్లకు, కౌటింగ్ ఓట్లకు నాలుగు ఓట్లు తేడా రావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి న్యాయం కోసం కోర్టుకు వెళ్లింది. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి
విజయ లక్ష్మీ పై 2 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి రేణుక ఓడిపోయింది. స్వల్పతేడాతో ఓడిపోవడం, ఆ ఓట్లకు ప్రాధాన్యత ఉండటంతో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.