Tamil Labours
-
ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్
ఖాజీపేట: అక్రమంగా ఎర్రచందనం రవాణా జరుగుతోందన్న సమాచారంతో మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం, ఖాజీపేట ఎస్ఐ రంగారావు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు తమిళ కూలీలను అరెస్టు చేసి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పుల్లూరు సమీపంలోని సెల్ టవర్ వద్ద తమిళ కూలీలు దుంగలను మోసుకుని పోతున్నట్లు ఆదివారం సాయంత్రం సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. అందులో సుమారు 197 కేజీల బరువుల గల 10 దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురు తమిళకూలీలను అదుపులోకి తీసుకున్నారు. 10 దుంగల విలువ సుమారు రూ. 5లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో పలువురు స్మగ్లర్లు తమపై దాడికి యత్నించారని సీఐ తెలిపారు. పట్టుబడిన వారందరూ తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా వారిగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
14 ఎర్రచందనం దుంగల స్వాధీనం
ఖాజీపేట: 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సీఐ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగపట్నం పైభాగాన ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌లో తమిళ కూలీలు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్ఐ రంగారావు, సిబ్బంది దాడులు నిర్వహించారు. దుంగలను తీసుకెళ్తున్న 20 మంది తమిళ కూలీలు పరారయ్యారు. వారితోపాటు ఉన్న మిట్టా ఆదినారాయణరెడ్డి, మునగాల సుబ్రమణ్యం (సర్వర్‌ఖాన్‌పేట)ను అదుపులోకి తీసుకున్నారు. 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారిని విచారణ చేయగా, నాలుగు రోజుల క్రితం తమిళ కూలీలు కలిశారని తెలిపారు. దారి చూపితే డబ్బు ఇస్తామని చెప్పారన్నారు. తమిళ కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సీఐ తెలిపారు. -
9 మంది తమిళ కూలీలు అరెస్ట్
మైదుకూరు(వైఎస్సార్‌జిల్లా): ఎర్రచందనం చెట్లను నరుకుతున్న 9 మంది తమిళ కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా మైదుకూరు శివారులోని ఆటవీ ప్రాతంలో ఆదివారం సాయంత్రం జరిగింది. అడవిలో చెట్లు నరుకుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు, పోలీసులు దాడి చేసి 9 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మైదుకూరు డీఎస్పీ రామకృష్ణ విలేకరులకు తెలిపారు. -
తమిళ కూలీల కోసం పోలీసుల తనిఖీలు
వైఎస్సార్ జిల్లా: తమిళ కూలీల కోసం పోలీసులు మరోసారి వేట ప్రారంభించారు. తమిళ కూలీలు ప్రవేశించారంటూ నెల్లూరు జిల్లా పోలీసులు ఇచ్చిన సమాచారంతో వైఎస్సార్ జిల్లా గోపవరం పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం నుంచి నెల్లూరు సరిహద్దుల్లోని పీపీ గుంట చెక్‌పోస్ట్ వద్ద సీఐ వెంకటప్ప ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైపు నుంచి వచ్చే వాహనాలను అణువణువూ తనిఖీ చేస్తున్నారు. మరోవైపు, పీపీ గుంట అటవీ ప్రాంతంలో ఒక పోలీసు బృందం తమిళ కూలీల కోసం జల్లెడ పడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (గోపవరం)