తమిళ కూలీల కోసం పోలీసులు మరోసారి వేట ప్రారంభించారు.
వైఎస్సార్ జిల్లా: తమిళ కూలీల కోసం పోలీసులు మరోసారి వేట ప్రారంభించారు. తమిళ కూలీలు ప్రవేశించారంటూ నెల్లూరు జిల్లా పోలీసులు ఇచ్చిన సమాచారంతో వైఎస్సార్ జిల్లా గోపవరం పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం నుంచి నెల్లూరు సరిహద్దుల్లోని పీపీ గుంట చెక్‌పోస్ట్ వద్ద సీఐ వెంకటప్ప ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైపు నుంచి వచ్చే వాహనాలను అణువణువూ తనిఖీ చేస్తున్నారు. మరోవైపు, పీపీ గుంట అటవీ ప్రాంతంలో ఒక పోలీసు బృందం తమిళ కూలీల కోసం జల్లెడ పడుతోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
(గోపవరం)