tamilnadu govenrment
-
లియో మూవీ రిలీజ్ వివాదం.. కొనసాగుతున్న సస్పెన్స్!
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం గురువారం థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఆటలు ప్రదర్శన వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. లియో చిత్రానికి ప్రభుత్వం 19వ తేదీ నుంచి 24వ తేది వరకు రోజుకు 5 ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే మరో ఆటను వేకువజామున 4 గంటలకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాత ఎస్ ఎస్.లలిత్ కుమార్ చైన్నె హైకోర్టును ఆశ్రయించగా.. అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఉదయం 9 గంటల ఆటకు బదులు 7 గంటలకు అనుమతించే విషయంపై పరిశీలించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. కాగా మరో పక్క సినీ డిస్ట్రిబ్యూటర్లు తమకు 5 ఆటలు చాలని ప్రకటించడం మరోవైపు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం మారినా..? ఇదిలా ఉంటే విజయ్ చిత్రం అంటేనే సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో విజయ్ నటించిన చిత్రాలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడమేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రఘుపతిని మీడియా ప్రశ్నించింది. లియో చిత్రం విషయంలో రాజకీయం ఉందనే ప్రచారం జరుగుతోందని.. రాజకీయాల్లో కొనసాగుతున్న కొందరు నిర్మిస్తున్న చిత్రాలకు ఎలాంటి సమస్యలు లేకుండా అనుమతిస్తున్నారనే విమర్శకు మీ సమాధానం ఏమిటన్న ప్రశ్నకు చిత్ర పరిశ్రమ విషయంలో విభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన బదులిచ్చారు. చిత్ర పరిశ్రమతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కాగా.. న్యాయస్థానంలో ఉపశమనం లభించకపోవడంతో లియో చిత్ర నిర్మాత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అముదను కలవడానికి వచ్చిన నిర్మాత తరపు న్యాయవాదుల కారు యాక్సిడెంట్‌కు గురైంది. తిరుగుముఖం పట్టిన న్యాయవాదుల కారును డ్రైవర్ మలుపు తిప్పుతుండగా అటుగా వస్తున్న మహిళ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. లియో చిత్రం గురువారం విడుదల అని ప్రకటించినా ఇప్పటి వరకు చాలా థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొంది. -
ముగిసిన వాణీజయరాం అంత్యక్రియలు.. నివాళులర్పించిన సీఎం
అధికారిక లాంఛనాలతో ప్రముఖ గాయని వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. చెన్నైలోని బేసంట్నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. వాణీజయరాం మృతిపై సీఎం సంతాపం తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. ' ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందా. వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డ్ కూడా ప్రకటించింది. ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె మరణించడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని అన్నారు. కాగా.. శనివారం చెన్నైలోని ఆమె నివాసంలో మరణించారు. దేశవ్యాప్తంగా దాదాపు 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు ఆలపించారు. అయితే ఆమె మృతిపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆమె ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాణీ భర్త జయరామ్ ఐదేళ్ళ క్రితం (2018లో) మరణించారు. ఈ దంపతులకు పిల్లలు ఎవరూ లేరు. సంగీతమే తమకు పిల్లలు లేని లోటు తీర్చిందని ఆమె చెబుతూ ఉండేవారు. బంధువులే వారసులై ఈ రోజు వాణీ జయరామ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
టీ షర్టు.. లెగ్గింగ్‌లు వద్దు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా ఉండే సంప్రదాయ డ్రెస్‌కోడ్ పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సచివాలయ మహిళా ఉద్యోగులు ధరించాల్సిన దుస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ జీవో జారీ చేశారు. మహిళా ఉద్యోగులు ఇకపై చీర, సల్వార్ కమీజ్, చుడీదార్లను మాత్రమే ధరించి విధులకు హాజరు కావాలని కోరింది. చీర మినహా మిగిలిన అన్ని డ్రస్సులను విధిగా దుపట్టాతో ధరించాలని స్పష్టం చేసింది. దుస్తుల రంగులు సైతం సున్నితమైనవిగా ఉండాలని తెలిపింది. అలాగే పురుషులు ప్యాంటు, షర్టు ధరించి రావాలి. అలాగే, రంగు రంగుల టీ షర్టులు ధరించరాదని పేర్కొంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది. -
శారద, కాంచనలకు కలైమామణి అవార్డు
చెన్నై : తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కలైమామణి అవార్డులను ప్రకటించింది. అలనాటి నటీమణులు శారద, కాంచనలతో పాటు కుట్టి పద్మినికి ఈ అవార్డు లభించింది. అలాగే నటులు సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా, విజయ్ ఆంటోని, శశికరుమార్, సంతానం, సూరి, నటి ప్రియమణి, నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు హరిలకు కూడా అవార్డులు దక్కాయి. కళారంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ప్రముఖ నటీమణి వైజయంతిమాల బాలి...బాలసరస్వతి అవార్డుకు ఎంపికయ్యారు. -
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రంలో వివాదాస్పద జల్లికట్టు క్రీడపై నిషేధం ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. జల్లికట్టు నిషేధంపై స్టే విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా జల్లికట్టు క్రీడపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఎడ్లను రెచ్చగొడుతూ, వాటిని అదుపులో పెట్టేందుకు ప్రయత్నించే ఈ క్రీడకు పలు ఆంక్షలతో అనుమతినిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏటా పొంగల్ (తెలుగువారికి సంక్రాంతి) పండుగ మరుసటి రోజున జరిపే ఈ క్రీడపై 2011లో యూపీఏ ప్రభుత్వం నిషేధం విధించింది. జంతువుల పట్ల హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకుంది. అయితే జల్లికట్టుపై నిషేధాన్ని ఎన్డీయే ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల నిర్వహించే ఎడ్ల బండ్ల పందాలకూ షరతులతో అనుమతినిచ్చింది. కేంద్రం నిర్ణయంపై పలువురు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
టీచర్లతో లవ్వా.. హవ్వ!
ఓ లలనా...ఓ సఖియా అంటూ ఓ విద్యార్థి, ఓ లేడీ టీచర్ చేతులు పట్టుకొని చెట్టూపుట్టలు తిరుగుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోవడం చూసి తమిళనాడు ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. విద్యాశాఖాధికారులను పిలిచి చీవాట్లు పెట్టింది. ఇలాంటి పాశ్చాత్య తరహా పోకడలను తక్షణమే అరికట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కదయనల్లూర్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో గత మార్చి 31న ఓ 26 ఏళ్ల లేడీ టీచరు, ఓ పదహారేళ్ల కుర్రాడిని ప్రేమించి అతడితో పారిపోయింది. ఈ సంఘటన జరిగిన పక్షం రోజుల తర్వాత దిండుగల్ జిల్లాలోని ఓ ట్యుటోరియల్ కాలేజీలో 22 ఏళ్ల లేడీ టీచర్, నీవు లేక నేను లేను.....అంటూ 20 ఏళ్ల అబ్బాయితో ఉడాయించింది. ఈ రెండు సంఘటనలపై దుమారం రేగడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. ఆగమేఘాల మీద కదిలిన విద్యాశాఖ అధికారులు వెంటనే ఓ ఫార్మల్ కమిటీని ఏర్పాటు చేశారు. సదరు కమిటీ వారు రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్లను పిలిపించి ఇలాంటి ప్రేమ కలాపాలను అరికట్టడం ఎలా ? అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. విద్యార్థులకు సరైన అవగాహన కల్పించడంతోపాటు లేడీ టీచర్లకు 'ప్రవర్తనా నియమావళి'ని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ నాయకుల్లో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. చర్మం కనిపించేలా స్కర్టులు, టీ షర్టులు, జీన్ పాంట్ల లాంటి పాశ్చాత్య దుస్తులను లేడీ టీచర్లు ధరించరాదని, సామాజిక వెబ్సైట్ల ప్రభావం పెరిగిన నేపథ్యంలో తరగతి గదిలోకి వారు సెల్ఫోన్లు తీసుకెళ్లరాదని, ప్రేమకలాపాలపై నిఘా ఉంచేందుకు విద్యా సంస్థల్లో అన్ని చోట్ల సీసీటీవీ కెమేరాలను అమర్చాలని 'తమిళనాడు హయ్యర్ సెకండరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు ఆంటోని అంబరసు, 'తమిళనాడు గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్' అధ్యక్షుడు ఎస్. తమిళాని ఆ చర్చల్లో వాదించారు. తరగతి గదుల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దనడం సమంజసమేనని, డ్రెస్ కోడ్ నిర్దేశించడం సమంజసం కాదని, ఇప్పుడు దీన్ని అనుమతిస్తే మున్ముందు ముఖాలు కూడా కనిపించకుండా ముసుగులు వేసుకోమనే కోడ్‌కు దారితీస్తుందని పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎస్. మురుగన్ వాదించారు. విద్యార్థులకు ప్రవర్తనా నియమావళి ఉండాలి గానీ, టీచర్లకు ప్రవర్తనా నియమావళి ఏంటని కొంత మంది ఫెమినిస్టులు వాదించారు. చివరకు వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విద్యాశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మౌఖిక ఆదేశాలతో లేడీ టీచర్లకు 'కోడ్', విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చారు. విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఓ పాఠశాలలో లేడీ టీచర్లంతా కలిసి 'వియ్ లవ్ అవర్ టీచర్స్' అనే అక్షరాల క్రమంలో విద్యార్థులను కూర్చోబెట్టారు. ఇందులో కూడా 'లవ్వే' ఉంది కదా! అని ఆ విద్యార్థులంతా ఎంత బుద్ధిగా కూర్చున్నారో!