తమిళ చానల్ న్యూస్ ఎడిటర్ అరెస్టు
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ రాజకీయ పార్టీ అధినేతకు చెందిన తమిళ చానల్ చీఫ్ న్యూస్ ఎడిటర్ దినేష్‌ను చెన్నై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అదే చానల్లో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్న మహిళపై దినేష్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వేధింపులకు తాళలేక ఆమె నెల్లాళ్ల కిందట ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయినా, ఫోన్లో వేధింపులు సాగించడంతో ఆమె కోయంబేడు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సెంథిల్‌కుమార్‌కు శనివారం ఫిర్యాదు చేసింది. మదురవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దినేష్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాలపై అతడిని పుళల్ జైలుకు రిమాండుకు తరలించారు.